lovers suicide attempt
-
ప్రేమికుల ఆత్మహత్యాయత్నం.. ప్రియుడిపై కేసు
సాక్షి, వరంగల్: ములుగు జిల్లా వెంకటాపురం(కె) మండల పరిధి నల్లగుంట గ్రామ శివారు దేవాదుల పైపులైను సమీపాన ప్రేమజంట ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. స్థానికులు, పోలీసుల కథనం ప్రకారం.. మండలంలోని నల్లగుంటకు చెందిన ధరంసోతు రాజేష్, భూపాలపల్లి జిల్లా మంజూర్‌నగర్‌కు చెందిన ఓ యువతి(16) రెండేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. విషయం ఇంట్లో తెలియడంతో తల్లితో పాటు బంధువులు యువతిని ప్రశ్నించినట్లు తెలిసింది. పెళ్లికి నిరాకరిస్తారనే భయంతో సదరు యువతి గురువారం రాత్రి 8 గంటల సమయంలో నల్లగుంటకు వచ్చి రాజేష్‌తో కలిసి గ్రామసమీపాన ఉన్న దేవాదుల పైపులైన్ వద్దకు చేరుకుని పురుగుల మందు తాగారు. అపస్మారకస్థితిలో ఉన్న రాజేష్ తెల్లవారుజామున స్నేహితులకు ఫోన్ చేయగా.. వారిద్వారా విషయం తెలుసుకున్న గ్రామస్తులు సంఘటనా స్థలానికి వెళ్లి ప్రేమికులిద్దరిని ములుగు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం రాజేష్‌ను మల్లంపల్లిలోని ఒక ప్రైవేట్ ఆస్పత్రికి, యువతిని వరంగల్ ఎంజీఎంకు తీసుకెళ్లారు. ఆత్మహత్యయత్నానికి పాల్పడిన యువతి మైనర్‌గా పోలీసులు పేర్కొంటున్నారు. రాజేష్‌పై కేసు నమోదు తమ కూతురు గురువారం రాత్రి 7 గంటలకు కిరాణా సామగ్రి తీసుకురావడానికి వెళ్లి తిరిగిరాలేదని యువతి తల్లి శుక్రవారం ఉదయం భూపాలపల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. దూరపు బంధువైన ధరంసోతు రాజేష్‌పై అనుమానం ఉందని ఆమె ఇచ్చిన ఫిర్యాదు మేరకు అతడిపై కిడ్నాప్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై అభినవ్ తెలిపారు. -
నల్గొండలో ప్రేమికుల ఆత్మహత్య
నల్గొండ : వ్యవసాయ క్షేత్రంలో ప్రేమికులు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన నల్లగొండ జిల్లా కేతపల్లి మండలంలో చోటుచేసుకుంది. క్రిమిసంహారక మందుతాగి ఇద్దరూ ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ ఘటనలో ప్రియుడు అక్కడిక్కడే మృతిచెందాడు. కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్న యువతిని ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయింది. అయితే యువకుడికి ఇదివరకే వివాహం జరిగినట్లు సమాచారం. అయినప్పటికీ మరొక యువతితో ప్రేమాయణం నడుపుతూ వచ్చాడు. ఈ పరిస్థితుల్లో ఆత్మహత్యకు గల కారణాలు ఏంటో ఇంకా తెలియరాలేదు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనపై కేసు నమోదు చేశారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాలను బంధువులకు అప్పగిస్తామని వెల్లడించారు. (వేధింపులు.. సీరియల్ నటి ఆత్మహత్య) -
పెద్దలు పెళ్లికి అంగీకరించకపోవడంతో..
సాక్షి, కొమురం భీం ఆసిఫాబాద్: పెద్దలు పెళ్లికి అంగీకరించకపోవడంతో ఓ ప్రేమ జంట ఆత్మహత్యాయత్నం చేసింది. ఈ ఘటన జిల్లాలోని జిల్లా లింగాపూర్ మండలం పిక్ల తాండ అటవీ ప్రాంతంలో వెలుగుచూసింది.ప్రేమికులిద్దరూ పురుగుల మందు తాగారు. యువతి అక్కడికక్కడే మృతి చెందగా, యువకుడు ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నాడు. అతన్ని హుటాహుటిన సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. ప్రేమ పెళ్లికి పెద్దలు ఒప్పుకోకపోవడంతోనే మనస్తాపం చెందిన యువతీయువకులు ఈ అఘాయిత్యానికి పాల్పగడినట్టుగా తెలుస్తోంది. అమ్మాయి మాడవి లక్ష్మీ (20) మామిడిపల్లి గ్రామస్తురాలు, అబ్బాయి ఆత్రం భీంరావు(22) జైనూర్ మండల రాసిమట్ట వాసిగా తెలిసింది. యువకుడి పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం. (కోడలిపై అత్తా,మామల పైశాచికం) -
కొద్ది రోజుల్లో పెళ్లిపీటలు ఎక్కాల్సిన ఆ జంట..
సాక్షి, మాచర్ల రూరల్: కొద్ది రోజుల్లో పెళ్లిపీటలు ఎక్కాల్సిన ఆ జంట.. కుటుంబ వివాదాల కారణంగా ఆత్మహత్యాయత్నం చేసింది. ఘటనలో యువకుడు మృతిచెందగా.. యువతి ప్రాణాపాయ స్థితిలో ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. గుంటూరు జిల్లా మాచర్ల మండలం కొప్పునూరులో వలంటీర్‌గా పనిచేస్తున్న కేతావత్ శివా నాయక్ (22)కు, రెంటచింతల మండలం పశర్లపాడుకు చెందిన జఠావత్ అనితతో పెద్దలు పెళ్లి నిశ్చయించారు. మాచర్ల పట్టణంలోని ఓ కళాశాలలో అనిత డిగ్రీ చదువుతోంది. వేసవి సెలవుల్లో వివాహం జరిపించాలనుకున్నారు. ఈ నేపథ్యంలో అనిత కుటుంబంలో ఏర్పడ్డ స్వల్ప విభేదాలతో కలత చెందిన శివానాయక్, అనితలు గురువారం కంభంపాడు కుడికాలువలో దూకారు. అక్కడ పొలం పనులు చేసుకుంటున్న కొందరు గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. రూరల్ సీఐ భక్తవత్సలరెడ్డి అక్కడికి చేరుకుని కాలువలో కొట్టుకుపోతున్న ఇద్దరినీ రక్షించేందుకు అక్కడే ఉన్న కొంతమందిని పురమాయించారు. నీటి ప్రవాహం ఉధృతంగా ఉండటంతో శివా నాయక్ కొట్టుకుపోగా.. కొన ఊపిరితో ఉన్న అనితను ఒడ్డుకు చేర్చి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. శివా నాయక్ మృతదేహాన్ని కాలువలో గాలించి బయటకు తెచ్చి పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. కొద్ది రోజుల్లో వివాహం జరగాల్సిన తమ పిల్లలకు ఈ దుస్థితేంటంటూ ఇరు కుటుంబాల బంధువులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
ప్రేమ జంట ఆత్మహత్యాయత్నం
టీ.నగర్: వివాహమైన మూడు రోజే యువతి ప్రేమికుడితో కలిసి విషం తాగి ఆత్మహత్యకు యత్నించింది. ఈ ఘటన విరుదునగర్ జిల్లాలో చోటుచేసుకుంది. వివరాలు.. సాత్తూర్ సమీపంలోని పిరవిపట్టికి చెందిన పెరుమాల్స్వామి కుమారుడు మనోజ్ పాండియన్ (19) స్థానిక ప్రభుత్వ ఎయిడెడ్ కళాశాలలో రెండో ఏడాది చదువుతున్నాడు. కోట్టూర్ కాళపెరుమాల్ పట్టికి చెందిన మురుగన్ కుమార్తె రంజిత (19) వీరుదునగర్లోని ఓ కళాశాలలో రెండో ఏడాది చదువుతోంది. కొన్నేళ్లుగా వీరు ప్రేమించుకుంటున్నారు. వీరి విషయం తెలియడంతో రంజిత తల్లిదండ్రులు మందలించారు. ఈ నెల 13న బంధువైన రమేష్‌తో వివాహం జరిపించారు. దీంతో మనస్తాపం చెందిన ప్రేమికులు ఇంటి నుంచి పారిపోయి సోమవారం కోవిల్పట్టికి చేరుకున్నారు. అక్కడున్న ఓ మామిడి తోపులోకి వెళ్లి ఇద్దరూ విషం తీసుకున్నారు. గమనించిన గ్రామస్తులు కోవిల్ పట్టి పోలీసులకు సమాచారం ఇచ్చారు. వారిని కోవిల్ పట్టి ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్చారు. ప్రాథమిక చికిత్స అనంతరం మెరుగైన చికిత్స కోసం మనోజ్పాండియన్ను తూత్తుకుడి ప్రభుత్వ ఆస్పత్రిలో..రంజితను నెల్లై ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్చారు. -
ప్రేమజంట ఆత్మహత్యాయత్నం
సాక్షి, కృష్ణా జిల్లా: తమ్మిలేరు రిజర్వాయర్‌లో దూకి ప్రేమజంట ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన చాట్రాయి మండలం ముంకల్లులో చోటు చేసుకుంది. ప్రియుడు సురేష్ గల్లంతవ్వగా, ప్రియురాలు నాగమణి స్థానికుల సహాయంతో బయటపడింది. నాగమణిని స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మరోవైపు గల్లంతయిన సురేష్ కోసం రిజర్వాయర్‌లో పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ప్రేమికులిద్దరూ పశ్చిమగోదావరి జిల్లా చింతలపూడి మండలం ప్రగడవరం గ్రామానికి చెందిన వారుగా పోలీసులు గుర్తించారు. -
పెళ్లయినా ప్రేమిస్తున్నానని వెంటపడటంతో...
సాక్షి, సూర్యాపేట: వారిద్దరిదీ ఒక్కటే ఊరు.. ఇద్దరి మనస్సులు కలిశాయి. మూడేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. వివాహం చేసుకుందామంటే కులాలు వేరు కావడంతో పెద్దలు ఒప్పకోలేదు. ప్రియురాలి తల్లిదండ్రులు వేరే యువకుడితో ఆమెకు వివాహం చేశారు. అయినా ప్రియుడు మాత్రం ఆమెనే పెళ్లి చేసుకుంటానని తరుచూ ఫోన్ చేయసాగాడు. ప్రియురాలికి ఫోన్ అందుబాటులో లేకుండా చేసినా ఆమె భర్తకే ఫోన్ చేశాడు. తామిద్దరం ప్రేమించుకుంటున్నామని చెప్పాడు. వారిద్దరు కలిసి తిరిగిన ఫొటోలు సైతం పంపించాడు. దీంతో భర్త ఆమెను తల్లిదండ్రుల వద్దకు పంపించాడు. పెద్ద మనుషుల సమక్షంలో సోమవారం వివాహం చేసుకునేందుకు ప్రియుడు, ప్రియురాలు ఒప్పకున్నారు. వివాహనికి అంతా సిద్ధమైంది. మరికొద్ది సమయంలో పెళ్లి జరుగుతుందనుకున్న తరుణంలో ప్రియుడి తల్లిదండ్రులు వారి వివాహానికి ఒప్పుకోలేదు. దీంతో ప్రేమికులిద్దరూ కలిసి పురుగుల మందుతాగి ఆత్మహత్యకు యత్నించారు. ఈ సంఘటన సోమవారం సూర్యాపేట మండలం టేకుమట్ల గ్రామంలో చోటుచేసుకుంది. గ్రామస్తులు, పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. టేకుమట్ల గ్రామానికి చెందిన వెలిజర్ల సైదులు సావిత్రమ్మ కుమారుడు సతీష్, దామెర్ల ముత్తయ్య మరియమ్మ కూతురు సరిత మూడు సంవత్సరాలుగా ప్రేమించుకుంటున్నారు. వెలిజర్ల సతీష్ కుమ్మరి సామాజిక తరగతికి చెందిన యువకుడు. సరిత దళిత కుటుంబానికి చెందిన యువతి. సరితను పెళ్లి చేసుకుంటానని ఒప్పించి సతీష్ శారీరకంగా లోబర్చుకున్నాడు. తనను పెళ్లి చేసుకోమని సరిత జనవరి నెలలో సతీష్‌ను నిలదీసింది. ‘మా అమ్మ ఒప్పుకోవడం లేదని నిన్ను పెళ్లి చేసుకుంటే చనిపోతానంటోంది’ అని సతీష్ పెళ్లికి నిరాకరించాడు. ఈ క్రమంలో సరితకు మార్చి 31న చివ్వెంల మండలం బీబీగూడేనికి చెందిన పడిదల కిరణ్‌కుమార్‌తో వివాహం జరిపించారు. పెళ్లి కూతురును చేసే రోజే తానే వివాహం చేసుకుంటానంటూ సరిత ఇంటి వద్దకు వెళ్లి అతడు ఆందోళన చేశాడు. పెళ్లిని అడ్డుకుంటే తగిన పరిణామాలు తప్పవని సరిత బంధువులు హెచ్చరించడంతో వెనక్కితగ్గాడు. వివాహం జరిగాక ఫోన్లో వేధింపులు.. సరిత వివాహం జరిగాక సతీష్ తరుచూ ఆమెకు ఫోన్ చేసి వేధిస్తుండేవాడు. తాను పెళ్లి చేసుకుంటానని టేకుమట్ల గ్రామానికి రమ్మని చెబుతూ ఫోన్ చేసేవాడు. ఈ క్రమంలో సరిత బంధువులు విషయం తెలుసుకుని ఆమెకు ఫోన్ అందుబాటులో లేకుండా చేశారు. దీంతో సరిత భర్త కిరణ్‌కుమార్‌కు ఫోన్ చేసి చెల్లెకు ఫోన్ ఇవ్వమని చెప్పగా సరితకు ఫోన్ ఇవ్వగానే గ్రామానికి రమ్మని ఫోన్లో మాట్లాడేవాడు. లేకపోతే ఇద్దరం కలిసి ఉన్న ఫొటోలు నీ భర్తకు పంపుతానని భయపెడుతూ ఉండేవాడు. విడాకులు ఇప్పించి పెళ్లికి సిద్ధమైన సతీష్.. ఇటీవల కల్యాణలక్ష్మి పథకానికి దరఖాస్తు చేసుకునేందుకు సూర్యాపేట తహసీల్దార్ కార్యాలయానికి సరిత తన భర్త కిరణ్‌కుమార్‌తో కలిసి రాగా విషయం తెలుసుకున్న సతీష్ అక్కడికి చేరుకున్నాడు. చెల్లెను ఇంటికి తీసుకెళ్తానని చెప్పి బైక్ మీద తీసుకెళ్లాడు. గ్రామంలోకి వెళ్లాక సరితతో తాను దిగిన ఫొటోలు ఆమె భర్తకు వాట్సాప్ చేశాడు. ఫొటోలు చూసిన సరిత భర్త కిరణ్‌కుమార్ తనకు సరిత వద్దని చెప్పడంతో పెద్ద మనుషుల సమక్షంలో విడాకులు అయ్యాయి. ఆ తర్వాత సరితను పెళ్లి చేసుకుంటానని సతీష్ ఒప్పుకున్నాడు. పెళ్లికి సిద్ధమైన రోజునే.. టేకుమట్లలోని గీతా భవనంలో సోమవారం పెళ్లి చేసుకునేందుకు నిర్ణయించుకున్నారు. ఆదివారం నూతన వస్త్రాలు తెచ్చుకుని పెళ్లికి సంబంధించిన సామగ్రి సిద్ధం చేసుకున్నారు. సోమవారం ఉదయం సతీష్ తన తల్లిని పెళ్లికి రావాలని చెప్పాడు. పెళ్లికి రానని, పెళ్లి అయ్యాక ఇంట్లోకి కూడా రావద్దని తల్లి చెప్పింది. దీంతో అప్పటికే తెచ్చుకున్న పురుగుల మందును సతీష్, సరిత తాగారు. గమనించిన స్థానికులు, బంధువులు ఇద్దరిని సూర్యాపేట ఏరియా ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఇద్దరు చికిత్స పొందుతున్నారు. వాంగ్మూలం సేకరించిన జడ్జి.. ప్రేమికులు ఇద్దరు పురుగుమందు తాగిన విషయాన్ని తెలుసుకున్న ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి శ్రీకాంత్‌బాబు సూర్యాపేట ఏరియా ఆస్పత్రికి చేరుకొని సతీష్, సరిత నుంచి వాంగ్మూలం తీసుకున్నట్లు సూర్యాపేటరూరల్ ఎస్ఐ శ్రీనివాస్ తెలిపారు. -
ప్రేమ విఫలమై...
వర్ధన్నపేట: యువతి యువకుడు ప్రేమించుకుని ఆ ప్రేమ విఫలమై యువతి ఇంటిలోకి వెళ్లిన ఆ యువకుడు కాలిన గాయాలతో బయటకు రావడం, యువతిపై కిరోసిన్ పడి ప్రమాదం నుంచి తప్పించుకున్న సంఘటన బుధవారం సాయంత్రం మండలంలోని దమ్మన్నపేటలో చోటుచేసుకుంది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం గ్రామానికి చెందిన యువకుడు దుబ్బ యాకయ్య అదే గ్రామానికి చెందిన యువతి గత కొందీ కాలంగా ప్రేమించుకుంటున్నారు. కాగా ఇటీవల ఇరువరి మధ్య మనస్పర్ధలు ఏర్పడడంతో పెద్ద మనుషుల సమక్షంలో ఎవరికీ సంబంధం లేకుండా తీర్మానం చేసినట్లు సమాచారం. ఈ క్రమంలో బుధవారం యువతి ఇంటికి వెళ్లిన యువకుడి వంటిపై కిరోసిన్‌తో మంటలు అంటుకోగా యువతి వంటిపై కూడా కిరోసిన్ పడింది. అయితే ఈ ఘటనలో యువకుడు యువతిపై కిరోసిన్ పోసి నిప్పంటిచే ప్రయత్నం చేశాడా.. లేక యువతి ఆ పని చేసిందా.. అనే విషయం పోలీసు విచారణలో స్పష్టం కానుంది. మంటలతో గాయపడిన యువకుడు యాకయ్యను హుటాహుటిన 108 వాహనంలో వరంగల్ ఎంజీఎం ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతున్నాడు. ఈ విషయంపై పోలీస్ స్టేషన్‌కు ఫోన్ చేయగా తమకు ఇంకా ఫిర్యాదు అందలేదని తెలిపారు. -
ప్రేమించడం పాపమా.. శాపమా?
ప్రేమించడం పాపమా.. శాపమా? అనే ప్రశ్నకు సమాధానం లభించడంలేదు. కొందరు తల్లిదండ్రులకు చెప్పి ఒప్పించి పెళ్లి చేసుకుంటుండగా మరికొందరు ఆ ధైర్యం చేయలేక తనువు చాలిస్తున్నారు.. అందరికీ తెలిసిపోయిందని కొందరు.. తల్లిదండ్రులు ఒప్పుకోరనే భయంతో మరికొందరు.. వారిని ఎదురించలేక ఇంకొందరు.. ఇలా వేర్వేరు కారణాలతో ప్రేమికుల ఆత్మహత్యల పరంపర కొనసాగుతూనే ఉంది. ఆరునెలల కాలంలో పోలీసుల రికార్డులు పరిశీలిస్తే ఆత్మహత్యలు చేసుకున్నవారి సంఖ్య 20 నుంచి 25 మందికి పైగా ఉండగా జంట ఆత్మహత్యలే 10 వరకు ఉన్నాయి. తాజాగా మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్, జోగుళాంబ గద్వాల జిల్లాల్లో ప్రేమికుల జంట ఆత్మహత్యలు కలకలం రేపాయి. ప్రేమించడం పాపం కాదు.. కానీ ఆత్మహత్య చేసుకుని తల్లిదండ్రులకు షాపంగా మార్చడమే సరైంది కాదు. అయితే వీరందరూ ఒక్కక్షణం ఆలోచించినా.. ఆత్మస్థైర్యం నింపుకున్నా ఆత్మహత్య చేసుకోవాలనే తలంపుతో బయటపడేవారని సూచిస్తున్నారు మానసిక వైద్య నిపుణులు. మహబూబ్‌నగర్ రూరల్: దేశానికి పట్టుగొమ్మలు అయిన అన్నదాతలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వెన్నుదన్నుగా నిలిచాయి. ప్రతి ఏడాది రైతుబంధు, పీఎం కిసాన్ సమ్మాన్ పథకం కింద పలు విడతల్లో రైతులకు ఎకరాకు రూ.16 వేల పెట్టుబడి సాయం వస్తుండడంతో రైతుల్లో హర్షం వ్యక్తమవుతుంది. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం రెండో విడతగా పెట్టుబడి సాయం అందిస్తుండగా.. కేంద్రం తొలి విడతగా ఎన్నికలకు ముందు రైతుల ఖాతాల్లో పెట్టుబడి సాయం జమ చేసింది. ఈ లెక్కన మహబూబ్‌నగర్, నారాయణపేట జిల్లాల్లో ఏడాదికి రూ.755.33 కోట్ల సాయం అందినట్లయింది. వర్షాకాలంలో వ్యవసాయ పనులు ప్రారంభం నుంచి మొదలుకొని సాగు చేసే వరకు అయ్యే ఖర్చును కొంత వరకు ప్రభుత్వమే భరిస్తున్నందున రైతులు వ్యవసాయంపై మక్కువ చూపుతున్నారు. నీటి వనరులు, బోరు బావులు, చెరువుల కింద పంటలు సాగు చేసే రైతులు వడ్డీ వ్యాపారులను ఆశ్రయించకుండా ప్రేమే లోకం కాదు ప్రేమించిన వ్యక్తి నిరాకరించారని, ప్రేమించి మోసం చేశారని యువత ఆత్మహత్యలకు పాల్పడుతుంటారు. జీవితంలో ప్రేమ ఒక్కటే లేదు. జన్మనిచ్చిన తల్లిదండ్రులు, తోబుట్టువులు, బంధువులు ఇలా అందరినీ దుఃఖసాగరంలో ముంచి ఆత్మహత్యకు పాల్పడి సాధించేదేముంది. విలువైన జీవితంలో సాధించాల్సిన లక్ష్యాలను నిర్దేశించుకుని వాటిని సాధించడానికి కృషిచేయాలి. కన్నవారి కలలను తీర్చాలి. పుట్టి.. పెరిగిన ఊరికి పేరు, ప్రఖ్యాతులు తీసుకురావాలి. ధైర్యం చెప్పేవారేరీ..? ‘సమాజంలో మనిషి ఎదుర్కోలేని కష్టాలను భగవంతుడు ఎన్నటికీ ఇవ్వడు’ అంటారు పరమహంస యోగానంద. రామాయణంలోని సుందరకాండలో ఆంజనేయుడు ఒక మాట అంటాడు. చనిపోవడం అనేక దోషాలకు కారణమవుతుంది. బతికుంటే ఏనాటికైనా శుభం కలుగుతుంది. అని ఇలాంటి స్ఫూర్తిదాయక మాటలు చెప్పేవారు రోజురోజుకూ తగ్గిపోతున్నారు. బలమే (ధైర్యమే) జీవితం.. బలహీనతే మరణమని అందరూ నమ్మాలని స్వామి వివేకానంద ఎన్నో సందర్భాల్లో చెప్పారు. ఉమ్మడి కుటుంబ వ్యవస్థ కనుమరుగయ్యేకొద్దీ ధైర్యవచనాలు చెప్పే వారు కరువవుతున్నారు. క్షణికావేశానికి లోనై బలవన్మరణం చేసుకుంటున్న వారిలో అత్యధికులు భారతీయులే ఉంటున్నట్లు ఒక అంతర్జాతీయ సంస్థ సర్వే వెల్లడించింది. వీరిలో అత్యధికులు ప్రేమలో విఫలం చెంది ఆత్మహత్యలు చేసుకుంటున్నట్లు గుర్తించారు. ఏటా వెయ్యి మందిలో 150 మంది ఇంట్లో ప్రేమ పెళ్లిళ్లకు పెద్దలు ఒప్పుకోకపోవడంతో ఆత్మహత్యలు చేసుకుంటున్నారనేది దీని సారాంశం. ఈ లెక్కన ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఇలాంటి ఘటనలు అధిక శాతం పెరుగుతున్నాయి. ఇలాంటి కేసులు జిల్లాలో ఇటీవల వరుసగా చోటుచేసుకోవడం కలకలం రేపుతోంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదిక ప్రకారం ప్రపంచంలో ప్రతి 40 సెకన్లకు ఒకరు ఆత్మహత్యకు పాల్పడుతున్నారు. సంవత్సరానికి సుమారు పది లక్షల మంది ఆత్మహత్య చేసుకొని మృతి చెందుతున్నారు. మనిషి తనకు తానుగా ఆత్మహత్య చేసుకోవాలని అనుకోవడం, మానవ అపసామాన్య స్థితిని తెలియజేస్తుంది. వ్యక్తి వారి జీవితాన్ని అంతం చేసుకోవాలని విపరీతమైన ఆలోచనలు చేయడాన్ని వైద్య భాషలో పారాసూసైడ్ అంటారు. ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచన, ఆత్మహత్యా ప్రయత్నం రెండూ తీవ్రమైనవిగా పరిగణించాల్సిన అవసరం ఉంది. మనుషులు వారికి అనుకున్నది సాధించలేకపోయినప్పుడు.. నిస్సహాయులై మిగిలిపోయినప్పుడు.. భవిష్యత్‌ను అంధకారంగా భావించినప్పుడు తట్టుకోలేని మానసిక ఒత్తిడికి గురైనప్పుడు.. జీవితంలో మనోవ్యాధికిలోనై ఆత్మహత్యకు పాల్పడుతున్నారని నిపుణుల మాట. ఇవిగో ఘటనలు.. తమ ప్రేమకు తల్లిదండ్రులు ఒప్పుకోరనే అనుమానంతో ఉండవెల్లి మండలం ఇటిక్యాలపాడుకు చెందిన లోకేష్‌నాయుడు, కస్తూరిలు సోమవారం అర్ధరాత్రి రైలు కిందపడి ఆత్మహత్యకు పాల్పడ్డారు. అలాగే తెలకపల్లి మండలం దాసుపల్లికి చెందిన గణేశ్ అనే యువకుడు తాను ప్రేమించిన అమ్మాయికి మరో వ్యక్తితో పెళ్లి చేస్తున్నారని తెలుసుకొని పురుగు మందు తాగి మృతిచెందాడు. ఇలాంటి ఘటనలు ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఇటీవల తరచూ చోటుచేసుకుంటుండటం ఆందోళన కలిగిస్తోంది. అయితే ఈ ఘటనలన్నీ కేవలం క్షణికావేశంలో చోటుచేసుకున్నవేనని పలువురు నిపుణులు పేర్కొంటున్నారు. మూడు కారణాలు ఆత్మహత్య చేసుకోవడం వెనక ప్రధానంగా మూడు కారణాలున్నాయి. పెద్దలు పెళ్లికి అంగీకరించకపోవడం, ప్రేమ విఫలం కావడం, తీవ్రమైన నిరసన తెలపడం.. అభద్రతాభావం.. తన బాధ వినే వారు ఎవరూ లేరనే భావనతో ఆత్మహత్య చేసుకోవడానికి పురిగొల్పుతుంది. ఆత్మహత్యలు చేసుకుంటున్న వారిలో ఎక్కువగా నడివయస్కులవారే. తన మాట వినే వారు ఉన్నారు అని వారు భావించినప్పుడు వారిలో ఆత్మహత్య ఆలోచన రాకుండా ఉంటుంది. గెలిచి.. చూపించాలి ప్రతీ వ్యక్తి జీవితంలో గెలవాలంటే అన్నింటికన్నా ముందు మానసిక పరిపక్వత చాలా అవసరం. చిన్ననాటి నుంచి వృద్ధాప్యం వరకు ఒడిదొడుకులు, కష్టాలు, ఇబ్బందులు వస్తూనే ఉంటాయి. అన్నీ దాటుకుంటూ వచ్చి అకారణంగా చిన్న విషయంలో ఒంటరి వారమవుతున్నాం. ప్రతి విషయాన్ని ఓపికగా ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటే గెలుపు మన పక్కనే ఉంటుంది. కొన్ని సందర్భాల్లో ఓటమి కూడా మనసును పలకరిస్తుంటుంది. జీవితమంటే గెలుపోటముల సంగ మం అని గ్రహిస్తే కుంగుబాటును దూరం చేసుకోవచ్చు. చిన్న చిన్న విషయాలకే బలవన్మరణానికి పాల్పడితే జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకోవాల ని కోటి మొక్కులు మొక్కే మన తల్లిదండ్రులు, అక్కాచెల్లెళ్లు, అన్నదమ్ములు ఇలా మన వెనక గెలు పు చూడాలని తాపత్రయపడే వారు చాలామంది ఉంటారు. పిల్లల చదువులు, ఉద్యోగాల కోసం జీవితాన్ని ధారబోసే తల్లిదండ్రులుంటారు. జీవితం ఒక్క మనకే పరిమితం కాదు. చాలా బంధాలు, బాంధవ్యాలతో ముడిపడి ఉంటుందనే విషయాన్ని గుర్తెరిగి నిర్ణయాలు తీసుకోవాలి. మనపై ఆధారపడినవారి గురించి ఆలోచించాలి. మనం ఎదగడంలో, ఉద్యోగం సాధించడంలో వారి పాత్ర ఉందని, మన ఎదుగుదలకు వారు ఉపయోగపడాలనే ఆలోచన మదిలో మెదలాలి. మార్పు గమనించాలి.. ఆత్మహత్య చేసుకోవాలని అనుకునే వారు అప్పటికప్పుడు కాకుండా ఇలాంటి వారు ముందుగానే బలవన్మారణాలకు సిద్ధమవుతారు. కుటుంబ సభ్యులతో ముభావంగా ఉంటారు. ఏదో పరలోకంలో ఉన్నట్లు ఆలోచన చేస్తారు. చిన్న చిన్న విషయాలకు ఏడుస్తుంటారు. నేను లేకపోయిన మీరు బాగుండాలనే మాటలు నోటి నుంచి వస్తుంటాయి. తోటి విద్యార్థులతో సన్నిహితంగా మెలగరు. ఒకరిద్దరితో జీవితం అంతమైతే తర్వాత ఏం జరుగుతుందనే చర్చలు జరుపుతారు. ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచన కలిగినప్పుడే చనిపోవచ్చు. – డాక్టర్ రామకిషన్, జనరల్ ఆస్పత్రి సూపరింటెండెంట్, మహబూబ్‌నగర్ ఆ.. ఆలోచననే తుంచేయాలి అభివృద్ధి చెందిన దేశాలతో పోల్చితే మన దేశంలో మానసిక జబ్బులపై ప్రజలకు సరైన అవగాహన లేదు. తీవ్ర ఒత్తిడిలో ఉన్నవారి మానసిక పరిస్థితిని అర్థం చేసుకునే శక్తి కూడా తక్కువే. ఆ క్రమంలో జీవితంపై విరక్తి చెందిన ప్రతి ఒక్కరికీ వచ్చే ఆలోచన ఆత్మహత్య చేసుకోవడం.. ఇలాంటి ఆలోచనను మొగ్గలోనే తుంచేయాలి. ప్రేమలో విఫలం చెందిన వారి మీద వాస్తవానికి ఒత్తిడి బాగా ఉంటుంది. చిన్నప్పటి నుంచి పెరిగిన వాతావరణం ఆత్మహత్యలకు దారితీస్తోంది. ప్రస్తుతం ఏమీ చేయలేనన్న భావనను మనసులోంచి తీసేయాలి. – వంగీపురం శ్రీనాథాచారి, మానసిక వ్యక్తిత్వ వికాస నిపుణుడు -
విషాదంతో ముగిసిన ప్రేమకథ
శ్రీకాకుళం ,వీరఘట్టం: ప్రేమ జంట కథ చివరకు విషాదాంతంతో ముగిసింది. పెద్దలను ఎదురించలేక తమలో ఉన్న ప్రేమను చంపుకుని ఆదివారం విశాఖపట్నంలోని కైలాసగిరిపై మండలానికి చెందిన ప్రేమ జంట ఆత్మహత్నాయత్నానికి పాల్పడిన విషయం విధితమే. ప్రియుడు చౌడాడ సత్యనారాయణ ఆదివారమే చనిపోగా ప్రియురాలు రౌతు కమల మృత్యువుతో పోరాడి సోమవారం తుదిశ్వాస విడిచింది. ఆమె కుటుంబ సభ్యులు కమల కళ్లను కేజీహెచ్ వైద్యుల సమక్షంలో దానం చేశారు. ఆదివారం సత్యనారాయణ మృతదేహానికి పోస్టుమార్టం చేసి కుటుంబ సభ్యులకు అప్పగించడంతో స్వగ్రామం అడారులో సోమవారం అంత్యక్రియలు నిర్వహించారు. కమల మృతదేహానికి కేజీహెచ్ వైద్యులు పోస్టుమార్టం నిర్వహించి వారి కుటుంబ సభ్యులకు అప్పగించారు. మంగళవారం స్వగ్రామం అడారులోనే దహన సంస్కారాలు నిర్వహించనున్నట్లు బంధువులు తెలిపారు. అడారులో విషాదం అలముకుంది. -
పెద్దలు ప్రేమ పెళ్లికి నిరాకరించారని..
టీ.నగర్: కుంభకోణం సమీపాన గల కావర్‌కూడం అంబలక్కార వీధికి చెందిన రవికుమార్ కుమారుడు చంద్రన్ (20). ఇదే ప్రాంతానికి చెందిన రత్నం కుమార్తె రంజిత (19). వీరిద్దరూ ప్రేమించుకుంటూ వచ్చారు. అయితే చంద్రన్, రంజితకు చిన్నాన్న వరస కావడంతో ఇరు కుటుంబాలు వీరి వివాహానికి సమ్మతించలేదు. దీంతో విరక్తి చెందిన ప్రేమజంట ఈ నెల 16వ తేదీన విషం తాగి ఆత్మహత్యకు యత్నించింది. ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఇరువురిని బంధువులు వెంటనే కుంభకోణం ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్చారు. తరువాత మెరుగైన చికిత్స కోసం ఇద్దరిని తంజావూరుకు వైద్య కళాశాల ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ చికిత్స పొందుతూ రంజిత సోమవారం రాత్రి మృతి చెందింది. ప్రాణాపాయ స్థితిలో ఉన్న చంద్రన్‌కు చికిత్సలు అందిస్తున్నారు. దీనిపై స్వామిమలై పోలీసులు విచారణ చేస్తున్నారు. -
ప్రేమికుల ఆత్మహత్యాయత్నం
కర్నూలు, అవుకు: మండలంలోని రామాపురంలో మంగళవారం ప్రేమికులు ఆత్మహత్యకు ప్రయత్నించారు. ప్రియుడు మరణించగా..ఆమె పరిస్థితి విషమంగా ఉంది. అవుకు ఎస్ఐ వెంకటేశ్వర రావు కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. రామాపురం గ్రామానికి చెందిన మారం రామచంద్రారెడ్డి కుమార్తె స్వప్నలత డిగ్రీ (బీఎస్సీ) వరకు చదివింది. అదే గ్రామానికి చెందిన కొండారెడ్డి కుమారుడు వెంకటేశ్వరరెడ్డి (24) కూడా బీకాం పూర్తి చేశాడు. ఇతను బెంగళూరులో ఏడాది పాటు అకౌంటెంట్‌గా పనిచేశాడు. ప్రస్తుతం తండ్రితో కలిసి వ్యాపారం చూసుకునేవాడు. కాగా.. స్వప్నలత, వెంకటేశ్వరరెడ్డి కొంత కాలంగా ప్రేమించుకుంటున్నారు. అయితే.. ఆమెకు వేరే వ్యక్తితో వివాహం చేసేందుకు రెండు రోజుల్లో నిశ్చితార్థం చేసుకోవాలని కుటుంబ సభ్యులు నిర్ణయించారు. ఈ పెళ్లి ఇష్టం లేని ఆమె మంగళవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో పురుగు మందు తాగింది. కుటుంబ సభ్యులు గమనించి చికిత్స నిమిత్తం బనగానపల్లె ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో అక్కడి వైద్యులు మెరుగైన చికిత్స కోసం కర్నూలు ప్రభుత్వాస్పత్రికి రెఫర్ చేశారు. విషయం తెలుసుకున్న వెంకటేశ్వరరెడ్డి విషపు గుళికలు మింగాడు. కుటుంబ సభ్యులు గమనించి ముందుగా బనగానపల్లె ప్రభుత్వ వైద్యశాలకు తీసుకెళ్లారు. పరిస్థితి విషమంగా ఉండడంతో కర్నూలు తీసుకెళ్లాల్సిందిగా వైద్యులు సూచించారు. అక్కడికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు. -
కలకలం రేపిన ఆత్మహత్యాయత్నాలు
మల్కాపురం(విశాఖ పశ్చిమ): పారిశ్రామిక ప్రాంతంలో ఓ యువతి, యువకుడు ఆత్మహత్యకు యత్నించడం... వారిలో యువతి మృతి చెందడం తీవ్ర సంచలనం రేపింది. తమ ప్రేమ ఫలించదనే వేదనతోనే ఆత్మహత్యకు యత్నించామని యువకుడు చెబుతుంటే... తమ కుమార్తెను ప్రేమ పేరుతో వేధించడం వల్లే ఆత్మహత్య చేసుకుందని మృతురాలి బంధువులు ఆరోపిస్తున్నారు. పోలీసులు, కుటుంబీకులు తెలిపిన వివరాల ప్రకారం... జీవీఎంసీ 49వ వార్డు మల్కాపురం, క్రాంతినగర్ ప్రాంతంలో దేవి(22) అనే యువతి తల్లిదండ్రులతో కలిసి నివసిస్తోంది. ఆమె డిగ్రీ ఆఖరి సంవత్సరం చదువుతోంది. అదే ప్రాంతంలో దేవి ఇంటికి సమీపాన అనుదీప్(24)అలియాస్ అరవింద్ అనే యువకుడు తల్లిదండ్రులతో ఉంటున్నాడు. స్థానికంగా ఓ కంపెనీలో కాంట్రాక్టు కార్మికుడిగా పని చేస్తున్నాడు. ఈ నేపథ్యంలో బుధవారం ఉదయం 9:15గంటలకు దేవి తన ఇంటిలోని గదిలోకి వెళ్లి ఉరి వేసుకుంది. అనుమానంతో గదిలోకి వెళ్లిన దేవి తల్లిదండ్రులు ఫ్యాన్ హుక్కు వేలాడుతున్న దేవిని కిందకు దించి స్థానిక సెయింట్ ఆన్స్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అయితే అప్పటికే ఆమె మృతి చెందిందని స్థానిక వైద్యులు నిర్థారించడంతో మల్కాపురం పోలీసులకు సమాచారం అందించారు. వారు ఘటనా స్థలికి వచ్చి వివరాలు సేకరించి పోస్టుమార్టం కోసం మృతదేహాన్ని కేజీహెచ్‌కు తరలించారు. ఘటనపై భిన్న వాదనలు మరోవైపు 9:40 గంటల సమయంలో తన ఇంటిలో అనుదీప్ ఆత్మహత్యకు యత్నించడంతో కుటుంబ సభ్యులు గుర్తించి రక్షించారని పోలీసులకు సదరు యువకుడు చెబుతున్నాడు. రెండేళ్లుగా తామిద్దరం ప్రేమించుకుంటున్నామని, యువతి ఇంటిలో ప్రేమ విషయం తెలియడంతో వేరే వారికి ఇచ్చి పెళ్లి చేసేందుకు సిద్ధమవుతున్నారని... అందువల్లే ఆత్మహత్యకు యత్నించామని అనుదీప్ పోలీసులకు చెబుతున్నాడు. అయితే అతని మెడపైగానీ, ఎక్కడా ఆత్మహత్యకు యత్నించిన ఆనవాళ్లు లేవని... అసలు వారిద్దరి మధ్య ప్రేమే లేదని... ప్రేమ పేరుతో దేవిని అనుదీప్ కొంత కాలంగా వేధిస్తున్నాడని... దీనిపై ఓ లేఖ కూడా దేవి రాసిందని ఆమె చిన్నాన్న మహాత్మ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నాడు. యువకుడి తల్లిదండ్రులను విచారిస్తున్న సీఐ భాస్కర్‌రావు నిజంగా వారిద్దరూ ప్రేమించుకుంటే ఒకేచోట ఆత్మహత్యకు యత్నించాలి కదా అని ఆయన ప్రశ్నిస్తున్నాడు. దేవి ఆత్మహత్య చేసుకోవడంతో తామంతా అతడిపై దాడి చేస్తామన్న భయంతో అనుదీప్ ఆత్మహత్యాయత్నం డ్రామా ఆడుతున్నాడని, పూర్తిస్థాయిలో విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని కోరారు. వీరి ఫిర్యాదు మేరకు అనుదీప్‌ను, అతని తల్లిదండ్రులను మల్కాపురం పోలీసులు విచారించారు. అనంతరం సంఘటన స్థలాలకు వెళ్లి పరిశీలించి వివరాలు సేకరించారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేస్తున్నట్లు సీఐ లంకా భాస్కర్‌రావు తెలిపారు. పూర్తిస్థాయిలో విచారణ చేపట్టి వివరాలు వెల్లడిస్తామని ఆయన పేర్కొన్నారు. -
పురుగుల మందు తాగిన ప్రేమికులు
ఇల్లంతకుంట(మానకొండూర్): ఒకరినొకరు ప్రేమించుకున్నారు. కులాలు వేరుకావడం పెళ్లికి ఇరుకుటుంబాల పెద్దలు అంగీకరించలేదు. ప్రేమను చంపుకోలేక, కలిసి బతకలేక ఓ ప్రేమజంట ఆత్మహత్యకు యత్నించింది. ఈ ఘటన ఆదివారం ఇల్లంతకుంట మండలంలో చోటు చేసుకుంది. ఇల్లంతకుంటకు చెందిన ఫర్జానా(22), ఇదే మండలంలోని అనంతారంకు చెందిన అక్కెం హరికృష్ణ(23) కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. విషయం యువతి కుటుంబానికి తెలియడంతో పదిరోజుల క్రితం కరీంనగర్‌కు చెందిన ఓ యువకుడితో ఫర్జానా వివాహం జరిపించారు. అయినప్పటికి ఫర్జాజా, హరికృష్ణలు ఒకరిపై ఒకరు ప్రేమను చంపుకోలేక ఇద్దరు కలిసి మరణించాలనే ఉద్దేశంతో తంగళ్ళపల్లి మండలం జిల్లెల్ల చెక్‌పోస్టు వద్ద ఆదివారం మధ్యాహ్నం పురుగుల మందు తాగారు. గమనించిన స్థానికులు బాధితులను ఎల్లారెడ్డిపేటలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. ఇందులో ఫర్జానా పరిస్థితి విషమంగా ఉందని తెలిసింది. మెరుగైన వైద్యం కోసం ఇద్దరిని కుటుంబసభ్యులు హైదరాబాద్‌కు తరలించారు. -
10 ఏళ్ల క్రితం వివాహం.. ప్రియుడితో కలిసి ఆత్మహత్యాయత్నం!
వైఎస్ఆర్, నంద్యాల: సోషల్ మీడియా ద్వారా పరిచయం అయ్యారు. అది ప్రేమగా మారింది. ఆమెకు అప్పటికే వివాహమైంది. అయినప్పటికీ ప్రియుడితో కలిసి జీవించాలని నిర్ణయించుకుంది. ఇంటి నుంచి బయటకు వచ్చేసింది. అయితే..ఇంతలోనే ఏం జరిగిందో కానీ ఇద్దరూ కలిసి ఆత్మహత్యకు ప్రయత్నించారు. ప్రియుడు మృతి చెందగా..ఆమె పరిస్థితి విషమంగా ఉంది. ఈ ఘటన గురువారం కర్నూలు జిల్లా నంద్యాల రైల్వేస్టేషన్ వద్ద చోటుచేసుకుంది. రైల్వే పోలీస్ స్టేషన్ హెడ్ కానిస్టేబుల్ రఫీ తెలిపిన మేరకు వివరాలిలా ఉన్నాయి. వైఎస్సార్ జిల్లా పులివెందులకు చెందిన విద్యుత్ శాఖ ఏడీఏ రఘుతో దివ్యకు పదేళ్ల క్రితం వివాహమైంది. వీరికి సంతానం లేదు. పైగా వయసులో 23 ఏళ్ల వ్యత్యాసం ఉంది. ఇదిలా ఉండగా.. అదే జిల్లా ప్రొద్దుటూరులోని దొరసానిపల్లె వీధికి చెందిన బండారు శ్రావణ్‌కుమార్(26) నెల్లూరులో ఏపీ జెన్కోలో కాంట్రాక్ట్ ఉద్యోగిగా పని చేస్తున్నాడు. ఇతనికి, దివ్యకు ఏడాది క్రితం సోషల్ మీడియా ద్వారా పరిచయం ఏర్పడింది. అది కాస్త ప్రేమగా మారింది. వీరు అప్పుడప్పుడు కలుసుకొనే వారని స్థానికులు తెలిపారు. ఈ నెల 13వ తేదీన ఇంటి నుంచి ఇద్దరూ బయటకు వచ్చారు. భార్య అదృశ్యమైందని దివ్య భర్త రఘు పులివెందుల పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అప్పటి నుంచి వీరిద్దరి జాడ ఎవరికీ కనిపించలేదు. పెళ్లి చేసుకోవడానికే ఇంటి నుంచి బయటకు వచ్చినట్లు తెలిసింది. గురువారం ఉదయం తిరుపతి నుంచి రైలులో నంద్యాల రైల్వేస్టేషన్‌కు చేరుకున్నారు. శ్రావణ్‌కుమార్ తన బంధువులకు ఫోన్ చేసి తాను బతకనని, పురుగు మందు తాగుతున్నానని తెలిపాడు. తాము మాట్లాడతామని వారు చెప్పినా వినకుండా ఫోన్ స్విచ్చాఫ్ చేశాడు. అనంతరం రైల్వేస్టేషన్ వెలుపల కూల్‌డ్రింక్స్ కొనుగోలు చేసి.. అందులో పురుగు మందు కలుపుకొని ఇద్దరూ తాగారు. తర్వాత రైల్వేస్టేషన్‌లోకి వెళుతూ స్టేషన్ ఆవరణలోనే పడిపోయారు. ఇది గమనించిన స్థానికులు 108 అంబులెన్స్‌కు ఫోన్ చేశారు. అంబులెన్స్ రాగానే నంద్యాల ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అక్కడ పోలీసులకు వారి పేర్లు, అడ్రస్ తెలిపి తామిద్దరం ప్రేమించుకున్నామని మాత్రమే చెప్పారు. పరిస్థితి విషమంగా ఉండటంతో ఐసీయూలో ఉంచి చికిత్స అందించినా కోలుకోలేక శ్రావణ్‌కుమార్ మృతి చెందాడు. ఆమె పరిస్థితి విషమంగా ఉండటంతో నంద్యాల లోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. శ్రావణ్‌కుమార్ తండ్రి శ్రీనివాసులు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు రైల్వే హెడ్‌కానిస్టేబుల్ రఫీ తెలిపారు. -
ప్రేమికుల ఆత్మహత్య.. బోయిన్‌గుట్టలో ఉద్రిక్తత
కడ్తాల్(కల్వకుర్తి): వారి ప్రేమకు పెద్దలు అడ్డుచెప్పడంతో ఆత్మహత్య చేసుకున్నారు. 14 సంవత్సరాల బాలిక.. ఆటో నడుపుతూ జీవనం సాగిస్తున్న 23 సంవత్సరాల అబ్బాయితో ప్రేమలో పడింది. ఇద్దరి వయసులో తేడాతో పాటు వరుసలు కూడా కుదరకపోవడంతో పెద్దలు వీరి ప్రేమను నిరాకరించారు. దీంతో బాలిక, యువకుడు పురుగుల మందు తాగి బలవన్మరణానికి పాల్పడ్డారు. షాద్‌నగర్ ఎసీపీ సురేందర్, కడ్తాల్ ఎస్ఐ సుందరయ్య తెలిపిన వివరాల ప్రకారం.. కడ్తాల్ మండలం చరికొండ పంచాయతీ పరిధిలోని బోయిన్‌గుట్టతండాకు చెందిన నేనావత్ రఘు–మంగమ్మ దంపతుల రెండో కూతురు నేనావత్ రేణుక(14), అదే తండాకు చెందిన పాత్లవత్ హూమ్లా, కేడీ దంపతుల మూడో కుమారుడు పాత్లావత్ రాజునాయక్(23) ప్రేమించుకున్నారు. వివాహం చేసుకుని జీవితాంతం కలిసి ఉండాలని ఈ ఏడాది ఏప్రిల్‌లో ఎవరికీ చెప్పకుండా ఇంట్లో నుంచి వెళ్లిపోయారు. విషయం తెలిసిన బాలిక తల్లిదండ్రులు కడ్తాల్ పోలీస్ స్టేషన్లో అప్పట్లో ఫిర్యాదు చేశారు. దీంతో మిస్సింగ్, కిడ్నాప్ కేసు నమోదు చేసిన పోలీసులు బాలిక, ఆ యువడిని పోలీస్ స్టేషన్‌కు తీసుకువచ్చారు. బాలికకు స్టేషన్లో కౌన్సెలింగ్ ఇచ్చి.. యువకుడిపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు పంపిచారు. ఇదిలా ఉండగా.. రెండు నెలల క్రితం జైలు నుంచి విడుదలైన పాత్లావత్ రాజు గతంలో మాదిరిగానే ఆటో నడుపుతూ బతుకువెళ్లదీస్తుండగా వారం రోజుల క్రితం రేణుకతో రాజు మాట్లాడాడని అదే తండాకు చెందిన కొందరు రేణుక తల్లితో చెప్పారు. దీంతో రేణుకను ఆమె తల్లి ఈ నెల 11న మందలించింది. మనస్తాపం చెందిన రేణుక 12వ తేదీ ఉదయం పురుగుల మందు తాగగా ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఆదివారం సాయంత్రం మృతి చెందింది. సోమవారం మృతదేహన్ని బోయిన్‌గుట్టకు తండాకు తీసుకువచ్చారు. అయితే, రాజు కారణంగానే తమ కూతురు ఆత్మహత్యకు పాల్పడిందని అతడి ఇంటి వద్దకు వెళ్లి ఆందోళన చేశారు. యువకుడి ఇంటి వద్ద ఇరువర్గాలకు చెందిన వారు ఘర్షణకు దిగడంతో సమాచారం అందుకున్న పోలీసులు తండాకు చేరుకుని ఇరువర్గాల వారిని శాంతిపజేశారు. రేణుక కుటుంబ సభ్యులు సోమవారం రాత్రి అంత్యక్రియలు నిర్వహించారు. మనస్తాపంతో ప్రేమికుడి ఆత్మహత్య.. ప్రేమించిన యువతి ఆత్మహత్య చేసుకోవడంతో తీవ్ర మనోవేదనకు గురైన పాత్లావత్ రాజు మంగళవారం ఉదయం వ్యవసాయ పొలం వద్ద పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గమనించిన కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహన్ని పరిశీలించారు. ఇదిలా ఉండగా అప్పటికే తండాకు చేరుకున్న మృతుడి బంధువులు, కుటుంబ సభ్యులు తమ కుమారిడిది ఆత్మహత్య కాదని, హత్య చేసి నోట్లో పురుగుల మందు పోశారని ఆరోపించారు. దీంతో తండాలో తీవ్ర ఉద్రిక్తత నెలకొనడంతో పరిస్థితిని అదుపులో ఉంచేందుకు ఇద్దరు సీఐలు, నలుగురు ఎస్ఐలతో పాటు ప్రత్యేక పోలీసు బలగాలతో తండాలో బందోబస్తు ఏర్పాటు చేశారు. అనంతరం యువకుడి అంత్యక్రియలు నిర్వహించారు. ఇరువురి కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్ఐ తెలిపారు. -
పరస్పరం ఆకర్షితులై.. ప్రేమగా భ్రమించి..!
పాల్వంచ(ఖమ్మం): వారిద్దరూ మైనర్లు. ఆ వయసులో సహజంగా కలిగే పరస్పర ఆకర్షణను ప్రేమగా భ్రమించారు. వీరిద్దరూ సన్నిహితంగా ఉంటున్న విషయం ఆమె ఇంటిలో తెలిసింది. వారిద్దరూ భయపడ్డారు. ఆత్మహత్యకు యత్నించారు. అతడు మృతిచెందాడు. ఆమెకు తీవ్ర గాయాలయ్యాయి. పాల్వంచలో ఆదివారం ఇది జరిగింది. స్థానికులు తెలిపిన వివరాలు... పట్టణంలోని ఇంటర్మీడియట్ కాలనీకి చెందిన డిప్లొమా విద్యార్థి మణికంఠ(17). కాంట్రాక్టర్స్ కాలనీలో ఉంటున్న ఆమె పదో తరగతి విద్యార్థిని. వీరి మధ్య పరిచయం స్నేహంగా మారింది. పరస్పరం ఆకర్షితులయ్యారు. దీనినే ప్రేమగా భ్రమించారు. ఈ విషయం ఇటీవల ఆమె ఇంట్లో తెలిసింది. తండ్రి మందలించాడు. ఆమె ఈ విషయాన్ని తన స్నేహితుడైన అతడితో చెప్పింది. ఇద్దరూ భయపడ్డారు. క్షణికమైన ఆవేశంతో, ఆలోచనారాహిత్యంతో ఆదివారం సాయంత్రం కాంట్రాక్టర్స్ కాలనీలో నిర్మాణంలోగల మూడంతస్తుల భవనంపై నుంచి దూకి ఆత్మహత్యకు యత్నించారు. కింద పడిపోగానే భయంతో పెద్దగా అరిచారు. పెద్ద శబ్దం, అరుపులు వినిపించడంతో చుట్టుపక్కల వారు పరుగు పరుగున వచ్చారు. రక్తపు మడుగులో అపస్మారక స్థితికి చేరిన వారిద్దరినీ 108 సిబ్బంది స్థానిక ఏరియా ఆస్పత్రిలో చేర్పించారు. అతడి తలకు, శరీర భాగాలకు తీవ్ర గాయాలయ్యాయి. ఆమె రెండు కాళ్లు విరిగాయి. మొహంపై బలమైన దెబ్బలు తగిలాయి. వారిద్దరి పరిస్థితి విషమించడంతో అక్కడి నుంచి ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో అతడు మృతిచెందాడు. ఘటన స్థలాన్ని సీఐ ప్రవీణ్ కుమార్, పట్టణ ఎస్ఐ ముత్యం రమేష్ పరిశీలించారు. -
పెద్దలు నిరాకరించడంతో ప్రేమ జంట..
వేములవాడఅర్బన్ (కరీంనగర్): వేములవాడ పట్టణ శివారులోని నాంపల్లి గుట్టపై శనివారం ఓ ప్రేమజంట ఆత్మహత్యాయత్నం చేసింది. వేములవాడ టౌన్ పోలీసుల కథనం ప్రకారం.. సిరిసిల్ల పట్టణంలోని రాజీవ్‌నగర్‌కు చెందిన దాసరి సాయి, గాంధీనగర్ కు చెందిన దూస రాశి కొన్నిరోజులుగా ప్రేమించుకుంటున్నారు. ప్రేమ విషయం ఇంట్లో తెలుపగా ఒకే సామాజిక వర్గం అయినా ఇరు కుటుంబాల పెద్దలు పెళ్లికి నిరాకరించారు. దీంతో శుక్రవారం సాయంత్రం ఈద్దరూ ఇళ్ల నుంచి వెళ్లిపోయారు. శనివారం తెల్లవారు జామున నాంపల్లి గుట్టపైకి చెరుకున్నారు. కలిసి బతకడం కష్టమని.. కలిసి చనిపోదామని నిర్ణయించుకున్నారు. వెంటతెచ్చుకున్న నిద్ర మాత్రలు మింగారు. గుట్టపైకి వచ్చిన భక్తులు కోనేరు వద్దకు వెళ్లగా అక్కడ ఇద్దరూ ఆపస్మారక స్థితిలో కనిపించడంతో స్థానికులు సమాచారం ఇచ్చారు. సంఘటన స్థలానికి వచ్చిన పోలీసులు వారిని 108లో సిరిసిల్ల ఆస్పత్రికి తరలించారు. వివరాలు సేకరించి వారి తల్లిదండ్రులకు సమాచారం అందించారు. ప్రస్తుతం ఇద్దరూ కోలుకుంటున్నారని వైద్యులు తెలిపారు. -
ప్రేమజంట ఆత్మహత్యాయత్నం..! ప్రియుడి మృతి
సాక్షి, వైఎస్సార్ కడప : జిల్లాలోని రాజంపేట రైల్వేస్టేషన్ సమీపంలో కలకలం రేగింది. ప్రేమజంట రైలుకింద పడి ఆత్మహత్యాయత్నం చేసింది. ఈ ఘటనలో ప్రియుడు అక్కడిక్కడే మృతి చెందగా.. తీవ్రంగా గాయపడిన ప్రియురాలిని హుటాహుటిన సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. ఆమె పరిస్థితి విషమంగా ఉందని ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. కాగా, మృతుడు విజయవాడకు చెందిన సిద్ధయ్య, గాయపడిన మహిళ కడపకు చెందిన కాసింబిగా గుర్తించారు. -
ప్రేమ కోసం ప్రాణత్యాగం
తలమడుగు(బోథ్): ప్రేమించిన యువతి పురుగుల మందు తాగిందని తానూ పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడో యువకుడు. పోలీసులు తెలిపిన వివరాలివీ.. మండలంలోని పల్లి కే గ్రామానికి చెందిన ఆత్రం ఉమేశ్ (22) అదే గ్రామానికి చెందిన యువతిని ప్రేమిస్తున్నాడు. బుధవారం యువతి పురుగుల మందు తాగి రిమ్స్‌లో చికిత్స పొందుతోంది. దీంతో ప్రేమించిన యువతి లేదని మనస్థాపంతో గురువారం రాత్రి ఉమేశ్ కూడా పురుగుల మందు తాగి పడిపోయాడు. గమనించిన కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం జిల్లా కేంద్రంలోని రిమ్స్‌కు తరలించారు. రిమ్స్‌లో చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందాడు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
ప్రేమా.. ఎంతపని చేశావు
తెలిసీ తెలియని వయసులో ప్రేమలో పడ్డారు. పెళ్లి చేయడానికి ఇద్దరూ మైనర్లే.. వివాహానికి అర్హులం కాదని కూడా తెలియని పిన్న వయసు వారిది. తొందరపడ్డారు. తమ ప్రేమ వ్యవహారం కనీసం తల్లిదండ్రులకు చెప్పలేదు. వారి నిర్ణయం కోసం కూడా వేచి చూడకుండానే తనువు చాలించాలనుకున్నారు. తమ ప్రేమను పెద్దలు అంగీకరించరన్న భయంతోనే ఆత్మహత్యకు ప్రయత్నించారు. ఈ ఘటనలో ప్రియుడు చనిపోగా, ప్రియురాలు మృత్యువుతో పోరాడుతోంది. ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. పాయకరావుపేట మండలం నామవరంలోని సాధారణ వ్యవసాయ కూలీల కుటుంబంలో ఈ విషాదకర సంఘటన చోటుచేసుకుంది. పాయకరావుపేట: నామవరం గ్రామానికి చెందిన వ్యవసాయ కూలీ గొర్ల రామకృష్ణ అలియాస్ కన్నబాబు(18), శ్రీ చైతన్యపాఠశాలలో పదో తరగతి చదువుతున్న బాలిక(14) ప్రేమించుకున్నారు. ఆమె తండ్రి సతీష్ కుమార్ ఒక ప్రైవేటు పాఠశాలలో బస్సు డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. రామకృష్ణ తండ్రి కూడా వ్యవసాయ కూలీనే. కొద్దిరోజులుగా ప్రేమలో పడ్డ వీరిద్దరూ ఈ నెల 7వతేదీ రాత్రి ఎమినిది గంటల సమయంలో ఇంటి నుంచి పరారయ్యారు. ఈమేరకు బాలిక తండ్రి అదే రోజు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పరారైన వీరు ఇదే మండలం గోపాలపట్నం సమీపంలో ఉన్న సీతమ్మవారి మెట్టవద్దకు 8వ తేదీ ఉదయం చేరుకున్నారు. రామకృష్ణ తన సోదరుడికి ఫోన్ చేసి తాను ఓ బాలికను ప్రేమించానని, పెళ్లికి అంగీకరించనందున పురుగుమందు తాగి చనిపోతున్నామని చెప్పాడు. దీంతో కంగారు పడ్డ సోదరుడు అలాంటి తొందర పాటు నిర్ణయాలు తీసుకోవద్దని..ఎక్కడ ఉన్నారో చెప్పాలన్నాడు. వారున్న స్థలం తెలపడంతో ఈ విషయం పోలీసులకు చెప్పారు. వెంటనే 8వ తేదీన ఎకాయెకిన సీతమ్మవారి మెట్టవద్దకు వెళ్లి చూసే సరికి ఇద్దరూ పురుగుమందు తాగి అపస్మారక స్థితిలో ఉన్నారు. వారిని తునిలోని ఒక ప్రైవేటు ఆస్పత్రిలో చేర్పించారు. చికిత్స పొందుతూ మంగళవారం మధ్యాహ్నం రామకృష్ణ మరణించాడు. ఇద్దరూ మైనర్లే కావడంతో ఈ ఘటనపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. చంపడానికే మా కుమార్తెను తీసుకుపోయాడు తమ కుమార్తె శైలజ ప్రేమవ్యవహారం తమకు తెలియదని తల్లిలక్ష్మి తెలిపింది. ఆమెను లోబరుచుకుని చంపడానికే తీసుకుపోయాడంటూ బోరున విలపించింది. పెద్దల సూచనమేరకు న్యాయం కోసం పోలీసులకు ఫిర్యాదు చేశామన్నారు. శైలజ తల్లి లక్ష్మి -
ప్రేమజంటను కాపాడిన హోంగార్డు
కరీమాబాద్ : రైలు పట్టాల మధ్య నిలబడి ఆత్మహత్య చేసుకునేందుకు ప్రయత్నించిన ఓ ప్రేమ జంటను ట్రాఫిక్ హోంగార్డు కాపాడిన సంఘటన నగరంలోని హంటర్‌రోడ్డు రైల్వే మినీ బ్రిడ్జి ట్రాక్‌పై జరిగింది. ట్రాఫిక్ హోంగార్డు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం..నగరంలోని వరంగల్ లక్ష్మీనగర్ ప్రాంతానికి చెందిన ప్రేమికులు(పేరు చెప్పడానికి ఇష్టపడలేదు) బుధవారం ఉదయం సుమారు 10.30 గంటల ప్రాంతంలో రైల్వే ట్రాక్‌పై నిలబడి ఆత్మహత్య చేసుకునేందుకు ఒకరినొకరు గట్టిగా పట్టుకున్నారు. అక్కడే విధులు నిర్వర్తిస్తున్న ట్రాఫిక్ హోంగార్డు రవి ఇది గమనించి వారిని ఆత్మహత్య చేసుకోవద్దని వారించడంతో పాటు ట్రాక్ మీద నుంచి బలవంతంగా పక్కకు కిందకు తీసుకెళ్లాడు.అక్కడే ప్రేమికులిద్దరికి తనతో పాటు స్థానికులు కౌన్సెలింగ్ ఇచ్చి పంపించినట్లు హోంగార్డు రవి వివరించారు. ప్రేమపెళ్లికి ఇరు కుటుంబ సభ్యులు ఒప్పుకోకపోవడం వల్లనే ఆత్మహత్య చేసుకునేందుకు వచ్చినట్లు వారు చెప్పారని రవి తెలిపాడు. కాగా సమయానికి స్పందించి ప్రేమ జంటను కాపాడిన హోంగార్డు రవిని పలువులు అభినందించారు. -
ప్రియురాలు దక్కదని ఆత్మహత్యాయత్నం
జగిత్యాలక్రైం : జగిత్యాల జిల్లా కేంద్రంలోని కొత్తబస్టాండ్ ప్రాంతంలో మంచిర్యాల జిల్లా కడెం మండలం గంగాపూర్ గ్రామానికి చెందిన లకవర్తి వినోద్ మాత్రలు మింగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. వివరాలిలా ఉన్నాయి. గంగాపూర్‌కు చెందిన వినోద్ అదే గ్రామానికి చెందిన రాజేశ్వరి అనే వివాహిత 9 నెలలుగా ప్రేమించుకుంటున్నారు. రాజేశ్వరికి అదే గ్రామానికి చెందిన ఓ వ్యక్తితో పెళ్లి జరిగింది. వీరి ప్రేమకు ఇరు కుటుంబ సభ్యులు అభ్యంతరం తెలపడంతో గురువారం ఇంట్లో చెప్పకుండా రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడకు వెళ్లారు. అక్కడ రాత్రి నిద్ర చేసి శుక్రవారం కడెం వెళ్లేందుకు జగిత్యాల కొత్తబస్టాండ్‌కు చేరుకున్నారు. ఇంటికి వెళ్తే ప్రియురాలు రాజేశ్వరి దూరమవుతోందని బస్ దిగిన అనంతరం వినోద్ వెంట తెచ్చుకున్న మాత్రలు మింగాడు. గమనించిన రాజేశ్వరి అడ్డుకోబోగా.. వెంట తెచ్చుకున్న కత్తితో కడుపులో పొడుచుకుంటుండగా ఆమె చేతివేలికి గాయం కాగా.. వినోద్‌కు కూడా గాయమైంది. వెంటనే స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో 108లో జగిత్యాల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఇరు కుటుంబాలకు పోలీసులు సమాచారం అందించగా.. స్పందించడం లేదని తెలిపారు. -
పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్న ప్రేమజంట
సాక్షి, జగ్గయ్యపేట : కృష్ణాజిల్లా పెనుగంచిప్రోలు మండలం లింగగూడెంలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. పెద్దలు ప్రేమ పెళ్లికి అనుమతి నిరాకరించడంతో ఓ ప్రేమజంట పెట్రోల్ పోసుకుని నిప్పు అంటించుకుంది. లింగగూడెనానికి చెందిన సాయి, సునీత ప్రేమించుకున్నారు. అయితే పెళ్లికి ఇరుకుటుంబాలు అంగీకరించకపోవడంతో గ్రామ సమీపంలోని సుబాబుల్ తోటలో వాళ్లిద్దరూ శనివారం ఈ సంఘటనకు పాల్పడ్డారు. ప్రస్తుతం సాయి, సునీత జగ్గయ్యపేట ప్రభుత్వ ఆస్పత్రిలో చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
పెళ్లి ఇష్టంలేక ప్రియుడు..మనస్తాపంతో ప్రియురాలు
మంచాల (ఇబ్రహీంపట్నం): విషం తాగి ప్రేమికులు వేర్వేరుగా ఆత్మహత్యాయత్నం చేశారు. ప్రేమించిన అమ్మాయిని వివాహం చేసుకోవాలని యువతి తరఫు బంధువులు యువకుడిపై ఒత్తిడి తేవడంతో ఆత్మహత్యాయత్నం చేశాడు. ఈ విషయం తెలుసుకున్న యువతి కూడా మనస్తాపంతో ఆత్మహత్యాయత్నం చేసింది. ఈ సంఘటన మండల పరిధిలోని ఎల్లమ్మతండాలో గురువా రం చోటు చేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. వివరాల్లోకి వెళితే.. యాదాద్రి జిల్లా నారాయణపురం మండలం డాకు తండాకు చెందిన అఖిల గత రెండు నెలలుగా ఎల్లమ్మ తండాలోని తమ బంధువుల ఇంటి వద్ద ఉంటూ ఇబ్రహీంపట్నంలోని ఓ ప్రైవేట్ కళాశాలలో ఇంటర్ చదువుతోంది. ఎల్లమ్మతండాకు చెందిన సపావట్ శ్రీకాంత్ ఆదిబట్లలోని టాటా కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. వీరిద్దరూ ప్రేమించుకుంటున్నారు. కుల పెద్దలు పెండ్లి చేయాలని ఇరువురి పిలిచి అడిగారు. అయితే శ్రీకాంత్ మాత్రం అఖిలను పెళ్లి చేసుకోవడం తనకిష్టం లేదని చెప్పాడు. ఆమెను ప్రేమించావు గనుక ఖచ్చితంగా పెళ్లి చేసుకోవాల్సిందేనని యువతి తరఫు బందువులు శ్రీకాంత్‌పై ఒత్తిడి తెచ్చారు. దీంతో శ్రీకాంత్ ఇంట్లో విషం తాగి ఆత్మహత్యకు ప్రయత్నించాడు. గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే చికిత్స నిమిత్తం ఇబ్రహీంపట్నంలోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. ఈ విషయం తెలుసుకున్న అఖిల కూడా విషం తాగింది. ఆమెను కూడా ఇబ్రహీంపట్నంలోని మరో ప్రైవేట్ వైద్యశాలలో చేర్చారు. వీరిద్దరూ ప్రస్తుతం చికిత్స పొందుతున్నారు. ఇద్దరి ఆత్మహత్య లేఖలు లభ్యం ఆత్మహత్యకు ముందు అఖిల ఉత్తరం రాసింది. శ్రీకాంత్ తనను ప్రేమించి పెళ్లి చేసుకుంటానని నమ్మించాడని.. కానీ ఇప్పుడు పెళ్లికి నిరాకరించడంతోనే ఆత్మహత్యకు పాల్పడుతున్నట్లు లేఖలో పేర్కొంది. తన మృతికి శ్రీకాంత్, అతని తల్లిదండ్రులు కారణమంటూ వారి పేర్లు ఉత్తరంలో రాసింది. అదే విధంగా శ్రీకాంత్ కూడా ఆత్మహత్యకు ముందు లేఖరాశాడు. తన మృతికి అఖిల బంధువులే కారణమంటూ లేఖలో ఆరోపించాడు. తనకు ఇష్టం లేకున్నా అఖిలతో పెళ్లి చేసేందుకు ఆమె బంధువులు తనపై ఒత్తిడి తెస్తున్నారని.. అది భరించలేకే ఆత్మహత్యకు పాల్పడున్నట్లు లేఖలో పేర్కొన్నాడు.