Audi Q7 car
-
వచ్చే ఏడాదిపై ఆడి కంపెనీ ఆశలు
న్యూఢిల్లీ: వచ్చే ఏడాది అమ్మకాలు తిరిగి పుంజుకుంటాయని ఆశిస్తున్నట్లు లగ్జరీ కార్ల తయారీ సంస్థ ఆడి ఇండియా తెలిపింది. సరఫరా అంతరాయాలతో ప్రస్తుత సంవత్సరంలో కంపెనీ పనితీరుకు ఆటంకం కలిగింది. 2024 మొదటి రెండు త్రైమాసికాల్లో ఎదుర్కొన్న సరఫరా సవాళ్ల నుండి కోలుకుని వచ్చే సంవత్సరంలో అమ్మకాలు 8–10 శాతం పెరుగుతాయని ఆడి అంచనా వేస్తోంది.‘భారత్‌లో 2024లో లగ్జరీ కార్ల పరిశ్రమ వృద్ధి 8–10 శాతం శ్రేణిలో ఉంటుందని అంచనా వేస్తున్నాం. కంపెనీ సైతం ఇదే విధమైన వృద్ధిని ఆశిస్తోంది’ అని ఆడి ఇండియా హెడ్ బల్బీర్ సింగ్ ధిల్లాన్ వెల్లడించారు. గత మూడేళ్లలో భారీ వృద్ధిని కనబరిచిన తర్వాత పరిశ్రమ విక్రయాల వృద్ధి క్షీణించిందని పేర్కొన్నారు. ఈ సంవత్సరం జనవరి–సెప్టెంబర్‌లో పరిశ్రమ వృద్ధి దాదాపు 5 శాతంగా ఉంది. గత మూడేళ్లలో 30 శాతం వార్షిక వృద్ధిని సాధించిందని తెలిపారు. అత్యధిక వార్షిక విక్రయాలు.. లగ్జరీ కార్ల పరిశ్రమ ఈ సంవత్సరం ఎన్నడూ లేనంత అత్యధిక వార్షిక విక్రయాలు 50,000 యూనిట్ల మార్కును దాటుతుందని విశ్వసిస్తున్నామని బల్బీర్ సింగ్ ధిల్లాన్ అన్నారు. మొదటి రెండు త్రైమాసికాల్లో కార్ల సరఫరా తగినంతగా లేనందున 2024 ఆడి ఇండియాకు కఠిన సంవత్సరంగా మారిందని పేర్కొన్నారు. కాబట్టి ఈ ఏడాది ఎదగలేమని, వచ్చే సంవత్సరం బలంగా తిరిగి పుంజుకుంటామని వివరించారు.కాగా, ఎస్యూవీ క్యూ7 కొత్త వెర్షన్‌ను సంస్థ పరిచయం చేసింది. కంపెనీ ఇప్పటి వరకు భారత్‌లో 10,000 యూనిట్లకు పైగా క్యూ7 మోడల్ కార్లను విక్రయించింది. ఈ ఫ్లాగ్షిప్ మోడల్‌ను కలిగి ఉండాలనే కస్టమర్ల నిరంతర కోరిక ఇందుకు నిదర్శనమని ధిల్లాన్ పేర్కొన్నారు. క్యూ7 రెండు వేరియంట్లలో లభిస్తుంది. ధర ఎక్స్‌షోరూంలో రూ.88.66 లక్షల నుంచి ప్రారంభం. -
రూ.95 లక్షల ఖరీదైన కారు కొన్న నటుడు
హిందీ బిగ్‌బాస్ కంటెస్టెంట్, బుల్లితెర నటుడు రాకేశ్ బాపత్ కొత్త కారు కొన్నాడు. ఈ వాలంటైన్స్ వీక్‌లో లగ్జరీ కారును తనకు తానే బహుమతిగా ఇచ్చుకుని మురిసిపోతున్నాడు. తన కొత్త ఆడి క్యూ7 కారును చూపిస్తూ ఓ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశాడు రాకేశ్. ఈ లగ్జరీ కారు ఆడి క్యూ7 భారత్‌లో ఇటీవలే లాంచ్ అయింది. ఈ కారు ధర సుమారు దాదాపు 95 లక్షల రూపాయలని తెలుస్తోంది. ఇంత ఖరీదైన కారును సొంతం చేసుకున్న నటుడికి అభిమానులు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. కాగా హిందీ బిగ్‌బాస్ ఓటీటీలో పాల్గొన్న రాకేశ్ మూడో రన్నరప్‌గా నిలిచాడు. ఈ షోలో అతడు శిల్పాశెట్టి సోదరి షమితా శెట్టితో లవ్ ట్రాక్ నడిపినట్లు వార్తలు వచ్చాయి. ఇప్పటికీ వారిద్దరూ తరచూ బయట కనిపిస్తుండటంతో వాళ్ల మధ్య ప్రేమ నిజమే అంటున్నారు. ఇదిలా ఉంటే రాకేశ్ 'తుమ్ బిన్', 'కోయి మేరే దిల్ మే హై', 'సవిత దామోదర్ పరంజపే' వంటి పలు సినిమాల్లో నటించాడు. అలాగే 'సలోని కా సఫర్', 'మర్యాద', 'ఖుబూల్ హై' వంటి పలు సీరియళ్లలో కనిపించాడు. -
అల్లు శిరీష్‌కు ప్రేమతో.. నాన్న కానుక
హైదరాబాద్: ప్రముఖ నిర్మాత, గీతా ఆర్ట్స్ అధినేత అల్లు అరవింద్ తన కుమారుడు అల్లు శిరీష్ కు ఖరీదైన బహుమతిని అందించారు. దసరా పండుగను పురస్కరించుకుని శిరీష్ కు ఆడి క్యూ7 కారును కానుకగా ఇచ్చారు. ఇటీవల శిరీష్ నటించిన శ్రీరస్తు శుభమస్తు సినిమా ఘన విజయం సాధించిన సందర్భంగా ఈ గిప్ట్ ఇచ్చారు. ఆడి క్యూ7 కారంటే తనకెంతో ఇష్టమని కారు ఈ సందర్భంగా నాన్నకి థ్యాంక్సు చెప్పారు. అన్నయ్య అల్లు అర్జున్ సమక్షంలో కీని తీసుకుంటున్న ఫొటోను శిరీష్ ట్విట్టర్ లో పోస్ట్ చేశారు.