
అవికా గోర్, సాయి రోనక్ జంటగా నటిస్తోన్న చిత్రం ‘పాప్ కార్న్’. ఎం.ఎస్.చలపతి రాజు సమర్పణలో ఆచార్య క్రియేషన్స్, అవికా స్క్రీన్ క్రియేషన్స్ బ్యానర్స్‌పై భోగేంద్ర గుప్తా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. మురళి గంధం దర్శకత్వం వహిస్తున్నారు. ఫిబ్రవరి 10న ఈ చిత్రం విడుదల కాబోతుంది. ఇప్పటికే విడుదలైన ట్రైలర్‌కు మంచి స్పందన లభించింది. తాజాగా ఈ చిత్రం నుంచి ‘మది విహంగమయ్యే...’ అనే లిరికల్ సాంగ్‌ను హీరో అక్కినేని నాగచైతన్య విడుదల చేసి, సినిమా పెద్ద సక్సెస్ కావాలని యూనిట్‌కి అభినందనలు తెలిపారు.
పాటను గమనిస్తే ఓ షాపింగ్ మాల్‌లోనే పాటంతా సాగుతుంది. హీరో హీరోయిన్లు అందులో షాపింగ్ చేయటానికి వచ్చినప్పుడు వారి ఆలోచనలు.. ఎంత వేగంగా వారి భవిష్యత్తు వైపు అందంగా దూసుకెళ్తున్నాయనే విషయాన్ని చక్కటి లిరిక్స్‌తో పాటలో పొందు పరిచారు లిరిక్ రైటర్ శ్రీజో. శ్రవణ్ భరద్వాజ్ సంగీతం అందించిన ఈ పాటను బెన్నీ దయాల్, రమ్యా బెహ్రా ఆలపించారు.
ఈ సందర్భంగా చిత్ర సమర్పకుడు ఎం.ఎస్.చలపతి రాజు మాట్లాడుతూ .. ఇప్పటి వరకు రానటువంటి ఓ డిఫరెంట్ కాన్సెప్ట్ మూవీ. సినిమా అంతా లిఫ్టులోనే ఉంటుంది. ఇప్పటి యువతకు కూడా కనెక్ట్ అవుతుంది’అన్నారు. ‘కొత్త కాన్సెప్ట్ చిత్రాలను తెలుగు ప్రేక్షకులు ఆదరిస్తారనే నమ్మకం ఉంది. ఫిబ్రవరి 10న పాప్ కార్న్‌తో సందడి చేయబోతున్నాం’అని హీరోయిన్ అవికా గోర్ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment