
ఒక ఇంట్లో ఒకరు సర్పంచ్ కావడం సాధారణంగా చూస్తుంటాం. అందుకు భిన్నంగా ఒక ఇంట్లో ముగ్గురు సర్పంచ్‌లుగా పనిచేయడం విశేషమే. తంబళ్లపల్లె మండలం మర్రిమాకులపల్లె పంచాయతీ ఇందుకు నిదర్శనంగా నిలుస్తోంది.
సాక్షి, తంబళ్లపల్లె: మండలంలోని మర్రిమాకులపల్లె పంచాయతీలో నాటి నుంచి నేటి వరకూ కేతిరెడ్డి కుటుంబ హవా నడుస్తోంది. ఈ పంచాయతీ ఏర్పడినప్పుడు మొదటి సర్పంచ్‌గా కేతిరెడ్డి తిమ్మారెడ్డి ఎన్నికయ్యారు. అప్పటి నుంచి వరుసగా మూడుసార్లు పదవిలో కొనసాగారు. అనంతరం ఆయన కుమారుడు కె.వెంకటరమణారెడ్డి సర్పంచ్‌గా ఎన్నికై ఆయన మూడుసార్లు సర్పంచ్‌గా పని చేశారు. వెంకటరమణారెడ్డి కోడలు కె.జ్యోతి గతంలో సర్పంచ్‌గా పనిచేశారు.
ప్రస్తుత ఎన్నికల్లో రెండోసారి గ్రామస్తుల ఆమోదంతో ఏకగ్రీవంగా ఎన్నిక కావడం విశేషం. ఈ పంచాయతీలో సుమారు 618 మంది ఓటర్లు ఉన్నారు. కేతిరెడ్డి కుటుంబ సభ్యులు ప్రజలకు అందుబాటులో ఉండడం, ప్రజా సమస్యలపై స్పందించడం, పంచాయతీ అభివృద్ధికి కృషి చేయడమే ఇందుకు కారణం. కులమతాలకు అతీతంగా ప్రభుత్వ సంక్షేమ పథకాలను అర్హులందరికీ అందజేయడంతో ఆ కుటుంబంపై ప్రజలు మొగ్గు చూపుతున్నారు.
చదవండి: ఏమ్మా.. ఎలా చదువుతున్నారు!
బర్త్‌డే: తప్పతాగి యువకుడి మృతి?