పెట్రోల్‌ పోసుకుని నిప్పంటించుకున్న ప్రేమజంట | Lovers attempt Suicide in krishna district | Sakshi
Sakshi News home page

పెట్రోల్‌ పోసుకుని నిప్పంటించుకున్న ప్రేమజంట

Published Sat, Jan 27 2018 4:49 PM | Last Updated on Sat, Jan 27 2018 5:25 PM

Lovers attempt Suicide in krishna district - Sakshi

సాక్షి, జగ్గయ్యపేట : కృష్ణాజిల్లా పెనుగంచిప్రోలు మండలం లింగగూడెంలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. పెద్దలు ప్రేమ పెళ్లికి అనుమతి నిరాకరించడంతో ఓ ప్రేమజంట పెట్రోల్‌ పోసుకుని నిప్పు అంటించుకుంది. లింగగూడెనానికి చెందిన సాయి, సునీత ప్రేమించుకున్నారు. అయితే పెళ్లికి ఇరుకుటుంబాలు అంగీకరించకపోవడంతో  గ్రామ సమీపంలోని సుబాబుల్‌ తోటలో వాళ్లిద్దరూ శనివారం  ఈ సంఘటనకు పాల్పడ్డారు. ప్రస్తుతం సాయి, సునీత జగ్గయ్యపేట ప్రభుత్వ ఆస్పత్రిలో చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement