jodeghat
-
కుటుంబసమేతంగా జోడేఘాట్‌కు కలెక్టర్
కెరమెరి(ఆసిఫాబాద్): కుమురం భీం మ్యూజియం ఓ అద్భుతమని..గిరిజన సంప్రదాయాలు, సంస్కతికి ప్రతీకగా నిలుస్తోందని ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ దివ్య దేవరాజన్ అన్నారు. గురువారం చారిత్రక ప్రదేశమైన కెరిమెరి మండలం జోడేఘాట్‌లో ఏర్పాటు చేసిన కుమురం భీం మ్యూజియాన్ని కలెక్టర్ కుటుంబసభ్యులతో కలిసి సందర్శించారు. విద్యార్థులు, గ్రామస్తులు వారికి పుష్పగుచ్ఛం అందజేసి స్వాగతం పలికారు. అనంతరం కలెక్టర్ భీం విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులరి్పంచారు. భీం సమాధిపై పూలు చల్లారు. వారికి మ్యూజియం క్యూరేటర్ మంగం విశ్వంభర్‌రావు భీం చరిత్రతో పాటు అన్ని విషయాలపై అవగాహన కల్పించారు. మ్యూజియంలో ఏర్పాటు చేసిన హైమన్‌డార్ఫ్ చిత్రమాలిక, ఆదివాసీల ఫొటో ఫ్రేంలు పరిశీలించారు. స్మృతిచిహ్నం, మనిషి ఆకృతిలో ఉన్న బొటానికల్ గార్డెన్, ఆదివాసీ ఆభరణాలు, పర్దాన్, తోటి, గోండు, నాయకపోడ్, తదితర కులాలకు చెందిన దేవతా ప్రతిమలను తిలకించారు. అనంతరం గుస్సాడీల నృత్యాలు, తన సహచరులతో మాట్లాడుతున్నట్లు ఉన్న భీం ప్రతిమలను చూసి కలెక్టర్ సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. మ్యూజియానికి వివిధ మండలాలకు చెందిన ఆదివాసీలు వస్తారని.. మీరు కూడా వచ్చి సమస్యలు తెలుపవచ్చని స్థానికులకు సూచించారు. వారి వెంట తహసీల్దార్ ప్రమోద్ కుమార్, ఏటీడీవో భాస్కర్, ఎంపీపీ పెందోర్ మోతిరాం, జెడ్పీటీసీ సెడ్మకి దుర్పతబాయి, నాయకులు పెందోర్ రాజేశ్వర్, మోహన్‌రావు, కోవ విజయ్, మడావి రఘు తదితరులు ఉన్నారు. -
ఆదిలాబాద్ అందాలు.. కన్నులకు నయానానందం
సాక్షి,ఆదిలాబాద్ : అబ్బురపరిచే అందాలు ప్రకృతి ప్రేమికులను కట్టిపడేస్తున్నాయి. ఎటు చూసిన పచ్చదనం, దట్టంగా ఉండి ఆహ్లాదాన్ని పంచే అడవులు, చెంగుచెంగున పరుగు తీసే వన్యప్రాణులు, పక్షుల కిలకిలరావాలు, గలగల పారే సెలయేర్లు..ఇలాంటి ఎన్నో అందాలకు నెలవు ఉమ్మడి ఆదిలాబాద్. ఈ ప్రాంతం మరో కశ్మీర్‌లా పర్యాటకులను అమితంగా ఆకట్టుకుంటోంది. బాసరలో నెలకొన్న జ్ఞానసరస్వతి, కుంటాల జలపాతం, కవ్వాల్‌లో వన్యప్రాణులు, జైపూర్‌లో మొసళ్లమడుగు ఇలా చెప్పుకుంటూ పోతే చాలా చూడతగిన ప్రదేశాలకు నిలయం మన జిల్లా. నేడు పర్యాటక దినోత్సవం సందర్భంగా జిల్లాలోని టూరిజంపై కథనం. కవ్వాల్‌లో చూడదగిన ప్రదేశాలు... ఎటు చూసిన పచ్చదనం, దట్టంగా నిటారుగా ఉండి ఆహ్లాదాన్ని పంచే అడవులు, చెంగు చెంగున పరుగులు తీసే వన్యప్రాణులు, పక్షుల కిలకిల రావాలు, గలగల పారే సెలయేరులు ఇవన్నింటికి చిరునామ కవ్వాల్ అభయారణ్యం. నిత్యం తమ పనుల్లో బిజీబిజీగా గడిపే వారు తమ కుటుంబంతో కొంత రిలాక్స్ అయ్యేందుకు సూదూర ప్రాంతాల వారు వచ్చి బస చేసే సౌకర్యం ఏర్పాటు చేశారు. గిరిజనుల ఆటపాట, వారు తయారు చేసిన వెదురు వస్తువులు, ఇక్కడ చూడవచ్చు. పచ్చదనంతో పర్యాటకులకు అహ్లాదాన్ని పంచుతూ అడవులను చూడటానికి సుదూర ప్రాంతాల నుంచి ప్రకృతి ప్రేమికులు నిత్యం వస్తుంటారు. వీరికి పర్యటకశాఖ ఆధ్వర్యంలో బస చేసేందుకు కార్టేజీలు, రెస్టారెంట్లతో పాటుగా సఫారీ సౌకర్యం కల్పించారు. ప్రతి సంవత్సరం డిసెంబర్ నుంచి నుంచి జూన్ వరకు జంగల్ సఫారీ ద్వారా అడవుల్లో 15 నుంచి 20 కీమీ దూరం తిప్పుతారు. ముఖ్యమైన ప్రదేశం టైగర్‌జోన్ కవ్వాల్ అభయారణ్యాన్ని 2012 ఎప్రిల్ 10 న కేంద్ర ప్రభుత్వం టైగర్‌జోన్‌గా ప్రకటించింది. ఈ టైగర్‌జోన్ లో అప్పుడప్పుడు వస్తు , పోయే పులితో పాటుగా చిరుత పులులు, ఎలుగుబంట్లు, లాంటి క్రూరమృగాలతో పాటు అడవి దున్నలు, నీలుగాయిలు, సాంబర్లు, చుక్కల