లక్నో: పశ్చిమ బెంగాల్‌కు చెందిన ఓ లెస్బియన్ జంట పెళ్లితో ఒక్కటయ్యారు. ఉత్తరప్రదేశ్ డియోరియా జిల్లాలోని ఓ ఆలయంలో సంప్రదాయ వేడుకలో పెళ్లి చేసుకున్నారు. బెంగాల్‌లో దక్షిణ పరగణా జిల్లాకు చెందిన జయశ్రీ రాహుల్ (28), రాఖీ దాస్ (23) డియోరియాలోని ఆర్కెస్ట్రాలో పనిచేస్తున్నారు. అక్కడ వారు ఒకరినొకరు ప్రేమించుకున్నారు. వీరిద్దరూ మొదట తమ వివాహానికి నోటరీ చేయబడిన అఫిడవిట్‌ను పొందారు. ఆపై సోమవారం డియోరియాలోని భవానీ ఆలయంలో జరిగిన వేడుకలో మూడు ముళ్లు వేసుకున్నారని స్థానికులు తెలిపారు.
కొన్ని రోజుల క్రితం దీర్ఘేశ్వరనాథ్ ఆలయంలో ఈ జంట పెళ్లి చేసుకోవడానికి అనుమతి నిరాకరించబడింది. అంతటితో ఆగని ఆ ప్రేమికులు తమ శ్రేయోభిలాషులతో కలిసి ప్రత్యామ్నాయ మార్గంగా పెళ్లికి నోటరీ అఫిడవిట్‌ను పొందారు. ఆ తర్వాత మఝౌలీరాజ్‌లోని భవాని ఆలయానికి వెళ్లి ఆలయ పూజారి సమక్షంలో దండలు మార్చుకున్నారు. వివాహానంతరం ఈ జంట తమ ప్రేమ కథ ఎలా ప్రారంభమైందో? సవాళ్లను ఎలా ఎదుర్కొన్నారో? వివరించారు.
ఇదీ చదవండి: సీఎం స్టాలిన్ సంక్రాంతి కానుక
Comments
Please login to add a commentAdd a comment