పురుగుల మందు తాగిన ప్రేమికులు | Lovers Commit Suicide In Karimnagar | Sakshi
Sakshi News home page

ప్రేమజంట ఆత్మహత్యాయత్నం

Published Mon, Dec 3 2018 8:23 AM | Last Updated on Mon, Dec 3 2018 8:28 AM

Lovers Commit Suicide In Karimnagar - Sakshi

అక్కెం హరికృష్ణ, ఫర్జానా

ఇల్లంతకుంట(మానకొండూర్‌): ఒకరినొకరు ప్రేమించుకున్నారు. కులాలు వేరుకావడం పెళ్లికి ఇరుకుటుంబాల పెద్దలు అంగీకరించలేదు. ప్రేమను చంపుకోలేక, కలిసి బతకలేక ఓ ప్రేమజంట ఆత్మహత్యకు యత్నించింది. ఈ ఘటన ఆదివారం ఇల్లంతకుంట మండలంలో చోటు చేసుకుంది. ఇల్లంతకుంటకు చెందిన ఫర్జానా(22), ఇదే మండలంలోని అనంతారంకు చెందిన అక్కెం హరికృష్ణ(23) కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు.

విషయం యువతి కుటుంబానికి తెలియడంతో పదిరోజుల క్రితం కరీంనగర్‌కు చెందిన ఓ యువకుడితో ఫర్జానా వివాహం జరిపించారు. అయినప్పటికి ఫర్జాజా, హరికృష్ణలు ఒకరిపై ఒకరు ప్రేమను చంపుకోలేక ఇద్దరు కలిసి మరణించాలనే ఉద్దేశంతో తంగళ్ళపల్లి మండలం జిల్లెల్ల చెక్‌పోస్టు వద్ద ఆదివారం మధ్యాహ్నం పురుగుల మందు తాగారు. గమనించిన స్థానికులు బాధితులను ఎల్లారెడ్డిపేటలోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించారు. ఇందులో ఫర్జానా పరిస్థితి విషమంగా ఉందని తెలిసింది. మెరుగైన వైద్యం కోసం ఇద్దరిని కుటుంబసభ్యులు హైదరాబాద్‌కు తరలించారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement