'లగ్గం' రీల్‌ పెట్టు.. చీరపట్టు | Laggam Movie Team Variety Promotion | Sakshi
Sakshi News home page

'లగ్గం' రీల్‌ పెట్టు.. చీరపట్టు

Oct 8 2024 6:47 PM | Updated on Oct 8 2024 6:47 PM

Laggam Movie Team Variety Promotion

చిన్న సినిమాలను జనాల్లోకి తీసుకెళ్లడం చాలా కష్టమైన పని. మంచి కంటెంట్‌ ఉన్నా సరే.. ఆ సినిమా వచ్చిందనే విషయం తెలియక ప్రేక్షకులు థియేటర్స్‌కి వెళ్లడం లేదు. అందుకే మేకర్స్‌ వినూత్నమైన రీతిలో తమ సినిమాను ప్రమోట్‌ చేసుకుంటున్నారు. ఎలాగో అలా తమ చిత్రం రిలీజ్‌ అవుతుందనే విషయం ఎక్కువ మందికి రీచ్‌ అయ్యేలా చేస్తున్నారు. తాజాగా ‘లగ్గం’ సినిమా మేకర్స్‌ కూడా వినూత్నంగా ప్రమోషన్స్ చేస్తూ సినిమాను జనాల్లోకి తీసుకెళ్లె ప్రయత్నం చేస్తున్నారు. 

ఈ క్రమంలో చీరల పండుగ పేరుతో రీల్ పెట్టు - చీర పట్టు అనే కార్యక్రమంకు శ్రీకారం చుట్టారు. ఆసక్తి కలిగిన యువకులు ఇన్‌స్టాగ్రామ్‌లో లగ్గం సినిమాకు సంభందించి పాటలకు గానీ లేదా టీజర్ లో డైలాగ్స్ కు గాని తమ స్టైల్ లో రీల్ లేదా యూట్యూబ్ షాట్ చేసి 8885050729 నెంబర్ కు పంపితే చీర ను గిఫ్ట్ గా అందిస్తారట. అయితే ఈ బహుమతి పొందాలంటే.. వారి అకౌంట్ లో పోస్ట్ చేసి లగ్గం పేజీ కి టాక్ చెయ్యాలట.

లగ్గం విషయాలకొస్తే.. ఇది తెలంగాణ నేపథ్యంలో సాగే సినిమా ఇది.  సాయి రోనక్, ప్రగ్యా నగ్రా, రాజేంద్రప్రసాద్,రోహిణి,సప్తగిరి, ఎల్బి.శ్రీరామ్, కృష్ణుడు కీలక పాత్రల్లో నటించిన ఈ సినిమాకు రమేశ్ చెప్పాల కథ-మాటలు-స్క్రీన్ ప్లే-దర్శకత్వం వహిస్తున్నారు. సుబిషి ఎంటర్త్సైన్మెంట్స్ బ్యానర్ పై వేణుగోపాల్ రెడ్డి  నిర్మిస్తున్న ఈ చిత్రం అక్టోబర్‌ 25న విడుదల కానుంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement