
ప్రతీకాత్మక చిత్రం
ప్రియుడు అక్కడిక్కడే మృతి చెందగా.. తీవ్రంగా గాయపడిన ప్రియురాలిని..
సాక్షి, వైఎస్సార్ కడప : జిల్లాలోని రాజంపేట రైల్వేస్టేషన్ సమీపంలో కలకలం రేగింది. ప్రేమజంట రైలుకింద పడి ఆత్మహత్యాయత్నం చేసింది. ఈ ఘటనలో ప్రియుడు అక్కడిక్కడే మృతి చెందగా.. తీవ్రంగా గాయపడిన ప్రియురాలిని హుటాహుటిన సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. ఆమె పరిస్థితి విషమంగా ఉందని ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. కాగా, మృతుడు విజయవాడకు చెందిన సిద్ధయ్య, గాయపడిన మహిళ కడపకు చెందిన కాసింబిగా గుర్తించారు.