ప్రియురాలు దక్కదని ఆత్మహత్యాయత్నం | Lovers Suicide Attempt In Karimnagar District | Sakshi
Sakshi News home page

ప్రియురాలు దక్కదని ఆత్మహత్యాయత్నం

Published Sat, May 12 2018 6:51 AM | Last Updated on Sat, May 12 2018 6:51 AM

Lovers Suicide Attempt In Karimnagar District - Sakshi

చికిత్స పొందుతున్న వినోద్, రాజేశ్వరి

జగిత్యాలక్రైం : జగిత్యాల జిల్లా కేంద్రంలోని కొత్తబస్టాండ్‌ ప్రాంతంలో మంచిర్యాల జిల్లా కడెం మండలం గంగాపూర్‌ గ్రామానికి చెందిన లకవర్తి వినోద్‌ మాత్రలు మింగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. వివరాలిలా ఉన్నాయి. గంగాపూర్‌కు చెందిన వినోద్‌ అదే గ్రామానికి చెందిన రాజేశ్వరి అనే వివాహిత 9 నెలలుగా ప్రేమించుకుంటున్నారు. రాజేశ్వరికి అదే గ్రామానికి చెందిన ఓ వ్యక్తితో పెళ్లి జరిగింది. వీరి ప్రేమకు ఇరు కుటుంబ సభ్యులు అభ్యంతరం తెలపడంతో గురువారం ఇంట్లో చెప్పకుండా రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడకు వెళ్లారు.

అక్కడ రాత్రి నిద్ర చేసి శుక్రవారం కడెం వెళ్లేందుకు జగిత్యాల కొత్తబస్టాండ్‌కు చేరుకున్నారు. ఇంటికి వెళ్తే ప్రియురాలు రాజేశ్వరి దూరమవుతోందని బస్‌ దిగిన అనంతరం వినోద్‌ వెంట తెచ్చుకున్న మాత్రలు మింగాడు. గమనించిన రాజేశ్వరి అడ్డుకోబోగా.. వెంట తెచ్చుకున్న కత్తితో కడుపులో పొడుచుకుంటుండగా ఆమె చేతివేలికి గాయం కాగా.. వినోద్‌కు కూడా గాయమైంది. వెంటనే స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో 108లో జగిత్యాల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఇరు కుటుంబాలకు పోలీసులు సమాచారం అందించగా.. స్పందించడం లేదని తెలిపారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement