కావ్య
సైకలాజికల్ ఎలిమెంట్స్ మిక్స్ అయిన న్యూ ఏజ్ లవ్ స్టోరీగా రూపొందిన చిత్రం‘మసక్కలి’. సాయిరోనక్, కావ్య, శిరీషలు ముఖ్య పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి నమిత్ సింగ్ నిర్మాత. నబి.యేనుగుబాల దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం వినాయక చవితి సందర్భంగా ఈ నెల 13న విడుదల కానుంది. ఈ సందర్భంగా నమిత్ సింగ్ మాట్లాడుతూ– ‘‘యూత్‌ను ఆకట్టుకునే పాయింట్‌తో పాటు ఓ కొత్త పాయింట్‌ను ఈ సినిమా ద్వారా చెప్పబోతున్నాం. సినిమా కథనం తప్పకుండా ఆకట్టుకుంటుంది. యూత్‌ఫుల్ లవ్‌లో కొత్త డైమన్షన్‌ను ఎఫెక్టివ్‌గా ప్రెజెంట్ చేశారు మా దర్శకుడు నబి’’ అన్నారు. దర్శకుడు నబి మాట్లాడుతూ– ‘‘మా ‘మసక్కలి’ అందమైన ప్రేమకథలా ఉంటూనే సైకలాజికల్ గేమ్‌లా ఉంటుంది. అందరికీ నచ్చుతుందని, కొత్త అనుభూతినిస్తుందనే గ్యారంటీ నాది’’ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment