అవికా గోర్, సాయి రోనక్ జంటగా నటిస్తోన్న చిత్రం ‘పాప్ కార్న్’. ఎం.ఎస్.చలపతి రాజు సమర్పణలో ఆచార్య క్రియేషన్స్, అవికా స్క్రీన్ క్రియేషన్స్ బ్యానర్స్‌పై బోగేంద్ర గుప్తా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. మురళి గంధం దర్శకత్వం వహిస్తున్నారు. బుధవారం ఈ మూవీ ట్రైలర్‌ను కింగ్ నాగార్జున విడుదల చేశారు. సినిమా పెద్ద హిట్ కావాలని యూనిట్‌కి అభినందనలు తెలియజేశారు.
ఇక ట్రైలర్ విషయానికొస్తే.. డిఫరెంట్ మైండ్స్ సెట్స్ ఉన్న ఇద్దరు వ్యక్తుల అనుకోకుండా లిఫ్ట్‌లో చిక్కుకుంటారు. వారిని ఎవరూ పట్టించుకోరు. ముందు ఒకరంటే ఒకరికి పడకుండా ఉన్న వాళ్లిద్దరూ సమయం గడిచేకొద్ది స్నేహితులుగా మారుతారు. ఒకరిపై మరొకరికి అభిమానం కలుగుతుంది. ఈ జర్నీలో వారిద్దరి మధ్య క్రియేట్ అయిన ఎమోషనల్ బాండింగ్ గురించి తెలియజేసే సినిమాయే ‘పాప్ కార్న్’ అని ట్రైలర్ చూస్తుంటే అర్థమవుతుంది. రొటీన్‌కు భిన్నంగా దర్శకుడు మురళి గంధం పాప్ కార్న్ మూవీని తెరకెక్కిచినట్లు ట్రైలర్ చూస్తుంటే అర్థమవుతుంది. త్వరలోనే ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుందని దర్శకనిర్మాతలు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment