నల్గొండ : వ్యవసాయ క్షేత్రంలో ప్రేమికులు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన నల్లగొండ జిల్లా కేతపల్లి మండలంలో చోటుచేసుకుంది. క్రిమిసంహారక మందుతాగి ఇద్దరూ ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ ఘటనలో ప్రియుడు అక్కడిక్కడే మృతిచెందాడు. కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్న యువతిని ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయింది. అయితే యువకుడికి ఇదివరకే వివాహం జరిగినట్లు సమాచారం. అయినప్పటికీ మరొక యువతితో ప్రేమాయణం నడుపుతూ వచ్చాడు. ఈ పరిస్థితుల్లో ఆత్మహత్యకు గల కారణాలు ఏంటో ఇంకా తెలియరాలేదు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనపై కేసు నమోదు చేశారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాలను బంధువులకు అప్పగిస్తామని వెల్లడించారు. (వేధింపులు.. సీరియల్ నటి ఆత్మహత్య)
Comments
Please login to add a commentAdd a comment