మ్యూజియాన్ని పరిశీలిస్తున్న మహారాష్ట్ర అధికారులు
కెరమెరి(ఆసిఫాబాద్): ఆదివాసీల అడవి బిడ్డ కుము రం భీం ధామం చాలా అద్భుతంగా ఉందని మహా రాష్ట్ర ఆదివాసీ సొసైటీ చైర్మన్ శ్యాంరావు కోట్నాకే, రాజూర తహసీల్దార్ వరోవింద్రవోటి అన్నారు. మంగళవారం మండలంలోని చారిత్రాత్మక ప్రదేశమైన జోడేఘాట్‌ను వారు సందర్శించారు. కుమురం భీం చిత్రపటానికి పూల మాల వేసి నివాళి అర్పించారు. నాలుగు గోత్రాలకు చెందిన జెండాల ముందు పూజలు చేశారు. అనంతరం మ్యూజియాన్ని సందర్శించారు. వారికి క్యూరేటర్ మంగంరావు అవగాహన కల్పించారు. ఆదివాసీల ఆభరణాలు, విల్లులు, వాడుకునే వస్తువులను చూశారు. ఫొటో ఎగ్జిబిషన్ తిలకించారు. అనంతరం కోయ, గోండు, కొలాం, నాయక్‌పోడ, పెర్సపేన్, పహండి కుపర్‌లింగో తదితర దేవతలకు పూజలు చేశారు. గిరిజన సంప్రదాయం, ఆదివాసీ ఆచార వ్యవహారాలను అడిగి తెలుసుకున్నారు. మహారాష్ట్రకు చెందిన పర్యాటకులు భారీగా తరలివచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment