
సాక్షి, కొమురం భీం ఆసిఫాబాద్: పెద్దలు పెళ్లికి అంగీకరించకపోవడంతో ఓ ప్రేమ జంట ఆత్మహత్యాయత్నం చేసింది. ఈ ఘటన జిల్లాలోని జిల్లా లింగాపూర్ మండలం పిక్ల తాండ అటవీ ప్రాంతంలో వెలుగుచూసింది.ప్రేమికులిద్దరూ పురుగుల మందు తాగారు. యువతి అక్కడికక్కడే మృతి చెందగా, యువకుడు ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నాడు. అతన్ని హుటాహుటిన సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. ప్రేమ పెళ్లికి పెద్దలు ఒప్పుకోకపోవడంతోనే మనస్తాపం చెందిన యువతీయువకులు ఈ అఘాయిత్యానికి పాల్పగడినట్టుగా తెలుస్తోంది. అమ్మాయి మాడవి లక్ష్మీ (20) మామిడిపల్లి గ్రామస్తురాలు, అబ్బాయి ఆత్రం భీంరావు(22) జైనూర్ మండల రాసిమట్ట వాసిగా తెలిసింది. యువకుడి పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం.
(కోడలిపై అత్తా,మామల పైశాచికం)
Comments
Please login to add a commentAdd a comment