Komaram Bheem anniversary
-
కొమురం భీం ఆశయసాధనకు ప్రభుత్వం కట్టుబడి ఉంది
సాక్షి, హైదరాబాద్: ఆదివాసీ పోరాట యోధుడు కొమురం భీం ఆశయ సాధనకు తెలంగాణ ప్రభుత్వం కట్టుబడి ఉందని, మా గూడెం–మా తాండాలో మా రాజ్యం అనే ఆదివాసీల తరతరాల ఆకాంక్షను తెలంగాణ ప్రభుత్వమే నిజం చేసిందని సీఎం కేసీఆర్ తెలిపారు. ఆదివాసీ ఆరాధ్య దైవం కొమురం భీం జయంతి సందర్భంగా భీం సేవలను స్మరిస్తూ కేసీఆర్ శుక్రవారం ఒక ప్రకటనలో ఘన నివాళి అర్పించారు. ఆదివాసీల అభివృద్ధి, సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం అనేక పథకాలు అమలు చేస్తోందని, భీం జయంతిని రాష్ట్ర ప్రభుత్వమే అధికారికంగా నిర్వహిస్తోందని వెల్లడించారు. భీం పోరాట ప్రదేశమైన జోడేఘాట్‌ను అన్ని హంగులతో అభివృద్ధి చేశామని, భవిష్యత్ తరాలకు ఆయన పోరాట పటిమను తెలియజేసే విధంగా స్మారక చిహ్నం, స్మృతివనంతో పాటు గిరిజన మ్యూజియాన్ని ఏర్పాటు చేశామని తెలిపారు. హైదరాబాద్ నడిబొడ్డున ఆదివాసీ భవన్ నిర్మాణం చేపట్టామని, త్వరలోనే ప్రారంభిస్తామని వెల్లడించారు. కొమురం భీం జల్, జంగల్, జమీన్ నినాద స్ఫూర్తి తెలంగాణ రాష్ట్ర సాధనలోనూ, స్వరాష్ట్ర అభివృద్ధి పథంలోనూ ఉందన్నారు. అడవులు, ప్రకృతి పట్ల ఆదివాసీ బిడ్డలకు ఉండే ప్రేమ గొప్పదని, వారి స్ఫూర్తిని ప్రతి ఒక్కరు కలిగి ఉండాలని సీఎం కేసీఆర్ ఆ ప్రకటనలో ఆకాంక్షించారు. -
ఉద్యమ వీరుడు మళ్లీ పుట్టాల్సిందే(నా)?
నాడు బ్రిటీష్ కదంబహస్తాల నుంచి భారతీయులను విడదీసేంచేందుకు స్వాతంత్ర పోరాటం చేసి అమరుడయ్యాడు జాతిపిత మహాత్మగాంధీ..! అలాగే చరిత్రలోనే అమర జీవిగా జల్.. జంగల్.. జమీన్ అనే నినాదంతో అప్పటి నిజాం ప్రభుత్వానికి వ్యతిరేకంగా సాయుధ పోరాటం జరిపి అసువులు బాసాడు గిరిజన ముద్దబిడ్డ కుమురం భీం.. ఆయన పోరాటం చేసి 79ఏళ్లు గడస్తున్నా ఆశయం మాత్రం నెరవేర లేదు. నేటికి తాగు, సాగునీరు లేక రోడ్డు సౌకర్యం కనపడక.. సాగుచేస్తున్న భూములకు పట్టాలు లేక అలమటిస్తున్న పల్లెలు కోకొలలు.. అందుకే భీం నువ్వు మళ్లీ పుట్టాలి. అని కోరుతున్నారు గిరిజనులు. నేడు 79వ వర్ధంతి సందర్భంగా ఆయన చేసిన పోరాట పటిమపై ప్రత్యేక కథనం. కెరమెరి(ఆసిఫాబాద్): శనివారం కుమురం భీం 79వ వర్ధంతి ఉందని భావించిన మహారాష్ట్రలోని చంద్రాపూర్‌కు చెందిన వివిధ గ్రామాల ఆదివాసీ గిరిజనులు జోడేఘాట్‌కు భారీగా తరలివచ్చారు. వందలాది మంది తరలిరావడంతో జోడేఘాట్‌కు కొత్త కళ వచ్చింది. ఇక్కడికి వచ్చిన వారికి భీం వర్ధంతి ఆదివారం ఉందని తెలియడంలో అసంతృప్తికి లోనయ్యారు. కొందరు జీపుల్లో రాగా మరికొందరు వ్యాన్లలో, బైకులతో తరలివచ్చారు. భీం విగ్రహానికి పూల మాలలు వేసి నివాళి అర్పించారు. అనంతరం బృందావనంలో కాలక్షేపం చేశారు. మ్యూజియంలో భీం ప్రతిమలు, గుస్సాడీల నృత్యాలు ప్రతిమలు, పురాతన ఆభరనాలు, దేవతల విగ్రహాలు, మ్యూజియంలో ఉన్న పరికరాలను చూసి సంతృప్తి వ్యక్తం చేశారు. వినియోగంలోకి రాని 5వ షెడ్యూల్ భారత రాజ్యాంగంలోని 5వ షెడ్యూల్ ప్రకారం అడవి, భూమి, నీరుపై పూర్తి హక్కు ఉన్నప్పటికీ నూతన చట్టాలు వాటికి తూట్లు పొడుస్తున్నాయి. రాజ్యాంగానికి భంగం కలిగిస్తున్నాయి. 2005 బిల్లు ప్రవేశపెట్టి హక్కులను కల్పిస్తామని గతంలోని ప్రభుత్వాలు చెప్పినా అవి అమలు కాలేదు. ఏజెన్సీ ప్రాంతంతోని నీటి వనరులు పూర్తిగా ఆదివాసీలకే దక్కాలని రాజ్యాంగంలో ఉంది. కుంటలు, చెరువుల నిర్మాణంలో ఆదివాసీలు భూములు కోల్పోయి గిరిజనేతరులకు ఆ నీరు వినియోగమవుతోంది. ఐటీడీఏ నిధులతో నిర్మించినా కుంటలు, చెరువుల్లో పెంచబడే చేపలు, రొయ్యలపై హక్కు ఆదివాసీలకే దక్కాలని చట్టాలు చెబుతున్నా వారి గోడు పట్టించుకునే వారు కరువయ్యారు. గిరిజన చట్టాలను అమలుచేయక గతంలో అధికారులు లాఠీన్యం చేసిన సందర్భాలు లేకపోలేదు. కొంత కాలంగా ఇతర ప్రాంతాల నుంచి వలసలుగా వచ్చి ఎస్టీలుగా చలామని అవుతూ నిజమైన గిరిజనులకు అన్యాయం చేస్తున్నా రు. వారి వలసలను నిరోధించే దమ్ము, ధైర్యం అధికారులకు లేక పోగ వారు ఎన్నో ఏళ్ల నుండి ఇక్కడే నివసిస్తున్నట్లు ధ్రువీకరణ పత్రాలు సైతం జారీ చేసిన ఘనత మన అధికారులకే దక్కుతుంది. గిరిజన చట్టాల అమలెక్కడా..? నాటి నుంచి నేటి వరకూ ఆదివాసీల పరిస్థితి కడుదయనీయం.. భూమి.. నీరు.. అడవిపై ఇంకా వారికి స్వాతంత్య్రం రాలేదు. ఎక్కడున్నాయి గిరిజన హక్కులు.. హక్కులను కల్పించే అధికారులు, ప్రజాప్రతినిధులు మాముళ్ల మత్తుల్లో తలతూగుతుంటే వారికి న్యాయం కల్పించే వారెవరు.. గిరిజన చట్టాలు గిరిజనేతరులకు చుట్టాలవుతున్నాయి. వాటిని మడచి జేబుల్లో పెట్టి దర్జాగా తిరుగుతున్నారు. అయినా ప్రభుత్వం మాత్రం ప్రేక్షక పాత్ర వహిస్తోంది. అప్పటి నైజాం సర్కారు ఆదివాసీ భూముల రక్షణకై భూ బదలాయింపు చట్టం 1/70 తీసుకవచ్చినా రక్షణ కల్పించే అధికార యంత్రాగం ఆదివాసీల భూములపై ఏ మాత్రం పట్టించుకోవడం లేదు. గిరిజనుల భూములను గిరిజనేతరులు గుట్టుచప్పుడు కాకుండా ఆక్రమించుకుంటున్నారు. ఆదివాసీ చట్టాలు, భూ ములకు రక్షణ కల్పించకపోవడం ఎవరి తప్పుని ప్రశ్నిస్తున్నారు. ఓటు బ్యాంకు కోసం.. ఆదివాసీలను ఓటు బ్యాంకుగా నాయకులు ఉపయోగిస్తున్నారు. ఎన్నికలు వచ్చాయంటే స్టేజెక్కి మైకు చేత బట్టుకుని వాగ్ధానాల వర్షం కురిపించడమే నాయకుల వంతు. వారి మాటలకు మోగిస్తున్న చప్పట్లతో నాయకుని కార్యమైతే నెరవేరుతుంది. తర్వాత ‘వర్షం పోయాక..ఎండలు కొట్టిన’ చందంగా మారుతాయి గిరిజన బతుకులు. 1/70 గురించి ఎరుగని వారుండరూ కానీ నేడు ఏజెస్సీలో పుట్టగొడుగుల్లా.. మిద్దెలకు మిద్దెలు నిర్మిస్తుంటే వారించే అధికారులు కళ్లప్పగించే చూస్తున్నారే తప్ప అడ్డుకోవడం లేదు. ఎప్పటికీ అదివాసీలు అడవులకే పరిమితమా..? అధికారులు.. నాయకులు.. ఒక్కసారీ ఆలోచించండి..!! అందుకోనేమో భీం నీవు మళ్లీ పుట్టాలని గిరిజనులు కోరుకుంటున్నారు. భీమ్ వర్ధంతికి మంత్రి ఐకేరెడ్డి రాక ఆసిఫాబాద్: గిరిజన పోరాట యోధుడు కుమురం భీమ్ వర్ధంతి కార్యక్రమంలో రాష్ట్ర అటవీశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి పాల్గొననున్నట్లు మంత్రి పీఏ కార్తిక్ రెడ్డి పేర్కొన్నారు. -
సీఎం వస్తారా .. రారా ?
స్పష్టత ఇవ్వని అధికారులు భారీ స్థాయిలో ఏర్పాట్లు నోరు విప్పని మంత్రి జోగు రామన్న సంగ్ధిదంలో ఆదివాసీలు కెరమెరి : మండలంలోని జోడేఘాట్‌లో ఆదివారం నిర్వహించనున్న కుమ్రం భీం వర్ధంతికి ముఖ్యమంత్రి కేసీఆర్ రాకపై నేటికి స్పష్టత రాలేదు. గడిచిన వారం రోజుల కిత్రం జోడేఘాట్‌లో ఏర్పాటు చేసి సమీక్షా సమావేశంలో ఎంపీ నగేశ్ సీఎం వస్తున్నారని పేర్కొన్నారు. కాని శుక్రవారం జోడేఘాట్‌లో కొనసాగుతున్న భీం స్మారక పనులను పరిశీలించిన మంత్రి జోగురామన్న సీఎంను ఆహ్వానిస్తామని పేర్కొనడంలో ఆదివాసీలు, అధికారుల్లో ఉత్కంఠ నెలకొంది. అసలు సీఎం వస్తారా ..? రారా..? అన్న సందేహం వ్యక్తమవుతోంది. మరో వైపు మంచిర్యాల జిల్లా కలెక్టర్, ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి ఆర్వీ కర్ణన్ మాత్రం ఏర్పాట్లు భారీగానే చేస్తున్నారు. కాని మంత్రి గాని, కలెక్టర్లు గాని సీఎం రాకపై స్పష్టత ఇవ్వడం లేదు. జోడేఘాట్‌లో వందశాతం పనులు పూర్తి కాకపోవడంతో సీఎంను రప్పిస్తే ఎలా ఉంటుంది అన్న కోణంలో కూడా మంత్రి ఎంపీ నగేశ్, కలెక్టర్లతో చర్చించారు. వర్ధంతికి తప్ప ఇతర సమయంలో ఇక్కడికి వచ్చేందుకు అనుకూల పరిస్థితులు లేవనే అభిప్రాయాన్ని సీఎం వెలిబుచ్చారు. కానీ పోలీసులు శుక్రవారం భారీ బలగాలతో జోడేఘాట్ అడవులను జల్లెడ పట్టారు. అనేక ప్రాంతాల్లో పహరా కాస్తున్నారు. -
ఆంతర్యం ఏంటో?
యూనివర్సిటీ ఏర్పాటుపై సరైన హామీ ఇవ్వని కేసీఆర్ ‘తెలంగాణలో గిరిజన యూనివర్సిటీ ఏర్పాటు ఖాయం. ఏర్పాటు చేసే యూనివర్సిటీకి కొమురం భీమ్ గిరిజన యూనివర్సిటీగా పేరు పెడుతాం.’ - ఇవీ బుధవారం జోడేఘాట్‌లో కొమురం భీమ్ వర్ధంతిలో పాల్గొన్న సీఎం కేసీఆర్ చెప్పిన మాటలు. ఉట్నూర్ : కొమురం భీమ్ వర్ధంతి వేడుకల నిర్వహణకు ముందు రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు హైదరాబాద్‌లో నిర్వహించిన ఉన్నతాధికారుల సమావేశంలో ఆదిలాబాద్ జిల్లాలోనే గిరిజన యూనివర్సిటీ ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నారు. దీంతో ఆ సమయంలో గిరిజనుల్లో ఆశలు చిగురించాయి. అయితే.. బుధవారం భీమ్ వర్ధంతిలో పాల్గొన్న సీఎం ఆ విషయంపై స్పష్టత ఇష్టారని అందరూ భావించినా.. కానీ, ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు. దీనికితోడు తెలంగాణలో ఏర్పాటు చేసే గిరిజన యూనివర్సిటీకి కొమురం భీమ్ పేరు పెడుతామంటూ ప్రకటన చేయడంతో అందరిలోనూ అయోమయం నెలకొంది. జిల్లా అంతగా చర్చ మొదలైంది. వెంటనే ప్రభుత్వం జిల్లాలో యూనివర్సిటీ ఏర్పాటుపై స్పష్టత ప్రకటన చేయాలని గిరిజన సంఘాలు కోరుతున్నాయి. యూనివర్సిటీ ఏర్పాటుతో అభివృద్ధి జిల్లాలో 2011 జనాభా లెక్కల ప్రకారం 4,95,794 ఆదివాసీ గిరిజన జనాభా ఉంది. జిల్లావ్యాప్తంగా తొమ్మిదికి పైగా గిరిజన తెగలు జీవిస్తున్నారు. గోండులు 2,63,515, లంబాడాలు 1,12,793, కోలాంలు 38,176, పర్దాన్లు 26,029, మన్నెవార్లు 15,370, నాయక్‌పోడ్‌లు 5,206, తోటీలు 2,231, కోయ 1,735, ఇతర తెగలు 30,739 చొప్పున ఉన్నారు. గిరిజన యూనివర్సిటీ జిల్లాలో ఏర్పాటు అయితే అందరూ విద్యాభివృద్ధి సాధించే అవకాశం లేకపోలేదు. అంతేగాకుండా మరికొందరికి ఉద్యోగ అవకాశాలూ లభిస్తాయి. -
సీఎం పర్యటన బందోబస్తు సంఖ్య
ఆదిలాబాద్ క్రైం : కొమురం భీమ్ వర్ధంతిలో పాల్గొనేందుకు ఈనెల 8న జిల్లాకు ముఖ్యమంత్రి చంద్రశేర్‌రావు వస్తున్న నేపథ్యంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. భీమ్ స్వస్థలమైన కెరమెరి మండలం జోడేఘాట్‌లో వర్ధంతి నిర్వహిస్తున్నారు. ఇందుకోసం సోమవారం జిల్లా పోలీసు అధికారులతో ఎస్పీ గజరావు భూపాల్ టెలీకాన్ఫరెన్స్ నిర్వహించి బందోబస్తు వివరాలు తెలుసుకున్నారు. జిల్లాకు మొదటిసారిగా ముఖ్యమంత్రి హోదాలో వస్తున్న కేసీఆర్‌కు రాష్ట్ర పోలీసు అధికారుల పర్యవేక్షిస్తారని తెలిపారు. ఎక్కడా భద్రతా లోపం లేకుండా జోడేఘాట్‌లో అణువణువు తనిఖీలు చేస్తున్నట్లు తెలిపారు. గ్రేహౌండ్స్ బలగాలతో కూంబింగ్ నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. వరంగల్ జోన్ ఐజీ రవిగుప్తా, కరీంనగర్ రేంజ్ డీఐజీ భీమానాయక్, జిల్లా ఎస్పీ పర్యవేక్షణలో పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయనున్నారు.