Avika ghor
-
పాప్‌కార్న్ సినిమా: ఆ తర్వాత ఏమైంది?
హీరోయిన్ అవిగా గోర్ నిర్మాతగా పరిచయమవుతున్న చిత్రం ‘పాప్ కార్న్’. సాయి రోనక్, అవికా గోర్ జంటగా యాడ్ ఫిల్మ్ మేకర్ మురళీ నాగ శ్రీనివాస్ గంధం దర్శకత్వంలో తెరకెక్కుతోంది. భోగేంద్రగుప్తా నిర్మిస్తున్న ఈ చిత్రానికి అవికా గోర్, ఎంఎస్ చలపతిరాజు సహనిర్మాతలు. బుధవారం (జూన్ 30) అవికా పుట్టినరోజు సందర్భంగా టైటిల్ ప్రకటించి, మోషన్ పోస్టర్ రిలీజ్ చేశారు. ‘‘సరికొత్త కథాకథనాలతో రూపొందుతున్న చిత్రమిది. అవికా గోర్ నిర్మాణ భాగస్వామ్యంలో ఈ సినిమా చేస్తుండటం సంతోషంగా ఉంది’’ అన్నారు భోగేంద్రగుప్తా మడుపల్లి. ‘‘మెలోడ్రామా జానర్లో సాగే చిత్రమిది. ఒకరిపై మరొకరికి విపరీతమైన ద్వేషం గల ఓ అమ్మాయి, ఓ అబ్బాయి... తప్పించుకోవడానికి వీలు లేని పరిస్థితిలో చిక్కుకుంటారు. ఆ తర్వాత ఏమైంది అనేది చిత్రకథ’’ అన్నారు మురళీ నాగ శ్రీనివాస్ గంధం. ఈ చిత్రానికి సంగీతం: శ్రవణ్ భరద్వాజ్. View this post on Instagram A post shared by Avika Gor (@avikagor) -
అందుకే వారు గొప్ప నటులయ్యారు
‘‘దర్శకుడు మన నుంచి ఏం ఆశిస్తున్నాడో నటుడిగా దాన్ని అందించడానికి ప్రయత్నిస్తాను. నేనెప్పుడూ దర్శకుణ్ణి ఇబ్బంది పెట్టలేదు. ‘వీడు బాగా నవ్విస్తాడు, ఏడిపిస్తాడు’ అని ప్రేక్షకులు ఎవర్ని భావిస్తారో వారే గొప్ప నటుడు’’ అన్నారు నటుడు అలీ. ఓంకార్ దర్శకత్వంలో అశ్విన్ బాబు, అవికా గోర్ జంటగా తెరకెక్కిన ‘రాజుగారి గది 3’ చిత్రం ఈ నెల 18న విడుదలకానుంది. ఈ సినిమాలో కీలక పాత్ర చేసిన అలీ మాట్లాడుతూ– ‘‘నేను ఇప్పటి వరకూ చేసిన సినిమాలు ఒక ఎత్తు, ‘రాజుగారి గది 3’ ఒకఎత్తు. విభిన్నమైన భావోద్వేగాలున్న పాత్రను నాకు ఇచ్చారు ఓంకార్. డైరెక్టర్‌గా తనకు చాలా క్లారిటీ ఉంది. ఆర్టిస్టుల నుంచి ఏం కావాలో రాబట్టుకుంటారు. మొదటి రెండు భాగాలకంటే ఈ సినిమా చాలా బావుంటుంది. ఛోటా కె.నాయుడు విజువల్స్ ఈ సినిమాను నెక్ట్స్ లెవల్‌కు తీసుకెళ్లాయి. ఈ చిత్రంతో అశ్విన్ నటుడిగా మరో ఎత్తుకి ఎదుగుతాడు. సెకండ్ హాఫ్‌లో సాయిమాధవ్ బుర్రా గారి డైలాగ్స్‌కు థియేటర్లో నవ్వులే. ఈ సినిమా చూస్తూ ప్రేక్షకులు పొట్టచెక్కలయ్యేలా నవ్వుతారు. డీటీఎస్ మిక్సింగ్ చేసిన వ్యక్తి చూసిన ప్రతిసారీ నవ్వుతూనే ఉన్నారని నాకు తెలిసింది. దీన్ని బట్టి థియేటర్లో ప్రేక్షకుల పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకోండి. బ్రహ్మానందం, మల్లికార్జునరావు, ధర్మవరపు సుబ్రహ్మణ్యం, ఎంఎస్ నారాయణగార్లు నాకు నచ్చిన హాస్యనటులు. రైటర్‌గా కెరీర్ స్టార్ట్ చేసి కామెడీ యాక్టర్స్ అయ్యారు. కామెడీ ఎంత మోతాదులో ఉండాలో వాళ్లకు తెలుసు. అందుకే గొప్ప హాస్యనటులుగా పేరు తెచ్చుకున్నారు’’ అన్నారు. -
భయపెడుతూ నవ్వించే దెయ్యం
‘‘రాజుగారి గది’ రెండు భాగాలు మంచి సక్సెస్ అయ్యాయి. సెకండ్ పార్ట్‌లో కామెడీ మిస్ అయింది అన్నారు. అది దృష్టిలో ఉంచుకొని ‘రాజుగారి గది 3’ కథ రెడీ చేశా’’ అన్నారు దర్శకుడు ఓంకార్. ‘రాజుగారి గది’ సిరీస్ నుంచి వస్తున్న మూడో సినిమా ‘రాజుగారి గది 3’. అశ్విన్‌బాబు, అవికా గోర్ ముఖ్యపాత్రల్లో నటించారు. ఈ చిత్రం ట్రైలర్‌ను హీరో వెంకటేశ్ రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా ఓంకార్ మాట్లాడుతూ– ‘‘రెండు నెలల్లో సినిమా పూర్తి చేశాం. అందరూ సొంత సినిమాలా భావించి పని చేశారు. మా సినిమా వందశాతం ఎంటర్టైన్ చేస్తుంది’’ అన్నారు. ‘‘మూడేళ్ల తర్వాత నేను చేస్తున్న తెలుగు సినిమా ఇది. ఓంకార్‌గారు కథ చెప్పగానే థ్రిల్ అయ్యాను’’ అన్నారు అవికా గోర్. ‘‘ఓంకార్ అన్నయ్య నన్ను కొత్త కోణంలో చూపించాడు’’ అన్నారు అశ్విన్‌బాబు. ‘‘ఈ సినిమాలో దెయ్యం ఆహ్లాదంగా నవ్విస్తుంది. భయపెడుతూ నవ్విస్తుంది. ఓంకార్ చాలా క్లారిటీ ఉన్న దర్శకుడు’’ అన్నారు మాటల రచయిత బుర్రా సాయిమాధవ్. ‘‘భయపడుతూ, నవ్విస్తూ ఉండే సినిమా ఇది. ఆర్టిస్టులకు గౌరవం ఇచ్చి నటన రాబట్టుకుంటారు ఓంకార్’’ అన్నారు నటుడు బ్రహ్మాజీ. ‘‘చిన్నప్పుడు విఠాలాచారి సినిమాలు చూసేవాణ్ణి. ఇప్పుడు ఓంకార్ అలాంటి దర్శకుడు’’ అన్నారు నటుడు అలీ. -
నటనకు గుడ్‌బై.. అవికా గోర్ సంచలన ప్రకటన
చిన్నారి పెళ్లికూతురు ధారావాహికతో నటనలో దేశవ్యాప్తంగా ప్రశంసలు పొందిన టీవీ నటి అవికా గోర్ సంచలన ప్రకటన చేశారు. తాను నటన నుంచి వైదొలగాలనుకుంటున్నట్టు పేర్కొన్నారు. సినిమాలకు దర్శకత్వం వహించడంపై దృష్టి పెట్టాలని కోరుకుంటున్నట్టు తెలిపారు. ఆఫర్లు రాకపోవడంతో ''ససురాల్ సిమర్ కా'' నటి కొంత కాలం నటన నుంచి బ్రేక్ తీసుకున్నట్టు వార్తలు గుప్పుమన్నాయి. కానీ ఆఫర్లు రాకపోవడంతో కాదని, తాను సినిమాలను డైరెక్ట్ చేయబోతున్నట్టు క్లారిటీ ఇచ్చేశారు. '' నేను టీవీలోకి రావాలనుకోవడం లేదు. దీని వెనుక ఉన్న ప్రధాన కారణం. కథలు చెత్తగా ఉన్నాయని కాదు. నేను బ్రేక్ తీసుకోవడానికి ఒక కారణముంది. ఫిల్మ్‌మేకింగ్ స్టడీస్, మేకింగ్ ఫిల్మ్స్‌పై దృష్టిపెట్టాలనుకుంటున్నా. పండుగలకు ఇంటికి వెళ్లాలనుకుంటున్నా. అక్కడే నేను నటించాలా లేదా అన్నది తెలుసుకుంటా'' అని అవికా తెలిపారు. ''ఒకానొక సమయంలో నేను దర్శకత్వంలో పాలుపంచుకున్నా. అప్పుడు చెప్పా నటించాలనుకోవడం లేదు. నేను డైరెక్టర్'' అని అన్నారు. ప్రస్తుతం అవికా గోర్, "లాడో - వీర్పూర్ కి మర్దాని" షోలో న్యాయ విద్యార్థిగా నటిస్తున్నారు. -
షూటింగ్లో ప్రమాదం.. హీరోకు గాయాలు
సంగీత దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చి.. తరువాత హీరోగా మారిన తమిళ స్టార్ జివి ప్రకాష్ కుమార్ సినిమా షూటింగ్ సందర్భంగా ప్రమాదానికి గురయ్యారు. ఈ ప్రమాదంనుంచి తృటిలో తప్పించుకున్న ఆయన స్వల్పంగా గాయపడ్డారు. చిన్నపాటి గాయాలతో జీవీ బయటపడంతో చిత్ర యూనిట్ ఊపిరి పీల్చుకుంది. ప్రస్తుతం జీవీ ప్రకాష్ 'కడవుల్ ఇరుక్కన్ కుమార' అనే తమిళ సినిమాలో హీరోగా నటిస్తున్నారు. జీవీ ప్రకాష్, ఆర్జే బాలజీలపై పాండిచ్చేరిలో పోరాట సన్నివేశాలు చిత్రీకరిస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. తమిళ దర్శకుడు రాజేష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో నిక్కి గల్రానీ, అవికాగోర్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. జివి గత సినిమాల మాధిరిగానే ఈ సినిమాను కూడా రొమాంటిక్ కామెడీ జానర్లో తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే జివి ప్రకాష్ నటించిన 'నాకు ఇంకో పేరుంది' సినిమా టాలీవుడ్లో రిలీజ్‌కు రెడీగా ఉండగా, ఈ మూవీని కూడా తెలుగులో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. -
లక్ష్మీ రావే మా ఇంటికి మూవీ స్టిల్స్