ఐపీఎస్‌ ఆఫీసర్‌ | Sai Ronak to play the role of a powerful cop in Odela Railway Station | Sakshi
Sakshi News home page

ఐపీఎస్‌ ఆఫీసర్‌

Published Mon, Nov 30 2020 6:26 AM | Last Updated on Mon, Nov 30 2020 6:26 AM

Sai Ronak to play the role of a powerful cop in Odela Railway Station - Sakshi

వశిష్టసింహ, హెబ్బా పటేల్, సాయిరోనక్, పూజితా పొన్నాడ ముఖ్య పాత్రల్లో తెరకెక్కిన చిత్రం ‘ఓదెల రైల్వేస్టేషన్‌’. డైరెక్టర్‌ సంపత్‌ నంది కథ, స్క్రీన్‌ప్లే, డైలాగ్స్‌ అందించిన ఈ చిత్రం ద్వారా అశోక్‌ తేజ దర్శకుడిగా పరిచయమవుతున్నారు. లక్ష్మీ రాధామోహన్‌ సమర్పణలో శ్రీ సత్యసాయి ఆర్ట్స్‌ పతాకంపై  కేకే రాధామోహన్‌ నిర్మించారు. ఈ చిత్రం నుండి ఇప్పటికే విడుదలైన వశిష్ట సింహ లుక్‌కి, హెబ్బా పటేల్‌ లుక్‌కి మంచి స్పందన వస్తోంది.

తాజాగా ఈ సినిమాలో పవర్‌ఫుల్‌ ఐపీఎస్‌ ఆఫీసర్‌ అనుదీప్‌ పాత్ర చేస్తున్న సాయిరోనక్‌ లుక్‌ని విడుదలచేశారు. ‘‘డిఫరెంట్‌ క్రైమ్‌ థ్రిల్లర్‌గా తెరకెక్కుతోన్న చిత్రమిది. సహజత్వానికి దగ్గరగా ఉంటుంది. ఈ సినిమా తప్పకుండా పెద్ద హిట్‌ అవుతుంది’’ అన్నారు. కేకే రాధామోహన్‌ మాట్లాడుతూ– ‘‘ఓదెల’ అనే గ్రామంలో జరిగిన సంఘటనల ఆధారంగా ఈ చిత్రం రూపొందుతోంది. షూటింగ్‌ పూర్తయింది. ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులు జరుగుతున్నాయి’’ అన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement