పాప్‌కార్న్‌ సినిమా: ఆ తర్వాత ఏమైంది? | Actress Avika Gor New Movie Popcorn Motion Poster | Sakshi
Sakshi News home page

Pop CoRn: ఆ తర్వాత ఏమైంది?

Published Thu, Jul 1 2021 12:38 AM | Last Updated on Thu, Jul 1 2021 8:16 AM

Actress Avika Gor New Movie Popcorn Motion Poster - Sakshi

హీరోయిన్‌ అవిగా గోర్‌ నిర్మాతగా పరిచయమవుతున్న చిత్రం ‘పాప్‌ కార్న్‌’. సాయి రోనక్, అవికా గోర్‌ జంటగా యాడ్‌ ఫిల్మ్‌ మేకర్‌ మురళీ నాగ శ్రీనివాస్‌ గంధం దర్శకత్వంలో తెరకెక్కుతోంది. భోగేంద్రగుప్తా నిర్మిస్తున్న ఈ చిత్రానికి అవికా గోర్, ఎంఎస్‌ చలపతిరాజు సహనిర్మాతలు. బుధవారం (జూన్‌ 30) అవికా పుట్టినరోజు సందర్భంగా టైటిల్‌ ప్రకటించి, మోషన్‌ పోస్టర్‌ రిలీజ్‌  చేశారు. ‘‘సరికొత్త కథాకథనాలతో రూపొందుతున్న చిత్రమిది.

అవికా గోర్‌ నిర్మాణ భాగస్వామ్యంలో ఈ సినిమా చేస్తుండటం సంతోషంగా ఉంది’’ అన్నారు భోగేంద్రగుప్తా మడుపల్లి. ‘‘మెలోడ్రామా జానర్‌లో సాగే చిత్రమిది. ఒకరిపై మరొకరికి విపరీతమైన ద్వేషం గల ఓ అమ్మాయి, ఓ అబ్బాయి... తప్పించుకోవడానికి వీలు లేని పరిస్థితిలో చిక్కుకుంటారు. ఆ తర్వాత ఏమైంది అనేది చిత్రకథ’’ అన్నారు మురళీ నాగ శ్రీనివాస్‌ గంధం. ఈ చిత్రానికి సంగీతం: శ్రవణ్‌ భరద్వాజ్‌. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement