jagtyala
-
నేను రాజీనామా చేస్తా: టీఆర్ఎస్ ఎమ్మెల్యే
జగిత్యాల జిల్లా: జగిత్యాల నియోజకవర్గ టీఆర్ఎస్ ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ సీఎం కేసీఆర్ కుమార్తె కల్వకుంట్ల కవిత కోసం తాను పదవీ త్యాగం చేస్తానని చెప్పారు. జగిత్యాల నుంచి పోటీ చేయాలని కవితను కోరుతానని తెలిపారు. టీపీసీసీ ప్రెసిడెంట్ ఉత్తమ్ కుమార్ రెడ్డి నల్గొండ నుంచి ఎంపీగా ఎన్నిక కావడంతో ఖాళీ అయిన హుజూర్ నగర్ స్థానం నుంచి కవిత పోటీ చేయబోరని వ్యాఖ్యానించారు. ఏది ఏమైనా టీఆర్ఎస్లో అదిష్టాన నిర్ణయమే ఫైనల్ అవుతుందని చెప్పారు. ఇటీవల జరిగిన ఎంపీ ఎన్నికల్లో నిజామాబాద్ నుంచి పోటీ చేసిన కేసీఆర్ కుమార్తె కవిత ఘోరంగా ఓడిపోయిన సంగతి తెల్సిందే. బీజేపీ అభ్యర్థి ధర్మపురి అరవింద్ చేతిలో 70 వేల 875 ఓట్ల తేడాతో కవిత ఓటమి చవిచూశారు. అయితే రాష్ట్రంలో జరిగే ఉప ఎన్నికల్లో కవిత నిలబెడతారా లేదా అనేది చర్చనీయాంశమైంది. -
లైన్ క్లియర్..!
కోరుట్ల: ఐదేళ్లుగా ఉధృతంగా సాగిన ఉద్యమం..అసెంబ్లీ ఎన్నికల్లో సీఎం కేసీఆర్, కేటీఆర్ ఇచ్చిన హామీ దరిమిలా కోరుట్ల రెవెన్యూ డివిజన్ ఏర్పాటుకు డ్రాఫ్ట్ నోటిఫికేషన్ జారీ అయింది. గత నెల 7న కోరుట్ల రెవెన్యూ డివిజన్‌పై డ్రాఫ్ట్ నోటిఫికేషన్‌తో పాటు ఏమైనా అభ్యంతరాలు ఉంటే తెలియజేయాలని కోరుతూ ప్రభుత్వం గెజిట్ జారీ చేసింది. అభ్యంతరాలకు నెల రోజుల గడువు..అంటే సరిగ్గా ఈనెల 9 వ తేదీ చివరి రోజుగా నిర్ణయించారు. కోరుట్ల రెవెన్యూ డివిజన్ ఏర్పాటుపై ఇప్పటికీ పెద్దగా అభ్యంతరాలు లేనట్లుగా సమాచారం. ఈక్రమంలో మరో 4 రోజుల్లో కోరుట్ల రెవెన్యూ డివిజన్ కల సాకారం కానుంది. అప్పుడు..అంచనా తప్పింది కోరుట్ల రెవెన్యూ డివిజన్ కోసం సుమారు ఐదేళ్లుగా ప్రజలు వివిధ రకాలుగా ఉద్యమం కొనసాగించారు. రెండున్నరేళ్లకు ముందు టీఆర్ఎస్ సర్కార్ కొత్త జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు ఏర్పాటు చేసేందుకు సన్నద్ధమైన సమయంలో సుమారు 3 నెలల పాటు కోరుట్ల డివిజన్ ఉద్యమం ఉధృతరూపం దాల్చింది. సుమారు 17 దరఖాస్తులు కోరుట్ల రెవెన్యూ డివిజన్ కోసం సర్కార్‌కు పంపినా ఫలితం దక్కలేదు. చివరి నిమిషం వరకు ఊరించి చివరకు మెట్‌పల్లిని రెవెన్యూ డివిజన్‌గా ప్రకటించారు. మెట్పల్లి డివిజన్ పరిధిలో కోరుట్ల, మెట్పల్లి, మల్లాపూర్, ఇబ్రహీంపట్నం, కథలాపూర్, మేడిపల్లి మండలాలను చేర్చారు. రెవెన్యూ డివిజన్ ఏర్పాటుపై అంచనాలు తలకిందులు కావడంతో ఆ సమయంలో స్థానికులు తీవ్ర అసంతృప్తికి లోనయ్యారు. ఉద్యమం మరికొన్నాళ్లు సాగినా నిరుత్సాహం వెంటాడింది. ఎన్నికల సాక్షిగా.. రెండున్నరేళ్ల తర్వాత టీఆర్ఎస్ సర్కార్ ముందస్తు ఎన్నికలకు వెళ్లింది. ఈ సమయంలో కోరుట్ల సెగ్మెంట్లో కోరుట్ల పట్టణ ఓటర్లు కీలకంగా మారారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు కోరుట్ల రెవెన్యూ డివిజన్ ఏర్పాటు అంశాన్ని సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లారు. జగిత్యాలలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం కేసీఆర్ కోరుట్ల రెవెన్యూ డివిజన్ ఏర్పాటుపై హామీ ఇచ్చారు. తర్వాత అసెంబ్లీ ఎన్నికలు మరో నాలుగు రోజులు ఉన్నాయనగా కోరుట్లలో జరిగిన ఎన్నికల బహిరంగ సభలో మరోసారి అప్పటి మంత్రి కేటీఆర్ రెవెన్యూ డివిజన్ ఏర్పాటు ఖాయమని ప్రకటించారు. ఈ విషయంలో ఎంపీ కల్వకుంట్ల కవిత చొరవచూపడంతో డివిజన్ ఏర్పాటుపై ఎన్నికల సమయంలో గట్టి హామీ దొరికింది. కీలక నేతల నుంచి హామీ రావడంతో కోరుట్ల స్థానికుల్లో టీఆర్ఎస్పై ఉన్న అసంతృప్తి చాలా మేర సమసిపోయింది. తర్వాత కోరుట్ల ఎమ్మెల్యేగా విద్యాసాగర్‌రావు గెలవడంతో పాటు టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. దీంతో కోరుట్ల డివిజన్ ఏర్పాటుకు మార్గం సుగమమైంది. ఫిబ్రవరి 7న కోరుట్ల రెవెన్యూ డివిజన్ ఏర్పాటుపై అభ్యంతరాలు, సలహాలు, సూచనల కోసం సర్కార్ డ్రాఫ్ట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. అభ్యంతరాలు అంతంతే.. కోరుట్ల రెవెన్యూ డివిజన్ ఏర్పాటుపై అభ్యంతరాలు, సలహాలు సూచనలకు 30రోజుల గడువు ఇవ్వగా, ఇప్పటికి 26 రోజులు గడిచాయి. మరో నాలుగురోజుల సమయం ఉంది. కోరుట్ల, కథలాపూర్, మేడిపల్లి మండలాలతో కూడిన కోరుట్ల రెవెన్యూ డివిజన్ ఏర్పాటుపై ఇప్పటి వరకు పెద్దగా అభ్యంతరాలు రానట్లు సమాచారం. చిన్నపాటి మార్పులకు చెందిన సలహాలు ఉన్నా పెద్దగా పరిగణనలోకి తీసుకోవాల్సిన అంశాలు కాకపోవడం గమనార్హం. ఈక్రమంలో మరో 4రోజులు గడిచిన తర్వాత కోరుట్ల రెవెన్యూ డివిజన్ ఏర్పాటుపై అభ్యంతరాల గడువు ముగిసిపోనుంది. కార్యాలయాలు ఎక్కడో.. కోరుట్ల రెవెన్యూ డివిజన్‌కు చెందిన కార్యాలయాలు ఎక్కడ ఏర్పాటు చేస్తారన్న అంశం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం ఊరికి దూరంగా ఆదర్శనగర్‌లో ఉన్న తహసీల్దార్ కార్యాలయాన్ని పట్టణంలోకి తరలించిన తర్వాత ఆ భవనంలో డివిజన్ కార్యాలయం ఏర్పాటు చేస్తే బాగుంటుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కోరుట్ల పోలీస్ సబ్ డివిజన్ ఉంటుందా లేదా అన్న విషయంలో పూర్తి స్పష్టత లేదు. గతంలో పోలీస్ సబ్ డివిజన్ కార్యాలయం పెద్దగుండు వద్ద ఉన్న ప్రభుత్వ స్థలంలో ఏర్పాటు చేసేందుకు ప్రతిపాదనలు పంపినట్లు సమాచారం. సబ్ డివిజన్ ఏర్పాటుతో ఇతరత్రా సబ్ డివిజనల్ కార్యాలయాలు అందుబాటులోకి రానున్నాయి. కోరుట్ల కోట బురుజులు -
ప్రణయ్ మా కళ్లలోనే ఉన్నాడు..
మిర్యాలగూడ అర్బన్ : ఇటీవల నల్లగొండ జిల్లా మిర్యాలగూడలో దారుణ హత్యకు గురైన పెరుమాళ్ల ప్రణయ్ తమకు కలలోకి వస్తున్నాడని, ప్రణయ్ ఆత్మ ఇంకా ఇక్కడే ఉందని ఆదివారం ప్రణయ్ ఇంటికి వచ్చిన హైదరాబాద్ దంపతులను స్థానిక పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రణయ్ తండ్రి బాలస్వామి, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... హైదరాబాద్ పటాన్‌చెర్వుకు చెందిన నాగారా వు, సత్యప్రియ దంపతులు ఆదివారం తమ పిల్లలతో కలిసి మిర్యాలగూడలోని ముత్తిరెడ్డికుంటలో ఉన్న ప్రణయ్ నివాసానికి వచ్చారు. తాము కూడా షెడ్యూల్డ్ కులానికి చెందిన వారమే అని, ప్రణయ్ ఆత్మ తమకు కలలోకి వస్తున్నాడని చెప్పి ప్రార్ధన చేశారు. అనంతరం ముందుగా ప్రణయ్ తల్లి, తండ్రులతో ప్రణయ్, మారుతీరావులు గత జన్మలో శత్రువులనీ, గత జన్మలో కోపాన్ని ఈ జన్మలో మారుతీరావు తీర్చుకున్నాడని వారితో చెప్పారు. అంతే కాకుండా ప్రణయ్ ఆత్మ ఇంకా ఇక్కడే తిరుగుతుందని, ప్రణయ్ ఆత్మ తమతో మాట్లాడుతుందని, మీతో కూడా మాట్లాడిస్తామని వారితో చెప్పడంతో అనుమానం వచ్చిన ప్రణయ్ తల్లిదండ్రులు పోలీసులకు సమాచారం అందించారు. ప్రణయ్ భార్య అమృతతో ఒంటరిగా మాట్లాడాలని వారు చెప్పడంతో అందుకు ఒప్పుకోలేదు. ప్రణయ్ గురించిన కొన్ని విషయాలు అమృతకు చెప్పాలని అనడంతో మాట్లాడటానికి ఒప్పుకున్నారు. అనంతరం ఆ దంపతులు ప్రణయ్ భార్య అమృతతో మాట్లాడుతూ ప్రణయ్ ఆత్మ నీ కోసం ఏడుస్తుందని, నీ కోసం ప్రణయ్ ఎదురుచూస్తున్నాడని చెప్పారు. ఈలోగా ప్రణయ్ ఇంటికి చేరుకున్న వన్‌టౌన్ పోలీసులు వారిని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. అన్ని కోణాల్లో విచారణ.. దంపతుల వివరాలను సేకరించే పనిలో పోలీసులున్నారు. ఆ ఇద్దరు దంపతులలో నాగరావు అనే వ్యక్తి కారుడ్రైవర్‌గా పని చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. వారు ఎందుకోసం ఇక్కడికి వచ్చారు, ఎవరైనా పంపించారా..? అనే కోణంలో విచారిస్తున్నట్లు డీఎస్పీ శ్రీనివాస్ తెలిపారు. -
నాన్న దుబాయ్‌లో.. అమ్మ ఆసుపత్రిలో..
సాక్షి, జగిత్యాల (కరీంనగర్): రెండేళ్ల వయసు. తండ్రి దుబాయిలో ఉంటున్నాడు. కొడుక్కి ఆరోగ్యం బాగోలేదని, ఆస్పత్రిలో చూపించాలని బస్సులో బయల్దేరింది ఆ తల్లి. దురదృష్టం వెంటాడి కొడుకు ప్రాణాలు బలితీసుకుంది. కనిపెంచిన తల్లిదండ్రులు కడచూపునకు కూడా నోచుకోలేదు. చివరికి బంధువులే అంత్యక్రియలు జరిపించారు. ఈ హృదయవిదారక సంఘటన అందరినీ కలచివేసింది. జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలం శనివారంపేటకు చెందిన గాజుల అశోక్, లత దంపతులు. వీరికి కూతురు శ్రీవాణి, కొడుకు హర్షవర్ధన్ (2) ఉన్నారు. అశోక్ ఏడాది క్రితం ఉపాధి కోసం దుబాయ్ వెళ్లాడు. హర్షవర్ధన్ ఆరోగ్యం బాగలేకపోవగడంతో లత చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తీసుకెళ్లేందుకు బస్సు ఎక్కింది. కొండగట్టు ఘాట్ వద్ద జరిగిన ప్రమాదంలో లత కాలు, నడుముకు తీవ్ర గాయాలయ్యాయి. హర్షవర్ధన్ అక్కడికక్కడే చనిపోయాడు. తల్లి ఆస్పత్రిలో చికిత్స పొందుతుండగా.. తండ్రి దుబాయ్‌లో ఉండిపోయాడు. బుధవారం బంధువులే అంత్యక్రియలు జరిపించారు. పది రోజుల క్రితమే రాఖీ కడితే అమ్మ దగ్గర డబ్బులు తీసుకుని తనకు ఇచ్చాడని హర్షవర్ధన్ అక్క శ్రీవాణి గుర్తు చేసుకుంటూ గుండెలవిసేలా రోదించిన తీరు పలువురిని కన్నీరు పెట్టించింది. -
రోడ్డెక్కాలంటేనే భయం..
తాజాగా.. జగిత్యాల జిల్లాలోని కొండగట్టు సమీపంలో మంగళవారం ఆర్టీసీ బస్సు లోయలో పడిన ఘటనలో సుమారు 50 మంది మరణించారు. సోమవారం హైదరాబాద్‌లో గచ్చిబౌలి బస్టాండ్ వద్ద ఆర్టీసీ బస్సు ముగ్గురు ప్రాణాలను బలితీసుకుంది. ఈ నేపథ్యంలో రోడ్డెక్కాలంటే జనం బెంబేలెత్తుతున్నారు. వరంగల్ పోలీసు కమిషనరేట్ పరిధిలో రోడ్డు ప్రమాదాలను గత ఏడాదితో పోలిస్తే 26 శాతం తగ్గించామని అధికారులు చెబుతున్నప్పటికీ.. నిత్యం ఏదో ఒకచోట ప్రమాదం జరుగుతూనే ఉండడం ఆందోళనకు గురిచేస్తోంది. ఆర్టీసీ బస్సు డ్రైవర్ నిర్లక్ష్యంగా హన్మకొండ అశోకా జంక్షన్లో ఆగస్టు 19న రెండు నిండు ప్రాణాలు బలయ్యాయి. హన్మకొండ చౌరస్తా నుంచి అశోక్ జంక్షన్‌కు వస్తున్న పాపని సరిత(32), ఆమె కుమారుడు రిత్విక్ హన్మకొండ చౌరస్తా నుంచి ప్రీ లెఫ్ట్‌లో నడిచి వస్తున్నారు. వారు నడిచే దారిలో ఎట్టి పరిస్థితుల్లో వాహనాలు రాకూడదు. కానీ నిబంధనలకు విరుద్ధంగా ఆర్టీసీ బస్సు ప్రీ లెఫ్ట్‌లోకి ప్రవేశించి రెండు ప్రాణాలను బలితీసుకుంది. ఈ ఘటనలో డ్రైవర్ తప్పు నూటికి నూరు పాళ్లు ఉంది. ఈ ప్రమాదం జరిగిన తర్వాత పోలీసు అధికారులు పెట్రోల్ పంపు నుంచి వచ్చే వాహనాలకు ప్రత్యేక దారి ఏర్పాటు చేసి హన్మకొండ నుంచి వచ్చే ప్రీ లెఫ్ట్‌లోకి వాహనాలు రాకుండా బారికేడ్లను ఏర్పాటు చే శారు. ఇదే పని ముందు చేసి ఉంటే ఈ ప్రమాదం జరిగేది కాదు. అధికారులు, డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగా జరిగిన ప్రమాదంలో రెండు ప్రాణాలను పోగొట్టుకోవాల్సి వచ్చింది. వరంగల్ క్రైం: ప్రజలు రోడ్డెక్కాలంటే భయపడుతున్నారు. మృత్యువు ఎటువైపు నుంచి ముంచుకొస్తుందోనని ఆందోళన చెందుతున్నారు. బస్సు, లారీ, డీసీఎం తదితర భారీ వాహనాలు నడిపే డ్రైవర్ల నిర్లక్ష్యంతో ద్విచక్రవాహన దారులు, పాదచారుల ప్రాణాలు గాలిలో కలుస్తున్నాయి. రహదారులు రక్తసిక్తమవుతున్నాయి. ఇంట్లో నుంచి బయటికి వెళ్లినవారు తిరిగొచ్చేవరకు గ్యారంటీ లేకుండా పోయింది. జగిత్యాల జిల్లాలోని కొండగట్టు సమీపంలో మంగళవారం ఆర్టీసీ బస్సు లోయలో పడిన ఘటనలో సుమారు 50 మంది మరణించారు. సోమవారం హైదరాబాద్‌లో గచ్చిబౌలి బస్టాండ్ వద్ద ఆర్టీసీ బస్సు ముగ్గురు ప్రాణాలను బలితీసుకుంది. రాష్ట్రంలో ఇటీవల రోడ్డు ప్రమాదాలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. వాహనాల అతివేగం ప్రాణాలను బలితీసుకుంటోంది. మార్కెట్లోకి విడుదలవుతున్న కార్లు, బైక్‌ల వేగం కంట్రోల్ కావడం లేదు. ఆనందం కోసం వేగంగా వాహనాలను నడిపితే.. అదే వేగం ప్రాణాలు హరిస్తోంది. వరంగల్ పోలీ సు కమిషనరేట్ పరిధిలో రోడ్డు ప్రమాదాలను గత ఏడాదితో పోలిస్తే 26 శాతం తగ్గించామని అధికారులు చెబుతున్నప్పటికీ నిత్యం ఏదో ఒకచోట ప్రమాదం జరగడం.. ప్రాణాలు పోవడం మనం చూస్తూనే ఉన్నాం. కుటుంబాన్ని మింగేసిన రోడ్డు ప్రమాదం.. హన్మకొండ రెవెన్యూ ఇన్స్పెక్టర్ మనుగొండ సరిత నాలుగు నెలల క్రితం రోడ్డు ప్రమాదంలో కొడుకును కోల్పోయింది. దీంతో తీవ్ర మనోవేదనకు గురైన ఆమె తన కూతురితో కలిసి ఇంట్లో ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడింది. రోడ్డు ప్రమాదం మిగిల్చిన విషాదం చివరికి ఇలా ఇద్దరి ఆత్మహత్యకు కారణమైంది. పోలీస్ కమిషనరేట్ పరిధిలో 274 మరణాలు వరంగల్ పోలీసు కమిషనరేట్‌లో 2018 జనవరి నుంచి ఆగస్టు వరకు వివిధ ప్రాంతాల్లో జరిగిన రోడ్డు ప్రమాదాల్లో సుమారు 274 మంది మృతిచెందగా, మరో 1,193 మందికి గాయాలైనట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. దీనిని బట్టి కమిషనరేట్‌లో ప్రమాదాల తీవ్రత అర్థమవుతోంది. కమిషనరేట్‌లో ఒక మామునూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని వరంగల్–ఖమ్మం 563 హైవేపై 2016లో 15 మంది మరణించగా 20 మందికి గాయాలయ్యాయి. 2017లో 14 మంది మరణించగా 17 మందికి గాయాలయ్యయి. 2018లో ఇప్పటి వరకు ఈ రవహదారిపై ఐదుగురు మరణించగా 8 మందికి గాయాలయ్యాయి. ఒక పోలీస్ స్టేషన్ పరిధిలోనే పరిస్థితి ఈ విధంగా ఉంటే మిగతా ప్రాంతాల్లో పరిస్థితిని ఊహించవచ్చు. శాఖల మధ్య సమన్వయ లోపం... రోడ్డు ప్రమాదాలు జరిగినప్పుడు వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు సంఘటన స్థలాలకు చేరుకుని చేరుకోని తుతూ మంత్రంగా నివేదికలు సమర్పిస్తున్నారు. కానీ ప్రమాదాలకుగల కారణాలను ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవటం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. రోడ్డు యాక్సిడెంట్ అనాలసిస్ గ్రూప్(రాగ్)లో పోలీసు శాఖ, ఆర్టీఏ, రవాణాశాఖ, ఆర్ అండ్ బీ, పంచాయతిరాజ్ శాఖలు ఉన్నాయి. పెద్ద ప్రమాదాలు జరిగిన తర్వాత ఈ శాఖల అధికారులు ప్రమాదాలకు గల కారణాలపై నివేదికలు రూపొందిస్తున్నారు. కానీ అవి కాగితాలకే పరిమితమవుతున్నాయనే విమర్శలు వినిపిస్తున్నాయి. తూతూమంత్రంగా అక్కడక్కడ చిన్నచిన్న సైన్ బోర్డులు ఏర్పాటు చేసి చేతులు దులుపుకుంటున్నారు. భద్రత లేని ఆర్టీసీ బస్సులు... ఒకప్పుడు సురక్షిత ప్రయాణానికి కేరాఫ్‌గా నిలిచిన ఆర్టీసీ బస్సులు ఇటీవల మృత్యుశకటాలుగా మారుతున్నాయి. హన్మకొండ నయీంనగర్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో వంగపహాడ్‌కు చెందిన ఒక ఏఎన్ఎం ప్రాణాలు కోల్పోయింది. హన్మకొండ పోలీసు స్టేషన్ సమీపంలోని అశోకా జంక్షన్లో ఆర్టీసీ డ్రైవర్ నిర్లక్ష్యానికి తల్లి, కుమారుడు బలయ్యారు. ఆర్టీసీలాంటి సంస్థల్లో డ్రైవర్లకు పూర్తి స్థాయిలో శిక్షణ ఇచ్చిన తర్వాతే రోడ్డుపైకి పంపుతారు. కానీ కొందరు డ్రైవర్లు విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించి అమాయకుల ప్రాణాలు తీస్తున్నారనే విమర్శలు ఇటీవల ఎక్కువగా వినిపిస్తున్నాయి. భారీ వాహనాలతో భద్రత కరువు.. రోడ్డు ప్రమాదాల్లో అధికంగా డ్రైవర్ల అతివేగం, వారు మద్యం తాగి నడపడం, నిద్రలేమి వల్లే జరుగుతున్నాయి. నగరంలో ట్రాఫిక్ పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షలను విరివిగా నిర్వహించడంతో మద్యం తాగి వాహనాలు నడపాలంటే కొంత భయపడుతున్నారు. కానీ భారీ వాహనాలు(బస్సులు, లారీలు, కంటైనర్లు) నడిపే వారికి బ్రీత్ ఎన్లైజర్ పరీక్షలు నిర్వహించడం లేదు. దీంతో కొంతమంది మద్యం మత్తులో వాహనాలను నడిపి ప్రమాదాలకు కారణమవుతున్నారనే విమర్శలు ఉన్నాయి. పోలీసు ఉన్నతాధికారులు భారీ వాహనాలను నడిపే డ్రైవర్లకు కూడా పరీక్షలు నిర్వహించాలని పలువురు కోరుతున్నారు. పని ఒత్తిడీ కారణమే కొంతకాలంగా ఆర్టీసీలో నియామకాలు లేవు. ప్రస్తుతం ఉన్న సిబ్బందిపై పనిభారం పెరిగింది. ప్రయాణికులకు సరిపడా బస్సులు సైతం లేవు. కొన్ని రూట్ల బస్సుల్లో కెపాసిటీకి మించి ప్రయాణికులు ఎక్కుతున్నారు. సంస్థలో ఉన్న డ్రైవర్లతోనే పని చేయిస్తున్నారు. దీంతో అదనంగా పని భారం పెరుగుతోంది. పని భారం పెరగడంతో కూడా డ్రైవర్లు ఒత్తిడికి గురవుతున్నారు. దీంతో ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. అధికారుల పర్యవేక్షణ కూడా పెరగాల్సిన అవసరం ఉంది. – చొల్లేటి కిరణ్, టీఎంయూ రీజినల్ అధ్యక్షుడు -
పొలంలోనే ప్రాణం పోయింది
సారంగాపూర్(జగిత్యాల): నారు మడికి నీరు పెట్టేందుకు వెళ్లి ఓ యువరైతు విద్యుదాఘాతంతో పొలంలోనే ప్రాణాలు వదిలిన సంఘటన జగిత్యాల జిల్లా బీర్పూర్ మండలం రేకులపల్లిలో ఆదివారం జరిగింది. గ్రామానికి చెందిన రైతు పంజాల గంగాధర్(32) తనకున్న ఎకరంనర పొలంలో వరి సాగుచేసేందుకు నారు పోశాడు. రెండు రోజులుగా వర్షాలు కురుస్తుండడంతో పొలం నాటు వేయాలని నిర్ణయించాడు. ఈక్రమంలో నారు మడికి నీరుపెట్టేందుకు ఉదయం వెళ్లాడు. కరెంట్ లేకపోవడంతో మోటార్ ఆన్‌కాలేదు. దీంతో పంపులోకి కుండతో నీరు పోశాడు. ఈక్రమంలోనే విద్యుత్‌సరఫరా కావడంతో మోటార్ స్టార్టయ్యింది. పొలం నుంచి బయటకు వచ్చే క్రమంలో పైపును పట్టుకున్నాడు. అప్పటికే మోటార్‌పంపు, పైప్‌నకు విద్యుత్ సరఫరా కావడంతో గంగాధర్ విద్యుదాఘాతానికి గురయ్యాడు. సమీపంలోనే ఉన్న అతని భార్య రజిత, వ్యవసాయకూలీలు గమనించి పెద్దగా కేకలు వేయడంతో మరికొందరు రైతులు సబ్‌స్టేషన్‌కు సమాచారం అందించి విద్యుత్ సరఫరా నిలిపివేయించారు. అయితే అప్పటికే గంగాధర్ మృతిచెందాడు. భార్య రజిత, కుమారుడు సిద్దు, కూతురు అక్షయ ఉన్నారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన రైతుబీమా పథకం ఈనెల 14 నుంచి అమలులోకి రానుండడంతో గంగాధర్ కుటుంబానికి బీమా డబ్బులు సైతం అందకుండా పోయాయి. మృతుని కుటుంబాన్ని ఆదుకోవాలని జగిత్యాల ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి, టీఆర్ఎస్ ఇన్చార్జి డాక్టర్ సంజయ్‌కుమార్ అధికారులను కోరారు. -
ప్రాణాలు తీసిన అతివేగం
సారంగాపూర్(జగిత్యాల): అతివేగం ఇద్దరు యువకుల ప్రాణం తీసింది. జగిత్యాల జిల్లా సారంగాపూర్ మండలం పోతారం శివారులోని గణేశ్‌పల్లిలో ఆదివారం రాత్రి ద్విచక్రవాహనం చెట్టుకు ఢీకొట్టింది. ప్రమాదంలో మండలంలోని రేచపల్లి గ్రామం కొత్తపల్లి తండాలో నివాసం ఉంటున్న మంగ శేఖర్(28), మైనవేని వెంకటే ష్(19) దుర్మరణం చెందారు. పోలీసుల వివరాల ప్రకారం.. శేఖర్, వెంకటేశ్ సెంట్రింగ్ పనులు నిర్వహిస్తారు. ఇటీవల తుంగూరులో ఓ భవనానికి స్లాబ్ వేశారు. యజమాని వద్ద డబ్బులు రావాల్సి ఉండడంతో ఇద్దరు కలిసి తూంగూరుకు ద్విచక్రవాహనంపై వెళ్లారు. వీరితో పాటు అదే గ్రామానికి చెందిన శేఖర్ తమ్ముడు మంగ సుధాకర్, కొత్తపల్లి రాజశేఖర్, దూస గణేశ్ మరో బైక్‌పై వెళ్లారు. యజమాని వద్ద డబ్బులు తీసుకుని కొత్తపల్లి తండాకు బయల్దేరారు.ఈ క్రమంలో రెండు వాహనాలను అతివేగంగా నడిపారు. బీర్పూర్ఘాట్ దిగి గణేశ్‌పల్లి సవిల్‌సప్లై గోదాం సమీపంలోని మూలమలుపు వద్ద శేఖర్, వెంకటేశ్ వెళ్తున్న బైక్ వేగంగా ఉండడంతో అదుపుతప్పి తాటిచెట్టును ఢీకొట్టింది. దీంతో ఇద్దరూ కిందపడ్డారు. తలలకు తీవ్రగాయాలు కావడంతో అక్కడికక్కడే మృతిచెందారు. వీరి వాహనాన్ని అనుసరిస్తున్న మరో ద్విచక్రవాహనంపై ఉన్న సుధాకర్, రాజశేఖర్, గణేష్ సైతం ముందున్న బైక్‌ను, చెట్టును ఢీకొట్టి కిందపడడంతో వీరికి స్వల్పగాయాలు అయ్యాయి. ఘటనాస్థలాన్ని ఎస్సై రాజ య్య పరిశీలించారు. మృతదేహాలను జగిత్యాల ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. అతివేగం.. అజాగ్రత్త.. రెండు వాహనాలు బీర్పూర్ నుంచే అతివేగంగా వస్తున్నాయని స్థానికులు పేర్కొన్నారు. ఒకరికన్నా మరొకరు పోటీతో వాహనాలు నడిపినట్లు చెబుతున్నారు.ప్రమాద స్థలానికి 500 మీటర్ల దూరంలో బ్రేక్వేసినా.. టైర్లు నేలకు రాకుతూ.. చెట్టును బలంగా ఢీకొట్టడంతో బెరడు ఊడిపోయిందంటే ప్రమాద స్థితిని అర్థం చేసుకోవచ్చని పోలీసులు అంటున్నారు. ఉపాధికోసం వచ్చి.. మంగ శేఖర్‌ది కుమురంభీం జిల్లా జిల్లా తిర్యాణి గ్రామం. సెంట్రింగ్ పనుల నేపథ్యంలో ఐదేళ్ల క్రితం భార్యాపిల్లలతో వచ్చి రేచపల్లిలో స్థిరపడ్డారు. ఇటీవలే తన తమ్ముడు సుధాకర్ సైతం పనుల నిమిత్తం వచ్చాడు. శేఖర్‌కు భార్య రూప, ఇద్దరు పిల్లలు ఉన్నారు. బైక్ అదుపుతప్పి యువకుడు.. జగిత్యాలక్రైం: జగిత్యాల జిల్లా కేంద్రంలోని పురాణిపేటలో అదివారం రాత్రి పెద్దింటి నరేష్(30) బైక్ అదుపుతప్పి దుర్మరణం చెందాడు. దగ్గులమ్మగుడి ప్రాంతనికి చెందిన నరేష్ తన సోదరి రాజేశ్వరిని పట్టణంలోని పురాణిపేటలో దింపేందుకు వెళ్లాడు. తిరిగి ఇంటికి వెళ్తుండగా... బైక్ అదుపుతప్పి అక్కడికక్కడే మృతి చెందాడు. ట్రాఫిక్ పోలీసులు మృతదేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతుడికి భార్య పద్మ, ఇద్దరు పిల్లలున్నారు. -
సీఎం కేసీఆర్ కు ప్రజల సమస్యలు పట్టవా? : జీవన్ రెడ్డి
సాక్షి, జగిత్యాల: తెలంగాణలో ప్రజల సమస్యలను సీఎం కేసీఆర్ గాలికి వదిలేశారని కాంగ్రెస్ సీఎల్పీ ఉపనేత జీవన్ రెడ్డి మండిపడ్డారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ... రాష్ట్రంలో ప్రధాన సమస్యలపై ప్రధాని మోదీతో సీఎం కేసీఆర్ చర్చించకపోవడం ఆయన చిత్తశుద్థకి నిదర్శనమన్నారు. రాష్ట్రంలో ముస్లింలకు 12 శాతం, గిరిజనులకు 10 శాతం రిజర్వేషన్ల సమస్యల గురించి అసలు పట్టించుకోక పోవడం విచారకరమని వ్యాఖ్యానించారు. గొప్పలు చెప్పుకోవటానికే పరిమితమైన కేసీఆర్ రాష్ట్రంలో ఉన్న సమస్యలను గాలికి వదిలేయడం బాధకరమని అన్నారు. బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ ద్వారా లక్షల మందికి ఉపాధి కలిగే విషయాలను కూడా సీఎం మర్చిపోయారని ఆరోపించారు. నీతి ఆయోగ్ సమావేశంలో వీటి గురించి మాట్లావకపోవడం దారుణమని, టీఆర్ఎస్ బీజేపీ బీ టీమ్ పార్టీగా మారిందని ఎద్దేవా చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 50 ఏళ్ల పాలనలో అప్పుల వాటా రూ. 60వేల కోట్లు ఉండగా, టీఆర్ఎస్ పాలనలో అప్పుల వాటా రూ రెండు లక్షల కోట్లకు పెరిగిందని అంటే నాలుగు ఏళ్లలోనే రూ. 150000 వేల కోట్లు పెరిగిందని జీవన్ రెడ్డి తెలిపారు. -
తెలంగాణలో పలుచోట్ల భారీ వర్షం
సాక్షి, హైదరాబాద్ : గత రెండు రోజులుగా నైరుతి రుతుపవనాల ప్రభావంతో తెలంగాణ రాష్ట్రంలోని పలు ప్రాంతాలలో వర్షాలు కురుస్తున్నాయి. సోమవారం పలు జిల్లాల్లో ఈదురు గాలులతో కూడిన వర్షం కురిసింది. సాయంత్రం జగిత్యాల జిల్లాలోని ధర్మపురి, వెల్గటూరు మండలాల్లో ఓ మోస్తరు వర్షం పడగా, మంచిర్యాల లక్సెట్టిపల్లి మండలంలో భారీ వర్షం కురిసింది. భారీ వర్షం కురియడంతో చెట్లు, విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. కరీంనగర్ జిల్లా చౌరస్తా వద్ద ఆటోలు, రెండు భైకులు, ధ్వంసం కాగా చెట్లు విరిగిపడ్డాయి. జిల్లాలోని దండేపల్లి, జన్నారం మండలాల్లో ఈదురు గాలులతో కూడిన వర్షం కురుస్తోంది. -
ఏం సాధించారని అవార్డులు..?
సాక్షి, జగిత్యాల: రాష్ట్ర అవతరణ వేడుకల్లో భాగంగా అవార్డులు.. ఇచ్చిన ప్రశంసపత్రాల ప్రదానంలో అధికారులు సరైన ప్రమాణాలు పాటించలేదని సీఎల్పీ ఉపనేత జీవన్‌రెడ్డి విమర్శించారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని తన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అధికారుల పనితీరుపై అసహనం వ్యక్తం చేశారు. ఇటీవల పూర్తయిన రైతుబంధు, సబ్సీడీ గొర్రెల పంపిణీ పథకం, మత్స్యకారులకు చేపల పంపిణీ, భూ రికార్డుల ప్రక్షాళన, స్వచ్ఛ జగిత్యాల అంతా ఓ బూటకమని ఎద్దేవా చేశారు. ఆయా రంగాలకు అవార్డులు ప్రదానం చేయడం దారుణమన్నారు. అవార్డులకు గుర్తింపు లభించే విధంగా అర్హులకే అవార్డులు ప్రదానం చేయాల్సిన బాధ్యతను అధికారులు విస్మరించారని మండిపడ్డారు. జిల్లాలో రైతుబంధు పథకం అమలు అస్తవ్యస్తంగా మారిందన్నారు. ఇప్పటికే అనేక ప్రచార, ప్రసార మాధ్యమాల్లో రైతుబంధు వైఫల్యం బట్టబయలైందన్నారు. అయినా.. జిల్లాకు ఎక్సలెన్సీ అవార్డు రావడం దారుణమన్నారు. పథకం పూర్తయిన తర్వాత.. నిర్వహించిన సమీక్షలో సాక్ష్యాత్తూ సీఎం అధికారులకు చీవాట్లు పెట్టిన పరిస్థితి వచ్చిందన్నారు. ఫలితంగా.. ఎక్సలెన్సీ అవార్డు వచ్చిన జిల్లాకూ అన్ని జిల్లాలతో పాటే స్పెషలాఫీసర్ నియామకం జరిగిందన్నారు. సబ్సిడీ గొర్రెల పంపిణీ పథకం జిల్లాలో విఫలమైందన్నారు. తొలి విడతలో 9,769 యూనిట్లలో 2.10లక్షల జీవాలు పంపిణీ చేస్తే.. అందులో 25శాతం చనిపోయాయని, మేత లేక మరో 25శాతం ఇతర ప్రాంతాలకు తరలిపోయాయని పేర్కొన్నారు. అన్ని గ్రామాల్లో సామాజిక తనిఖీ చేయించి పంపిణీ చేసిన గొర్రెల్లో ఏ మేరకు గొల్లకుర్మల వద్ద ఉన్నాయో లెక్క తేల్చాలని డిమాండ్ చేశారు. గొర్రెల పంపిణీ పథకంలో ఒక్కో గొర్రెను రూ. 5,700తో కొనుగోలు చేస్తే.. కొనుగోలు చేసిన గొర్రె ప్రస్తుత ధర రూ. 3,500కు మించడం లేదన్నారు. జీవాల ధర పతనం కావడంతో.. అర్హులైన గొల్లకుర్మలు తమ జీవాలను అమ్ముకోలేకపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మత్స్య కార్మికులకు పంపిణీ చేసిన చేప పిల్లలూ ఎండకు చనిపోయాయన్నారు. స్వచ్ఛ భారత్– స్వచ్ఛ జగిత్యాలలో బహిరంగ మల, మూత్ర విసర్జన అటకెక్కిందన్నారు. వ్యక్తిగత మరుగుదొడ్లు నిర్మించుకున్న పది వేలకు పైగా మంది లబ్ధిదారులకు ఇప్పటికీ బిల్లులు రాలేదని.. వారందరూ ఎంపీడీవో కార్యాలయాల చుట్టూ పద్రక్షిణలు చేస్తున్నారని విమర్శించారు. జిల్లాను స్వచ్ఛ జగిత్యాలగా ప్రకటించడంతోనే బిల్లులు మంజూరు కావడం లేదన్నారు. కేవలం జగిత్యాల పట్టణంలోనే నాలుగొందల కల్యాణలక్ష్మి దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయంటే జిల్లాలో పథకం అమలు తీరు తెన్నులు అర్థం చేసుకోవచ్చన్నారు. విద్యాహక్కు చట్టాన్ని కనీసం ఈ ఏడాదైనా అమలు చేసి కార్పొరేట్, ప్రైవేట్ స్కూళ్లలో నిరుపేదలకు 25శాతం సీట్లు ఇప్పించి విద్య అందించాలని డిమాండ్ చేశారు. పొరుగు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఇప్పటి వరకు రెండుసార్లు డీఎస్సీ నిర్వహించి టీచర్ పోస్టులు భర్తీ చేస్తే.. మన రాష్ట్రంలో మాత్రం ఒక్క టీచర్ పోస్టు కూడా భర్తీ చేయలేదన్నారు. అలాగే.. విద్య, ఉద్యోగ రంగాల్లో ముస్లింలకు ఇస్తామన్న 12 శాతం రిజర్వేషన్ కల్పించడంలో కేసీఆర్ విఫలమయ్యారన్నారు. అలాగే... ఇస్లాం మతంలో ఇతరుల ప్రమేయం సహించరాని నేరమని జీవన్‌రెడ్డి చెప్పారు. ట్రిపుల్ తలాక్ విషయంలో కేంద్రానికి వ్యతిరేకంగా వెళ్లని కేసీఆర్‌కు ముస్లింల ఓట్లు అడిగే హక్కు లేదన్నారు. రైతుబంధు పథకంలో భాగంగా రైతులకు ఇచ్చే పెట్టుబడి రాయితీ గురించి కశ్మీర్, గుజరాత్, ఢిల్లీ, పశ్చిమ బెంగాల్లో భారీగా ప్రకటనలు ఇచ్చి ప్రజాధనాన్ని కొల్లగొట్టారని ఆరోపించారు. ఇతర రాష్ట్రాల్లో ప్రకటనలు ఇవ్వాల్సిన అవసరం ఏం వచ్చిందని ప్రశ్నించారు. ఈ సమావేశంలో మున్సిపల్ చైర్మన్ విజయలక్ష్మీ, వైస్ చైర్మన్ సిరాజొద్దీన్ మన్సూర్, కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు బండ శంకర్, కొలుగూరి దామోదర్, గాజుల రాజేందర్, ముకస్సిర్ అలీ నేహాల్, గిరి నాగభూషణం, రియాజ్ పాల్గొన్నారు. -
ప్రియురాలు దక్కదని ఆత్మహత్యాయత్నం
జగిత్యాలక్రైం : జగిత్యాల జిల్లా కేంద్రంలోని కొత్తబస్టాండ్ ప్రాంతంలో మంచిర్యాల జిల్లా కడెం మండలం గంగాపూర్ గ్రామానికి చెందిన లకవర్తి వినోద్ మాత్రలు మింగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. వివరాలిలా ఉన్నాయి. గంగాపూర్‌కు చెందిన వినోద్ అదే గ్రామానికి చెందిన రాజేశ్వరి అనే వివాహిత 9 నెలలుగా ప్రేమించుకుంటున్నారు. రాజేశ్వరికి అదే గ్రామానికి చెందిన ఓ వ్యక్తితో పెళ్లి జరిగింది. వీరి ప్రేమకు ఇరు కుటుంబ సభ్యులు అభ్యంతరం తెలపడంతో గురువారం ఇంట్లో చెప్పకుండా రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడకు వెళ్లారు. అక్కడ రాత్రి నిద్ర చేసి శుక్రవారం కడెం వెళ్లేందుకు జగిత్యాల కొత్తబస్టాండ్‌కు చేరుకున్నారు. ఇంటికి వెళ్తే ప్రియురాలు రాజేశ్వరి దూరమవుతోందని బస్ దిగిన అనంతరం వినోద్ వెంట తెచ్చుకున్న మాత్రలు మింగాడు. గమనించిన రాజేశ్వరి అడ్డుకోబోగా.. వెంట తెచ్చుకున్న కత్తితో కడుపులో పొడుచుకుంటుండగా ఆమె చేతివేలికి గాయం కాగా.. వినోద్‌కు కూడా గాయమైంది. వెంటనే స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో 108లో జగిత్యాల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఇరు కుటుంబాలకు పోలీసులు సమాచారం అందించగా.. స్పందించడం లేదని తెలిపారు. -
రైతుల బంధువు కేసీఆర్
జగిత్యాలరూరల్/సారంగాపూర్/రాయికల్ : తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయని నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత అన్నారు. ఈ క్రమంలోనే దేశంలోనే ఎక్కడా లేని, ఎవరూ కనీసం ఆలోచించని గొప్ప పథకం రైతుబంధును సీఎం కేసీఆర్ ప్రారంభించారని పేర్కొన్నారు. రైతుల బంధువుగా, అన్నదాత మోములో ఆనందం చూడాలన్న లక్ష్యంతోనే పనిచేస్తున్నారని తెలిపారు. ప్రతిష్టాత్మక రైతుబంధు పథకాన్ని జగిత్యాల మండలం గుల్లపేట, సారంగాపూర్ మండలం నాగునూర్, లచ్చక్కపేట, బీర్పూర్ మండలంలోని మంగేళ, రాయికల్ మండలం ఒడ్డెలింగాపూర్‌లో గురువారం లాంఛనంగా ప్రారంభించారు. రైతులకు పెట్టుబడి చెక్కులు, కొత్త పాస్‌పుస్తకాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమాల్లో ఎంపీ మాట్లాడారు. రైతుబిడ్డ సీఎం కేసీఆర్ అని, రైతుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని ఎకరానికి పంటకు రూ.4 వేలు ఆర్థిక సహాయం రైతులకు అందించి పెద్ద కొడుకులా నిలిచారని అన్నారు. రైతుల సంక్షేమమే లక్ష్యంగా, తెలంగాణ మాగాణాను సస్యశ్యామలం చేయలని, లక్ష ఎకరాలను సాగులోకి తేవాలని కేసీఆర్ నిరంతంరం శ్రమిస్తున్నారని తెలిపారు. ఇందులో భాగంగానే రూ.25 వేల కోట్లతో సాగునీటి ప్రాజెక్టులు నిర్మస్తున్నారని అన్నారు. వ్యవసాయానికి 24 గంటల కరెంటు ఇస్తున్నారని, పంటలు సాగుచేసేందుకు రైతులు అప్పులు చేయకుండా ఉండేందుకు పెట్టుబడి సాయం కూడా అందిస్తున్నారని చెప్పారు. దేశ చరిత్రలోనే ఏ రాష్ట్రం ఈ పథకం ప్రవేశపెట్టలేదన్నారు. రైతు సంతోషంగా ఉండి పది మందికి పనికల్పించి వారికి అన్నం పెట్టే రోజు రావాలన్నదే ముఖ్యమంత్రి ఆలోచన అన్నారు. రైతులు పండించిన పంటలకు రైతులే ధర నిర్ణయించాలని కేసీఆర్ రైతు సమన్వయ సమితులు ఏర్పాటు చేశారని తెలిపారు. బీడీ కార్మికులకు పింఛన్లు, గొ ర్రెల పథకం, గంగపుత్రులకు చేపల పంపిణీ పథకాలు కూడా తెలంగాణలోనే ప్రవేశపెట్టారని గుర్తుచేశారు. రాష్ట్రంలో ఇంటింటికీ తాగునీరు అందించాలన్న లక్ష్యంతో మిషన్ భగీరథ పథకం చేపట్టినట్లు తెలిపారు. తెలంగాణ ఏర్పాటు తరువాత 18 లక్షల మెట్రిక్‌టన్నుల గోదాముల నిర్మాణం జరిగిందన్నారు. సోషలిస్ట్ ఎజెండా, టీఆర్ఎస్ పార్టీ ఎజెండా ఒక్కటేనని ఆమె మంగేళ గ్రామంలో జరిగిన సభలో పునరుద్ఘాటించారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన ప్రతీ హామీ నెరవేరుస్తామని స్పస్టం చేశారు. ఒడ్డెలింగాపూర్ గ్రామంలో గౌడ సంఘం, వడ్డెర సంఘం, అంబేద్కర్ సంఘ భవనానికి ప్రహరీ, మహిళ సంఘ భవనానికి రూ.5 లక్షల చొప్పున, లోక్‌నాయక్, మాంక్త్యానాయక్ తండాకు రోడ్డు సౌకర్యం నిధులు మంజూరు చేస్తామన్నారు. రాయికల్‌లో డిగ్రీ కళాశాలలో లెక్చరర్ల భర్తీ కోసం డెప్యూటీ సీఎంతో మాట్లాడి యుద్ధప్రతిపాదికన కాంట్రాక్ట్ లెక్చరర్లను తెస్తామని, జూన్‌లో విద్యార్థులకు ఇబ్బందులు కలగకుండా తరగతులు నిర్వహిస్తామన్నారు. కలెక్టర్ శరత్ మాట్లాడుతూ జిల్లాలో రైతుబంధు పథకం కోసం వంద బృందాలను ఏర్పాటు చేశామన్నారు. రెండు లక్షల మంది రైతులకు రూ.167 కోట్ల చెక్కులు పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. ఈనెల 17 వరకు ఉదయం 7 గంటల నుంచి పంపిణీ ప్రారంభిస్తామన్నారు. అటవీ భూములకు కూడా జిల్లాలో రూ.3 కోట్ల పెట్టుబడి అందించడం జరుగుతుందన్నారు. అనంతరం జగిత్యాల మండలానికి రూ.10.30 కోట్ల చెక్కులను రైతు సమన్వయ సమితి మండల కన్వీనర్లకు అందజేశారు. కార్యక్రమాల్లో ఆర్డీవో నరేందర్, జిల్లా వ్యవసాయాధికారి భాగ్యలక్ష్మీ, తహసీల్దార్లు వెంకటేశ్, వసంత, రాజేందర్, ఎంపీడీవో పుల్లయ్య, టీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్చార్జి డాక్టర్ సంజయ్‌కుమార్, రైతు సమన్వయ సమితి జిల్లా కన్వినర్ చీటి వెంకట్రావు, జగిత్యాల మార్కెట్ చైర్పర్సన్ శీలం ప్రియాంక, రాయికల్ మార్కెట్ కమిటీ చైర్మ న్ ఎనగందుల ఉదయశ్రీ, ఎంపీపీలు కొల్ముల శారద, పడాల పూర్ణిమ, సర్పంచులు ముదిగొండ శేఖర్, అమృత, ఎంపీటీసీలు లక్ష్మి, గంగధర విజయ, విండో చైర్మన్ ముప్పాల రాంచందర్‌రావు, టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. ఎంపీకి ఘన స్వాగతం.. జగిత్యాల మండలం గుల్లపేట గ్రామంలో ఎంపీ కవితకు గ్రామస్తులు ఘన స్వాగతం పలికారు. మహిళలు మంగళహారతులతో రాగా రైతులు ఎడ్లబండ్లతో వచ్చి ఎంపీ కవితను ఎడ్లబండిపై ఎక్కించుకుని సభా వేదిక వద్దకు తీసుకెళ్లారు. వేదికపై గీత కార్మికులు తాటిముంజలు అందజేయగా, రైతులు పండించిన ఎల్లిగడ్డలు, మామిడి కాయలతో దండచేసి అందజేశారు. వేదిక ఎక్కని జెడ్పీటీసీ.. జగిత్యాల మండలం గుల్లపేట గ్రామంలో చేపట్టిన రైతుబంధు పథకంలో చెక్కుల పంపిణీ కార్యక్రమానికి నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత హాజరు కాగా సభ వేదిక వద్ద జెడ్పీటీసీ తమకు అధికారులు సమాచారం అందించలేదని, వేదిక ఎక్కకుండా జనంలోనే కూర్చున్నారు. కలెక్టర్ శరత్ జెడ్పీటీసీని స్టేజీపైకి రావాలని పిలిచినా వెళ్లలేదు. ఏడీఏ రాజేశ్వర్ జెడ్పీటీసీకి క్షమాపణ చెప్పినా ఆమె వేదికపైకి వెళ్లలేదు. అధికార పార్టీకి చెందిన జెడ్పీటీసీ వేదికపైకి వెళ్లకపోవడంతో అధికారుల్లో ఆందోళన మొదలైంది. -
బీడీకార్మిక ఆస్పత్రికి సుస్తి
వైద్యుడు లేడు.. మందులూ లేవు అద్దె కూడా చెల్లించని వైనం ఈఎస్ఐకి తరలించే యోచన? ఆస్పత్రి తరలిపోతే కార్మికులకు ఇబ్బందే.. బీడీ కార్మికుల దవాఖాన దుస్థితి జగిత్యాల అర్బన్ : జగిత్యాలలోని బీడీ కార్మికుల ఆసుపత్రికి సుస్తి చేసింది. 1997లో 37 వేల మంది కార్మికుల కోసం ఏర్పాటు చేసిన ఈ ఆసుపత్రిలో ప్రస్తుతం వైద్యులు లేరు. కనీసం మందులు కూడా లేవు. సకాలంలో వైద్యమందక కార్మికులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. జగిత్యాల డివిజన్లో అత్యధికంగా బీడీ కార్మికులు ఉండడంతో కేంద్రప్రభుత్వం ఇక్కడ ప్రత్యేకంగా బీడీ కార్మిక సంక్షేమ నిధి, స్థానిక సంచార దవాఖానా ఏర్పాటు చేసింది. అద్దె భవనంలో ప్రారంభించిన అధికారులు.. ఎనిమిది నెలలుగా యజమానికి అద్దె చెల్లించడంలేదు. గత్యంతరం లేక యజమాని ఖాళీ చేయాలని ఒత్తిడి తెస్తున్నారు. లేని వైద్యులు.. అందని మందులు ప్రస్తుతం ఈ ఆసుపత్రిలో ఒక ఫార్మాసిస్ట్, ఒక నర్స్, మల్టీ టాస్క్స్టాఫ్ ఇద్దరు పనిచేస్తున్నారు. వీరితోనే ఆసుపత్రిని వెళ్లదీస్తున్నారు. మరోవైపు మందులు లేకపోవడంతో కార్మికులు చికిత్సకు దూరమవుతున్నారు. కనీసం పెయిన్‌కిల్లర్స్, బీపీ, షుగర్, జలుబు, యాంటిబయాటిక్స్, విరోచనాల నివారణతోపాటు మహిళలకు అవసరమైన మందులు కూడా అందుబాటులో లేవంటే అతిశయోక్తికాదు. మందుల కోసం ప్రతిరోజూ కార్మికులు ఆసుపత్రికి వచ్చి ఖాళీ చేతులతో వెనుదిరుగుతున్నారు. విషయాన్ని హైదరాబాద్‌లోని డెప్యుటీ వెల్ఫేర్ కమిషన్ దృష్టికి తీసుకెళ్లామని సిబ్బంది చెబుతున్నారు. వరంగల్ తరలింపు? ఇక్కడి ఆసుపత్రికి జగిత్యాల డివిజన్లోని 14 మండలాల బీడీ కార్మికులతోపాటు పొరుగు జిల్లాల కార్మికులు వస్తుంటారు. అలాంటి ఆసుపత్రిలో వైద్యుడిని నియమించడంతోపాటు మందులు అందుబాటులో ఉంచాల్సిన అధికారులు.. అద్దె భవనంలో నిర్వహిస్తున్నా.. కిరాయి మాత్రం చెల్లించడం లేదు. పైగా వేరే భవనం చూడాలని, లేకుంటే వరంగల్‌లోని ఈఎస్ఐ ఆసుపత్రికి తరలించేందుకు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. ఈ ఆస్పత్రిని వరంగల్‌లోని ఈఎస్ఐ (ఎంప్లాయిస్ స్టేట్ ఇన్సూరెన్స్) ఆస్పత్రికి తరలిస్తే ఇక్కడి వేలాది మంది కార్మికులకు వైద్యం అందకుండాపోయే ప్రమాదముంది. కార్మికుల దరి చేరని పథకాలు ఈ ఆసుపత్రిలో బీడీ కార్మికులతోపాటు కార్డు పొందినవారూ వైద్య సేవలు పొందుతారు. కార్డు పొందిన కార్మికురాలి కొడుకులు, కూతుళ్లకు సైతం వైద్యం అందించాల్సి ఉంది. విద్యా పథకం కింద ఉపకార వేతనాలు అందించాల్సి ఉంది. వినోదం పథకంలో భాగంగా ఆటలపోటీలు నిర్వహించి బహుమతులు అందించాల్సి ఉన్నా.. సరిపడా సిబ్బంది లేకపోవడంతో కేంద్రప్రభుత్వ పథకాలు కార్మికులకు అందకుండాపోతున్నాయి. వైద్య శిబిరాలు దూరం ఆసుపత్రి ఆధ్వర్యంలో ప్రతివారం రెండుసార్లు బీడీకార్మికులు అధికంగా ఉన్న గ్రామాలకు వెళ్లి వైద్య శిబిరాలు నిర్వహించాల్సి ఉంటుంది. వైద్యుడు లేకపోవడం.. మందులు రాకపోవడంతో క్యాంపులు నిర్వహించడం లేదు. ఎంపీ కవిత, ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి చొరవ తీసుకుని బీడీ కార్మికుల ఆసుపత్రికి సొంత భవనం నిర్మించడంతోపాటు వైద్యుడిని నియమించాలని, మందులు తెప్పించాలని బీడీ కార్మికులు కోరుతున్నారు.