
సాక్షి, కృష్ణా జిల్లా: తమ్మిలేరు రిజర్వాయర్‌లో దూకి ప్రేమజంట ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన చాట్రాయి మండలం ముంకల్లులో చోటు చేసుకుంది. ప్రియుడు సురేష్ గల్లంతవ్వగా, ప్రియురాలు నాగమణి స్థానికుల సహాయంతో బయటపడింది. నాగమణిని స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మరోవైపు గల్లంతయిన సురేష్ కోసం రిజర్వాయర్‌లో పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ప్రేమికులిద్దరూ పశ్చిమగోదావరి జిల్లా చింతలపూడి మండలం ప్రగడవరం గ్రామానికి చెందిన వారుగా పోలీసులు గుర్తించారు.
Comments
Please login to add a commentAdd a comment