
చిన్నారి పెళ్లికూతురు ధారావాహికతో నటనలో దేశవ్యాప్తంగా ప్రశంసలు పొందిన టీవీ నటి అవికా గోర్ సంచలన ప్రకటన చేశారు. తాను నటన నుంచి వైదొలగాలనుకుంటున్నట్టు పేర్కొన్నారు. సినిమాలకు దర్శకత్వం వహించడంపై దృష్టి పెట్టాలని కోరుకుంటున్నట్టు తెలిపారు. ఆఫర్లు రాకపోవడంతో ''ససురాల్ సిమర్ కా'' నటి కొంత కాలం నటన నుంచి బ్రేక్ తీసుకున్నట్టు వార్తలు గుప్పుమన్నాయి. కానీ ఆఫర్లు రాకపోవడంతో కాదని, తాను సినిమాలను డైరెక్ట్ చేయబోతున్నట్టు క్లారిటీ ఇచ్చేశారు.
'' నేను టీవీలోకి రావాలనుకోవడం లేదు. దీని వెనుక ఉన్న ప్రధాన కారణం. కథలు చెత్తగా ఉన్నాయని కాదు. నేను బ్రేక్ తీసుకోవడానికి ఒక కారణముంది. ఫిల్మ్‌మేకింగ్ స్టడీస్, మేకింగ్ ఫిల్మ్స్‌పై దృష్టిపెట్టాలనుకుంటున్నా. పండుగలకు ఇంటికి వెళ్లాలనుకుంటున్నా. అక్కడే నేను నటించాలా లేదా అన్నది తెలుసుకుంటా'' అని అవికా తెలిపారు. ''ఒకానొక సమయంలో నేను దర్శకత్వంలో పాలుపంచుకున్నా. అప్పుడు చెప్పా నటించాలనుకోవడం లేదు. నేను డైరెక్టర్'' అని అన్నారు. ప్రస్తుతం అవికా గోర్, "లాడో - వీర్పూర్ కి మర్దాని" షోలో న్యాయ విద్యార్థిగా నటిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment