జీవితం నేర్పిన పాఠం | Mahi V Raghav's movie Paathshala might be released soon | Sakshi
Sakshi News home page

జీవితం నేర్పిన పాఠం

Published Sat, Jun 21 2014 11:01 PM | Last Updated on Sat, Sep 2 2017 9:10 AM

జీవితం నేర్పిన పాఠం

జీవితం నేర్పిన పాఠం

అది కళాశాల ముగింపు రోజు. గడచిన జ్ఞాపకాలను నెమరేసుకుంటూ, బరువెక్కిన హృదయాలతో విద్యార్థులంతా ఒకరికొకరు వీడ్కోలు పలుకుతున్నారు. అలాంటి క్షణంలో ఆ అయిదుగురు మిత్రులు... ‘ఎవరిళ్లకు వాళ్లు వెళ్లే ముందు... ఒకరి ఇళ్లకు ఒకరం నాలుగు రోజులు అతిథులుగా వెళ్దాం’ అని నిశ్చయించుకున్నారు. ఆ నిర్ణయమే ఆ మిత్రుల జీవితాల్లో అనూహ్యమైన మార్పుకు కారణమైంది. పదహారేళ్ల చదువులో నేర్చుకోని పాఠాలను ఈ నాలుగు రోజుల ‘పాఠశాల’ ఆ అయిదుగురికీ నేర్పింది... సింపుల్‌గా ‘పాఠశాల’ చిత్రం కథాంశమిది.
 
 ‘విలేజ్‌లో వినాయకుడు, కుదిరితే కప్పు కాఫీ’ చిత్రాలను నిర్మించిన మూన్ వాటర్ పిక్చర్స్ పతాకంపై ఈ సినిమా రూపొందింది. రాజేశ్ మహంకాళి, పవన్‌కుమార్‌రెడ్డి నిర్మాతలు. మహి వి.రాఘవ్ దర్శకుడు. ‘‘వినోదం, వైవిథ్యం, సందేశాల మేళవింపే ఈ సినిమా. నిర్మాణం పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని జూలై చివరివారంలో కానీ, ఆగస్ట్ తొలివారంలో కానీ విడుదల చేస్తాం’’ అని నిర్మాతలు తెలిపారు. సాయి రోనక్, అనుప్రియ, నందు, శిరీష ప్రధాన పాత్రలు పోషించిన ఈ చిత్రానికి సంగీతం: రాహుల్‌రాజ్, కెమెరా: సుధీర్ సురేంద్రన్, కూర్పు: శ్రవణ్.కె.
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement