Shireesha
-
కరీంనగర్ శిరీష: రూ. 50 లక్షల ‘ఇమ్మన’ ఫెలోషిప్! పోషకాహారంపై
గ్రామీణ–పట్టణ కుటుంబాల్లో పోషకాహార లేమి ఏ విధంగా ఉందో మూలాల నుంచి క్షుణ్ణంగా అధ్యయనం చేసిన కరీంనగర్ వాసి శిరీష జునుతులకు ఇన్నోవేటివ్ మెథడ్స్ అండ్ మెట్రిక్స్ ఫర్ అగ్రికల్చర్ అండ్ న్యూట్రిషన్ ఆక్షన్స్ (ఇమ్మన)నుంచి యాభై లక్షల రూపాయల ఫెలోషిప్ లభించింది. ప్రపంచవ్యాప్తంగా ఈ ఫెలోషిప్‌ను ఆరుగురు అందుకోగా వారిలో మన దేశం నుంచి శిరీష ఒక్కరే కావడం విశేషం. ఫెలోషిప్ వివరాలతో పాటు అగ్రికల్చర్, ఫుడ్ అండ్ న్యూట్రిషన్ విభాగాల్లో తను చేస్తున్న కృషి గురించి వివరించింది శిరీష. ‘‘ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం నుంచి ఫుడ్ అండ్ న్యూట్రిషన్లో పీహెచ్డీ చేశాను. మేనేజ్‌లో రెండేళ్లుగా వర్క్ చేస్తున్నాను. అర్బన్ ఫార్మింగ్, మైక్రో గ్రీన్స్, ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్‌లో ప్రాజెక్ట్ వర్క్ పూర్తిచేశాను. ఇప్పుడు ఈ ఫెలోషిప్ అగ్రికల్చర్, న్యూట్రిషన్, హెల్త్ ఈ మూడు విభాగాల్లో చేసిన ప్రాజెక్ట్‌కి వచ్చింది. ఇలా వచ్చిన నగదు మొత్తాన్ని ప్రాజెక్ట్ వర్క్‌కే వాడతాను. నేను గ్రామీణ, గిరిజన స్థాయిల్లో చేసిన ప్రాజెక్ట్ రిజల్ట్‌ని ఇక్రిశాట్లో జరిగిన కాన్ఫరెన్స్‌లో ప్రెజెంట్ చేశాను. స్వీడన్, మలావిల్లోనూ ఈ విశేషాలు తెలియజేయబోతున్నాను. అంతర్జాతీయ స్థాయిలో పెద్ద ఎత్తులో ప్రెజెంటేషన్‌కి అవకాశం వచ్చిందంటే దీని ప్రాముఖ్యత ఈ సమయంలో చాలా ఉందని అర్ధమవుతోంది. కష్టమైన టాస్క్ అయినప్పటికీ సకాలంలో పూర్తి చేయగలిగానని ఆనందంగా ఉంది. గ్రామీణ స్థాయికి వెళ్లాలి... వ్యవసాయం అనగానే మన జనాభాకు సరిపడా ఆహారోత్పత్తి జరగాలనే ఇన్నాళ్లుగా ఆలోచిస్తున్నాం. ఇప్పటివరకు మన దేశం ఈ విషయంలో రెండవ స్థానంలో ఉంది. పోషకాహారలోపంలో మాత్రం మొదటి స్థానంలో ఉంది. మన దగ్గర చాలా మంది పోషకాహార లేమి సమస్యను ఎదుర్కొంటున్నారు. వ్యవసాయానికి సంబంధించిన అధికారులకు గైడ్‌లైన్స్ ఇవ్వడం వల్ల, వారు సులువుగా ప్రజల్లోకి తీసుకెళతారు. ఈ అధికారులు చెప్పడం వల్ల దీని ప్రభావం కూడా బాగుంటుంది. ఏ సాగు చేయాలి, ఎలాంటి పంటలు వేయాలి, కుటుంబాన్ని బట్టి, వారి పోషకాహార స్థాయులను బట్టి దిగుబడి చేయడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయి అనే విషయాల మీద ఇంకా సరైన అవగాహన రావాల్సి ఉంది. దీనివల్ల రక్తహీనత, పోషకాహారం లేమి వంటివి తగ్గించవచ్చు. గిరిజనుల ఆహారం అంగన్వాడీలు, సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ద్వారా గ్రామీణ మహిళల కుటుంబాల పోషకాహార స్థాయిలు ఎలా ఉన్నాయి.. అనే దానిమీద స్టడీ చేశాను. మిల్లెట్స్‌ని ఆహారంగా తీసుకోవడం ఇటీవల పట్టణాల్లోనూ పెరిగింది. అయితే, గిరిజనులు ఎప్పటి నుంచో వీటిని తీసుకుంటున్నారు. దీనివల్ల వారి రోగనిరోధకశక్తి పట్టణాల్లో వారికన్నా మెరుగ్గా ఉంది. ఈ విషయాన్ని నేరుగా తెలుసుకోవడానికి తెలంగాణలోని గిరిజనుల కుటుంబాలను కలుసుకొని స్టడీ చేశాను. రాగి అంబలి, జొన్నరొట్టె, ఆకుకూరలు వారి ఆహారంలో ప్రధానంగా ఉంటాయి. అదే గ్రామాల్లో అయితే అవగాహన తక్కువే. ఈ విషయంగా అవగాహన సదస్సులు జరగాల్సిన అవసరం ఉంది. మార్పు తీసుకురావడానికి అందరి కృషి అవసరం’’ అని వివరించింది శిరీష. అవగాహన ముఖ్యం: శిరీష మాది కరీంనగర్ జిల్లా, బొంతుపల్లి గ్రామం. వ్యవసాయం కుటుంబం. బిఎస్సీ హోమ్‌సైన్స్ చేశాక ఎమ్మెస్సీకి ఫుడ్ అండ్ న్యూట్రిషన్‌ను ఎంచుకున్నాను. ఆ తర్వాత పీహెచ్‌డి చేస్తున్నప్పుడే ఎన్ఐఆర్డిలో జరిగిన మీటింగ్‌లో ఈ ఫెలోషిప్‌కి అప్లయ్ చేసుకోవచ్చు అని తెలిసి అప్లయ్ చేశాను. దాదాపుగా నా చదువు అంతా ఫెలోషిప్స్తోనే గడిచింది. మా అన్నయ్య ఇచ్చే గైడ్‌లైన్స్ కూడా బాగా సహాయపడ్డాయి. – నిర్మలారెడ్డి -
జంగం సిస్టర్స్ గీతావధానం
అష్టావధానం గురించి విన్నాం. శతావధానం చూశాం. ఈ గీతావధానం ఏమిటి? భగవద్గీత భారతీయుల ఆధ్యాత్మిక సంపద. ఇంకా చెప్పాలంటే ప్రపంచ జనులకు మార్గదర్శి. జీవన సందేశి. భగవద్గీతను ఔపోసన పట్టిన ఇద్దరు అక్కచెల్లెళ్లు గీతావధానం చేస్తున్నారు. మనీష, శిరీష... అనే ఈ అక్కచెల్లెళ్లు ‘జంగం సిస్టర్స్’గా గతంలో గణితావధానం చేశారు. ఇప్పుడు గీతావధానం చేస్తున్నారు. ఆపైన నాట్యావధానం కూడా చేస్తారట. ఆ ప్రతిభకు పరిచయం ఇది. ‘‘నేను దూరవిద్యలో తెలుగు ఎంఏ చేస్తున్నాను. సాహిత్య అవధానాలు ఇప్పటికే చేస్తున్నాను. చిన్నప్పటి నుంచి నాన్నగారు మాతో రుక్మిణీ కల్యాణం, గజేంద్ర మోక్షం వంటి ఘట్టాలు కంఠస్థం చేయించారు. తెలుగులో ఇప్పటివరకు సుమారు రెండు వేల పద్యాలు నేర్చుకున్నాను. ఇంకా నేర్చుకుంటున్నాను. మనుచరిత్ర, మేఘసందేశం కావ్యాలు సంపూర్ణంగా కంఠపాఠం అయ్యాయి. మా నాన్నగారే మా గురువు. ప్రభుత్వ సంగీత కళాశాలలో సంగీతం సర్టిఫికెట్ కోర్సు చేశా. మా బాబయ్య జంగం విజయకుమార్ మాకు బాల్యం నుంచే కూచిపూడి నాట్యం నేర్పించారు. నేను డాన్స్‌లో డిప్లొమా పూర్తి చేశాను. త్వరలో ఎం.ఏ చేద్దామనుకుంటున్నాను’ అంటూ వివరించారు జంగం సిస్టర్స్‌లోని అక్క మనీషా చక్రవర్తి. అవధానం తెలుగువారి సాహిత్య ప్రక్రియ. ఎనిమిది మంది పృచ్ఛకులతో చేస్తే అది అష్టావధానం. ఈ విధంగా శతావధానం, సహస్రావధానం వరకు చేస్తారు. ఇది తెలుగువారికి సొత్తు. ఇందులోనే గణితావధానం, నేత్రావధానం, నాట్యావధానం వంటి ఎన్నో ప్రక్రియలు కూడా తెలుగువారిని అలరిస్తున్నాయి. వీటన్నిటికీ భిన్నంగా ‘భగవద్గీత అవధానం’ చేస్తున్నారు జంగం సిస్టర్స్. ‘నేను పదో తరగతితో చదువు ఆపేశాను. నా ఐదోఏటే మా బాబయ్య మా అక్కకు, నాకు నాట్యం, నాట్యశాస్త్రం కూడా మా బాబయ్యే నేర్పించారు. నాట్యశాస్త్రంలో మొత్తం ఆరువేల శ్లోకాలు ఉన్నాయి. అందులో 3500 శ్లోకాలు కంఠతా నేర్చుకున్నాను. 2021 ఉగాది నాటికి ఆరు వేల శ్లోకాలూ కంఠస్థం చేసి నాట్యావధానం చేయాలనుకుంటున్నాను. చిన్నప్పటి నుంచి ఇలా ఏదో ఒకటి సాధన చేయటమే పరమావధిగా సాగుతున్నాం. మా అక్క సాహిత్య అవధానం చేస్తుంటే, నేను నాట్యావధానం చేయడానికి సన్నద్ధురాలిని అవుతున్నాను. అక్క ఐదోతరగతి చదువుతున్నప్పుడు మొట్టమొదటి గణితావధానం చేసింది. నేను మాత్రం ఏడో తరగతిలో మొదలుపెట్టాను. ఇద్దరం కలిసి ఇప్పటివరకు పది అవధానాలు చేశాం’ అని చెబుతారు చెల్లాయి శిరీష. గణితావధానంలో క్యాలండర్ మెమరీ అంశాన, ఏ సంవత్సరంలో ఏ తారీకు నాడు ఏ వారం వచ్చిందో చెబుతారు. దత్తపది పేరున పన్నెండు అంకెల సంఖ్యను 7, 13 అంకెతో గుణిస్తే ఎంత వస్తుంది లేదా భాగిస్తే ఎంత వస్తుంది... వంటివి చెబుతారు. చిన్నప్పటి నుంచే తండ్రి జంగం చక్రవర్తి పిల్లలకు యోగా నేర్పించారు. అలాగే పద్యాలు కూడా ఆయనే నేర్పించారు. నాట్యానికి సంబంధించి సంగీత పరిజ్ఞానం అవసరం కనుక, ఈ పిల్లలిద్దరికీ సంగీతం నేర్పించారు. ‘ప్రస్తుతం నేను వయొలిన్ నేర్చుకుంటున్నాను, చెల్లి మృదంగం నేర్చుకుంటోంది’ అంటూ తమ గురించి చెప్పుకొచ్చారు జంగం సిస్టర్స్. – సంభాషణ: వైజయంతి పురాణపండ ఫోటోలు: నడిపూడి కిషోర్, సాక్షి, విజయవాడ భగవద్గీత అవధానం... 1. శ్లోకం – సంఖ్య: భగవద్గీతలోని 700 శ్లోకాలలో ఏ అధ్యాయంలో ఏ శ్లోకం సంఖ్య అడిగితే ఆ శ్లోకం చెప్పాలి. 2. న్యస్తాక్షరి: ఒక శ్లోకంలో అక్కడక్కడ అక్షరాలు ఇస్తారు. చివరకు మొత్తం శ్లోకం చెప్పాలి 3. దత్తపది: ఒక పదం చెప్పి, ఆ పదం ఏ శ్లోకంలోదో, ఎన్నో అధ్యాయంలోదో అడిగితే, దానికి సమాధానం చెప్పాలి. 4. పాద వ్యతిక్రమం: శ్లోకం తీసుకుని ఏదో ఒక పాదం చెబుతారు. ఆ పాదం ఉన్న శ్లోకం అప్పచెప్పాలి. 5. శ్లోకధార: ఒక అధ్యాయంలో వారు ఒక సంఖ్య చెబుతారు. అంటే రెండు అనే సంఖ్య చెబితే ఆ అధ్యాయంలోని 2, 12, 22, 32 అలా ఆ సంఖ్యల శ్లోకాలు అప్పచెప్పాలి. 6. శ్లోకార్థ తాత్పర్యం: ఏ శ్లోకం అడిగినా దానికి అర్థం తాత్పర్యం చెప్పాలి 7. శ్లోక ఆరోహణ అవరోహణం: ఐదు లేదా పది శ్లోకాలు అడుగుతారు. వాటిని కింద నుంచి పైకి లేదా పై నుంచి కిందకు అప్పగించాలి. 8. ప్రస్తుతి ప్రసంగం: భగవద్గీత మీద అడిగే ప్రశ్నలకు చమత్కార సమాధానాలు చెప్పాలి. గిడుగు వారి జయంతిని పురస్కరించుకుని, మా పిల్లలు వాళ్ల స్నేహితులతో కలిసి ‘శతకసేన’ పేరున మొత్తం 108 పద్యాలు కంఠస్థం చేస్తున్నారు. వారికి సర్టిఫికేట్లు ఇస్తున్నాం. మా పిల్లలు పిల్లలు జావళీలకు నృత్యం సమకూర్చి ప్రదర్శనలు ఇస్తున్నారు. పిల్లలు ఈ మార్గంలో వెళ్లడానికి నా భార్య వాసవి ఒక మౌన సైనికురాలిగా సహకరిస్తోంది. ఈ భగవద్గీత అవధాన కార్యక్రమంలో మా పిల్లలు ఎనిమిది మంది పండితులను అవధానం ద్వారా ఢీ కొట్టబోతున్నారు. గతంలో అత్యంత క్లిష్టమైన గణితావధానం నిర్వహించి పెద్దల ప్రశంసలు అందుకున్నారు. ఎంతోమంది మా పిల్లలకు ఆశీస్సులు, శుభాకాంక్షలు అందిస్తున్నారు. నేను పంచకావ్యాలను యక్షగానాలుగా రాశాను. మనుచరిత్రలో పెద్దమ్మాయి ప్రవరాఖ్యుడిగా, చిన్నమ్మాయి వరూధినిగా నటిస్తున్నారు. పిల్లలిద్దరూ ‘నాట్యవేద అకాడెమీ ఆఫ్ మ్యూజిక్ అండ్ డాన్స్ స్థాపించి’ నృత్య దర్శకత్వం కూడా చేస్తున్నారు. భగవద్గీత ధర్మబద్ధంగా జ్ఞానసముపార్జనకు తోడ్పడుతుంది. అందుకే అందులోని 700 శ్లోకాలు పిల్లలకు నేర్పాను. 72 ఏళ్ల వయసులో యడ్లవల్లి మోహన్‌రావు అనే పండితుడితో ఈ ప్రక్రియలో భగవద్గీత అవధానం చేయించాను. ఆయన తనకు వయసు మీద పడుతుండటంతో, ఈ ప్రక్రియను వేరేవారికి కూడా నేర్పమన్నారు. అప్పుడు మా పిల్లలకు నేర్పాను. వారు ఇప్పుడు ప్రథమంగా ఈ రోజు అవధానం చేస్తున్నారు. భగవద్గీతను రెండు నెలల పాటు సాధన చేశారు. మూడో నెలలో అవధాన క్రమంలో వాళ్ల చేత సాధన చేయించాను. – జంగం శ్రీనివాస చక్రవర్తి, (ఈ చిన్నారుల తండ్రి), తెలుగు పండితులు, విజయవాడ -
ప్రేమలో కొత్త కోణం
సైకలాజికల్ ఎలిమెంట్స్ మిక్స్ అయిన న్యూ ఏజ్ లవ్ స్టోరీగా రూపొందిన చిత్రం‘మసక్కలి’. సాయిరోనక్, కావ్య, శిరీషలు ముఖ్య పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి నమిత్ సింగ్ నిర్మాత. నబి.యేనుగుబాల దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం వినాయక చవితి సందర్భంగా ఈ నెల 13న విడుదల కానుంది. ఈ సందర్భంగా నమిత్ సింగ్ మాట్లాడుతూ– ‘‘యూత్‌ను ఆకట్టుకునే పాయింట్‌తో పాటు ఓ కొత్త పాయింట్‌ను ఈ సినిమా ద్వారా చెప్పబోతున్నాం. సినిమా కథనం తప్పకుండా ఆకట్టుకుంటుంది. యూత్‌ఫుల్ లవ్‌లో కొత్త డైమన్షన్‌ను ఎఫెక్టివ్‌గా ప్రెజెంట్ చేశారు మా దర్శకుడు నబి’’ అన్నారు. దర్శకుడు నబి మాట్లాడుతూ– ‘‘మా ‘మసక్కలి’ అందమైన ప్రేమకథలా ఉంటూనే సైకలాజికల్ గేమ్‌లా ఉంటుంది. అందరికీ నచ్చుతుందని, కొత్త అనుభూతినిస్తుందనే గ్యారంటీ నాది’’ అన్నారు. -
‘అమ్మానాన్నలు మాకొద్దు’
హనుమాన్‌జంక్షన్ రూరల్(కృష్ణా): ‘బడికెళతామంటే వద్దు పనికి పొమ్మంటున్నారు.. మాకేమో చదువుకోవాలని ఉంది.. ఇంట్లో ఎప్పుడూ గొడవలు, తన్నులాటలే.. ఏంచేయాలో దిక్కుతోచటం లేదు.. మాకీ అమ్మనాన్నలు వద్దు..’ అంటూ ఇద్దరు చిన్నారులు కృష్ణా జిల్లా వీరవల్లి పోలీసులను ఆశ్రయించారు. పోలీసుల కథనం మేరకు.. పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు సమీపంలోని తంగెళ్లమూడికి చెందిన ఆటో డ్రైవర్ మహ్మద్ అక్రం కొన్నేళ్ల క్రితం అదే ప్రాంతానికి చెందిన శిరీషను ప్రేమ వివాహం చేసుకున్నాడు. వీరికి కూతురు మహ్మద్ షన్ను (12), కుమారుడు మహ్మద్ అబ్దు బకత్ సిద్ధిఖ్ (9) ఉన్నారు. కొంతకాలంగా వీరి సంసారంలో గొడవలు ప్రారంభమయ్యాయి. పిల్లల భవిష్యత్‌ను దృష్టిలో పెట్టుకుని అమ్మమ్మ, తాతయ్యలు వింజమూరి మల్లేశ్వరి, రంగారావు.. బాపులపాడు మండలంలోని ఎ.సీతారామపురంలో తమ వద్దే ఉంచుకుని చదువు చెప్పిస్తున్నారు. పది రోజుల క్రితం అక్రం.. తమ పిల్లలను పంపించాలని గొడవ చేసి తీసుకెళ్లాడు. అప్పటి నుంచి దంపతులు రోజూ గొడవపడడం, పిల్లలను వేధించడం, కూలి పనులకు వెళ్లాలని కొట్టడంతో భరించలేక అమ్మమ్మ, తాతయ్య దగ్గరకు వచ్చేశారు. తండ్రి మళ్లీ వచ్చి తీసుకెళతాడని భయపడిన వారు బుధవారం నేరుగా వీరవల్లి పోలీస్‌స్టేషన్‌కు వెళ్లారు. తాము తమ తల్లిదండ్రుల వద్ద ఉండలేమంటూ కన్నీటి పర్యంతమవుతూ వారి కష్టాలు ఎస్ఐ పి.మురళీకృష్ణకు చెప్పుకున్నారు. తల్లిదండ్రులు తమను కొడుతున్నారని, బడికి పంపించడం లేదని వాపోయారు. అమ్మమ్మ, తాతయ్యల వద్ద ఉంటూ చదువుకుంటామని చెప్పారు. పోలీసులు పిల్లలిద్దరికీ కౌన్సెలింగ్ ఇచ్చి గన్నవరం ఐసీడీఎస్ అధికారులకు అప్పగించారు. కాగా, ఈ ఘటనపై కేసు నమోదు కాలేదు. -
మిర్యాలగూడలో వివాహిత బలవన్మరణం
మిర్యాలగూడ: నల్లగొండ జిల్లా మిర్యాలగూడలో శుక్రవారం ఉదయం ఓ మహిళ ఆత్మహత్య చేసుకుంది. మేళ్లచెర్వు మండలం చింతిర్యాల గ్రామానికి చెందిన శిరీష(23)కు త్రిపురారం మండలం బొర్రాయిపల్లి గ్రామానికి చెందిన రవికిరణ్ రెడ్డితో పది నెలల క్రితం వివాహమైంది. రవికిరణ్‌రెడ్డి మిర్యాలగూడ సమీపంలోని రెడ్డిల్యాబ్స్లో పనిచేస్తున్నాడు. వారు ఇటీవలే మిర్యాలగూడలో కాపురం పెట్టారు. గురువారం ఉదయం రవికిరణ్‌రెడ్డి విధులకు వెళ్లగా శిరీష ఒక్కటే ఇంట్లో ఉంది. మధ్యాహ్నం పొరుగింటి వారు చూడటంతో శిరీష ఇంట్లో కిటికీకి ఉరి వేసుకుని వేలాడుతూ కనిపించింది. దీంతో పోలీసులకు సమాచారం అందించారు. ఆమె మృతిపై స్థానికులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
ఆర్కే అంగరక్షక దళ నాయకురాలి మృతి
డిసెంబర్ 31న ఎన్కౌంటర్లో మృతి కుటుంబ సభ్యులకు ఆలస్యంగా అందిన సమాచారం వజ్రపుకొత్తూరు, న్యూస్‌లైన్: మావోయిస్టు పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యుడు, అగ్రనేత రామకృష్ణ (ఆర్కే) ప్రధాన అంగరక్షకురాలు మడ్డు పూర్ణిమ అలియాస్ శిరీష ఇటీవల ఒడిశాలో జరిగిన ఎన్కౌంటర్లో చనిపోయారు. ఈ సమాచారం ఆమె కుటుంబ సభ్యులకు ఆలస్యంగా సోమవారం అందింది. డిసెంబర్ 31వ తేదీన అర్ధరాత్రి ఒడిశాలోని కోరాపుట్ జిల్లా బీరిగూడ పరిసర ప్రాంతాల్లో జరిగిన పోలీసులతో జరిగిన ఎదురు కాల్పుల్లో ఆమె మృతి చెందినట్లు మల్కన్‌గిరి డివిజన్ మావోయిస్టు పార్టీ కమిటీ ఒక ప్రకటన కూడా విడుదల చేసింది. శిరీష మావోయిస్టు పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యునిగా పనిచేసి, ప్రభుత్వానికి లొంగిపోయిన మడ్డు బాబూరావు కుమార్తె. వీరి స్వగ్రామం శ్రీకాకుళం జిల్లా వజ్రపుకొత్తూరు మండలం అక్కుపల్లి. 2000లో పార్టీలో చేరిన ఆమె కొరాపుట్ ఏరియా కమిటీలో సభ్యురాలిగా పనిచేశారు. అనంతరంరామకృష్ణ భద్రత కోసం ఏర్పాటు చేసిన అంగరక్షక దళానికి నాయకురాలిగా వ్యవహరిస్తున్నారు. 1998 ఆగస్టులో జరిగిన కొప్పరడాంగ్ ఎన్కౌంటర్లో తల్లి కమల మృతి చెందడాన్ని జీర్ణించుకోలేక.. మావోయిస్టు పార్టీలో చేరాలని నిర్ణయించుకుంది. కుమార్తె మరణవార్త తనను కలచివేసిందని బాబూరావు తెలిపారు.