అల్లు శిరీష్కు ప్రేమతో.. నాన్న కానుక
హైదరాబాద్: ప్రముఖ నిర్మాత, గీతా ఆర్ట్స్ అధినేత అల్లు అరవింద్ తన కుమారుడు అల్లు శిరీష్ కు ఖరీదైన బహుమతిని అందించారు. దసరా పండుగను పురస్కరించుకుని శిరీష్ కు ఆడి క్యూ7 కారును కానుకగా ఇచ్చారు.
ఇటీవల శిరీష్ నటించిన శ్రీరస్తు శుభమస్తు సినిమా ఘన విజయం సాధించిన సందర్భంగా ఈ గిప్ట్ ఇచ్చారు. ఆడి క్యూ7 కారంటే తనకెంతో ఇష్టమని కారు ఈ సందర్భంగా నాన్నకి థ్యాంక్సు చెప్పారు. అన్నయ్య అల్లు అర్జున్ సమక్షంలో కీని తీసుకుంటున్న ఫొటోను శిరీష్ ట్విట్టర్ లో పోస్ట్ చేశారు.