తెలంగాణ పెళ్లి బ్యాక్‌డ్రాప్‌తో సినిమా.. శరవేగంగా షూటింగ్ | Laggam Movie Shooting Updates Latest | Sakshi

షూటింగ్ బిజీలో 'లగ్గం'.. రిజల్ట్‌పై దర్శకనిర్మాతలు ధీమా

Mar 4 2024 12:08 PM | Updated on Mar 4 2024 12:08 PM

Laggam Movie Shooting Updates Latest - Sakshi

సుభిషి ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై వేణుగోపాల్ రెడ్డి నిర్మిస్తున్న సినిమా 'లగ్గం'. 'భీమదేవరపల్లి బ్రాంచి' మూవీతో దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్న రమేష్ చెప్పాల ఈ చిత్రాన్ని తీస్తున్నారు. తెలుగు సంప్రదాయంలోని తెలంగాణ పెళ్లిని కన్నుల విందుగా చూపించబోతున్నానని ప్రతి ఒక్కరు ఈ చిత్రం చూసి మాట్లాడుకుంటారని ఈ దర్శకుడు ధీమాగా చెబుతున్నాడు. 

(ఇదీ చదవండి: పెళ్లి చేసుకున్న టాలీవుడ్ హీరోయిన్.. నెల తర్వాత బయటపెట్టింది)

కొన్ని తరాలు గుర్తుంచుకునే చిత్రమవుతుందని నిర్మాత వేణుగోపాల్ రెడ్డి తన అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. సాయి రోనాక్, ప్రగ్యా నగ్రా హీరో హీరోయిన్‌గా నటించారు. రాజేంద్రప్రసాద్, రోహిణి,  ఎల్.బి శ్రీరామ్, సప్తగిరి తదితరులు కీలకపాత్రలు పోషించారు. "ఇది వరకు తెలుగు సాంప్రదాయంలో జరిగే పెళ్లి కాన్సెప్ట్ తో చాలా చిత్రాలు వచ్చాయి. అందుకు భిన్నంగా లగ్గం సినిమా ఉండబోతోందని నటుడు రాజేంద్ర ప్రసాద్ చెప్పారు.

(ఇదీ చదవండి: వరలక్ష్మి శరత్ కుమార్ పెళ్లి కళ.. ఎంగేజ్‌మెంట్ ఫొటోలు వైరల్)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement