స్పష్టత ఇవ్వని అధికారులు
భారీ స్థాయిలో ఏర్పాట్లు
నోరు విప్పని మంత్రి జోగు రామన్న
సంగ్ధిదంలో ఆదివాసీలు
కెరమెరి : మండలంలోని జోడేఘాట్‌లో ఆదివారం నిర్వహించనున్న కుమ్రం భీం వర్ధంతికి ముఖ్యమంత్రి కేసీఆర్ రాకపై నేటికి స్పష్టత రాలేదు. గడిచిన వారం రోజుల కిత్రం జోడేఘాట్‌లో ఏర్పాటు చేసి సమీక్షా సమావేశంలో ఎంపీ నగేశ్ సీఎం వస్తున్నారని పేర్కొన్నారు. కాని శుక్రవారం జోడేఘాట్‌లో కొనసాగుతున్న భీం స్మారక పనులను పరిశీలించిన మంత్రి జోగురామన్న సీఎంను ఆహ్వానిస్తామని పేర్కొనడంలో ఆదివాసీలు, అధికారుల్లో ఉత్కంఠ నెలకొంది. అసలు సీఎం వస్తారా ..? రారా..? అన్న సందేహం వ్యక్తమవుతోంది. మరో వైపు మంచిర్యాల జిల్లా కలెక్టర్, ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి ఆర్వీ కర్ణన్ మాత్రం ఏర్పాట్లు భారీగానే చేస్తున్నారు.
కాని మంత్రి గాని, కలెక్టర్లు గాని సీఎం రాకపై స్పష్టత ఇవ్వడం లేదు. జోడేఘాట్‌లో వందశాతం పనులు పూర్తి కాకపోవడంతో సీఎంను రప్పిస్తే ఎలా ఉంటుంది అన్న కోణంలో కూడా మంత్రి ఎంపీ నగేశ్, కలెక్టర్లతో చర్చించారు. వర్ధంతికి తప్ప ఇతర సమయంలో ఇక్కడికి వచ్చేందుకు అనుకూల పరిస్థితులు లేవనే అభిప్రాయాన్ని సీఎం వెలిబుచ్చారు. కానీ పోలీసులు శుక్రవారం భారీ బలగాలతో జోడేఘాట్ అడవులను జల్లెడ పట్టారు. అనేక ప్రాంతాల్లో పహరా కాస్తున్నారు.
సీఎం వస్తారా .. రారా ?
Published Sat, Oct 15 2016 12:22 PM | Last Updated on Tue, Aug 14 2018 10:54 AM
Advertisement
Advertisement