rampachodavaram mla
-
చంద్రబాబు అప్పుడెందుకు స్పందించలేదు
రంపచోడవరం: టీడీపీ హయాంలో మహిళలపై అనేక దాడులు జరిగితే స్పందించని మాజీ సీఎం చంద్రబాబునాయుడు ఇప్పుడు పెద్దగా మాట్లాడుతున్నారని, అప్పుడు లేవని గొంతు ఇప్పుడేందుకు లేస్తోందని రంపచోడవరం ఎమ్మెల్యే నాగులపల్లి ధనలక్ష్మి ధ్వజమెత్తారు. రంపచోడవరంలో ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో శుక్రవారం స్థానిక విలేకరులతో ఆమె మాట్లాడారు. విజయవాడలో మానసిన వికలాంగురాలుపై జరిగిన దాడిపై ప్రభుత్వం తీవ్రంగా స్పందించిందన్నారు. బాధితురాలికి రూ. 10 లక్షల పరిహారం అందజేయడమే కాకుండా ఆ కుటుంబంలో వారికి ఉద్యోగం కల్పించేందుకు చర్యలు చేపట్టిందన్నారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం మహిళల రక్షణ కోసం దిశ యాప్‌ను రూపొందించిందన్నారు. ఈ యాప్ ఉంటే ప్రతి మహిళకు ఒక సెక్యూరిటీ గార్డు వెంట ఉన్నట్టే అన్నారు. తహసీల్దార్ వనజాక్షిపై దాడి జరిగినప్పుడు చంద్రబాబు ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు. టీడీపీ మహిళా నేతలు ఎందుకు ఆ సంఘటనను ఖండించలేదని ప్రశ్నించారు. ప్రతి దానిని రాజకీయం చేయడం తగదన్నారు. టీడీపీకి చెందిన వ్యక్తి వేధింపులకు బాలిక సూసైడ్ నోట్ రాసి ఆత్మహత్య చేసుకుంటే చంద్రబాబునాయుడు ఎందుకు మాట్లాడలేదన్నారు. కాల్‌మనీ కేసులో కుటుంబాలను రోడ్డుపై లాగారని విమర్శించారు. వీటిపై ప్రశ్నించిన మంత్రి రోజాను అప్పుడు ఏడాది పాటు అసెంబ్లీకి రాకుండా సస్పెండ్ చేశారని గుర్తు చేశారు. విజయవాడ సమావేశాలకు పిలిచి పోలీస్ వ్యాన్‌లో రోజాను తిప్పిన సంఘటనను చంద్రబాబు గుర్తుతెచ్చుకోవాలన్నారు. ముంపు గ్రామాలను నూరుశాతం తరలింపు : పోలవరం ప్రాజెక్టు నిర్మాణం కారణంగా దేవీపట్నం మండలంలో ముంపునకు గురవుతున్న గ్రామాల్లో నిర్వాసితులను బయటకు తరలించామని రంపచోడవరం ఎమ్మెల్యే నాగులపల్లి ధనలక్ష్మి తెలిపారు. ఒకటి రెండు గ్రామాలకు పునరావాస కాలనీ నిర్మాణాలు జరుగుతున్నాయని తెలిపారు. అప్పటి టీడీపీ పర్సంటేజీల కోసం కాఫర్ డ్యామ్ నిర్మాణం చేసి నిర్వాసితుల గురించి పట్టించుకోలేదన్నారు. ఏ ముఖం పెట్టుకుని ఈ రోజు నిర్వాసితుల తరఫున మాట్లాడుతున్నరని నిలదీశారు. వైఎస్సార్ సీపీలో గెలుపొంది టీడీపీకి అమ్ముడు పోయిన వంతల రాజేశ్వరి నిర్వాసితుల కోసం ఏం చేయలేదన్నారు. ఇప్పుడు న్యాయపోరాటం చేయడం హాస్యాస్పదంగా ఉందన్నారు. నిర్వాసితుల కోసం రాజేశ్వరి ఏం చేశారో ఆత్మ పరిశీలన చేసుకోవాలన్నారు. వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చిన తరువాత నిర్వాసితులకు ఆర్అండ్ఆర్ ప్యాకేజీ, ఇళ్ల నిర్మాణం వేగవంతం చేసి కాలనీలకు తరలించినట్లు తెలిపారు. పోలవరం నిర్వాసితులు అందరికీ న్యాయం చేస్తామన్నారు. పోలరవం ప్రాజెక్టు కోసం వారి జీవితాలను త్యాగం చేశారని, పుట్టి పెరిగిన గ్రామాలను జ్ఞాపకాలను వదిలి వెళ్లిన వారికి ఎంత చేసిన తక్కువేనని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారన్నారు. నిర్వాసితుల విషయంలో తమ ప్రభుత్వం ఎప్పుడు సానుకూలంగా వారికి న్యాయం చేసేందుకు సిద్ధంగా ఉందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. (చదవండి: ప్రోత్సహిస్తే సిరులే!) -
కుమార్తె ఎమ్మెల్యే.. తల్లి సర్పంచ్..
సాక్షి, అడ్డతీగల: కుమార్తె ఎమ్మెల్యేగా పనిచేస్తున్నారు. ఇప్పుడు ఆమె తల్లి సర్పంచ్‌గా ఎన్నికయ్యారు. ఇందుకు తూర్పుగోదావరి జిల్లా వేదికైంది. రంపచోడవరం ఎమ్మెల్యే నాగులపల్లి ధనలక్ష్మి తల్లి నాగులపల్లి రాఘవ. అడ్డతీగల మండలం గొండోలు పంచాయతీకి బుధవారం జరిగిన ఎన్నికల్లో సర్పంచ్ పదవికి వైఎస్సార్సీపీ అభిమానిగా పోటీచేసిన రాఘవ 273 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. ఆమె 2001–06, 2013–18 వరకు రెండుసార్లు సర్పంచ్‌గా పనిచేశారు. ఎమ్మెల్యే స్వగ్రామం రాజుంపాలెం.. గొండోలు పంచాయతీలో ఉంది. ఇక్కడ 1,070 ఓట్లు ఉండగా ఎన్నికల్లో 717 పోలయ్యాయి. మొత్తం ఎనిమిది వార్డుల్లోనూ వైఎస్సార్సీపీ అభిమానులే గెలుపొందారు. చదవండి: (కుప్పం కూడా చెప్పింది.. గుడ్ బై బాబూ) (తండ్రి ఎమ్మెల్సీ.. తనయుడు సర్పంచ్..) -
కన్నీరు పెట్టుకున్న వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే!
కాకినాడ సిటీ: గిరిజనులు ఏం పాపం చేశారు. ప్రతి తల్లీ ప్రసవ వేదన అనుభవిస్తోంది. ఓవైపు పురిటి నొప్పులు పడుతూనే పుట్టే బిడ్డ సజీవంగా పుడతాడా లేదా అనే ఆందోళనతోనే ఉంటోంది. కొద్దిపాటి అనారోగ్యంతో చిన్నారులు ప్రాణాలు కోల్పోతున్నారు. గత ఏడాది ఏప్రిల్ నుంచి ఈ ఏడాది మార్చి వరకూ వందల సంఖ్యలో చిన్నారులు మృతి చెందారు. దీనికి తోడు కాళ్ల వాపు కబళిస్తోంది. అసలు ఏజెన్సీలో ఏం జరుగుతోంది? నివారణా చర్యలేమిటనే కోణంలో ఆలోచించాల్సిన అవసరం ఉందంటూ రంపచోడవరం ఎమ్మెల్యే ధనలక్ష్మి సభలో కన్నీళ్లు పెట్టుకున్నారు. శుక్రవారం కాకినాడలో జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో జిల్లాలోని వైద్య ఆరోగ్యశాఖ పనితీరును జిల్లా ఇన్చార్జి మంత్రి, ఉప ముఖ్యమంత్రి, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఆళ్ల కాళీకృష్ణ శ్రీనివాస్ (నాని) సమీక్షించారు. ఈ సమీక్షా సమావేశంలో వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే ధనలక్ష్మి మాట్లాడుతూ ఏజెన్సీ ప్రాంతంలో గర్భిణి తనకు పుట్టిన బిడ్డ బతుకుతుందో లేదోనన్న ఆందోళనతో ఉన్నారని, వీరికి సరైన వైద్యం అందకపోవడంతో పుట్టిన బిడ్డలు చనిపోవడం, ఒక్కొక్కసారి తల్లీ, బిడ్డా కూడా మరణిస్తున్నారని కన్నీటి పర్యంతమయ్యారు. అసలు పుట్టిన బిడ్డలు ఎందుకు చనిపోతున్నారో అర్థం కావడంలేదని, పౌష్టికాహార లోపమా లేక, మరే ఇతర సమస్యా అన్నది ఇప్పటికీ అర్థం కావడం లేదన్నారు. రానున్న రెండేళ్లలో అందరికీ ఆరోగ్యం: ఆళ్ల నాని రానున్న రెండేళ్లలో వైద్య ఆరోగ్య శాఖలో సంస్కరణలు చేసి ప్రజలకు మంచి ఆరోగ్యాన్ని అందించేందుకు సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి కృతనిశ్చయంతో ఉన్నారని జిల్లా ఇన్చార్జి మంత్రి, ఉప ముఖ్యమంత్రి, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఆళ్ల కాళీకృష్ణ శ్రీనివాస్ (నాని) ఉద్ఘాటించారు. శుక్రవారం కాకినాడలో జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో జిల్లాలోని వైద్యాధికారులు, వైద్యులతో నిర్వహించిన వైద్య ఆరోగ్యశాఖ పనితీరును ఆయన సమీక్షించారు. ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి పేదలందరికీ నాణ్యమైన కార్పొరేట్ వైద్యం అందించేందుకు వీలుగా బడ్జెట్లో రూ.12 వేల కోట్లు కేటాయించారని మంత్రి ఆళ్ల నాని తెలిపారు. నవరత్న పథకాల్లో భాగంగా ఆరోగ్యశ్రీని బలోపేతం చేస్తామన్నారు. ఈ పథకం కింద ప్రతి కుటుంబాన్నీ కవర్ చేసేందుకు వీలుగా హెల్త్ కార్డులు అందిస్తున్నామన్నారు. ఈ పథకాన్ని జనవరి 1, 2020న పశ్చిమగోదావరి జిల్లాలో లాంఛనంగా ప్రారంభిస్తామని మంత్రి నాని తెలిపారు. అన్ని ప్రాంతాలను ప్రామాణికంగా తీసుకుని సీఎం జగన్మోహన్రెడ్డితో సమీక్షించిన అనంతరం పూర్తి స్థాయిలో వైద్య ఆరోగ్యశాఖను ప్రక్షాళన చేస్తామని అన్నారు. ఆరోగ్యశ్రీ పరిధిని విస్తరిస్తామని, ప్రస్తుతం 1070 వ్యాధులకు ఈ పథకాన్ని వర్తింపజేస్తుండగా మరో వెయ్యి వ్యాధులను యీ పరిధిలోకి తీసుకువస్తామని అన్నారు. ప్రతి మండలానికి 108, 104 వాహనాలు ఉండేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. సెప్టెంబర్ నాటికి 108 వాహనాలు 676 , 104 వాహనాలు 773 కొనుగోలు చేయనున్నట్లు మంత్రి వెల్లడించారు. గిరిజన ప్రాంతాల్లో మెరుగైన వైద్యం అందించేందుకు పూర్తి స్థాయిలో చర్యలు తీసుకుంటామన్నారు. ఉపముఖ్యమంత్రి, రెవెన్యూ శాఖా మంత్రి పిల్లి సుభాష్‌చంద్రబోస్ మాట్లాడుతూ జిల్లాలో డయాలసిస్ వ్యాధిగ్రస్తులు పెరుగుతున్నారని, ఇప్పటికే 32 మంది డయాలసిస్ రోగులు ఉన్నారని, ఏరియా ఆస్పత్రుల్లో డయాలసిస్ యూనిట్లు ఏర్పాటు చేయాలన్నారు. సమావేశంలో పాల్గొన్న వ్యవసాయ, సహకారశాఖ మంత్రి కురసాల కన్నబాబు మాట్లాడుతూ ఏజెన్సీ ప్రాంతంలో వైద్యం దారుణంగా ఉంటోందని, ఈ ప్రాంతంలో కాళ్లవాపు వ్యాధి వచ్చి అనేక మంచి మరణించారని అన్నారు. ఇప్పటికీ ఆ వ్యాధి ఎందుకు వస్తుందో వైద్యులు తెలుసుకోలేదన్నారు. జిల్లాలో 24 ్ఠ7 గా పీహెచ్‌సీలు నడుస్తున్నా, 7 గంటలు కూడా అవి పనిచేయడం లేదని అన్నారు. కరపలో నర్సింగ్ ట్రైనింగ్ సెంటర్‌ను తీసుకువచ్చి భవనం నిర్మిస్తే గత ప్రభుత్వంలో ఆ భవనాన్ని బీసీ హాస్టల్‌కు ఇచ్చారని అన్నారు. జిల్లాలో లెప్రసీ మళ్లీ విజృంభిస్తున్నట్లు సాంకేతికాలు అందుతున్నాయని, దీనిపై వైద్యులు ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. సాంఘిక సంక్షేమశాఖామంత్రి