దుప్పులు, కొండగొర్రెలు, మనుబోతులు, కుందేళ్లు, ముళ్లపంది, అడవి పందులు, తోడేళ్లు లాంటి వన్యప్రాణులు ఇక్కడ నివసిస్తుంటాయి. చూడాల్సిన ప్రదేశాలు కవ్వాల్ టైగర్‌జోన్‌లో అనేక చూడదగిన ప్రదేశాలున్నాయి. కొన్ని ప్రదేశాల వరకు మాత్రమే అటవిశాఖ అనుమతి ఇచ్చింది. వాటిలో మల్యాల, కల్పకుంట వాచ్టవర్లు, నీలుగాయి కుంట, గడ్డి క్షేత్రాలు, సొలార్కుంట, బేస్క్యాంపులున్నాయి. ఎలా రావచ్చు.. జన్నారంలోని కవ్వాల్ అభయారణ్యం చూడటానికి హైదరాబాద్ నుంచే కాకుండా తెలంగాణలోని పలు జిల్లాల నుంచి వచ్చేందుకు రైలు, రోడ్డు మార్గాలున్నాయి. హైదరాబాద్ నుంచి 250కి.మీ దూరం ఉంటుంది. హైదరాబాద్ నుంచి ఆదిలా బాద్ జిల్లాకు చెందిన బస్సులు ప్రతిరోజు రాకపోకలు కొనసాగిస్తాయి. ఆదిలాబాద్ నుంచి మంచిర్యాలకు వెళ్లే బస్సుల ద్వారా జన్నారంకు చేరుకోవచ్చు. నిర్మల్, కొమురంభీం జిల్లా ల నుంచి బస్సు సౌకర్యాలు ఉన్నాయి. ఆదిలాబాద్ నుంచి 100కి.మీ, నిర్మల్ నుంచి 80, కుమురంభీం జిల్లా నుంచి 120కి.మీ దూరం ప్రయాణం చేయాల్సి ఉంటుంది. చూడదగిన ప్రదేశం జోడేఘాట్ జల్.. జంగల్.. జమీన్ కోసంబ అసువులు బాసి అమరవీరుడైన ఆదివాసీ ముద్దుబిడ్డ కుముర భీం పోరుగడ్డలోని భీం మ్యూజియం పర్యాటకులను ఆకట్టుకుటుంది. ప్రతి రోజు అనేక మంది పర్యాటకులు ఇక్కడికి వచ్చి మ్యూజియంలోని పరికరాలను తిలకిస్తారు. నాటి ప్రభుత్వం జోడేఘాట్‌ను గుర్తించక పోగా తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేకంగా నిధులు విడుదల చేసి దీనికి ప్రత్యేక ఖ్యాతిని తెచ్చిపెట్టింది. ఇలా వెళ్లాలి... కెరమెరి మండలంలోని హట్టి గ్రామం నుంచి జోడేఘాట్‌కు 22కిలో మీటర్ల దూరం ఉంది. ఆసిపాబాద్ నుంచి 52, ఆదిలాబాద్ నుంచి 123 కిటో మీటర్ల దూరం, ఆసిపాబాద్ నుంచి ఉదయం 7 గంటలకు, మధ్యాహ్నం 3 గంటలకు ఆర్టీసీ బస్సు సౌకర్యం ఉంది. ఆసిఫాబాద్ నుంచి రూ.35, కెరమెరి నుంచి రూ.19బస్సు టిక్కట్టు ఉంది. కెరమెరి నుంచి ఆటోలు ప్రతి రోజు నడుస్తాయి. హట్టి నుంచి జోడేఘాట్ వరకు బీటీరోడ్డు సౌకర్యం ఉంది. చారిత్రక ప్రదేశం పార్పల్లి పర్యాటకులు కోటపల్లి మండలం పార్పల్లి గ్రామంలోని కొండపై కొలువున్న భైరవస్వామి ఆలయం చూడదగిన ప్రదేశం. దీనిని అభివృద్ధి చేస్తే పర్యాటకుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. ఈ గ్రామంలోని ప్రజలు శుభకార్యాలు ప్రారంభించే ముందు భైరవస్వామిన దర్శించుకుంటారు. గోదావరి నది పరివాహక ప్రాంతంలో పూర్వకాలంలో మునులు, రుషులు తపస్సు చేసేవారని తెలుస్తోంది. మండలంలోని పార్పల్లి సమీపంలోని గుట్టపై స్వయంభుగా వెలసిన భైరవుడి జయంతిని శనివారం ఘనంగా నిర్వహించేందుకు ఉత్సవ కమిటీ అన్ని ఏర్పాట్లు చేసింది. కనువిందు చేస్తున్న కుంటాల ప్రకృతి సహజ సిద్ధమైన కుంటాల జలపాతం పచ్చని అడవితల్లి ఒడిలో సెలయేళ్ల పరవళ్లు తొక్కుతున్న జలధారాలతో పర్యాటకులను ఆకట్టుకుంటోంది. కొండ కోనలు.. పచ్చని పందిరి లాంటి చెట్ల నడుమ జాలువారే జలధారలు.. ఇది జిల్లాలో ప్రకృతి వరప్రసాదమైన కుంటాల జలపాతం ప్రత్యేకత. ఇక్కడ ఆహ్లాదాన్ని ఆస్వాదించడానికి ఇతర రాష్ట్రాల నుంచి ప్రకృతి ప్రేమికులు నిత్యం వస్తుంటారు. పరిశ్రమలు, కార్యాలయాల్లో పనిచేసే కార్మికులు, అధికారులు, ఉద్యోగులు, యువత మానసిక ఉల్లాసానికి వారంతపు సెలువుల్లో వేల సంఖ్యల్లో వస్తారు. రాష్ట్రంలోనే ప్రసిద్ధి... రాష్ట్రంలోనే ప్రసిద్ధి చెందిన పర్యాటక కేంద్రాల్లో కుంటాల జలపాతం ఒకటి. ఇది ఆదిలాబాద్ జిల్లా నేరడిగొండ మండల కేంద్రం నుంచి 12కిలో మీటర్ల దూరం వెళ్లితే దట్టమైన అటవీ ప్రాంతంలో పాలనురుగుల పరవళ్లతో కనిపిస్తోం ది. శని,ఆదివారాల్లో హైదరాబాద్, కరీం నగర్, వరంగల్, నిజామాబాద్ జిల్లాలతో పాటు మహరాష్ట్ర, ఆంధ్ర, ఉత్తర, దక్షిణాది రాష్ట్రాల నుంచి విద్యార్థులు, యువత, వివిధ కంపెనీల్లో పనిచేసే ఉద్యోగులు ఇక్కడికి వస్తుంటారు. ఇక్కడికి వచ్చిన పర్యాటకులు ఆ జలధారలు, చుట్టూర అటవీ ప్రాంతం మధ్యలో నుంచి జాలువారే జలధారాలను చూస్తూ మంత్రముగ్ధులవుతారు. పాపికొండలను తలపించే అందాలు చెన్నూర్ మండలంలోని సోమన్‌పల్లి ప్రాంతంలోని గోదావరి నది తీరంలో సుమారు రెండు వందల ఏళ్ల క్రితం పాండవులు సంచరించారనే ప్రాచీన చరిత్రకు సజీవ సాక్ష్యంగా నిలుస్తున్నాయి. మండలంలోని సోమన్‌పల్లి నది తీరంలో శివాలయం, భీముని లొద్ది, బుగ్గమలన్న ఆలయాలు ఉన్నాయి. గతంలో ఈ ప్రాంత వాసులు ఈ ఆలయాల్లో పూజలు నిర్వహించి మొక్కలు తీర్చుకునే వారు. గ్రామానికి దూరంగా ఉండడంతో పాటు రోడ్డు సౌకర్యం లేక అటవీ ప్రాంతం కావడంతో భక్తుల రాక రోజు రోజుకు తగ్గుముఖం పట్టింది. భీముడు సోమన్‌పల్లి గుట్ట మీద ఒక్క అడుగు భీమినిలో మరో అడుగు వేసి వెళ్లాడని ఇక్కడ ఉన్న భీముని అడుగే ఇందుకు నిదర్శనమని గ్రామస్తులు చెబుతున్నారు. ఈ ప్రాంతాన్ని పర్యాటకాభివృద్ధి చేస్తే మరో పాపికొండలను తలపిస్తుందని స్థానికులంటున్నారు. తెలంగాణ అన్నవరంగా.. గూడెం ఉమ్మడి రాష్ట్రంలో రెండో అన్నవరంగా, ప్రత్యేక తెలంగాణ ఏర్పడిన తర్వాత తెలంగాణ అన్నవరంగా మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలంలోని గూడెం శ్రీసత్యనారాయణస్వామి ఆలయం ప్రసిద్ధికెక్కింది. 1964లో గూడెం గ్రామ వాస్తవ్యుడు శ్రీ గోవర్ధన పెరుమాండ్ల స్వామి అనే చాదాత్త వైష్ణవుడు ఈ ఆలయాన్ని నిర్మించాడు. అప్పటినుంచి ఈ ఆలయం దినదినాభిభివృద్ధి చెందుతోంది. ఈ ఆలయం 63వ జాతీయ రహదారికి పక్కనే ఉండటంతో నిత్యం భక్తులతో రద్దీగా ఉంటుంది. ఆలయ సమీపాన్నే పవిత్ర గోదావరి నది ప్రవహించడంతో ఆలయానికి వచ్చిన భక్తులు గోదావరినదిలో పుణ్యస్నానాలు ఆచరించి సత్యదేవున్ని దర్శించుకుంటారు. వెళ్లడం ఇలా... గూడెం సత్యనారాయణస్వామి ఆలయం జిల్లా కేంద్రం మంచిర్యాలకు 30కిలోమీటర్లు దూరంలో ఉంటుంది. ఆలయానికి కరీంనగర్ నుంచి వచ్చే వారు లక్సెట్టిపేట, లేదా, వయా లక్సెట్టిపేట మీదుగా ఆదిలాబాద్, మంచిర్యాల వెళ్లే బస్సుల్లో రావచ్చు. ఈ బస్సులు ఆలయం ముందునుంచే వెళ్తాయి కాబట్టి ఆలయం వద్దనే దిగొచ్చు. నిజామాబాద్, జగిత్యాల వైపు నుంచి వచ్చే వాళ్లు లక్సెట్టిపేట, మంచిర్యాల వెళ్లేవారు బస్సుల్లో రావచ్చు. ఆదిలాబాద్ నుంచి వచ్చే వాళ్లు మంచిర్యాల, లేదా వయా లక్సెట్టిపేట మీదుగా కరీంనగర్, హైదరాబాద్, వరంగల్, గుంటూరు, ఖమ్మం వెళ్లే బస్సుల్లో రావచ్చు. నిర్మల్ జిల్లా.. పర్యాటక ఖిల్లా పచ్చని చెట్లు, గలగల పారే గోదారి అలలు, ఎగిసి పడే జలపాతాలు, చెంగున ఎగిరే వన్యప్రాణులున్న అడవుల జిల్లా ఉమ్మడి ఆదిలాబాద్‌లోకి స్వాగత తోరణంలా ఉంటుంది నిర్మల్ ఖిల్లా. హైదరాబాద్ నుంచి వచ్చే పర్యాటకులకు స్వాగతం పలుకుతోంది. నూతనంగా ఏర్పడిన నిర్మల్ జిల్లాలో ప్రధాన పర్యాటక పుణ్యక్షేత్రం బాసర. జిల్లాకు పడమరన ఉన్న ఈ ఆలయం దక్షిణ భారతాన గల ఏకైక సరస్వతీ క్షేత్రం. నాలుగు వందల ఏళ్ల కిందట నిర్మించిన నగరం నిమ్మల. అదే కాలక్రమంలో నిర్మల్‌గా మారింది. ఇక్కడి నకాశీ కళకు అంతే చరిత్ర ఉంది. ఏకైక క్షేత్రం..బాసర వేదాలు, ఉపనిషత్తులు, మహాభారతాన్ని రాసిన వేదవ్యాసుడి చేతుల మీదుగా సరస్వతమ్మ ఇక్కడ ప్రాణం పోసుకుంది. తెలంగాణను సస్యశ్యామలం చేస్తున్న గోదావరి నది నిర్మల్ జిల్లా బాసర వద్దే రాష్ట్రంలోకి అడుగు పెడుతోంది. గోదారి ఒడ్డున పచ్చని చెట్లు, ప్రశాంత వాతావరణంలో గల కోవెలలో చదువుల తల్లి కొలువై ఉంది. ఈ అమ్మ ఒడిలోనే తమ పిల్లలకు అక్షర శ్రీకారాలు చేయిస్తుంటారు. -
భీం ధామం అద్భుతం..!
కెరమెరి(ఆసిఫాబాద్): ఆదివాసీల అడవి బిడ్డ కుము రం భీం ధామం చాలా అద్భుతంగా ఉందని మహా రాష్ట్ర ఆదివాసీ సొసైటీ చైర్మన్ శ్యాంరావు కోట్నాకే, రాజూర తహసీల్దార్ వరోవింద్రవోటి అన్నారు. మంగళవారం మండలంలోని చారిత్రాత్మక ప్రదేశమైన జోడేఘాట్‌ను వారు సందర్శించారు. కుమురం భీం చిత్రపటానికి పూల మాల వేసి నివాళి అర్పించారు. నాలుగు గోత్రాలకు చెందిన జెండాల ముందు పూజలు చేశారు. అనంతరం మ్యూజియాన్ని సందర్శించారు. వారికి క్యూరేటర్ మంగంరావు అవగాహన కల్పించారు. ఆదివాసీల ఆభరణాలు, విల్లులు, వాడుకునే వస్తువులను చూశారు. ఫొటో ఎగ్జిబిషన్ తిలకించారు. అనంతరం కోయ, గోండు, కొలాం, నాయక్‌పోడ, పెర్సపేన్, పహండి కుపర్‌లింగో తదితర దేవతలకు పూజలు చేశారు. గిరిజన సంప్రదాయం, ఆదివాసీ ఆచార వ్యవహారాలను అడిగి తెలుసుకున్నారు. మహారాష్ట్రకు చెందిన పర్యాటకులు భారీగా తరలివచ్చారు. -
సీఎం వస్తారా .. రారా ?
స్పష్టత ఇవ్వని అధికారులు భారీ స్థాయిలో ఏర్పాట్లు నోరు విప్పని మంత్రి జోగు రామన్న సంగ్ధిదంలో ఆదివాసీలు కెరమెరి : మండలంలోని జోడేఘాట్‌లో ఆదివారం నిర్వహించనున్న కుమ్రం భీం వర్ధంతికి ముఖ్యమంత్రి కేసీఆర్ రాకపై నేటికి స్పష్టత రాలేదు. గడిచిన వారం రోజుల కిత్రం జోడేఘాట్‌లో ఏర్పాటు చేసి సమీక్షా సమావేశంలో ఎంపీ నగేశ్ సీఎం వస్తున్నారని పేర్కొన్నారు. కాని శుక్రవారం జోడేఘాట్‌లో కొనసాగుతున్న భీం స్మారక పనులను పరిశీలించిన మంత్రి జోగురామన్న సీఎంను ఆహ్వానిస్తామని పేర్కొనడంలో ఆదివాసీలు, అధికారుల్లో ఉత్కంఠ నెలకొంది. అసలు సీఎం వస్తారా ..? రారా..? అన్న సందేహం వ్యక్తమవుతోంది. మరో వైపు మంచిర్యాల జిల్లా కలెక్టర్, ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి ఆర్వీ కర్ణన్ మాత్రం ఏర్పాట్లు భారీగానే చేస్తున్నారు. కాని మంత్రి గాని, కలెక్టర్లు గాని సీఎం రాకపై స్పష్టత ఇవ్వడం లేదు. జోడేఘాట్‌లో వందశాతం పనులు పూర్తి కాకపోవడంతో సీఎంను రప్పిస్తే ఎలా ఉంటుంది అన్న కోణంలో కూడా మంత్రి ఎంపీ నగేశ్, కలెక్టర్లతో చర్చించారు. వర్ధంతికి తప్ప ఇతర సమయంలో ఇక్కడికి వచ్చేందుకు అనుకూల పరిస్థితులు లేవనే అభిప్రాయాన్ని సీఎం వెలిబుచ్చారు. కానీ పోలీసులు శుక్రవారం భారీ బలగాలతో జోడేఘాట్ అడవులను జల్లెడ పట్టారు. అనేక ప్రాంతాల్లో పహరా కాస్తున్నారు. -
జోడేఘాట్‌లో భీం స్మారక పనులు పరిశీలన
భీం వర్ధంతి సభకు సీఎం కేసీఆర్‌ను ఆహ్వానిస్తాం రాష్ట్ర అటవీ శాఖ మంత్రి జోగు రామన్న కెరమెరి : కుమ్రం భీం 76వ వర్ధంతి సభ ఆదివారం మండలంలో జోడేఘాట్‌లో నిర్వహిస్తున్నట్లు అటవీ పర్యావరణ, బీసీ సంక్షేమ శాఖా మంత్రి జోగు రామన్న తెలిపారు. శుక్రవారం మండలంలోని జోడేఘాట్‌లో కొనసాగుతున్న భీం స్మారక పనులను మంత్రి పరిశీలించారు. అంతకు ముందు ఆదివాసీలు డోలు సన్యాయిలతో మంత్రికి సన్మానించారు. భీం విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం భీం సృ్మతివనం, మ్యూజియం, హంపీథియోటర్ల నిర్మాణాలను పరిశీలించారు. మ్యూజియంలో అలంకంరించనున్న గుస్సాడీ, ప్రతిమలు, వాయిద్యా కళాకారులు, కుమ్రం భీంతో సమావేశం ఏర్పాటు చేస్తున్నట్లు ప్రజల ప్రతిమలను పరిశీలించారు. అనంతరం భీం వర్ధంతి గిరిజన ఉత్సవాల పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడారు. భీం వర్ధంతి సభకు సీఎం కేసీఆర్ ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు. రూ. 25 కోట్లతో జోడేఘాట్‌లో మ్యూజియం, సృ్మతివనం, హంపీథియోటర్ నిర్మాణం చేపట్టామన్నారు. 2014లో జోడేఘాట్‌కు సీఎం కేసీఆర్ వచ్చినపుపడు కొత్త జిల్లాకు కుమ్రం భీం పేరు పెడతానని హామీని నెరవేర్చారు. ఎంపీ నగేశ్, ఎమ్మెల్యే కోవ లక్ష్మి మాట్లాడుతూ భీం వర్ధంతి రోజున పండుగ వాతావరణం సృష్టించాలన్నారు. ఈ కార్యక్రమంలో కుమ్రం భీం, మంచిర్యాల కలెక్టర్లు చంపాలాల్, ఆర్వీ కర్ణణ్, కుమ్రం భీం జిల్లా డీఆర్వో అధ్వైత్ కుమార్ సింగ్, ఎస్పీ సన్ ప్రీత్‌సింగ్, ఎమ్మెల్సీ పురాణం సతీశ్‌కుమార్, డీసీసీబీ చైర్మన్ దామోధర్ రెడ్డి, వాంకిడి జెడ్పీటీసీ నాగేశ్వరరావు, భీం ఉత్సవ కమిటీ చైర్మన్ మడావి రఘునాథ్, కన్వీనర్ మోహన్‌రావు, ఎంపీపీ గణేశ్, ఏఎంసీ చైర్మన్ శ్రీనివాస్, మైనార్టీ నాయకుడు మమ్మద్, ఏపీవో నాగోరావు, డీఎఫ్‌వో వెంకటేశ్వరరావు పాల్గొన్నారు. -
ఇక జనరంజకంగా జోడేఘాట్
కొనసాగుతున్న భీం స్మారక పనులు వర్ధంతి నాటికి పూర్తికానున్న మేజర్ పనులు కెరమెరి : చారిత్రాత్మక నిర్మాణాలతో అమర వీరుడి పురిటిగడ్డకు కొత్త శోభ సంతరించనుంది. నూతన నిర్మాణాలతో జోడేఘాట్ కొత్త పుంతలు తొక్కనుంది. ఇప్పటికే వివిధ శాఖల అధికారులు జోడేఘాట్‌లోనే బసజేసి పనులు పర్యవేక్షిస్తున్నారు. 16న నిర్వహించనున్న కుమ్రం భీం 76 వర్ధంతికి ఎలాగైన నిర్మాణాలు పూర్తి చేయాలని కృత నిశ్చయంతో అధికారులు మకాం వేసి పనులు పర్యవేక్షిస్తున్నారు. 2014 వ సంవత్సరం సీఎం కేసీఆర్ జోడేఘాట్‌లో నిర్వహించిన 74 కుంమ్రం భీం వర్ధంతికి హాజరై కుమ్రం భీం మ్యూజీయం, జల్, జంగల్, జమీన్ ఆర్చీలు, కుమ్రం భీం సృ్మతి చిహ్నం, బొటానికల్ గార్డెన్, హంపీథియేటర్ నిర్మాణాల కోసం రూ. 25 కోట్లను మంజూరు చేశారు. అందులో రూ. 16 కోట్లతో మ్యూజియం, కుమ్రం భీం సృ్మతి చిహ్నం, హంపీథియేటర్ పనులు వెనువెంటనే ప్రారంభించారు. కొనసాగుతున్న పనులు గడిచిన ఏడాదిన్నరగా పనులు కొనాగుతున్నాయి. ఇప్పటికి 90 శాతం పనులు పూర్తయ్యాయి. కేవలం శనివారం ఒకే రోజు గడువు ఉండడంతో ఆయా శాఖలకు చెందిన అధికారులు రాత్రి పగలు అక్కడే ఉండి పనులు చేస్తున్నారు. స్మృతి చిహ్ననికి సంబంధించిన సెంట్రింగ్ వర్క్ పూర్తి అయ్యింది. సమాధి, 8 ఫీట్ల నిలువెత్తు కుమ్రం భీం విగ్రహం అమర్చడమే తరువాయి. అలాగే నాలుగు మాసాల క్రితమే జల్, జంగల్, జమీన్ ఆర్చీలు పూర్తి అయ్యాయి. మ్యూజియానికి సంబంధించిన మేజర్ పనులు సమాప్తమవగా చిన్నచిన్న పనులు మిగిలి ఉన్నాయి. మ్యూజియంలో గుస్సాడీలు నృత్యాలు చేస్తున్నట్లు, కళాకారులు వాయిద్యాలను వాయిస్తున్నట్లు ఉన్న ప్రతిమలు ఆకట్టుకుంటున్నాయి. మరో వైపు కుమ్రం భీం తన తోటి వారితో సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడుతున్నట్లు ఉన్న ప్రతిమలు అచ్చం మనిషిలాగానే పోలి ఉన్నాయి. మ్యూజీయం గోడలకు రకరకాల గిరిజన సంసృ్కతికి సంబంధించిన చిత్రాలు అమర్చారు. గిరిజన సంస్కృతి ఉట్టి పడేలా.. గిరిజన సంసృ్కతి ఉట్టి పడేలా కళలు, కళాకారులతో అలంకరిస్తున్నారు. కొన్ని ప్రతిమలను గ్లాస్‌తో తయారు చేసిన పరికరాల్లో అమర్చనున్నారు. గిరిజన సంసృ్కతీ, పురాతన సామగ్రితో మ్యూజియాన్ని అలంకరించనున్నారు. ఆదివాసీ దేవలు బల్లి, భీమ దేవరా, జంగుబాయి, నాగోబా, పెర్సాపేన్ దేవలను ఏర్పాటు చేయనున్నారు. బీహార్, జెఎన్టీయు లకు చెందిన కళాకారులచే అలంకరణ కొనసాగుతుంది. మునుపెన్నడు లేని విధంగా జోడేఘాట్‌కు కళకళాలాడనుంది. -
జోడేఘాట్‌లో సుగంధ పరిమళం
వంద మొక్కలతో ఏర్పాటు కానున్న లాన్ మనిషి ఆకృతిలో అమర్చనున్న ఔషధ మొక్కలు లోటస్‌పాండ్‌లో తామర, కలువ పూలు ఆకట్టుకోనున్న గార్డెన్ కెరమెరి : కుమ్రం భీం వర్ధంతి పురస్కరించుకొని ఈనెల 16న మండలంలో జోడేఘాట్‌లో అటవీశాఖ అధికారులు బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఆ గ్రామంలో లాన్, లోటస్‌పాండ్ ఏర్పాటు చేయనున్నారు. భీమ్ స్మారక మ్యూజియం, సృ్మతిచిహ్నం సమీపంలో ఏర్పాటు చేస్తున్నారు. 100 రకాల ఔషధ మొక్కలు సుగంధ ద్రవ్యాలతో గార్డెన్ ఏర్పాటుకు అధికారులు సమాయత్తమయ్యారు. గుండ్రటి ఆకారంలో మనిషి ఆకృతి బొమ్మను ఏర్పాటు చేశారు. కాళ్లు, చేతులు, గుండె, తల, కిడ్నీ వ్యాధులను నయం చే సే ఔషధ మొక్కలను ఆ ఆకృతిలో అమర్చనున్నారు. ఏ భాగానికి సంబంధించిన ఆ భాగంలోనే, మిగిలిన స్థలంలో సుగంధ ద్రవ్యాల మొక్కలు నాటనున్నారు. భీం వర్ధంతికి, రెండు రోజులు ఉండడంతో అధికారులు పనులు వేగవంతం చేశారు. సుగంధ ద్రవ్యాలు, ఔషధ మొక్కలు ఈ గార్డెన్లో తులసి, ధతూర, కృష్ణ, తరాత్‌కిరాని, బహినియ, అంజీర్, పత్రి, ఇగ్సోరా, కరిలీద్, జట్రోఫా, నందివర్దనం, లెమిన్, అల్లనే రడి, టట్‌పానెట్, సంపంగిబ్రహ్మి, జాజి, కుఫియా, సరస్వతితోపాటు మరో 80 రకాల మొక్కలు నాటనున్నారు. 14న వీటిని నాటితే 16న అన్ని పూస్తాయని, ఆ ప్రాంతమంతా సుగంధ పరిమళంతో ఉంటుందని బెల్లంపల్లి డీఎఫ్‌వో వెంకటే శ్వర్లు తెలిపారు. దానికి కింది భాగంలోనే లోటస్ పాండ్ నిర్మించనున్నారు. తామర కలువ పూలు, మరో ఐదు రకాల పూలు వేసి చూపరులకు కనువిందు చేయనున్నారు. ఈ మేరకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. -
సీపీఐ బస్సు యాత్ర
మంచిర్యాల సిటీ : నిజాం ప్రభుత్వం నుంచి విముక్తి పొందిన తెలంగాణ చరిత్రను రాష్ట్ర ప్రజలకు వివరించేందుకు ఈ నెల 11 నుంచి సీపీఐ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా బస్సు యాత్ర చేపట్టనున్నట్లు ఆ పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు గుండా మల్లేశ్, వాసిరెడ్డి సీతారామయ్య తెలిపారు. మంగళవారం మంచిర్యాలలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. సెప్టెంబర్ 11న ఉదయం 9 గంటలకు నల్లగొండ జిల్లా యాదాద్రి నుంచి బస్సు యాత్ర ప్రారంభమై 17న హైదరాబాద్‌లో ముగుస్తుందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించే బస్సు యాత్రను పురస్కరించుకొని సీపీఐ ఆధ్వర్యంలో జాతాలు, పతాకావిష్కరణలు, అమరవీరులకు నివాళులు ఘటించే కార్యక్రమాలు చేపట్టాలన్నారు. 15న ఉదయం 8 గంటలకు బస్సుయాత్ర జైపూర్ మండలంలోని ఇందారం చేరుకుంటుందని, అక్కడి నుంచి 10 గంటలకు మంచిర్యాల, 11 గంటలకు రామకృష్ణాపూర్, 12 గంటలకు సోమగూడెం, ఒంటి గంటలకు బెల్లంపల్లికి చేరుతుందన్నారు. బెల్లంపల్లిలోని తెలంగాణ చౌక్ వద్ద బహిరంగ సభ ఉంటుందని తెలిపారు. అలాగే ఈనెల 10న జోడేఘాట్‌లో కొమురం భీమ్‌కు నివాళులు అర్పించనున్నట్లు తెలిపారు. తెలంగాణ విమోచన దినోత్సవాన్ని పురస్కరించుకొని 17న హైదరాబాద్‌లోని నిజాంగ్రౌండ్‌లో భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నామని, సభకు జిల్లాలోని అన్ని వర్గాల ప్రజలు అధిక సంఖ్యలో హాజరుకావాలని కోరారు. సమావేశంలో సీపీఐ జిల్లా కార్యదర్శి కలవేని శంకర్, నియోజకవర్గ కార్యదర్శి కలవేని శ్యాంతోపాటు నాయకులు ఎండీ షఫీ, జోగుల మల్లయ్య, పుల్లక్క, లింగమూర్తి, కిషన్‌రావు ఉన్నారు. -
కొమరం భీమ్‌కు ఘన నివాళి
-
జోడేఘాట్‌కు వరాలు
ఆదిలాబాద్: 'ఇక్కడ నివసిస్తున్న గిరిజనులకు 50 డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు కేటాయిస్తాం.. వాటర్ గ్రిడ్ పైప్ లైన్ ద్వారా మంచినీరు అందిస్తాం.. రోడ్లు వేయిస్తాం.. సమైక్యాంద్ర పాలనలో గిరిజనులకు జరిగిన అన్యాయాన్ని పూడ్చేస్తాం..' అంటూ జోడేఘాట్ పై ఎడతెగని వరాలు కురిపించారు మంత్రి కల్వకుంట్ల తారకరామారావు(కేటీఆర్). గోడు వీరుడు కొమరం భీమ్ 75వ వర్ధంతి సందర్భంగా ఏర్పాటుచేసిన సభలో ఆయన ప్రసంగించారు. సమైక్యాంధ్రలో కొమరం భీమ్ కు సరైన ప్రాధాన్యం లభించలేదని, తెలంగాణ ప్రభుత్వం.. గిరిజనులను అన్నిరకాలుగా ఆదుకుంటుందని పేర్కొన్నారు. మంత్రులు చందూలాల్, జోగురామన్న, ఇంద్రకరణ్ రెడ్డిలతోపాటు పలు శాఖల అధికారులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. కెరామెరి మండలంలోని జోడేఘాట్ లో కొమరం భీమ్ వర్ధంతిని ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. కొమురం భీం వర్థంతిలో పాల్గొనేందుకు ఏటా వేలాది గిరిజనులు జోడేఘాట్ వస్తుంటారు. ఇందుకోసం ఈసారి ఉట్నూర్, ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల ఆర్టీసీ డిపోల నుంచి ప్రత్యేకంగా బస్ సర్వీసులు నడుపుతున్నారు. గత ఏడాది భీం వర్థంతి సభకు సీఎం కేసీఆర్ హాజరయ్యారు. అప్పుడు ఇచ్చిన హామీల ప్రకారం హట్టినుంచి జోడేఘాట్ వరకు తారు రోడ్డు నిర్మాణం పూర్తికాగా, 81 ఎకరాల్లో భీం స్మారక చిహ్నం, మ్యూజియంలు నిర్మాణ దశలో ఉన్నాయి. -
జోడేఘాట్‌లో ప్రపంచస్థాయి మ్యూజియం
-
జనసంద్రమైన జోడేఘాట్
- ఆదివాసీ పోరాట యోధుడు భీమ్‌కు సీఎం కేసీఆర్ ఘన నివాళి - వేలల్లో తరలివచ్చిన అడవిబిడ్డలు - సంప్రదాయ పద్ధతిలో పూజలు సాక్షి ప్రతినిధి, ఆదిలాబాద్ : జోడేఘాట్ జనసంద్రమైంది.. ఆదివాసీ పోరాట యోధుడు కొమురం భీమ్‌కు నివాళి అర్పించేందుకు వచ్చిన వేలాది మందితో పులకించిపోయింది. జల్.. జంగల్.. జమీన్ కోసం నైజాం సర్కార్‌పై అలుపెరుగని పోరాటం చేసి అసువులు బాసిన ఆదివాసీల ఆరాధ్యదైవానికి ప్రజాప్రతినిధులు, అధికారులు, ఆదివాసీ గిరిజనులు ఘనంగా శ్రద్ధాంజలి ఘటించారు. చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా కొమురం భీమ్‌కు నివాళులర్పించేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి అత్యంత మారుమూల ప్రాంతమైన జోడేఘాట్‌కు రావడం పట్ల ఆదివాసీల్లో హర్షం వ్యక్తమవుతోంది. మరోవైపు సీఎం పర్యటన నేపథ్యంలో పక్షం రోజులుగా ఏర్పాట్లు, బందోబస్తు చర్యల్లో నిమగ్నమైన జిల్లా అధికార, పోలీసు యంత్రాంగం ఎట్టకేలకు ఊపిరి పీల్చుకుంది. కొమురం భీమ్ 74వ వర్ధంతి కార్యక్రమం బుధవారం కెరమెరి మండలం జోడేఘాట్‌లో గిరిజన సంప్రదాయ పద్ధతిలో నిర్వహించారు. గతేడాది రాష్ట్ర పండుగగా ప్రకటించిన ప్రభుత్వం ఈ ఏడాది ప్రత్యేక రాష్ట్రంలో ఘనంగా నిర్వహించడంపై ఆదివాసీల్లో ఆనందం కనిపిస్తోంది. మధ్యాహ్నం ఒంటి గంటకు హెలిక్యాప్టర్‌లో జోడేఘాట్‌కు చేరుకున్న ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు తొలుత భీమ్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం కొమురం భీమ్ స్మారక చిహ్నం, స్మృతి వనం, గిరిజన మ్యూజియం నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. వివిధ ప్రభుత్వ శాఖలు ఏర్పాటు చేసిన స్టాళ్లను పరిశీలించారు. అంతకు ముందుకు భీమ్ మనువడు కుంరం సోనేరావు కుటుంబీకులతో కలిసి భీం సమాధి వద్ద పూజలు చేసి, కొమురం వంశీయుల జెండాలను ఎగురవేశారు. ఏటా నిర్వహించనున్న గిరిజన దర్బార్‌లో ఈ ఏడాది కేసీఆర్ పాల్గొన్నారు. ఆదివాసీ, గిరిజన సంఘాల నుంచి వినతులు స్వీకరించారు. ఆదివాసీలకు వరాలు.. భీమ్ వర్ధంతిలో పాల్గొన్న ముఖ్యమంత్రి కేసీఆర్ జిల్లాపై, ఆదివాసీలపై వరాల జల్లు కురిపించారు. ఆదివాసీల మరణాలపై స్పందించిన సీఎం వారి ఆరోగ్య స్థితిగతులు, పౌష్టికాహరం అందించేందుకు అన్ని చర్యలు తీసుకుంటుందని ప్రకటించారు. పారిశుధ్యం, తాగునీరు విషయంలో క్షేత్ర స్థాయిలో ఉండే సర్పంచులు, స్థానిక సంస్థల నాయకులు, ప్రజాప్రతినిధులు కలిసికట్టుగా పనిచేస్తేనే గిరిజన మరణాలను అరికట్టవచ్చని వారి బాధ్యతలను గుర్తు చేశారు. కొమురం భీమ్ తన గుండెల్లో కొలువై ఉన్నారని పేర్కొన్న కేసీఆర్ మహోన్నత పోరాటం చేసిన వ్యక్తికి గత ప్రభుత్వాల్లో సరైన గౌరవం లభించలేదన్నారు. భీమ్ రక్తంతో తడిసిన గడ్డ జోడేఘాట్‌ను పర్యాటకంగా అభివృద్ధి చేస్తామన్నారు. జిల్లాలో ఏకపక్షంగా టీఆర్ఎస్ అభ్యర్థులను ఎన్నుకున్నందుకు చరిత్రలో కలకాలం నిలిచిపోయోలా జిల్లాను అభివృద్ధి చేస్తామన్నారు. ఆదిలాబాద్ తూర్పు ప్రాంతంతో కొత్తగా ఏర్పాటు చేయనున్న జిల్లాకు కొమురం భీమ్ పేరును పెడతామని ప్రకటించిన కేసీఆర్ ఇక్కడ సూపర్‌స్పెషాలిటీ ఆస్పత్రిని కూడా ఏర్పాటు చేస్తామన్నారు. అత్యంత మారుమూల మండలాలైన దహెగాం, బెజ్జూరు వంటి మండలాల్లో సాగునీటి అవసరాలు తీర్చాకే ‘ప్రాణహిత-చేవెళ్ల’ నీటిని ఇతర జిల్లాలకు కేటాయిస్తామన్నారు. రాష్ట్ర అటవీ, పర్యావరణ శాఖ మంత్రి జోగు రామన్న మాట్లాడుతూ జిల్లాలోని విద్యా వైద్యం రంగాల అభివృద్ధికి ప్రతి మండల కేంద్రంలో జూనియర్ కళాశాల, నియోజకవర్గ కేంద్రాల్లో డిగ్రీ కళాశాలలను ఏర్పాటు చేయాలని సీఎంకు విజ్ఞప్తి చేశారు. వైద్యాధికారుల పోస్టుల భర్తీకి చర్యలు చేపట్టాలన్నారు. రహదారుల అభివృద్ధికకి చర్యలు తీసుకుంటామని చెప్పారు. సీఎం ఓఎస్డీ, కవి, గాయకుడు దేశిపతి శ్రీనివాస్ మాట్లాడుతూ.. దేశంలోని పలు ఉద్యమాలకు భీమ్ పోరాటం స్ఫూర్తి నింపిందన్నారు. వలస పాలకులు భీమ్ చరిత్రను గుర్తించలేదని గుర్తు చేశారు. స్థానిక ఎమ్మెల్యే కోవ లక్ష్మి మాట్లాడుతూ.. వట్టి వాగు ప్రాజెక్టుకు కొట్నాక భీమ్రావు పేరు పెట్టాలని కోరారు. కార్యక్రమంలో ఎంపీలు గోడం నగేష్, సీతారాంనాయక్, జిల్లా పరిషత్ చైర్మన్ శోభా సత్యనారాయణగౌడ్, కలెక్టర్ ఎం.జగన్మోహన్, ఐటీడీఏ ఇన్చార్జి పీవో ప్రశాంత్‌పాటిల్, ఎమ్మెల్యేలు ఎ.ఇంద్రకరణ్‌రెడ్డి, ఎన్.దివాకర్‌రావు, నల్లాల ఓదేలు, కోనేరు కోనప్ప, జి.విఠల్‌రెడ్డి, రేఖా శ్యాంనాయక్, దుర్గం చిన్నయ్య, రాథోడ్ బాపూరావు, ఎమ్మెల్సీ వెంకట్రావు, టీఆర్ఎస్ తూర్పు, పశ్చిమ జిల్లాల అధ్యక్షులు పురాణం సతీష్, లోకభూమారెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు గండా మల్లేష్, ఆత్రం సక్కు, కావేటి సమ్మయ్య, తెలంగాణ గజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు శ్యాంనాయక్, కెరమెరి జెడ్పీటీసీ అబ్దుల్‌కలాం, ఎంపీపీ మాచర్ల గణేష్, సర్పంచ్ బీము తదితరులు పాల్గొన్నారు. ఎస్పీ గజరావు భూపాల్ బందోబస్తును పర్యవేక్షించారు. -
నేడు జోడేఘాట్‌కు ముఖ్యమంత్రి కేసీఆర్
-
నేడు జోడేఘాట్‌కు ముఖ్యమంత్రి కేసీఆర్
కొమురం భీం వర్ధంతిలో పాల్గొననున్న సీఎం సాక్షి ప్రతినిధి, ఆదిలాబాద్: ఆదివాసీ పోరాట యోధుడు కొమురం భీంకు ఘన నివాళులర్పించేందుకు తెలంగాణ సీఎం కె.చంద్రశేఖర్‌రావు బుధవారం ఆదిలాబాద్ జిల్లా కెరమెరి మండలం జోడేఘాట్‌కు వస్తున్నారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా ఓ ముఖ్యమంత్రి ఈ కార్యక్రమానికి రావడంపై ఆదివాసీల్లో హర్షం వ్యక్తమవుతోంది. సీఎం రాకకు సంబంధించి జిల్లా అధికార యంత్రాంగం అన్నిఏర్పాట్లు పూర్తి చేసింది. రాష్ట్ర అటవీ, పర్యావరణ శాఖ మంత్రి జోగు రామన్న, కలెక్టర్ ఎం.జగన్మోహన్, ఐటీడీఏ ఇన్చార్జి పీవో ప్రశాంత్‌పాటిల్ వారం రోజులుగా ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. జోడేఘాట్ అత్యంత మారుమూల అటవీ ప్రాంతం కావడం, మావోయిస్టు ప్రాబల్య ప్రాంతం కావడంతో పోలీసు యంత్రాంగం గట్టి బందోబస్తు చర్యలు చేపట్టింది. గ్రేహౌండ్స్, ప్రత్యేక పోలీసు బలగాలు పక్షం రోజులుగా ఈ అటవీ ప్రాంతాన్ని జల్లెడ పడుతున్నాయి. మరోవైపు తమ అధినేతకు ఘన స్వాగతం పలికేందుకు టీఆర్ఎస్ శ్రేణులు కూడా సంసిద్ధంగా ఉన్నాయి. హెలీకాప్టర్ ట్రయల్న్ కెరమెరి : కొమురం భీమ్ వర్ధంతి వేడుకల్లో పాల్గొనేందుకు బుధవారం సీఎం కేసీఆర్ వస్తున్న నేపథ్యంలో మంగళవారం జోడేఘాట్‌లో హెలీకాప్టర్ ట్రయల్ రన్ చేసింది. మధ్యాహ్నం 1 గంటలకు హైదరాబాద్ నుంచి నేరుగా జోడేఘాట్ అడవుల్లో ఏర్పాటుచేసిన హెలిప్యాడ్ స్థలంలో దిగిన ఈ హెలీకాప్టర్ సిగ్నల్స్ సరిగా లేక సుమారు గంటసేపు అక్కడే ఉండిపోయింది. -
సీఎం పర్యటన బందోబస్తు సంఖ్య
ఆదిలాబాద్ క్రైం : కొమురం భీమ్ వర్ధంతిలో పాల్గొనేందుకు ఈనెల 8న జిల్లాకు ముఖ్యమంత్రి చంద్రశేర్‌రావు వస్తున్న నేపథ్యంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. భీమ్ స్వస్థలమైన కెరమెరి మండలం జోడేఘాట్‌లో వర్ధంతి నిర్వహిస్తున్నారు. ఇందుకోసం సోమవారం జిల్లా పోలీసు అధికారులతో ఎస్పీ గజరావు భూపాల్ టెలీకాన్ఫరెన్స్ నిర్వహించి బందోబస్తు వివరాలు తెలుసుకున్నారు. జిల్లాకు మొదటిసారిగా ముఖ్యమంత్రి హోదాలో వస్తున్న కేసీఆర్‌కు రాష్ట్ర పోలీసు అధికారుల పర్యవేక్షిస్తారని తెలిపారు. ఎక్కడా భద్రతా లోపం లేకుండా జోడేఘాట్‌లో అణువణువు తనిఖీలు చేస్తున్నట్లు తెలిపారు. గ్రేహౌండ్స్ బలగాలతో కూంబింగ్ నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. వరంగల్ జోన్ ఐజీ రవిగుప్తా, కరీంనగర్ రేంజ్ డీఐజీ భీమానాయక్, జిల్లా ఎస్పీ పర్యవేక్షణలో పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయనున్నారు. -
ఆదిలాబాద్ లో విమానాశ్రయం: కేసీఆర్
హైదరాబాద్: కొమురం భీమ్ వర్థంతిని అక్టోబర్ 8న అధికారికంగా నిర్వహించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ఉత్తరాఖండ్ లోని జిమ్ కార్బెట్ తరహాలో ఆదిలాబాద్ జిల్లాలోలోని కొమురం భీమ్ స్వస్థలం జోడేఘాట్ ను అభివృద్ధి చేస్తామని సీఎం కేసీఆర్ తెలిపారు. జోడేఘాట్ ను పర్యాటక కేంద్రంగా ఏర్పాటు చేస్తామని చెప్పారు. త్వరలోనే ఆదిలాబాద్ లో విమానాశ్రయం నిర్మిస్తామన్నారు. ఆదిలాబాద్ జిల్లాలో గిరిజన యూనివర్సిటీ ఏర్పాటుచేయనున్నట్టు కేసీఆర్ వెల్లడించారు.