
సాక్షి, హైదరాబాద్ : సినీ నటుడు చిరంజీవి చిన్న కూతురు శ్రీజ మాజీ భర్త శిరీష్ భరద్వాజ్ తాజాగా రెండో పెళ్లి చేసుకున్నారు. హైదరాబాద్‌కు చెందిన డాక్టర్ విహనను ఆయన వివాహం చేసుకున్నారు. 2007లో శ్రీజను శిరీష్ భరద్వాజ్ ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. పెద్దలకు తెలియకుండా జరిగిన ఈ వివాహం అప్పట్లో సంచలనం రేపింది. అనంతరం వీరిద్దరి మధ్య కొన్ని విభేదాలు వచ్చాయి. అదనపు కట్నం కోసం శిరీష్ తనను మానసికంగా, శారీరకంగా వేధిస్తున్నాడని శ్రీజ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఈ క్రమంలోనే వేరుగా ఉంటున్న ఇద్దరు 2014లో చట్టబద్ధంగా విడాకులు తీసుకున్నారు. అనంతరం ప్రముఖ వ్యాపారవేత్త తనయుడైన కళ్యాణ్‌ను శ్రీజ 2016 మార్చి 28న పెళ్ళి చేసుకున్నారు. శిరీష్ - శ్రీజ జంటకు ఒక పాప ఉండగా, వారిరువురు విడిపోయిన తర్వాత పాప శ్రీజ దగ్గరే ఉంటోంది. రాజకీయాల్లోకి అడుగుపెట్టి బీజేపీలో చేరిన శిరీష్ తాజాగా రెండో పెళ్లి చేసుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment