
సాయిరోనక్, నేహా సోలంకి జంటగా నటిస్తున్న చిత్రం ‘ఛలో ప్రేమిద్దాం’. సురేష్ రేపల్లే దర్శకుడు. హిమాలయ స్టూడియో మేన్సన్స్ పతాకంపై ఉదయ్ కిరణ్ నిర్మిస్తున్నారు.
ఇటీవల విడుదలైన ఈ చిత్రం ఫస్ట్ లుక్ అండ్ మోషన్ పోస్టర్ కి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. తాజాగా శుక్రవారం ఈ మూవీ నుంచి తొలిపాటను విలక్షణ నటుడు జగపతిబాబు విడుదల చేశారు. `ఎమ్‌బిఏ, ఎమ్‌సిఏలు చదవలేకపోతివి` అంటూ సాగే ఈ కాలేజ్ సాంగ్ కు దేవ్ పవార్ సాహిత్యాన్ని సమకూర్చగా భీమ్స్ సిసిరోలియో అద్భుత సంగీతాన్ని అందించారు. ఆదిత్య ద్వారా ఆడియో మార్కెట్ లోకి విడుదలైంది.
ఈ సందర్భంగా నిర్మాత ఉదయ్ కిరణ్ మాట్లాడుతూ...‘ ప్రస్తుతం మా సినిమాకు సంబంధించిన సెన్సార్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. త్వరలో సినిమాను గ్రాండ్ గా రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం` అన్నారు. ఈ కాలేజ్ సాంగ్ యూత్‌తో పాటు ప్రతి ఒక్కరికీ కనెక్ట్ అవుతుందన్నారు దర్శకుడు సురేశ్ శేఖర్. వరుసగా ఒక్కో సింగిల్ రిలీజ్ చేయడానికి ప్లాన్ చేశామని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment