
సర్పంచ్‌గా గెలుపొందిన తల్లి రాఘవతో రంపచోడవరం ఎమ్మెల్యే నాగులపల్లి ధనలక్ష్మి
సాక్షి, అడ్డతీగల: కుమార్తె ఎమ్మెల్యేగా పనిచేస్తున్నారు. ఇప్పుడు ఆమె తల్లి సర్పంచ్‌గా ఎన్నికయ్యారు. ఇందుకు తూర్పుగోదావరి జిల్లా వేదికైంది. రంపచోడవరం ఎమ్మెల్యే నాగులపల్లి ధనలక్ష్మి తల్లి నాగులపల్లి రాఘవ. అడ్డతీగల మండలం గొండోలు పంచాయతీకి బుధవారం జరిగిన ఎన్నికల్లో సర్పంచ్ పదవికి వైఎస్సార్‌సీపీ అభిమానిగా పోటీచేసిన రాఘవ 273 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. ఆమె 2001–06, 2013–18 వరకు రెండుసార్లు సర్పంచ్‌గా పనిచేశారు. ఎమ్మెల్యే స్వగ్రామం రాజుంపాలెం.. గొండోలు పంచాయతీలో ఉంది. ఇక్కడ 1,070 ఓట్లు ఉండగా ఎన్నికల్లో 717 పోలయ్యాయి. మొత్తం ఎనిమిది వార్డుల్లోనూ వైఎస్సార్‌సీపీ అభిమానులే గెలుపొందారు.