మద్యం మత్తులోఒక యువకుడు ఐదేళ్ల బాలికను చిత్రహింసలకు గురి చేశాడు.
మద్యం మత్తులోఒక యువకుడు ఐదేళ్ల బాలికను చిత్రహింసలకు గురి చేశాడు. చుట్టుపక్కల వారు అతడిని చితకబాది పోలీసులకు అప్పగించారు. ఈ ఘటన మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. సీఐ రమేష్ కొత్వాల్ తెలిపిన వివరాలివీ.. రవి (22) అనే వ్యక్తి సికింద్రాబాద్‌లోని ఓ హోటల్‌లో కార్మికుడు. అతడు ధనలక్ష్మి అనే వివాహితతో సంబంధం పెట్టుకుని ఆమె కుమార్తె(5) సహా ఆదిత్యనగర్‌లో ఉంటున్నాడు.
ఈక్రమంలో మంగళవారం ఉదయం ధనలక్ష్మి ఇంట్లో లేని సయమంలో రవి పీకలదాకా మద్యం తాగి వచ్చి ఆ చిన్నారిని ఇష్టం వచ్చినట్లు కొరుకుతూ.. రక్తం వచ్చేలా రక్కుతూ చిత్రహింసలు పెట్టాడు. బాధ తాళలేక చిన్నారి పెద్దగా ఏడవటంతో చుట్టుపక్కలవారు అక్కడికి వచ్చారు. రవి నిర్వాకాన్ని గమనించిన స్థానికులు అతడిని చితక బాదారు. అనంతరం మియాపూర్ పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.