ఉత్తరప్రదేశ్‌లోని షాజహాన్‌పూర్‌లో ఒక యువతి తన స్నేహితురాలిని గాఢంగా ప్రేమించింది. ఆమెను పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుని, పురుషునిగా మారేందుకు ఒక మాంత్రికుని వద్దకు వెళ్లింది. ఇదే అవకాశంగా భావించిన ఆ మాంత్రికుడు ఆమెపై ఘాతుకానికి తెగబడ్డాడు. రెండు నెలల క్రితం కుటుంబ సభ్యులు ఆ యువతి అదృశ్యమయ్యిందంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు దర్యాప్తు చేసిన పోలీసులు ఆ మాంత్రికునితో పాటు ఆమె స్నేహితురాలిని కూడా అరెస్టు చేశారు.
ఆర్సీమిషన్ పరిధిలో ఉంటున్న పూనమ్ ఇంటి నుంచి ఏప్రిల్ 18న మాయమయ్యింది. ఏప్రిల్ 26న ఆమె సోదరుడు దీనిపై పోలీసులకు పిర్యాదు చేశాడు. దీంతో పోలీసులు కేసు దర్యాప్తు ప్రారంభించారు. ఈ సందర్భంగా మాయమైన ఆ యువతి తన స్నేహితురాలు ప్రీతిని పెళ్లాడాలనుకుందని తెలిసింది.ఇదిలా ఉండగా మే 18న లఖీంపురా పరిధిలో ఒక యువతి అస్థిపంజరం పోలీసులకు లభ్యమయ్యింది. పోలీసులు ఆ అస్థిపంజరం శాంపిల్ ల్యాబ్‌కు పంపగా మాయమైన పూనమ్‌దేనని తేలింది.
ఈ కేసు గురించి పోలీసులు మాట్లాడుతూ.. పువాయులో ఉంటున్న ప్రీతి, పూనమ్‌లు స్వలింగ సంపర్కులుగా ఉంటున్నారు. ఈ నేపధ్యంలో పూనమ్ తన స్నేహితురాలు ప్రీతిని వివాహం చేసుకోవాలని అనుకుంది. అయితే పూనమ్ కారణంగా ప్రీతికి పెళ్లి సంబంధాలు కుదరడం లేదు. దీంతో ప్రీతి తల్లి ఊర్మిళ.. లఖీంపూర్ ఖీరీ పరిధిలో ఉంటున్న రామ్‌నివాస్ అనే వ్యక్తిని కలుసుకుంది. తన కుమార్తె వివాహానికి పూనమ్ అడ్డుగా ఉందని, ఆమెను అంతమొందిస్తే రెండున్నర లక్షల రూపాయలు ఇస్తానని అతనికి చెబుతూ రూ. 5 వేలు అడ్వాన్స్‌గా ఇచ్చింది.
తరువాత ప్రీతి, పూనంలను రామ్‌నివాస్ ఒక అడవికి తీసుకువెళ్లాడు. అక్కడ వారిద్దరికీ వివాహం చేసే విషయమై మాట్లాడాడు. మంత్ర విద్యలతో పురుషునిగా మార్చేస్తానని పూనమ్‌కు రామ్‌నివాస్ హామీనిచ్చాడు. ఇందుకోసం మరోమారు అడవికి రావాల్సివుంటుందని పూనమ్‌కు చెప్పాడు.అతను చెప్పిన సమయానికి పూనమ్ అడవికి రాగానే రామ్‌నివాస్ ఆమెపై దాడి చేసి, హత్యచేశాడు. తరువాత ఆమె మృతదేహాన్ని అక్కడున్న పొదల్లో దాచిపెట్టాడు.
ఈ కేసు గురించి సిటీ ఎస్పీ సుధీర్ మాట్లాడుతూ ఈ కేసు దర్యాప్తు చేస్తున్న తాము మే 18న వివిధ ఆధారాలతో పూనమ్‌కు చెందిన అస్థిపంజరాన్ని గోమతి నది ఒడ్డున స్వాధీనం చేసుకున్నామన్నారు. పూనమ్ సోదరుడు పర్వీందర్ తన సోదరి దుస్తులను చూసి గుర్తుపట్టాడు. అతని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఈ ఘాతుకానికి పాల్పడ్డ రామ్‌నివాస్, ప్రీతి, ఆమె తల్లి ఊర్మిళలపై కేసు నమోదు చేశారు. రామ్‌నివాస్, ప్రీతిలను అరెస్టు చేశారు. పరారైన ఊర్మిళ కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
ఇది కూడా చదవండి: ఆ హ్యాండ్సమ్ సీరియల్ కిల్లర్‌పై అమ్మాయిల మోజు..
Comments
Please login to add a commentAdd a comment