హిందీ బిగ్‌బాస్ కంటెస్టెంట్, బుల్లితెర నటుడు రాకేశ్ బాపత్ కొత్త కారు కొన్నాడు. ఈ వాలంటైన్స్ వీక్‌లో లగ్జరీ కారును తనకు తానే బహుమతిగా ఇచ్చుకుని మురిసిపోతున్నాడు. తన కొత్త ఆడి క్యూ7 కారును చూపిస్తూ ఓ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశాడు రాకేశ్. ఈ లగ్జరీ కారు ఆడి క్యూ7 భారత్‌లో ఇటీవలే లాంచ్ అయింది. ఈ కారు ధర సుమారు దాదాపు 95 లక్షల రూపాయలని తెలుస్తోంది. ఇంత ఖరీదైన కారును సొంతం చేసుకున్న నటుడికి అభిమానులు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.
కాగా హిందీ బిగ్‌బాస్ ఓటీటీలో పాల్గొన్న రాకేశ్ మూడో రన్నరప్‌గా నిలిచాడు. ఈ షోలో అతడు శిల్పాశెట్టి సోదరి షమితా శెట్టితో లవ్ ట్రాక్ నడిపినట్లు వార్తలు వచ్చాయి. ఇప్పటికీ వారిద్దరూ తరచూ బయట కనిపిస్తుండటంతో వాళ్ల మధ్య ప్రేమ నిజమే అంటున్నారు. ఇదిలా ఉంటే రాకేశ్ 'తుమ్ బిన్', 'కోయి మేరే దిల్ మే హై', 'సవిత దామోదర్ పరంజపే' వంటి పలు సినిమాల్లో నటించాడు. అలాగే 'సలోని కా సఫర్', 'మర్యాద', 'ఖుబూల్ హై' వంటి పలు సీరియళ్లలో కనిపించాడు.
Comments
Please login to add a commentAdd a comment