
సాక్షి, అమరావతి: ‘మందర మాటలు విని శ్రీరాముడిని కైక అడువులకు పంపినట్టే.. చంద్రబాబు మాటలు విని వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని సోనియాగాంధీ కష్టాలపాలు చేశారు. అరణ్యవాసం చేసిన శ్రీరాముడికి ప్రజలు పట్టాభిషేకం చేసిన విధంగానే వైఎస్ జగన్‌ను కూడా రాష్ట్ర ప్రజలు భారీ మెజారిటీతో గెలిపించారు’ అంటూ పురాణేతిహాసాలను జోడిస్తూ రంపచోడవరం ఎమ్మెల్యే ధనలక్ష్మి చేసిన ప్రసంగం గురువారం శాసనసభలో ప్రత్యేకతను సంతరించుకుంది. ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ విద్యపై జరిగిన చర్చలో ఆమె అనేక అంశాలను ప్రస్తావించారు. ఇంగ్లిష్ మాధ్యమం వల్ల మాతృభాష ఉనికి కోల్పోదన్నారు.
దేశాన్ని ఎన్నో ఏళ్లు ఇంగ్లిష్ పాలకులు పాలించినా తెలుగు వన్నె తగ్గలేదని గుర్తు చేశారు. 2,600 సంవత్సరాల చరిత్ర ఉన్న తెలుగు భాషకు ప్రాచీన హోదా కలి్పంచేందుకు 40 ఏళ్ల అనుభవం ఉన్న చంద్రబాబు చేసిన కృషి శూన్యమన్నారు. రాజకీయ ప్రయోజనాలకే ఆయన తెలుగు భాషను వాడుకుంటున్నారని మండిపడ్డారు. 20 ఏళ్ల కుర్రాడిలా ఆలోచన చేస్తాననే చంద్రబాబు.. ఈ వయసు వాళ్లు తెలుగు మీడియాన్ని ఎందుకు ఇష్టపడతారో చెప్పాలన్నారు. తన కొడుకు, మనవడిని ఏ మీడియంలో చదివించారని నిలదీశారు. తెలుగు మీద ప్రేమ చూపే టీడీపీ ఎమ్మెల్యేలు ఇంగ్లిష్‌లో ఎందుకు సంతకాలు చేస్తున్నారని ప్రశి్నంచారు.
Comments
Please login to add a commentAdd a comment