తెలంగాణ పోరాట యోధుడు కొమురం భీం 75వ వర్థంతి వేడుకలు స్వగ్రామంలో ఘనంగా ప్రారంభమయ్యాయి.
ఆదిలాబాద్: తెలంగాణ పోరాట యోధుడు కొమురం భీం 75వ వర్థంతి వేడుకలు స్వగ్రామంలో ఘనంగా ప్రారంభమయ్యాయి. ఆదిలాబాద్ జిల్లా కెరమెరి మండలం జోడేఘాట్‌లోని భీం సమాధి వద్ద ఆయన వంశీకులు ప్రత్యేక పూజలు చేసి నాలుగు రకాల జెండాలను ఎగురవేశారు. ప్రభుత్వం తరఫున ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి ఆర్.ఇ.కరుణన్ పూజలు నిర్వహించి కొమురం భీంకు ఘనంగా నివాళులర్పించారు.