పినిపే విశ్వరూప్ మాట్లాడుతూ కోనసీమ ప్రాంతం పూర్తిగా వెనుకబడిన ప్రాంతమని ఈ ప్రాంతంలో వైద్యాన్ని మెరుగుపర్చాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. కార్యక్రమంలో పాల్గొన్న వైద్య, ఆరోగ్యశాఖ ప్రిన్సిపల్ కార్యదర్శి జవహర్‌రెడ్డి మాట్లాడుతూ నవరత్నాల పథకంలో పేదల ఆరోగ్యానికి సంబంధించి ఆరోగ్యశ్రీ పథకానికి అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నామని అన్నారు. ఇతర రాష్ట్రాల్లో కూడా ఆరోగ్యశ్రీ వర్తింపజేసేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. మండలాల్లో ఉన్న ఆస్పత్రులను 2020 డిసెంబర్ నాటికి పూర్తి స్థాయిలో ఆధునికీకరించి మౌలికసదుపాయాలు కల్పిస్తామన్నారు. ప్రతీ పీహెచ్సీలో డయాగ్నోస్టిక్ సెంటర్‌తో పాటు చిన్న, చిన్న ఆరోగ్య పరీక్షలు అన్ని అక్కడే ఉండేలా చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు. ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యం పొందేవారి సంఖ్యను 60 శాతానికి పెంచేలా వైద్య సిబ్బంది కృషి చేయాలని జవహర్‌రెడ్డి ఆదేశించారు. ప్రభుత్వ విప్, తుని ఎమ్మెల్యే దాడిశెట్టి రాజా మాట్లాడుతూ తుని ఆస్పత్రిలో 20 మంది సిబ్బంది అవసరం ఉన్నారని, అనస్థీషియా వైద్యుని, గైనకాలజిస్ట్‌లను నియమించాలన్నారు. ఎంపీ గీత మాట్లాడుతూ తీరప్రాంతాల్లో ఉన్న మత్స్యకారులకు మెరుగైన వైద్యం అందించాలన్నారు. అలాగే జిల్లాలో చాపకింద నీరులా హెచ్ఐవీ వ్యాధిగ్రస్తుల సంఖ్య పెరుగుతూ వస్తోందని దీనికి అవసరమైన చర్యలు చేపట్టాలన్నారు. కొత్తపేట ఎమ్మెల్యే జగ్గిరెడ్డి మాట్లాడుతూ రావులపాలెంలో ట్రామాకేర్, డయాలసిస్ సెంటర్లను ఏర్పాటు చేయాలని, దీనికి కావల్సిన స్థలాన్ని అందించడానికి సిద్ధంగా ఉన్నామన్నారు. అలా గైనకాలజిస్ట్‌లను, సివిల్ సర్జన్లను, ఆర్థోపెడిక్ వైద్యులను నియమించాలన్నారు. జగ్గంపేట ఏజెన్సీ ముఖద్వారంగా ఉండడం వల్ల బైపాస్ రోడ్డులో ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయని, జగ్గంపేటలో ట్రామాకేర్ సెంటర్, 100 పడకల ఆస్పత్రిని ఏర్పాటు చేయాలన్నారు. ప్రత్తిపాడు ఎమ్మెల్యే పర్వత శ్రీపూర్ణచంద్ర ప్రసాద్ మాట్లాడుతూ ఏలేశ్వరం ఆస్పత్రిని 50 పడకల ఆసుపత్రిగా మార్చాలని, ప్రత్తిపాడు పీహెచ్‌సీని వంద పడకల ఆస్పత్రిగా మార్చాలన్నారు. పిఠాపురం ఎమ్మెల్యే పెండెం దొరబాబు మాట్లాడుతూ పిఠాపురం ఆస్పత్రిని 30 పడకల ఆసుపత్రిగా మార్చాలన్నారు. ఆసుపత్రిలో వైద్యులను డిప్యూటేషన్ ఇవ్వకుండా చూడాలని, అవసరమైన చోట్ల వైద్యులను, నర్సులను, ఆస్పత్రి సిబ్బందిని నియమించాలన్నారు. రాజానగరం ఎమ్మెల్యే జక్కంపూడి రాజా మాట్లాడుతూ రాజమహేంద్రవరం ఆస్పత్రిని 500 పడకల ఆస్పత్రిగా మార్చాలని అన్నారు. ట్రామాకేర్ సెంటర్ ఉన్నా సిబ్బంది లేరన్నారు. పి.గన్నవరం ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు మాట్లాడుతూ నగరంలో సూపర్‌స్పెషాలిటీ ఆస్పత్రిని ఏర్పాటు చేయాలన్నారు. ఈ ప్రాంతంలో గ్యాస్ లీకైన సందర్భాల్లో ప్రమాదాలు జరుగుతుంటే వారిని కాకినాడ తరలించాల్సి వస్తోందన్నారు. కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి మాట్లాడుతూ కాకినాడ జీజీహెచ్‌లో ఖాళీగా ఉన్న వైద్యులు, నర్సుల పోస్టులు భర్తీ చేయాలన్నారు. ముమ్మిడివరం ఎమ్మెల్యే పొన్నాడ సతీష్ మాట్లాడుతూ తమ నియోజకవర్గం పూర్తిగా వెనుకబడి ఉందని, ఈ ప్రాంతంలో ఆస్పత్రుల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలన్నారు. రామచంద్రపురం ఎమ్మెల్యే చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ మాట్లాడుతూ కిడ్నీ రోగులకు అందించినట్టే పెరాలసిస్ రోగులకు కూడా రూ.10వేలు పెన్షన్ ఇవ్వాలన్నారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యేలు చినరాజప్ప, వేగుళ్ల జోగేశ్వరరావు, గోరంట్ల బుచ్చయ్యచౌదరి, ఎమ్మెల్సీ సోము వీర్రాజులు తమ ప్రాంతాల్లో ఆసుపత్రులను అభివృద్ధి చేయాలని, వైద్యుల ఖాళీలను భర్తీ చేయాలని కోరారు. ఈ సమావేశంలో ఆయుష్ కమిషనర్ రమ్యశ్రీ, అమలాపురం ఎంపీ చింతా అనురాధ, డీఎంఅండ్‌హెచ్‌వో బి.సత్యసుశీల, జేసీ–2 జి రాజకుమారి, మేయర్ సుంకర పావని పాల్గొన్నారు. -
ముంపు మండలాల్లో వైఎస్ జగన్ పర్యటన ఖరారు
జూలై 2న రానున్నారని ప్రకటించిన ఎమ్మెల్యే రాజేశ్వరి, యువ నేత అనంతబాబు ప్రజలను అధిక సంఖ్యలో తరలిరావాలని పిలుపు రేఖపల్లి(వీఆర్‌పురం) : విలీన మండలాల్లో వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి పర్యటన జూలై 2వ తేదీన ఖరారైందని ఎమ్మెల్యే వంతల రాజేశ్వరి, వైఎస్సార్సీపీ జిల్లా యువజన విభాగం అధ్యక్షుడు అనంత ఉదయభాస్కర్ (బాబు) ప్రకటించారు. రేఖపల్లిలో శనివారం వీఆర్‌పురం, కూనవరం, చింతూరు, ఎటపాక మండలాల వైఎస్సార్సీపీ శ్రేణులతో సమావేశం నిర్వహించి పర్యటనపై చర్చించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జిల్లాలో కాపు ఉద్యమం కారణంగా ఈ నెల 16వ తేదీన ఖరారైన పర్యటనను రద్దు చేసుకున్న విషయూన్ని గుర్తు చేశారు. పశ్చిమ పర్యటన అనంతరం... జులై 1వ తేదీన జగన్ మోహన్‌రెడ్డి ముందుగా పశ్చిమ గోదావరి జిల్లా విలీన మండలాల్లో పర్యటించిన అనంతరం తూర్పు విలీన మండలాల్లో 2న పర్యటిస్తారన్నారు. భద్రాచలంలో రాత్రి విశ్రాంతి తీసుకొని 2న ఎటపాక మండలం మీదుగా కూనవరం చేరుకొని అక్కడి నుంచి రేఖపల్లిలో నిర్వాసిత రైతులతో మాట్లాడతారని చెప్పారు. అనంతరం రేఖపల్లి చెరువు ప్రాంతంలో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో పాల్గొంటారని, ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు మాచర్ల గంగులు, ఆవుల మరియాదాస్, రమేష్ నాయుడు, కడియం రామాచారి, మంత్రిప్రగడ నరసింహారావు, ఎండీ మూసా, కొవ్వూరి రాంబాబు, వైఎస్సార్ సీపీ మండలాల కన్వీనర్లు పొడియం గోపాల్, ఆలూరి కోటేశ్వర రావు, కిశోర్‌బాబు, వై.రామలింగారెడ్డి, వాసు జిల్లా నాయకులు పాల్గొన్నారు. -
'రూ.100 కోట్లు ఇచ్చినా వెళ్లం.. మేం వైఎస్ఆర్సీపీతోనే..'
హైదరాబాద్: రూ.20 కోట్లు కాదు కదా రూ.100 కోట్లు ఇచ్చినా తాము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని విడిచిపెట్టేది లేదని ఆ పార్టీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరీ స్పష్టం చేశారు. తాము శాశ్వతంగా వైఎస్ఆర్ సీపీలోనే కొనసాగుతామని చెప్పారు. ఎప్పటికైనా టీడీపీ ఓ మునిగే పడవ అని ఆమె అన్నారు. ఆ పార్టీలోకి పోయి ఏం చేయాలని, అలా చేస్తే జనాలు ఛీ కొడతారని అన్నారు. ఎలాగైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని దెబ్బ కొట్టేందుకే టీడీపీ కుట్రలు చేస్తుందని ఆమె మండిపడ్డారు. అందుకే రంపచోడవరం వంతల రాజేశ్వరీకి రూ.20 కోట్లు ఇస్తామని ప్రలోభపెట్టారని అన్నారు. గిరిజన బిడ్డలమైన తాము వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వల్లే అసెంబ్లీలో అడుగుపెట్టగలిగామని చెప్పారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో గిరిజన ఎమ్మెల్యేలు ఎక్కువగా ఉన్నందున వారిని లాక్కునేందుకే టీడీపీ కుట్రలు చేస్తుందని ఆ కుట్రలు మానుకోవాలని హెచ్చరించారు. -
'పార్టీ మారితే రూ.20 కోట్లు ఇస్తామన్నారు'
హైదరాబాద్: పార్టీ మారితే రూ.20 కోట్లు ఇస్తామని ప్రలోభపెట్టేందుకు ప్రయత్నించారని వైఎస్సార్ సీపీకి చెందిన రంపచోడవరం ఎమ్మెల్యే వంతల రాజేశ్వరి వెల్లడించారు. తాను డబ్బుకు లొంగే మనిషిని కాదని స్పష్టం చేశారు. ఎవరెన్ని ప్రలోభాలు పెట్టినా పార్టీ మారే ప్రసక్తే లేదని చెప్పారు. మంగళవారం ఉదయం అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద ఆమె 'సాక్షి'తో మాట్లాడారు. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వల్లే తాను ఎమ్మెల్యే అయ్యాయని, చివరివరకు వైఎస్సార్ సీపీలోనే కొనసాగుతానని ప్రకటించారు. ప్రజలకు సేవ చేసేందుకే రాజకీయాల్లోని వచ్చానని చెప్పారు. విశ్వసనీయతతో పనిచేస్తానని, రాజకీయాల్లో కొనసాగినంతకాలం జగనన్న వెంటే ఉంటానని స్పష్టం చేశారు. తన గురించి అనవసరంగా కొన్ని ప్రతికలు, వార్తా చానళ్లు అసత్య ప్రచారం చేస్తున్నాయని మండిపడ్డారు. తనను అడగకుండా ఎలా రాస్తారని ఆమె ప్రశ్నించారు.