భీం వర్ధంతి సభకు సీఎం కేసీఆర్‌ను ఆహ్వానిస్తాం
రాష్ట్ర అటవీ శాఖ మంత్రి జోగు రామన్న
కెరమెరి : కుమ్రం భీం 76వ వర్ధంతి సభ ఆదివారం మండలంలో జోడేఘాట్‌లో నిర్వహిస్తున్నట్లు అటవీ పర్యావరణ, బీసీ సంక్షేమ శాఖా మంత్రి జోగు రామన్న తెలిపారు. శుక్రవారం మండలంలోని జోడేఘాట్‌లో కొనసాగుతున్న భీం స్మారక పనులను మంత్రి పరిశీలించారు. అంతకు ముందు ఆదివాసీలు డోలు సన్యాయిలతో మంత్రికి సన్మానించారు.
భీం విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం భీం సృ్మతివనం, మ్యూజియం, హంపీథియోటర్ల నిర్మాణాలను పరిశీలించారు. మ్యూజియంలో అలంకంరించనున్న గుస్సాడీ, ప్రతిమలు, వాయిద్యా కళాకారులు, కుమ్రం భీంతో సమావేశం ఏర్పాటు చేస్తున్నట్లు ప్రజల ప్రతిమలను పరిశీలించారు. అనంతరం భీం వర్ధంతి గిరిజన ఉత్సవాల పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడారు. భీం వర్ధంతి సభకు సీఎం కేసీఆర్ ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు.
రూ. 25 కోట్లతో జోడేఘాట్‌లో మ్యూజియం, సృ్మతివనం, హంపీథియోటర్ నిర్మాణం చేపట్టామన్నారు. 2014లో జోడేఘాట్‌కు సీఎం కేసీఆర్ వచ్చినపుపడు కొత్త జిల్లాకు కుమ్రం భీం పేరు పెడతానని హామీని నెరవేర్చారు.
ఎంపీ నగేశ్, ఎమ్మెల్యే కోవ లక్ష్మి మాట్లాడుతూ భీం వర్ధంతి రోజున పండుగ వాతావరణం సృష్టించాలన్నారు. ఈ కార్యక్రమంలో కుమ్రం భీం, మంచిర్యాల కలెక్టర్లు చంపాలాల్, ఆర్వీ కర్ణణ్, కుమ్రం భీం జిల్లా డీఆర్వో అధ్వైత్ కుమార్ సింగ్, ఎస్పీ సన్ ప్రీత్‌సింగ్, ఎమ్మెల్సీ పురాణం సతీశ్‌కుమార్, డీసీసీబీ చైర్మన్ దామోధర్ రెడ్డి, వాంకిడి జెడ్పీటీసీ నాగేశ్వరరావు, భీం ఉత్సవ కమిటీ చైర్మన్ మడావి రఘునాథ్, కన్వీనర్ మోహన్‌రావు, ఎంపీపీ గణేశ్, ఏఎంసీ చైర్మన్ శ్రీనివాస్, మైనార్టీ నాయకుడు మమ్మద్, ఏపీవో నాగోరావు, డీఎఫ్‌వో వెంకటేశ్వరరావు పాల్గొన్నారు.
జోడేఘాట్‌లో భీం స్మారక పనులు పరిశీలన
Published Sat, Oct 15 2016 12:14 PM | Last Updated on Mon, Sep 4 2017 5:19 PM
Advertisement