
తలమడుగు(బోథ్): ప్రేమించిన యువతి పురుగుల మందు తాగిందని తానూ పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడో యువకుడు. పోలీసులు తెలిపిన వివరాలివీ.. మండలంలోని పల్లి కే గ్రామానికి చెందిన ఆత్రం ఉమేశ్ (22) అదే గ్రామానికి చెందిన యువతిని ప్రేమిస్తున్నాడు.
బుధవారం యువతి పురుగుల మందు తాగి రిమ్స్‌లో చికిత్స పొందుతోంది. దీంతో ప్రేమించిన యువతి లేదని మనస్థాపంతో గురువారం రాత్రి ఉమేశ్ కూడా పురుగుల మందు తాగి పడిపోయాడు. గమనించిన కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం జిల్లా కేంద్రంలోని రిమ్స్‌కు తరలించారు. రిమ్స్‌లో చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందాడు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment