
ఇటీవల స్టార్ హీరోలు తన పంథా మార్చుకున్నారు. గతంలో హీరోలు ప్రైవేట్ ఫంక్షన్స్‌లో పెద్దగా కనిపించేవారు కాదు. తమ స్థాయికి తగ్గ ఈవెంట్‌లకు మాత్రమే హజరయ్యే వారు. ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి. తారలు తమ పర్సనల్ టీంతో కూడా సన్నిహితంగా ఉంటున్నారు. అభిమానుల ఇళ్లలో ఫంక్షన్స్‌కూ వస్తున్నారు.
గీతా ఆర్ట్స్ లో బాయ్‌గా పని చేస్తున్న శిరీష్ పెళ్లి వేడుకలో బన్నీ సందడి చేశారు. చాలా ఏళ్ల క్రితమే గీతా ఆర్ట్స్‌లో జాయిన్ అయిన శిరీష్, మంచి డ్యాన్సర్, అందుకే బన్నీ కళ్లల్లో పడ్డాడు. శిరీష్ ఇంట్రస్ట్‌ను గుర్తించిన బన్నీ డ్యాన్స్ ఇన్సిస్టిట్యూట్‌లో చేర్పించాడు. ప్రస్తుతం శిరీష్ అసిస్టెంట్ కొరియోగ్రాఫర్‌గా పనిచేస్తున్నాడు.
ఇటీవల జరిగిన శిరీష్ పెళ్లి వేడుకకు బన్నీ హాజరయ్యారు. వధూవరులను ఆశీర్వదించి వారికి కుటుంబం సభ్యులతో కాసేపు సరదాగా మాట్లాడారు. అల్లు అర్జున్ లాంటి స్టార్ హీరో తమ ఇంట్లో పెళ్లి వేడుకకు హాజరు కావటం పట్ల ఇరుకుటుంబాల వారు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment