లగ్గం మూవీ ట్రైలర్‌.. నూతన వధూవరులకు సర్‌ప్రైజ్‌! | Tollywood Movie Laggam Trailer Launch By New Wedding Couple | Sakshi
Sakshi News home page

Laggam Trailer : లగ్గం మూవీ ట్రైలర్‌.. నూతన వధూవరులతోనే చేయించారుగా!

Published Thu, Oct 10 2024 6:03 PM | Last Updated on Thu, Oct 10 2024 6:26 PM

Tollywood Movie Laggam Trailer Launch By New Wedding Couple

సాయి రోనక్, ప్రజ్ఞ నగ్రా ప్రధాన పాత్రల్లో నటిస్తోన్న చిత్రం లగ్గం. ఈ సినిమాకు రమేశ్ చెప్పాల దర్శకత్వం వహిస్తున్నారు.  ఈ మూవీని సుభిషి ఎంటర్టైనమెంట్స్ పతాకంపై వేణుగోపాల్ రెడ్డి నిర్మిస్తున్నారు. తాజాగా ఈ సినిమా ట్రైలర్‌ను మేకర్స్ విడుదల చేశారు. ఇప్పటికే రిలీజైన సాంగ్స్, పోస్టర్స్, టీజర్‌కు అభిమానుల నుంచి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది.

అయితే ట్రైలర్‌ రిలీజ్‌ను రోటీన్‌కు భిన్నంగా ప్లాన్ చేశారు మేకర్స్. లగ్గం మూవీ ట్రైలర్‌ను రియల్‌గా పెళ్లి చేసుకుంటున్న నూతన వధూవరుల చేతుల మీదుగా విడుదల చేశారు. ఓ కల్యాణ మండపంలో జరిగిన ఈ కార్యక్రమంలో సినిమా టీమ్ అంతా పాల్గొన్నారు. వెరైటీగా మూవీ ప్రమోషన్స్ చేయడంతో మూవీ టీమ్‌ను అభినందించారు. వధూవరులు సైతం ఆనందం వ్యక్తం చేశారు. కాగా.. ఈ చిత్రంలో రాజేంద్రప్రసాద్, రోహిణి, సప్తగిరి, కృష్ణుడు,  రఘుబాబు, రచ్చ రవి కీలక పాత్రల్లో నటించారు. ఈ సినిమాకు చరణ్ ‍అర్జున్‌ సంగీతమందించారు. 
 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement