
ఆపస్మాకర స్థితితో ఉన్న ప్రేమజంట..
వేములవాడఅర్బన్ (కరీంనగర్): వేములవాడ పట్టణ శివారులోని నాంపల్లి గుట్టపై శనివారం ఓ ప్రేమజంట ఆత్మహత్యాయత్నం చేసింది. వేములవాడ టౌన్ పోలీసుల కథనం ప్రకారం.. సిరిసిల్ల పట్టణంలోని రాజీవ్‌నగర్‌కు చెందిన దాసరి సాయి, గాంధీనగర్ కు చెందిన దూస రాశి కొన్నిరోజులుగా ప్రేమించుకుంటున్నారు. ప్రేమ విషయం ఇంట్లో తెలుపగా ఒకే సామాజిక వర్గం అయినా ఇరు కుటుంబాల పెద్దలు పెళ్లికి నిరాకరించారు. దీంతో శుక్రవారం సాయంత్రం ఈద్దరూ ఇళ్ల నుంచి వెళ్లిపోయారు.
శనివారం తెల్లవారు జామున నాంపల్లి గుట్టపైకి చెరుకున్నారు. కలిసి బతకడం కష్టమని.. కలిసి చనిపోదామని నిర్ణయించుకున్నారు. వెంటతెచ్చుకున్న నిద్ర మాత్రలు మింగారు. గుట్టపైకి వచ్చిన భక్తులు కోనేరు వద్దకు వెళ్లగా అక్కడ ఇద్దరూ ఆపస్మారక స్థితిలో కనిపించడంతో స్థానికులు సమాచారం ఇచ్చారు. సంఘటన స్థలానికి వచ్చిన పోలీసులు వారిని 108లో సిరిసిల్ల ఆస్పత్రికి తరలించారు. వివరాలు సేకరించి వారి తల్లిదండ్రులకు సమాచారం అందించారు. ప్రస్తుతం ఇద్దరూ కోలుకుంటున్నారని వైద్యులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment