Sirish
-
ఆశిష్‌కి ఈ సినిమా ఓ సవాల్
ప్రముఖ నిర్మాత ‘దిల్’ రాజు సోదరుడు, నిర్మాత శిరీష్ తనయుడు ఆశిష్ ‘రౌడీ బాయ్స్’ చిత్రం ద్వారా హీరోగా పరిచయమైన విషయం తెలిసిందే. ఆశిష్ హీరోగా నటిస్తున్న రెండో సినిమా ‘సెల్ఫిష్’ శుక్రవారం హైదరాబాద్‌లో ఆరంభమైంది. విశాల్ కాశీని దర్శకుడిగా పరిచయం చేస్తూ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, సుకుమార్ రైటింగ్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. ‘దిల్’ రాజు, శిరీష్ నిర్మాతలు. ముహుర్తపు సన్నివేశానికి దర్శకుడు హరీష్ శంకర్ కెమెరా స్విచాన్ చేయగా, తమిళ స్టార్ ధనుష్ క్లాప్ ఇచ్చారు. దర్శకుడు అనిల్ రావిపూడి గౌరవ దర్శకత్వం వహించడంతో పాటు మోషన్ పోస్టర్ రిలీజ్ చేశారు. అనంతరం ‘దిల్’ రాజు మాట్లాడుతూ.– ‘‘రౌడీ బాయ్స్’తో మా ఆశిష్ నటుడిగా ప్రూవ్ చేసుకున్నాడు. ఆ సినిమా తనకు టైలర్ మేడ్. కానీ ఈ సినిమా తనకు ఓ చాలెంజ్లాంటిది. నేను, సుకుమార్ ‘ఆర్య’ (2004) సినిమాకు పని చేశాం. ఇన్నేళ్లకు ‘సెల్ఫిష్’కు మేం పని చేయడం ఆనందంగా ఉంది. ‘సెల్ఫిష్’ ఐడియా చెప్పినప్పుడే బాగా నచ్చి సినిమా చేద్దామని కాశీకి చెప్పాను. స్టోరీ పర్ఫెక్ట్గా సెట్ అయింది’’ అన్నారు. ఈ చిత్రానికి కెమెరా: మణికందన్ .ఎస్, సంగీతం: మిక్కీ జే మేయర్, సహనిర్మాతలు: హర్షిత్ రెడ్డి, హన్షితా రెడ్డి, అశోక్ బండ్రెడ్డి. -
హీరోగా మారడానికి 25 కేజీల బరువు తగ్గాను
ఆశిష్‌ను పెద్ద దర్శకుడితో లాంచ్ చేయవచ్చు. ఆశిష్ లాంచ్‌కు పెద్ద డైరెక్టర్ని పెడదామని శిరీష్ కూడా అన్నాడు. కానీ దానికి నేను వ్యతిరేకం. పెద్ద డైరెక్టర్ అయితే డబ్బు కోసమో, ఆబ్లిగేషన్ కోసమో చేస్తాడు. నాకు ఈ రెండూ ఇష్టం లేవు. ఓ కుర్రాడితో సినిమా చేస్తున్నప్పుడు ఓవర్ బడ్జెట్ పెట్టాలని నాకు లేదు. ఓ కొత్త యాక్టర్‌లానే ఆశిష్‌ను ఎదగనివ్వాలని అనుకున్నాను’’ అని ప్రముఖ నిర్మాత ‘దిల్’ రాజు అన్నారు. Producer Speech About Rowdy Boys Movie Hero: ‘దిల్’ రాజు సోదరుడి కుమారుడు శిరీష్ తనయుడు ఆశిష్ హీరోగా పరిచయం అవుతున్న చిత్రం ‘రౌడీబాయ్స్’. ‘హుషారు’ ఫేమ్ శ్రీహర్ష కొనుగంటి దర్శకత్వంలో ‘దిల్’ రాజు, శిరీష్ నిర్మించిన ఈ చిత్రం నేడు విడుదల కానుంది. ఈ సందర్భంగా ‘దిల్’ రాజు మాట్లాడుతూ – ‘‘ఇప్పటి స్టార్ హీరోలు కొందరు ఒకప్పుడు మా నిర్మాణ సంస్థ నుంచే లాంచ్ అయ్యారు. అయితే ఆశిష్‌కు నేను ఎవరితో పోలికలు పెట్టను. ఎవరి బ్రాండ్ వారిది. ఇండస్ట్రీలో ప్రస్తుతం 20 మంది హీరోలు ఉన్నారు. రాబోయే రోజుల్లో ఇంకా వస్తారు.. వస్తూనే ఉంటారు. కానీ ఇందులో ఎంతమంది హీరోలు నిలబడతారు అనేది వారి హార్డ్ వర్క్, స్క్రిప్ట్ సెలక్షన్‌పై ఆధారపడి ఉంటుంది. అయితే ఆశిష్‌కు స్క్రిప్ట్ సెలక్షన్ విషయంలో నేను ఉన్నాను కాబట్టి సహాయం చేస్తాను. మూడు నాలుగు సినిమాల తరవాత తనే ఫలానా కథ నచ్చిందని చెప్పేస్తాడు. మంచి కంటెంట్‌కు ఆర్టిస్ట్ కష్టం తోడైతేనే ఆడియన్స్‌కు ఆ ఆర్టిస్ట్ ఎక్కువగా రీచ్ అవుతారని నేను నమ్ముతాను. నా సక్సెస్ రీజన్ కూడా అదే. నేను కూడా స్టోరీలను పట్టుకునే ఇప్పుడు నిర్మాతగా ఈ స్థాయికి చేరుకున్నాను. నా కెరీర్ స్టార్టింగ్‌లో నా మొదటి తొమ్మిది సినిమాలకు ఏ స్టార్ హీరో లేడు. ‘బృందావనం’తో ఎన్టీఆర్ రూపంలో ఆ సమయంలో నాకో స్టార్ హీరో దొరికారు. అప్పటివరకు నేను అప్‌కమింగ్ నిర్మాతగానే కెరీర్లో ముందుకు వెళ్లాను. అదే నా ఫిలాసఫీ. ఇప్పుడు ఆశిష్ కూడా అలానే ఎదగాలని కోరుకుంటున్నాను. ‘ఆశు డ్యాన్స్ బాగా చేస్తున్నాడు... వాడ్ని హీరో చేయండి’ అని నా భార్య అనేవారు. వాడిని అడిగితే, నటనపై ఆసక్తి ఉంది అన్నాడు. ‘ఆసక్తి ఉంటే సరిపోదు. చాలా కష్టపడాలి. మా బ్యాకప్ ఒక సినిమా లేదా రెండు సినిమాలకే ఉపయోగపడుతుంది. ఈలోపు నువ్వు నీ ప్రతిభతో ఆడియన్స్, దర్శకులు, రైటర్స్‌కు రీచ్ కాలేకపోతే నువ్వే ఇబ్బంది పడతావ్’ అని ఆశిష్‌కు చెప్పాను. ఇక ‘రౌడీబాయ్స్’ సినిమా టార్గెట్ యూత్. హర్ష తన లైఫ్‌లోని సంఘటనలతో ఈ సినిమా కథ చెప్పారు... నచ్చింది. ఓకే చేశాను. ఆశిష్ నవ్విస్తాడు.. ఏడిపిస్తాడు. డ్యాన్సులు చేస్తాడు. ఇక ‘దిల్’ రాజుగారి సినిమాలంటే ఫ్యామిలీ ఆడియన్స్‌కు నచ్చుతాయనే ఓ బ్రాండ్ ఉంది. కానీ ‘ఏంటి.. ‘దిల్’ రాజు ఎప్పుడూ క్లాసులు పీకుతాడు’’ అనుకున్నవారు కూడా ఉన్నారు. నేను కూడా ఒకే ధోరణిలో సినిమాలు చేస్తే ఆగిపోవాల్సి వస్తుంది. జనరేషన్ మారుతోంది. నాకు కష్టం అనిపించినా ఎక్కడో దాటాలి. ‘రౌడీబాయ్స్’లో ఉన్న ముద్దు సన్నివేశాన్ని ట్రైలర్లోనే చూపించి ఆడియన్స్‌ను ప్రిపేర్ చేశాం. కథ డిమాండ్ చేయడంతో కొన్ని ముద్దు సన్నివేశాలు పెట్టడం జరిగింది. ఓటీటీ వచ్చాక చాలా మార్పులు వచ్చాయి. నేనూ కథల్ని బట్టి మారుతూ ఉండాలి. ఈ మార్పులో నా ఫస్ట్ స్టెప్ ‘రౌడీబాయ్స్’ సినిమా’’ అన్నారు. అంతా పాజిటివ్... ఏపీ సీఎం జగన్మోహన్రెడ్డిగారితో గురువారం చిరంజీవిగారు సమావేశమయ్యారు. ఈ సమావేశంపై నాకు పూర్తి అవగాహన లేదు. అయితే అంతకుముందు మేం చిరంజీవిగారితో మాట్లాడాం. ఇండస్ట్రీ సమస్యలపై ఆయనకు ఓ అవగాహన ఉంది. చిరంజీవిగారు వెళ్లారు కాబట్టి ప్రస్తుతం ఉన్న సమస్యలు పరిష్కారమవుతాయనే నమ్ముతున్నాను. త్వరలో అంతా పాజిటివ్‌గా జరుగుతుంది. సహనంగా ఉండకుండా కొందరు ఏదో మాట్లాడుతున్నారు. దానివల్ల సమస్యలు జటిలం అవుతున్నాయే కానీ పరిష్కారం కావడం లేదు. పాతిక కిలోల బరువు తగ్గాను – ఆశిష్ ‘‘ఫ్యామిలీ ఫంక్షన్స్, పార్టీల్లో నేను డ్యాన్స్ చేసేవాడిని. డ్యాన్స్‌లో అల్లు అర్జున్‌గారు నా ఫేవరెట్. నేను హీరో అవ్వాలనుకుంటున్న విషయాన్ని ఇంట్లో వారికి ప్రూవ్ చేసిన తర్వాత నా జర్నీ స్టార్ట్ చేశాను’’ అన్నారు ఆశిష్. ఇంకా మాట్లాడుతూ – ‘‘అరుణ భిక్షు, సత్యానంద్‌గార్ల దగ్గర, బాంబేలో నటనలో శిక్షణ తీసుకున్నాను. అయితే అనుభవం కోసం ‘కేరింత’కు అసిస్టెంట్ డైరెక్టర్‌గా చేశాను. ‘రౌడీ బాయ్స్’ షూటింగ్ ముందు రోజే సీన్ పేపర్స్ తీసుకుని ప్రిపేర్ అయ్యేవాడిని. రొమాంటిక్ సీన్స్ కాస్త ఇబ్బందిగా అనిపించాయి. నాకు రొమాంటిక్ అండ్ కాలేజ్ స్టోరీలంటే ఇష్టం. ఆడియన్స్ ఎలా యాక్సెప్ట్ చేస్తే అలా వెళ్తాను. హీరోగా మారడానికి 25 కేజీల బరువు తగ్గాను. ఈ సినిమా కెమెరామేన్ మదిగారు చెప్పిన నా లోపాలను సరిదిద్దుకుంటూ యాక్టర్‌గా మెరుగుపడ్డాను. నా తర్వాతి చిత్రం కాశీ దర్శకత్వంలో ‘సెల్ఫిష్’ టైటిల్‌తో చేస్తున్నాను’’ అన్నారు. -
‘నీకే కాదు.. పెళ్లికే తగనివాణ్ని’
ప్రేమించాడు. పెళ్లయ్యాక ఫస్ట్ నైటే తొలి ముద్దు అన్నాడు. అమ్మాయి ఆనందంలో తేలిపోయింది. ‘తగినవాడు’ అనుకుంది. కానీ లాస్ట్ మినిట్‌లో ‘నేను తగనివాణ్ణి’ అన్నాడు. ‘నీకే కాదు.. పెళ్లికే తగనివాణ్ని’ అన్నాడు. అమ్మాయి షాక్ తింది. అది పట్టించుకోలేదు అతను. ‘‘ప్లీజ్.. నువ్వే మన పెళ్లి చెడగొట్టాలి’’ అన్నాడు! రిసార్ట్ అన్నారు గానీ అది రిసార్ట్‌లా లేదు. బీచ్ ఒడ్డున నాసి రకం షెడ్లు వేసి రూముల్లాగా చేశారు. రెండు మూడు కుర్రాళ్ల టీములు – వైజాగ్ వాళ్లట – పార్టీ చేసుకోవడానికి స్టే చేసి ఉన్నాయి. ఇప్పుడు వచ్చిన హైదరాబాద్ కుర్రాళ్ల టీములో ఒకరిద్దరు ఉత్సాహంగా ఉన్నా ఒకరిద్దరు బెరుగ్గా ఉన్నారు. ‘రాత్రికి ఉంటుంది మజా’ అన్నాడు హైదరాబాద్ టీమ్‌లోని ఒక కుర్రాడు. ‘జాగ్రత్త... పోలీసులు సడన్‌గా రావచ్చు. మీ మంచికే చెప్తున్నాను’ అన్నాడు బీర్లు తెచ్చి పెట్టిన బోయ్. రాత్రయ్యింది. రిసార్ట్‌లో మసక చీకటి అలుముకుంది. అక్కడక్కడ రూముల్లో సందడి వినిపిస్తూ ఉంది. హైదరాబాద్ టీములోని కుర్రాళ్లు వాళ్లలోని ఒకతన్ని గదిలోనే వదిలి మిగిలినవాళ్లంతా బయటకు వచ్చేశారు. ‘ఎంజాయ్ మామా’ అని కేరింతలు కొట్టారు వాళ్లందరూ. గదిలో ఉన్న కుర్రాడు తన ఎదురుగా వచ్చి కూచున్న ఆమె వైపు క్యూరియస్‌గా చూశాడు. లేడీ సైకియాట్రిస్ట్ రూములో ఆ అమ్మాయి, ఆ అమ్మాయి తల్లీ కూచుని ఉన్నారు. అమ్మాయి కళ్ల కింద చారలు ఉన్నాయి. ఏడెనిమిది రోజులుగా తిండి తింటున్నట్టుగా లేదు. ఏడ్చి ఏడ్చి అలసిపోయినట్టుగా ఉంది. ‘నా ఖర్మ డాక్టర్. మూడు రోజుల్లో పెళ్లి. ఎలా తయారయ్యిందో చూడండి’ అంది తల్లి సైకియాట్రిస్ట్‌తో. ‘ఇష్టం లేని పెళ్లి చేస్తున్నారా?’ అడిగింది సైకియాట్రిస్ట్.‘లేదండీ. ఇద్దరికీ ఒకరంటే ఒకరికి ఇష్టమే. ఆఫీసులో కలీగ్స్. ప్రేమించుకున్నారు. వాళ్లకై వాళ్లొచ్చి అడిగితేనే పెద్దలం ఓకే అన్నాం’ ‘ఏమ్మా... ఏంటి ప్రాబ్లమ్’ అడిగింది సైకియాట్రిస్ట్. ఆ అమ్మాయి ఏమీ మాట్లాడలేదు. ‘మీరు బయట కూచోండి. నేను కనుక్కుంటాను’ అంది సైకియాట్రిస్ట్. ‘నువ్వు ఈ కాలం అబ్బాయివి కావు’ అంది మాన్విత శిరీష్‌తో. ‘నేను ఈ కాలం అబ్బాయినే’ ఉడుక్కుంటూ అన్నాడు శిరీష్. ‘నీ మొహం. సర్పంటైన్ పబ్ హైదరాబాద్‌లో ఎక్కడ ఉందో చెప్పు?’ ‘తెలీదు. నీకు తెలుసా?’ కంగారుగా అడిగాడు. ‘తెలీదు. వెళ్లలేదు. కంగారు పడకు. నా ఫ్రెండ్స్ ఎవరో వెళితే దాని గురించి తెలిసింది. అందులో రాక్ మ్యూజిక్‌లూ పాప్ మ్యూజిక్‌లూ ఉండవు. ఎంచక్కా ఒక తబలా ఒక హార్మోనియం పెట్టుకొని ఎంకి పాటలు పాడతారు. బీరులోకి అరటికాయ బజ్జీలు ఇస్తారట’ నవ్వింది. ‘ఏమో... అదంతా నాకు తెలియదు. ఆఫీసవగానే నేరుగా ఇంటికెళ్లిపోతాను’ ‘వెళ్లి జబర్దస్త్ చూస్తావు. అంతేగా?’ ‘అరె.. నీకెలా తెలుసు?’ ‘సుబ్బారావ్... అందుకే నువ్వంటే నాకిష్టం’ శిరీష్ బుగ్గను పిండింది మాన్విత. ఒక శాటర్ డే మాన్వితను కారులో లాంగ్ డ్రైవ్‌కు తీసుకెళుతూ శిరీష్ మాన్వితతో చెప్పాడు– ‘నేను ఇంటర్ చదివే రోజుల్లో ఎంసెట్‌లో ర్యాంక్ కోసం సాయంత్రాలు డాబా మీదకు వెళ్లి చదువుకునేవాణ్ణి. రాత్రి ఎనిమిదీ ఎనిమిదిన్నర టైములో పక్కింటామె పనంతా ముగించి స్నానానికి వెళ్లేది. వాళ్లది ఓపెన్ టాప్ బాత్రూమ్. నేను సరిగ్గా నిలబడితే పూర్తిగా కనిపిస్తుంది. కాని నేను ఒక్కసారి కూడా చూడలేదు. చూడకూడదు అనుకున్నాను. బి.టెక్ చేస్తున్నప్పుడు మా బేచ్మేట్ ఒకమ్మాయి నాకు ఐ లవ్ యూ చెప్పింది. కాని ఆ అమ్మాయి పట్ల నాకేమీ ఫీలింగ్స్ లేవు. సారీ అన్నాను. అయితే ఒక ముద్దన్నా పెట్టు అంది. పెట్టను అన్నాను. నేను పెట్టే ముద్దు నేను చేసుకోబోయే అమ్మాయికే పెట్టాలి అనుకున్నాను. ఇప్పుడు ఈ కారులో నువ్వూ నేనూ తప్ప ఎవరూ లేరు. ఇప్పుడు నిన్ను ముద్దు పెట్టుకోవచ్చు. కాని మన పెళ్లయ్యాక నువ్వు పాల గ్లాసు తీసుకొని వచ్చాక కొత్త పెళ్లి కూతురిగా ఉన్నప్పుడు నిన్ను తొలిసారి ముద్దు పెట్టుకున్న మెమొరీ లైఫ్‌లాంగ్ బాగుంటుంది కదా’... మాన్విత కళ్లల్లో ఎందుకో అతని పట్ల విపరీతంగా ఆరాధన పెరిగి తడి ఉబికింది. ‘సుబ్బారావ్... సుబ్బారావ్’ తలలోకి వేళ్లు దూర్చి అల్లరిగా జుట్టును చెదరగొట్టింది. ‘తర్వాత?’ అడిగింది సైకియాట్రిస్ట్. ‘అతను పెళ్లి చేసుకోను అంటున్నాడు’ ‘అదేంటి?’ ‘నన్నే పెళ్లి చెడగొట్టమంటున్నాడు. నాతో మాట్లాడటం లేదు. నా ఫోన్ ఎత్తడం లేదు. మూడ్రోజుల్లో పెళ్లి పెట్టుకొని ఏం ఎరగనట్టు ఇవాళ ఆఫీసుకు కూడా వెళ్లాడు’ ‘విచిత్రంగా ఉంది’ ‘నాకు చచ్చిపోవాలని ఉంది’ ‘రేయ్ మామా... అసలే ఆ అమ్మాయి స్పీడు. నువ్వేమో పప్పు. ఫస్ట్‌నైట్ తెల్లముఖం వేశావంటే తర్వాత మా పరువు పోతుంది’ అన్నారు శిరీష్ ఫ్రెండ్స్. ‘అలా ఏమీ ఉండదు. మన తాత ముత్తాలంతా ప్రాక్టీసు చేసే పెళ్లిళ్లు చేసుకున్నారా? నేచరే అన్నీ నేర్పుతుంది’‘చెట్లు కొట్టేసి, కొండలు తవ్వి రోడ్లు వేసేశాక ఇంకా నేచర్ ఎక్కడుంది? అదేం నేర్పుతుంది’ జోక్ చేశాడో ఫ్రెండు. ‘మగాడు కొన్ని తెలియడం వల్ల చెడిపోతాడు. కొన్ని తెలియకపోతే చెడిపోతాడు’మొత్తానికి అందరూ శిరీష్‌ని బెదరగొట్టి రిసార్ట్ ప్రోగ్రామ్ పెట్టారు.‘అది శిరీష్ చేసిన తప్పు డాక్టర్. అక్కడ అతను ఫెయిల్ అయ్యాడు. ఏమీ చేయలేకపోయాడు. అది చాలా దెబ్బ కొట్టింది అతని కాన్ఫిడెన్స్ మీద. కాని అతడు ఎంత మంచివాడంటే వెంటనే హైదరాబాద్ వచ్చి జరిగింది నాతో చెప్పి పెళ్లి చేసుకోలేనని డిక్లేర్ చేశాడు. ఇక మీదట ఎవర్నీ చేసుకోనని కూడా చెప్పేశాడు. ఇరవై నాలుగ్గంటలూ కెరీర్ మీద దృష్టి పెడతాడట. అదే జీవితం అనుకుంటాడట’ మాన్విత ఏడ్చింది. ‘ఆపు. అనవసరంగా ఏడుస్తున్నావు. లేచి బయటికెళ్లి ఇప్పుడు మీ అమ్మను పంపు. రేపు ఆ సుబ్బారావ్ను పంపు’ అంది సైకియాట్రిస్ట్. తల్లికి జరిగిందంతా చెప్పి కూతురుకు ఎలా ధైర్యం చెప్పాలో సలహా ఇచ్చింది సైకియాట్రిస్ట్. మరుసటి రోజు సైకియాట్రిస్ట్ ఎదురుగా కూచుని ఉన్నాడు శిరీష్. ‘చూడు శిరీష్.. ఇంత సంస్కారం ఉండి డిస్టర్బెన్స్ తెచ్చుకున్నావ్. ఇంటర్‌కోర్స్ అనేది ఆహ్లాదకరమైన వాతావరణంలో, సంపూర్ణ అంగీకారం, పరిచయం, ప్రేమ ఉన్న మనుషుల మధ్య అవరోధాలు లేకుండా జరుగుతుంది. లేదంటే నీలా జరుగుతుంది. నీకున్న జబ్బును పెర్ఫార్మెన్స్ యాంగ్జయిటీ అంటారు. కొత్త వాతావరణం, ఎవరో తెలియని స్త్రీ, రోగ భయం, పోలీసుల భయం... వీటిన్నింటి వల్ల నువ్వు ఫెయిలయ్యావు తప్ప నీలో లోపం ఉండి కాదు. ఇక మీదట ఎప్పుడూ ఇలా చేయకు. ధైర్యంగా ఉండు. సరేనా’ అంది.అప్పటి వరకూ కుంగిపోయి ఉన్న శిరీష్‌లో ఆ మాటలతో వెలుగు వచ్చింది. ‘థ్యాంక్యూ డాక్టర్. మరి మెడిసిన్లు ఏమైనా వాడాలా?’ అడిగాడు. ‘అవును. వాడాలి’ అని ఆమె ప్రిస్క్రిప్షన్ మీద రాసి ఇచ్చింది. చూశాడు.‘పెళ్లి’ అని ఉంది. శిరీష్, మాన్విత పెళ్లి చేసుకున్నారు. వాళ్లు సంతోషంగా ఉన్నారనడానికి ఫేస్బుక్లో అప్లోడ్ అవుతున్న హనీమూన్ ట్రిప్ ఫొటోలే సాక్ష్యం. – కథనం: సాక్షి ఫీచర్స్ డెస్క్ -
రెండో పెళ్లి చేసుకున్న శిరీష్ భరద్వాజ్
సాక్షి, హైదరాబాద్ : సినీ నటుడు చిరంజీవి చిన్న కూతురు శ్రీజ మాజీ భర్త శిరీష్ భరద్వాజ్ తాజాగా రెండో పెళ్లి చేసుకున్నారు. హైదరాబాద్‌కు చెందిన డాక్టర్ విహనను ఆయన వివాహం చేసుకున్నారు. 2007లో శ్రీజను శిరీష్ భరద్వాజ్ ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. పెద్దలకు తెలియకుండా జరిగిన ఈ వివాహం అప్పట్లో సంచలనం రేపింది. అనంతరం వీరిద్దరి మధ్య కొన్ని విభేదాలు వచ్చాయి. అదనపు కట్నం కోసం శిరీష్ తనను మానసికంగా, శారీరకంగా వేధిస్తున్నాడని శ్రీజ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలోనే వేరుగా ఉంటున్న ఇద్దరు 2014లో చట్టబద్ధంగా విడాకులు తీసుకున్నారు. అనంతరం ప్రముఖ వ్యాపారవేత్త తనయుడైన కళ్యాణ్‌ను శ్రీజ 2016 మార్చి 28న పెళ్ళి చేసుకున్నారు. శిరీష్ - శ్రీజ జంటకు ఒక పాప ఉండగా, వారిరువురు విడిపోయిన తర్వాత పాప శ్రీజ దగ్గరే ఉంటోంది. రాజకీయాల్లోకి అడుగుపెట్టి బీజేపీలో చేరిన శిరీష్ తాజాగా రెండో పెళ్లి చేసుకున్నారు. -
ఆఫీస్ బాయ్ పెళ్లికి అల్లు అర్జున్
ఇటీవల స్టార్ హీరోలు తన పంథా మార్చుకున్నారు. గతంలో హీరోలు ప్రైవేట్ ఫంక్షన్స్‌లో పెద్దగా కనిపించేవారు కాదు. తమ స్థాయికి తగ్గ ఈవెంట్లకు మాత్రమే హజరయ్యే వారు. ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి. తారలు తమ పర్సనల్ టీంతో కూడా సన్నిహితంగా ఉంటున్నారు. అభిమానుల ఇళ్లలో ఫంక్షన్స్‌కూ వస్తున్నారు. గీతా ఆర్ట్స్ లో బాయ్‌గా పని చేస్తున్న శిరీష్ పెళ్లి వేడుకలో బన్నీ సందడి చేశారు. చాలా ఏళ్ల క్రితమే గీతా ఆర్ట్స్‌లో జాయిన్ అయిన శిరీష్, మంచి డ్యాన్సర్, అందుకే బన్నీ కళ్లల్లో పడ్డాడు. శిరీష్ ఇంట్రస్ట్‌ను గుర్తించిన బన్నీ డ్యాన్స్ ఇన్సిస్టిట్యూట్‌లో చేర్పించాడు. ప్రస్తుతం శిరీష్ అసిస్టెంట్ కొరియోగ్రాఫర్‌గా పనిచేస్తున్నాడు. ఇటీవల జరిగిన శిరీష్ పెళ్లి వేడుకకు బన్నీ హాజరయ్యారు. వధూవరులను ఆశీర్వదించి వారికి కుటుంబం సభ్యులతో కాసేపు సరదాగా మాట్లాడారు. అల్లు అర్జున్ లాంటి స్టార్ హీరో తమ ఇంట్లో పెళ్లి వేడుకకు హాజరు కావటం పట్ల ఇరుకుటుంబాల వారు హర్షం వ్యక్తం చేస్తున్నారు. -
మనాలిలో మెగా హీరోలు
స్టార్ హీరోలకు కూడా కొన్ని తీరని కోరికలుంటాయి. ముఖ్యంగా తమ ఫాలోయింగ్ కారణంగా అందరిలా బయట స్పేచ్ఛగా తిరగలేరు స్టార్స్. అందుకే షూటింగ్ షెడ్యూల్స్ మధ్య ఏమాత్రం గ్యాప్ దొరికినా వెకేషన్స్ ప్లాన్ చేస్తుంటారు. తాజాగా మెగా ఫ్యామిలీ హీరోలంతా కలిసి మనాలిలో వెకేషన్‌ను ఎంజాయ్ చేస్తున్నారు. రంగస్థలం 1985 షూటింగ్ నుంచి గ్యాప్ తీసుకున్న రామ్ చరణ్, నా పేరు సూర్య షూటింగ్ కు బ్రేక్ ఇచ్చిన అల్లు అర్జున్ లు ఫ్యామిలీలతో కలిసి మనాలీలో సందడి చేస్తున్నారు. వీరితోపాటు అల్లు వారి చిన్నబ్బాయి శిరీష్ కూడా మానలిలో ఎంజాయ్ చేస్తున్నాడు. -
ఎంపీ తనయులకు బెయిల్, ఆందోళన
-
ఎంపీ తనయులకు బెయిల్, ఆందోళన
అనంతపురం: బాగేపల్లి టోల్‌ప్లాజాపై దాడి కేసులో హిందూపురం టీడీపీ ఎంపీ నిమ్మల కిష్టప్ప తనయులను బెయిల్ పై విడుదల చేయడం పట్ల ఆగ్రహం వ్యక్తమవుతోంది. బాగేపల్లి పోలీసుస్టేషన్లో లొంగిపోయిన నిమ్మల కిష్టప్ప కుమారులు అంబరీష్, శిరీష్‌లను స్టేషన్ బెయిల్‌పై విడుదల చేశారు. పోలీసుల వ్యవహరించిన తీరుపై బాగేపల్లి టోల్‌ప్లాజా సిబ్బంది ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫర్నీచర్‌ను ధ్వంసం చేసి మాపై దాడి చేస్తే స్టేషన్ బెయిల్ ఇచ్చి విడిచిపెడతారా అని పోలీసులను ప్రశ్నించారు. రాజకీయ ఒత్తిడుల కారణంగానే పోలీసులు మెతగ్గా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు విన్పిస్తున్నాయి. కొత్త ఫర్నీచర్ కొనిస్తామని ఎంపీ నిమ్మల కిష్టమ్మ ప్రతిపాదించినట్టు ప్రచారం జరుగుతోంది. అంబరీష్, శిరీష్ సోమవారం ఆంధ్ర– కర్ణాటక సరిహద్దులోని బాగేపల్లి టోల్‌ప్లాజాలో వీరంగం సృష్టించారు. టోల్గేట్ వద్ద అంబరీష్ అనుచరుల కారును ఆపి గేట్ ఫీజు అడిగారన్న కోపంతో విధ్వంసానికి దిగారు. టోల్‌ప్లాజాపై దాడి చేసి.. కంప్యూటర్లు, అద్దాలు పగలగొట్టారు. తమతో పెట్టుకుంటే పుట్టగతులు ఉండవని బాధితులను బెదిరించారు. దీంతో బాగేపల్లి పోలీసులు నిమ్మల అంబరీష్, నిమ్మల శిరీష్, పాపన్న, నరేష్, లక్ష్మీపతి, మునికుమార్, శ్రీకృష్ణపై 149, 143, 147, 323, 324, 504, 427, 506 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. -
కళ్లతో కాదు... దిమాక్‌తో!
‘కళ్ళున్నోడు ముందు మాత్రమే చూస్తాడు. దిమాక్ ఉన్నోడు దునియా మొత్తం చూస్తాడు’ – ‘దూకుడు’లో మహేశ్‌బాబు చెప్పిన డైలాగ్ ఇది. ఆ సినిమాలో మహేశ్ ఏదైతే చెప్పారో ఇప్పుడు రవితేజ అలానే చేస్తున్నారు. విచిత్రంగా ఉంది కదూ! మరేం లేదు. ప్రస్తుతం నటిస్తున్న ‘రాజా.. ది గ్రేట్’లో మాస్ మహారాజా రవితేజకు కళ్లు కనిపించవు. కానీ, దునియా మొత్తం అతనికి కనిపిస్తుందట. ఎలాగంటే... మాస్‌రాజా కళ్లతో కాదు, దిమాక్‌తో దునియా చూస్తాడు. రవితేజ హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో శిరీష్ నిర్మిస్తున్న చిత్రం ఇది. ఇందులో రవితేజ అంధుడిగా నటిస్తున్నారు. ఇదేదో ఆర్ట్ ఫిల్మ్‌లా ఉండదని చిత్రబృందం అంటోంది. అలీ, రఘుబాబు, శ్రీనివాసరెడ్డి, ‘అదుర్స్’ రఘు తదితర కమెడియన్స్ ఉన్నారీ సిన్మాలో. ‘కృష్ణగాడి వీరప్రేమగాథ’ ఫేమ్ మెహరీన్ హీరోయిన్. సరికొత్త కథతో పక్కా కమర్షియల్ పద్ధతిలో సిన్మాను తెరకెక్కిస్తున్నారట. ఆర్టిస్టులు, జోకులు... షూటింగ్ స్పాట్ యమా సందడిగా ఉంటోందట. ప్రస్తుతం డార్జిలింగ్‌లో షూటింగ్ జరుగుతోంది. -
గొలుసు దొంగల కథతో...
ప్రస్తుతం సిటీల్లో జరుగుతున్న గొలుసు దొంగతనాల నేపథ్యంలో తెరకెక్కిన చిత్రం ‘మెట్రో’. శిరీష్, బాబీ సింహా, సేంద్రన్, నిషాంత్ ముఖ్య పాత్రల్లో ఆనంద కృష్ణన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం తమిళంలో హిట్ అయింది. ఈ చిత్రాన్ని సురేశ్ కొండేటి సమర్పణలో ఆర్ 4 ఎంటర్టైన్మెంట్ పతాకంపై రజని రామ్ తాళ్లూరి ‘మెట్రో’ పేరుతో మార్చి 3న తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు. ఈ చిత్రం ట్రైలర్‌ను హీరో శర్వానంద్ రిలీజ్ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ– ‘‘తమిళంలో ఘనవిజయం సాధించిన ఈ చిత్రం తెలుగులోనూ హిట్ అవ్వాలి. యూనిట్‌కు మంచి పేరు, డబ్బులు తీసుకురావాలి’’ అన్నారు. సురేశ్ కొండేటి మాట్లాడుతూ– ‘‘హైదరాబాద్, విశాఖపట్నం వంటి మెట్రో నగరాల్లో గొలుసు దొంగతనాల వార్తలు వింటూనే ఉన్నాం. స్నాచర్లు గొలుసులు తెంచుకుపోవడం ఒక్కోసారి మహిళల ప్రాణాల మీదకు తెస్తోంది. ఇటువంటి వాస్తవ సంఘటనలను దర్శకుడు తెరపై చక్కగా ఆవిష్కరించారు. యువ గాయని గీతామాధురి మా చిత్రంలో నటిస్తుండటం విశేషం. ఏ.ఆర్. మురుగదాస్, గౌతమ్ మీనన్ వంటి ప్రముఖ దర్శకుల ప్రశంసలు పొందిన ఈ చిత్రం, తెలుగులోనూ హిట్ అవుతుందనే ధీమాతో ఉన్నాం’’ అన్నారు. -
కథానాయకి మారింది
చిత్ర షూటింగ్ ప్రారంభమై, కొన్ని రోజులు చిత్రీకరణ జరుపుకున్న తరువాత కూడా హీరోయిన్లు మారిన సందర్భాలు చాలా ఉన్నాయి. అందుకు కారణాలు చాలానే ఉంటాయి. తాజాగా రాజా రంగుస్కీ చిత్ర విషయంలోనూ అదే జరిగింది. ఇంతకు ముందు బర్మా, జాక్సన్ దురై చిత్రాలను తెరకెక్కించిన దర్శకుడు ధరణీధరన్ తాజాగా దర్శకత్వం వహిస్తున్న చిత్రం రాజా రంగుస్కీ. ఇందులో మెట్రో చిత్రం ఫేమ్ శిరీష్ కథానాయకుడిగా నటిస్తున్నారు. నాయకిగా ఇరైవి చిత్రం ఫేమ్ పూజా దేవరియాను ఎంపిక చేశారు. చిత్రం ప్రారంభమైంది. ఇలాంటి సమయంలో చిత్ర హీరోయిన్ మారింది. పూజా దేవరియాకు బదులు నటి చాందిని తమిళరసన్ వచ్చి చేరింది. కారణాన్ని దర్శకుడు తెలుపుతూ ‘పూజా దవరియా మంచి నటి. రాజా రంగుస్కీ చిత్రంలోని నాయకి పాత్రకు తను కరెక్ట్‌గా నప్పారు కూడా. అయితే తను అనూహ్యంగా అనారోగ్యానికి గురవ్వడంతో వైద్యుల సూచనల మేరకు విశ్రాంతి అవసమైంది. తాము రెండు నెలల్లో చిత్ర షూటింగ్‌ను పూర్తి చేయాల్సిన పరిస్థితి. అందువల్ల ఆమెను చిత్రం నుంచి తప్పించాల్సిన పరిస్థితి అని వివరించారు. చాలా తక్కువ సమయంలో నటి చాందిని తమిళరసన్ ను హీరోయిన్ Sగా ఎంపిక చేశామని, తను చాలా చక్కని నటనను ప్రదర్శిస్తున్నారని దర్శకుడు ధరణీధరన్ తెలిపారు. ఇప్పుడు అనుకున్న విధంగా రాజా రంగుస్కీ చిత్రాన్ని రెండు నెలల్లో పూర్తి చేస్తామని ఆయన చెప్పారు. -
మల్లూ శిరీష్ అనిపించుకుంటాడా?
అల్లు అర్జున్‌కి మలయాళంలో మంచి క్రేజ్ ఉంది. అక్కడివాళ్లు ‘మల్లూ అర్జున్’ అని పిల్చుకుంటారు. ఇప్పుడు బన్నీ తమ్ముడు అల్లు శిరీష్ మలయాళ ప్రేక్షకులకు పరిచయం కానున్నారు. అయితే అన్నయ్యలా అనువాద చిత్రాల ద్వారా కాదు.. స్ట్రైట్ సినిమాతో. మలయాళ సూపర్ స్టార్ మోహన్‌లాల్, శిరీష్ కాంబినేషన్లో ‘1971 బియాండ్ బోర్డర్స్’ టైటిల్‌తో ఓ చిత్రం రూపొందనుంది. ఇందులో మోహన్‌లాల్ హీరో కాగా, ట్యాంక్ కమాండర్‌గా శిరీష్ కీలక పాత్ర చేయనున్నారు. మేజర్ రవి దర్శకుడు. అల్లు శిరీష్ మాట్లాడుతూ - ‘‘మలయాళ తెరకు పరిచయం కావడానికి ఇది సరైన సబ్జెక్ట్. ఇందులో ట్యాంక్ కమాండర్‌గా ఫుల్ లెంగ్త్ సపోర్టింగ్ రోల్ చేస్తున్నా. పాకిస్తాన్‌కి వ్యతిరేకంగా సాగే చిత్రం కాదిది. ప్రతి భారతీయుడు గర్వపడేలా ఉంటుంది. మోహన్‌లాల్ వంటి స్టార్‌తో కలసి నటించే అవకాశం రావడం నా లక్. త్వరలో షూటింగ్ మొదలవుతుంది’’ అన్నారు. అల్లు అర్జున్‌ని ఆదరించి, ‘మల్లూ అర్జున్’ అని అభిమానంగా పిల్చుకుంటున్న మలయాళ ప్రేక్షకులతో శిరీష్ కూడా ‘మల్లూ శిరీష్’ అనిపించుకోగలుగుతాడా? వెయిట్ అండ్ సీ. -
ధరణీధరన్ దర్శకత్వంలో శిరీష్
మంచి సక్సెస్ఫుల్ దర్శక నటుల కాంబినేషన్లో ఒక చిత్రం తెరకెక్కనుందంటే కచ్చితంగా ఆ చిత్రంపై మంచి అంచనాలు నెలకొంటాయి. అలాంటి ఒక చిత్ర నిర్మాణానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ఇటీవల చిన్న చిత్రంగా రూపొంది మంచి విజయాన్ని అందుకున్న చిత్రం జాక్సన్‌దురై. ఈ చిత్రానికి దర్శకుడు ధరణీధర న్. ఈయన తాజా చిత్రానికి రెడీ అయ్యారు. అదే విధంగా ఇటీవల అనూహ్య విజయాన్ని సొంతం చేసుకున్న మరో చిత్రం మెట్రో. ఇందులో కథానాయకుడు శిరీష్. ఈయన తాజా చిత్రాన్ని ధరణీధరన్ దర్శకత్వంలో నటించనున్నారు. ఈ యూత్ కాంబినేషన్‌కు క్రేజీ సంగీత దర్శకుడు తోడైతే ఆ చిత్రానికి వ్యాపార వర్గాల్లోనూ అంచనాలు నెలకొంటాయి. ఎస్ఈ వినూత్న కథా చిత్రానికి యువన్ శంకర్‌రాజా సంగీత బాణీలను అందించనున్నారు. దర్శకుడు కథ చెప్పగానే మరోమాట లేకుండా తానీ చిత్రాన్ని చేస్తున్నానని యువన్ అన్నారని చిత్ర నిర్మాతలు తెలిపారు. అన్నట్లు ఈ చిత్రాన్ని నిర్మాత శక్తి వాసన్ బర్మా టాకీస్ సంస్థతో కలిసి నిర్మించనున్నారు. చిత్ర రికార్డింగ్ కార్యక్రమాలు నవంబర్ నెలలో ప్రారంభం కానున్నాయని షూటింగ్‌ను నవంబర్ చివరి వారంలో గానీ, డిసెంబర్ తొలివారంలో గానీ ప్రారంభించనున్నట్లు నిర్మాతల వర్గం తెలిపారు. -
అల్లు శిరీష్‌కు ప్రేమతో.. నాన్న కానుక
హైదరాబాద్: ప్రముఖ నిర్మాత, గీతా ఆర్ట్స్ అధినేత అల్లు అరవింద్ తన కుమారుడు అల్లు శిరీష్ కు ఖరీదైన బహుమతిని అందించారు. దసరా పండుగను పురస్కరించుకుని శిరీష్ కు ఆడి క్యూ7 కారును కానుకగా ఇచ్చారు. ఇటీవల శిరీష్ నటించిన శ్రీరస్తు శుభమస్తు సినిమా ఘన విజయం సాధించిన సందర్భంగా ఈ గిప్ట్ ఇచ్చారు. ఆడి క్యూ7 కారంటే తనకెంతో ఇష్టమని కారు ఈ సందర్భంగా నాన్నకి థ్యాంక్సు చెప్పారు. అన్నయ్య అల్లు అర్జున్ సమక్షంలో కీని తీసుకుంటున్న ఫొటోను శిరీష్ ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. -
చిట్‌ఫండ్ వ్యాపారం కూడా చేశారట!
సినిమా అంటే ప్యాషన్... ఫ్యాషన్ కాదు! అని ఉతికి ఆరేసిన డైలాగులు వినీవినీ చెవులు కాయలు కాశాయి. సినిమా అంటే లక్... గట్స్ కాదు! అన్న స్పీచ్‌లు అరిగిపోయిన గ్రామఫోన్ రికార్డులా వినీవినీ చెవుల తుప్పు వదిలింది. రాశి బాగుంటేనే రాసులు రాలతాయని ఇప్పటిదాకా ఉన్న నమ్మకం! సినిమాకు అసలు ఏం ఉండాలి? ‘రాశిలహరి’ ఉండాలి అని ఇండస్ట్రీ అంతా కోడై కూస్తోంది. రాజు, శిరీష్, లక్ష్మణ్, హర్షిత్‌ల కొత్త తరంగమే ఈ రాశిలహరి! ధైర్యం, సాహసం, తెగువే కాదు... నమ్మకం, పాజిటివ్ థింకింగ్, స్థితప్రజ్ఞత ఈ టీమ్ బలం! సాక్షితో మనసు విప్పి మాట్లాడారు... నిన్నటి జర్నీ గురించి, నేటి ఎచీవ్‌మెంట్స్ గురించి, రేపటి గోల్స్ గురించి! ఎంజాయ్!! పన్నెండేళ్ళుగా ఫిల్మ్స్ తీస్తున్న మీ దోస్తీ మొదలైందెలా? ‘దిల్’ రాజు: ముగ్గురన్నదమ్ముల్లో మూడోవాణ్ణి. మా పెద్దన్నయ్య నరసింహారెడ్డి ఫ్రెండ్ - లక్ష్మణ్. ఇక, శిరీష్ మా సొంత పెదనాన్న కొడుకు. మేము ముగ్గురం బాల్య స్నేహితులం. ఊళ్ళో 16ఎం.ఎం సినిమాలేసేవాళ్ళం. అప్పటికి, సినిమాల్లోకి వద్దామనే ఆలోచన కూడా ఉండేది కాదు. ఈ రంగంలోకి వచ్చిన ఆ తొలి రోజులు గుర్తున్నాయా? రాజు: సికింద్రాబాద్ ఆర్.పి. రోడ్లో మాకు ఆటోమొబైల్ పార్ట్స్ షాపుండేది. ఆ వీధంతా ఫిల్మ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫీసులే. వాళ్ళు ఫోన్ కోసం మా షాపుకొస్త్తుండేవాళ్ళు. ఆ సినీ వాతావరణం మమ్మల్ని మలిచింది. ఆ టైమ్‌లోనే మా బంధువు మహేందర్‌రెడ్డి అనే డిస్ట్రిబ్యూటర్ ఉన్నారు. 1995లో ఆయన మరో కొత్త డిస్ట్రిబ్యూషన్ ఆఫీస్ పెడుతుంటే, ఏడుగురం భాగస్వాములుగా చేరాం. ‘పుట్టినిల్లా మెట్టినిల్లా’తో మా సినీ జర్నీ మొదలైంది. తరువాత విడిగా మరో డిస్ట్రిబ్యూషన్ పెట్టాం. ‘దిల్’తో నిర్మాతలయ్యాం. అంతకు ముందు చిట్‌ఫండ్ వ్యాపారం కూడా చేశారట! రాజు: అవును. అది 1992 - 1995 మధ్య! ‘శ్రీవాస చిట్‌ఫండ్ గ్రూప్’ నడిపాం. డిస్ట్రిబ్యూషన్ మొదలెట్టినప్పుడు 1995 - 96 మధ్య ఎన్ని ఫెయిల్యూర్సొచ్చాయో! అయితే, కష్టసుఖాల్లో వీళ్ళిద్దరూ (శిరీష్, లక్ష్మణ్‌లను చూపిస్తూ) నా వెంటే ఉన్నారు. మాటకు నిలబడుతూ చాలా కష్టపడ్డాం. లక్ష్మణ్: లాసొచ్చినా చెప్పిన డబ్బులిచ్చేసేవాళ్ళం. కెరీర్ తొలి రోజుల్లో సినిమా ఫ్లాపైనా, నిర్మాత ‘కాస్ట్యూమ్స్’ కృష్ణకు ఒప్పుకున్న డబ్బులు వెతికి మరీ ఇచ్చారట! రాజు: (నవ్వేస్తూ...) అవును. ఒక కన్నడ సూపర్‌హిట్‌ను ‘అరుంధతి’ పేరు మీద ‘కాస్ట్యూమ్స్’ కృష్ణ గారు రీమేక్ చేసినప్పుడు అది కొన్నాం. 36 లక్షలిస్తామన్నాం. కానీ, రూ. 34 లక్షలే కట్టగలిగాం. సినిమా ఫ్లాపైన నాలుగో రోజున మిగిలిన 2 లక్షలు ఆయనను వెతుక్కుంటూ వెళ్ళి మరీ ఇస్తే, మా కమిట్మెంట్కు ఆశ్చర్యపోయారు. తర్వాత తీసిన ‘పెళ్ళి పందిరి’కి అందరూ రెట్టింపు ఆఫర్ చేసినా, మాకే ఇచ్చారు. నిజాయతీగా ఉంటే మంచే జరుగుతుంది. మొదట్లో సుధాకరరెడ్డి, కరుణాకరరెడ్డి, గిరి - ఇలా చాలామంది మీ పార్ట్నర్స్. వాళ్ళెవరూ ఇప్పుడు మీతో లేరేం? లక్ష్మణ్, శిరీష్: ‘ఎవరు వచ్చినా, వెళ్ళిపోయినా మనం విడిపోవడం జరగదు. కలిసే ఉంటాం’ అని రాజు ముందే హామీ ఇచ్చాడు. అప్పుడే పార్టనర్సని చేర్చుకున్నాం. చాలామంది వెళ్ళిపోయినా, మేము మటుకు కలిసే ఉన్నాం. మీరంతా ఒకేచోట నుంచి రావడంతో అది సాధ్యమైందా? రాజు: అదేమీ లేదు. ఏడుగురం కలసి ట్రావెల్ చేశాం. ఇందులో లక్ష్మణ్గారిది కరీమ్నగర్, భిక్షం గారిది నల్గొండ, మాది నిజామాబాద్. ఇలా ఒక్కొక్కరిది ఒక్కోచోటు. లక్ష్మణ్: కాకపోతే, మేము ముగ్గురం పాజిటివ్. చేసిన తప్పుల్ని విశ్లేషించుకొంటాం. ఒప్పులే మాట్లాడుకుంటాం. శిరీష్: సొంత పని ఉన్న రోజు మినహా కలిసే ఉంటాం. రాజు: కుటుంబ సభ్యులూ కలసి మెలిసి ఉంటారు. ఏటా మా మూడు ఫ్యామిలీలూ కలిసి ట్రిప్‌కు వెళతాం. కానీ బిజినెస్‌లో పొరపొచ్చాలు రావడం కామన్ కదా... శిరీష్: చేస్తున్నది స్నేహమనే తప్ప, బిజినెస్ అనుకోం. లక్ష్మణ్: ఓపెన్‌గా మాట్లాడుకుంటాం. డబ్బు దగ్గరే ఒకరిపైఒకరికి అనుమానాలొస్తాయి. మా మధ్య అవి లేవు. అంటే మీ మధ్య అసలెప్పుడూ భేదాభిప్రాయాలే లేవా? రాజు: ఎవరితోనైనా నేను నిదానంగా డీల్ చేస్తా. శిరీష్ కొద్దిగా ఫాస్ట్‌గా డీల్ చేస్తాడు. లక్ష్మణ్ కూడా ఫాస్టే. మా మధ్యా చిన్న గ్యాప్స్ వస్తాయి. ఏ ఇద్దరి మధ్య గ్యాప్ వచ్చినా, మూడోవాళ్ళు సర్దుబాటు చేస్తారు. మీకు లేకున్నా చుట్టుపక్కలవాళ్ళు, ఇంట్లో ఆడవాళ్ళు...! రాజు: ప్రెస్‌లో నా పేరే వినపడుతుంటుంది. ‘మీ ముగ్గురిలో రాజుకే పేరొస్తోంద’ని ఎక్కిస్తారు. కామెంట్స్ చేస్తారు. మేమవి పట్టించుకోం. నవ్వేసుకుంటాం. ఇంట్లో ఆడవాళ్ళంటారా! మా ఆఫీసు, సినీ వ్యవహారాలను ఇళ్ళకు తీసుకెళ్ళం. వాళ్ళతో చెప్పం. పిల్లలు పెద్దవుతున్నారు కనక, అవగాహన కోసం ఇప్పుడిప్పుడే కొద్దిగా చెబుతున్నాం. మీ మధ్య పని విభజన ఎలా? శిరీష్: క్రియేటివ్సైడ్ రాజు చూస్తాడు. అకౌంట్స్, బిజినెస్ నా పని. ఫైనాన్స్, మిగతాది లక్ష్మణ్ చూస్తాడు. రాజు: ముందుగా కథ వింటా. బావుందనుకుంటే, డెవలప్ చేసే పనిలో పడతా. స్క్రిప్ట్ డెవలప్ చేసిన తరువాత హీరోకు వినిపించే ముందు, శిరీష్, లక్ష్మణ్లిద్దరికీ వినిపిస్తా. అభిప్రాయాలు తెలుసుకుంటా. డిస్కస్ చేస్తా. హీరో ఓ.కే అన్నాక ప్రొడక్షన్లోకి వెళ్ళిపోతాం. మళ్ళీ ఎడిటింగ్ రూమ్‌లోనే వీళ్ళిద్దరూ సినిమా చూస్తారు. కథ విన్నప్పుడనుకున్నవి, వచ్చిందీ, లేనిదీ నిర్మొహమాటంగా చెప్పేస్తారు. అకౌంట్స్ శిరీష్ చూస్తే, ఫస్ట్‌కాపీ వచ్చాక సెటిల్మెంట్సంతా కూడా శిరీష్, లక్ష్మణ్‌ల పనే. లక్ష్మణ్: మా సినిమా అని మొహమాటం లేదు. డబుల్ పాజిటివ్ చూస్తున్నప్పుడు ఫ్లాప్ అని చాలాసార్లే చెప్పాం. శిరీష్: అప్పుడు దాన్నెలా బెటర్ చేయాలో చూస్తాం. రాజు: స్క్రిప్ట్ దశలో అనుకున్నట్లు అవుట్‌పుట్ లేదని ‘మిస్టర్ పర్ఫెక్ట్’కి 17 రోజులు రీషూట్ చేశాం. ‘కేరింత’ 30 డేస్ షూటయ్యాక మార్చి తీశాం. శిరీష్: సూపర్‌హిట్ అని నమ్మకంతో ఉన్నాం. తీరా రిలీజ్ డే ఓపెనింగ్స్ లేవు. అంతే అప్పటికప్పుడు కూర్చొని, సినిమాను నిలబెట్టడానికి ప్రమోషన్ మీద దృష్టి పెట్టాం. రాజు: మూడు వారాలదే పని. కొన్నిటికి ఏం చేసినా లాభం లేదని తెలిసిపోతుందిగా! రాజు: నిజమే. ‘రామయ్యా వస్తావయ్యా’ ఫ్లాపని మార్నింగ్ షోకే అర్థమైంది. అంచనా దాటి ఆడిన సినిమా? శిరీష్: ప్రభాస్ నటించిన ‘మున్నా’. అనుకున్నట్లు తెరకెక్కించడంలో విఫలమయ్యామని రిలీజ్‌కు ముందే అర్థమైంది. ప్రసాద్ ల్యాబ్స్ నాగినీడు సహా అంతా డిస్కస్ చేశాం. ఫెయిల్‌కి ప్రిపేరయ్యాం. రాజు: కానీ, చివరకు 9 కేంద్రాల్లో వందరోజులాడింది. ఎంతైనా, జనం పల్స్ తెలుసుకోవడం కష్టం కదా! రాజు: మొన్న రిలీజ్‌కు ముందే మా ఫ్యామిలీస్‌కు ‘సుబ్రహ్మణ్యం ఫర్ సేల్’ వేశా. అంతా మా వాళ్ళే! కానీ, ఒక పక్క నిల్చొని, ఆర్డినరీ ఆడియన్స్‌గా వాళ్ళ రియాక్షన్సేంటి, ఏ సీన్‌కు అనుకున్న రెస్పాన్స్ రాలేదు లాంటివి గమనించా. ఈ రంగంలో ఉండాలంటే అంత స్టడీ తప్పదు. కెరీర్లో నిర్మాతలుగా మీరు గర్వంగా ఫీలైన సినిమా? రాజు: మేము ముగ్గురం గర్వంగా ఫీలైన సినిమా కచ్చితంగా ‘బొమ్మరిల్లు’. తొలి చిత్రం ‘దిల్’తో హిట్ వచ్చింది. కొత్త తరహా ‘ఆర్య’తో పేరు - విజయం రెండూ దక్కాయి. తరువాత కష్టపడి చేసిన ‘భద్ర’తో హ్యాట్రిక్ వచ్చింది. వాటి తర్వాత నెక్స్ట్లెవల్కి తీసుకెళ్ళిన సినిమా ‘బొమ్మరిల్లు’. కథల్ని మీరు బాగా జడ్జ్ చేస్తారట. అదెలా అబ్బింది? రాజు: చిన్నప్పట్నుంచి సినిమాలు చూస్తూ ఉండడంతో తెలియకుండానే అది వచ్చింది. ఇక, వినయ్ (వి.వి. వినాయక్)తో కలసి ప్రయాణించినప్పుడు కథకు లైన్ అనుకోవడం, వన్‌లైన్ ఆర్డర్ రాయడం లాంటివి అలవాటయ్యాయి. ఆఫీసులో ఒక్కో రూమ్‌లో ఒక్కో టీమ్ కథలు చేస్తారట! రాజు: (నవ్వేస్తూ) స్క్రిప్ట్ కెక్కువ టైమ్ తీసుకుంటాం. స్క్రిప్టు పక్కాగా ఉండేందుకు కసరత్తులు తప్పవుగా! కొత్త దర్శకులను ఎక్కువ పరిచయం చేస్తుంటారు. కొత్తవాళ్ళయితే చెప్పుచేతల్లో ఉంటారనా? రాజు: రామానాయుడు గారి తర్వాత ఈ జనరేషన్లో అధిక సంఖ్యలో 8 మంది దర్శకుల్ని ఇంట్రడ్యూస్ చేసిన ఘనత మాదే. కొత్తవాళ్ళలో ప్రూవ్ చేసుకోవాలనే తపన, కసి ఉంటాయి. స్క్రిప్ట్ నచ్చేదాకా తీర్చిదిద్దే తీరిక, ఓపిక ఉంటాయి. పెద్ద దర్శకులకి అంత తీరిక ఉండకపోవచ్చు. అంతచేసినా, రొటీన్ కమర్షియల్ ఫిల్మ్స్ వస్తున్నాయిగా! రాజు: తప్పదు. ఒక పూర్తిస్థాయి కొత్త కథ అయితే, అది తీయడానికి రెండేళ్ళయినా వెయిట్ చేయవచ్చు. కానీ, ఒక చిన్న పాయింట్ మాత్రం కొత్తగా అనిపిస్తే, అట్టిపెట్టుకొని లేట్ చేసే కన్నా, వేడివేడిగా సినిమా తీసి వడ్డించడం బెస్ట్. నిర్మాతగా ఆర్థికంగా భారీ నష్టం తెచ్చిన పెద్ద తప్పు? రాజు: ‘తూనీగ తూనీగ’. మేము అది చేపట్టడం పెద్ద తప్పయింది. కెరీర్లో అత్యధిక నష్టం తెచ్చిన సినిమా అదే. ఎన్నో హిట్లిచ్చినా, రెండేళ్ళ క్రితం ఒకట్రెండు పెద్ద ఫ్లాపులతో ఆర్థికంగా తలకిందులయ్యారని వార్తలొచ్చాయి? రాజు: అది నిజం కాదు. 2009 -’10 టైమ్‌లో ‘రామ రామ కృష్ణ కృష్ణ’, మా కజిన్ కోసం తీసిన ‘మరో చరిత్ర’, అలాగే ‘జోష్’ - మూడూ దెబ్బతిన్నాయి. నిర్మాణం కన్నా డిస్ట్రిబ్యూషన్లో ఎక్కువసార్లు దెబ్బతిన్నాం. లక్ష్మణ్: సొసైటీలో మాత్రం మా పని అయిపోయిందనీ, రోడ్డు మీద పడ్డామనీ కామెంట్స్ వచ్చాయి. రాజు: కానీ, దేవుడి దయ వల్ల ‘ఆర్య’ దగ్గర నుంచి ఇవాళ్టి వరకు ఫైనాన్షియల్ స్ట్రగుల్స్ ఎప్పుడూ లేవు. రాజులో మీకు కనిపించే పెద్ద ప్లస్ పాయింట్ ఏమిటి? లక్ష్మణ్, శిరీష్: నెగిటివ్‌గా ఏదీ మాట్లాడడు. రాజుకున్నంత సహనం లేకపోతే, ఇవాళింత ఎదిగేవాళ్ళం కాదు. రాజు గారూ! మీరెవరి నుంచి ఎక్కువ నేర్చుకున్నారు? రాజు: సెట్స్‌లో రామానాయుడు గారి లాంటి మునుపటి తరం నిర్మాతల పనితీరు, కమిట్మెంట్ అడిగి తెలుసుకొనేవాణ్ణి. ‘భద్ర’ సెట్స్‌లో మురళీమోహన్ గారిని అడిగి, చాలా తెలుసుకున్నా. ‘ఆర్య‘ సక్సెస్ తర్వాత అల్లు అరవింద్ గారితో ఎక్కువ ట్రావెల్ చేస్తున్నా. రాజు గారూ... మీరు ఒకసారి నటించినట్లున్నారు? రాజు: నటించలేదు. కొన్నేళ్ళ క్రితం డిస్ట్రిబ్యూటర్స్‌గా ఒక సినిమా కొన్నాం. అప్పుడా దర్శక, నిర్మాతలు క్యారెక్టర్ ఉంది. వేయమన్నారు. ఫోటోలతో ఫ్లెక్సీ పెట్టారు. వాళ్ళు ట్రాప్ చేస్తున్నారని సాయంత్రానికల్లా అర్థమైంది. ఇచ్చిన 3 లక్షల ఆరు వేలు వదిలేసి, సినిమా వద్దని నమస్కారం పెట్టేశా. వచ్చిన అనుభవం రేటు అదన్న మాట! (నవ్వులు...) {పొఫెషన్లో మీ విస్తరణ, నెక్స్ట్ జనరేషన్ ప్రవేశం? రాజు: (లోపలికొస్త్తున్న హర్షిత్‌ను చూపుతూ...) ఇదిగో వీళ్ళంతా మా నెక్స్ట్ జనరేషనే. మా అమ్మాయి మా కింద ఉన్న థియేటర్స్ చూస్తుంది. మా అన్న కొడుకు హర్షిత్ ప్రొడక్షన్ చూస్తాడు. ‘సుబ్రమణ్యం ఫర్ సేల్’కు ప్రొడక్షన్ డిజైనర్‌గా చేసింది వాడే! శిరీష్ వాళ్ళబ్బాయి, లక్ష్మణ్ వాళ్ళబ్బాయిలూ ఈ రంగంలోకి రావాలనుకుంటున్నారు. సెట్స్‌లో, బయట హర్షిత్‌కు ట్రైనింగిస్తున్నట్లున్నారు? రాజు: బయోటెక్ ఇంజనీరింగ్ చదివాడు. అమెరికాలో ఏడాదిన్నర సినిమా కోర్స్ చదివి, ప్రొడక్షన్ నేర్చుకొచ్చాడు. హర్షిత్! ఫిల్మ్‌స్టడీ వల్ల ఉపయోగం ఉందా? హర్షిత్: (బిడియపడుతూనే) కచ్చితంగా ఉంది. కానీ, హాలీవుడ్‌కీ, మనకీ తేడా ఉంది. అక్కడ స్క్రిప్ట్ ఫైనలయ్యాక, ఎగ్రిమెంటయ్యాక మార్చకూడదు. రాజు: మన దగ్గర రూల్సంటే కుదరదు. డేట్స్ అడ్జస్ట్ చేసుకోవాలి. ప్రాక్టికల్‌గా నేర్చుకుంటున్నాడు. వీళ్ళ జనరేషన్ ఫిల్మెపు్పుడు? ఫ్రెష్‌గా ఉంటుందేమో? రాజు: ఇండివిడ్యుయల్‌గా చిన్న సినిమా తీయమన్నాం. హర్షిత్ ఆ పనిలో ఉన్నాడు. ఈ ఏజ్‌లో మేము ట్రెండీ ఫిల్మ్స్ చేయాలంటే భయపడతాం. అదే హర్షిత్ ఏజ్ గ్రూప్ వాళ్ళయితే, యూత్‌ఫుల్ లవ్‌స్టోరీస్ బాగా డీల్ చేస్తారు. నిర్మాతలుగా మీ డ్రీమ్ ప్రాజెక్ట్? రాజు: ప్రత్యేకించి ఏమీ లేదు. మరిన్ని మంచి సినిమాలు తీయడమే! కానీ, మా లక్ష్మణ్‌కి ఒక కోరిక ఉంది. లక్ష్మణ్: (నవ్వేస్తూ) అందరూ గొప్పగా చెప్పుకొనేలా, ‘బాహుబలి‘ లాంటి గ్రాండియర్ ఫిల్మ్ తీయాలి. రాజు: అందరం 50 ఏళ్ళకు రీచ్ అవుతున్నాం. మహా అయితే మరో పదేళ్ళిందులో ఉంటాం. ఉన్నన్ని రోజులూ ఇలాగే అందరం కలిసి ఉండాలని మా కోరిక. - రెంటాల జయదేవ అంటే మీ మధ్య అసలెప్పుడూ భేదాభిప్రాయాలే లేవా? కానీ బిజినెస్‌లో పొరపొచ్చాలు రావడం కామన్ కదా... శిరీష్: చేస్తున్నది స్నేహమనే తప్ప, బిజినెస్ అనుకోం. లక్ష్మణ్: ఓపెన్‌గా మాట్లాడుకుంటాం. డబ్బు దగ్గరే ఒకరిపైఒకరికి అనుమానాలొస్తాయి. మా మధ్య అవి లేవు. రాజు: ఎవరితోనైనా నేను నిదానంగా డీల్ చేస్తా. శిరీష్ కొద్దిగా ఫాస్ట్‌గా డీల్ చేస్తాడు. లక్ష్మణ్ కూడా ఫాస్టే. మా మధ్యా చిన్న గ్యాప్స్ వస్తాయి. ఏ ఇద్దరి మధ్య గ్యాప్ వచ్చినా, మూడోవాళ్ళు సర్దుబాటు చేస్తారు. హర్షిత్! ఫిల్మ్‌స్టడీ వల్ల ఉపయోగం ఉందా? హర్షిత్: (బిడియపడుతూనే) కచ్చితంగా ఉంది. కానీ, హాలీవుడ్‌కీ, మనకీ తేడా ఉంది. అక్కడ స్క్రిప్ట్ ఫైనలయ్యాక, ఎగ్రిమెంటయ్యాక మార్చకూడదు. రాజు: మన దగ్గర రూల్సంటే కుదరదు. డేట్స్ అడ్జస్ట్ చేసుకోవాలి. ప్రాక్టికల్‌గా నేర్చుకుంటున్నాడు. రాజు గారూ... మీరు ఒకసారి నటించినట్లున్నారు? రాజు: నటించలేదు. కొన్నేళ్ళ క్రితం డిస్ట్రిబ్యూటర్స్‌గా ఒక సినిమా కొన్నాం. అప్పుడా దర్శక, నిర్మాతలు క్యారెక్టర్ ఉంది. వేయమన్నారు. ఫోటోలతో ఫ్లెక్సీ పెట్టారు. వాళ్ళు ట్రాప్ చేస్తున్నారని సాయంత్రానికల్లా అర్థమైంది. ఇచ్చిన 3 లక్షల ఆరు వేలు వదిలేసి, సినిమా వద్దని నమస్కారం పెట్టేశా. వచ్చిన అనుభవం రేటు అదన్న మాట! (నవ్వులు...) ఎన్నో హిట్లిచ్చినా, రెండేళ్ళ క్రితం ఒకట్రెండు పెద్ద ఫ్లాపులతో ఆర్థికంగా తలకిందులయ్యారని వార్తలొచ్చాయి? రాజు: అది నిజం కాదు. 2009 -’10 టైమ్‌లో ‘రామ రామ కృష్ణ కృష్ణ’, మా కజిన్ కోసం తీసిన ‘మరో చరిత్ర’, అలాగే ‘జోష్’ - మూడూ దెబ్బతిన్నాయి. నిర్మాణం కన్నా డిస్ట్రిబ్యూషన్లో ఎక్కువసార్లు దెబ్బతిన్నాం. లక్ష్మణ్: సొసైటీలో మాత్రం మా పని అయిపోయిందనీ, రోడ్డు మీద పడ్డామనీ కామెంట్స్ వచ్చాయి. రాజు: కానీ, దేవుడి దయ వల్ల ‘ఆర్య’ దగ్గర నుంచి ఇవాళ్టి వరకు ఫైనాన్షియల్ స్ట్రగుల్స్ ఎప్పుడూ లేవు. -
జీవితం నేర్పిన పాఠం
అది కళాశాల ముగింపు రోజు. గడచిన జ్ఞాపకాలను నెమరేసుకుంటూ, బరువెక్కిన హృదయాలతో విద్యార్థులంతా ఒకరికొకరు వీడ్కోలు పలుకుతున్నారు. అలాంటి క్షణంలో ఆ అయిదుగురు మిత్రులు... ‘ఎవరిళ్లకు వాళ్లు వెళ్లే ముందు... ఒకరి ఇళ్లకు ఒకరం నాలుగు రోజులు అతిథులుగా వెళ్దాం’ అని నిశ్చయించుకున్నారు. ఆ నిర్ణయమే ఆ మిత్రుల జీవితాల్లో అనూహ్యమైన మార్పుకు కారణమైంది. పదహారేళ్ల చదువులో నేర్చుకోని పాఠాలను ఈ నాలుగు రోజుల ‘పాఠశాల’ ఆ అయిదుగురికీ నేర్పింది... సింపుల్‌గా ‘పాఠశాల’ చిత్రం కథాంశమిది. ‘విలేజ్‌లో వినాయకుడు, కుదిరితే కప్పు కాఫీ’ చిత్రాలను నిర్మించిన మూన్ వాటర్ పిక్చర్స్ పతాకంపై ఈ సినిమా రూపొందింది. రాజేశ్ మహంకాళి, పవన్‌కుమార్‌రెడ్డి నిర్మాతలు. మహి వి.రాఘవ్ దర్శకుడు. ‘‘వినోదం, వైవిథ్యం, సందేశాల మేళవింపే ఈ సినిమా. నిర్మాణం పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని జూలై చివరివారంలో కానీ, ఆగస్ట్ తొలివారంలో కానీ విడుదల చేస్తాం’’ అని నిర్మాతలు తెలిపారు. సాయి రోనక్, అనుప్రియ, నందు, శిరీష ప్రధాన పాత్రలు పోషించిన ఈ చిత్రానికి సంగీతం: రాహుల్‌రాజ్, కెమెరా: సుధీర్ సురేంద్రన్, కూర్పు: శ్రవణ్.కె. -
కొత్తవారి కేరింత
ఔత్సాహిక నటీనటులే ప్రధాన పాత్రధారులుగా సాయికిరణ్ అడవి దర్శకత్వంలో ‘దిల్’ రాజు, శిరీష్, లక్ష్మణ్ కలిసి నిర్మిస్తున్న చిత్రం ‘కేరింత’. ఈ చిత్రం సోమవారం హైదరాబాద్‌లో మొదలైంది. దేవుని పటాలపై చిత్రీకరించిన ముహూర్తపు దృశ్యానికి అల్లు అరవింద్ కెమెరా స్విచాన్ చేయగా, వి.వి.వినాయక్ క్లాప్ ఇచ్చారు. ఎం.శ్యామ్‌ప్రసాద్‌రెడ్డి గౌరవ దర్శకత్వం వహించారు. దిల్ రాజు మాట్లాడుతూ -‘‘మా సంస్థ నుంచి వస్తున్న 18వ చిత్రమిది. రెండేళ్ల పాటు స్క్రిప్ట్ వర్క్ చేశాం. కొత్తవాళ్లు ఇందులో ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. స్టార్ హంట్ నిర్వహించి మరీ ఎంపిక చేశాం. మా సంస్థలో వచ్చిన ఆర్య, బొమ్మరిల్లు, కొత్త బంగారులోకం చిత్రాల తరహాలో కొత్తదనం ఉండే సినిమా ఇది. ఈ నెల 23 నుంచి చిత్రీకరణ మొదలుపెడతాం. సెప్టెంబర్‌లో పాటలను, అక్టోబర్‌లో చిత్రాన్ని విడుదల చేస్తాం’’ అని తెలిపారు. ఈ చిత్రానికి మాటలు: అబ్బూరి రవి, సంగీతం: మిక్కీ జె.మేయర్, కెమెరా: విశ్వ. -
‘కొంత్త జంట’ మూవీ స్టిల్స్