kethireddy
-
మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి హౌస్ అరెస్టు
తాడిపత్రిటౌన్: అనంతపురం జిల్లా, తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిని పోలీసులు సోమవారం హౌస్ అరెస్టు చేశారు. శింగనమల నియోజకవర్గ పరిధిలోని యల్లనూరు మండలం, తిమ్మంపల్లిలోని స్వగృహంలో నిర్బంధించారు. 41 సెక్షన్ కింద నోటీసు జారీ చేశారు. తాడిపత్రిలోని పెద్దారెడ్డి నివాసానికి రాకుండా మరోమారు అడ్డుకున్నారు. కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కేతిరెడ్డిని తాడిపత్రిలోకి అడ్డుపెట్టకుండా పోలీసులు అడ్డుకుంటూ వస్తున్నారు. తాడిపత్రి మునిసిపల్ చైర్మన్, టీడీపీ నేత జేసీ ప్రభాకర్‌రెడ్డి ఒత్తిళ్లకు తలొగ్గి..వివిధ కారణాలు చూపుతూ ఆయన్ను నిలువరిస్తున్నారు.మొన్నటి వరకు కేతిరెడ్డి నియోజకవర్గ ఎమ్మెల్యేగా ఉన్నారు. తాడిపత్రిలో సొంతిల్లు కూడా ఉంది. అయినా శాంతిభద్రతల సమస్యను సాకుగా చూపి తాడిపత్రికి రానివ్వడం లేదు. సోమవారం తాడిపత్రికి వస్తున్నట్లు కేతిరెడ్డి పెద్దారెడ్డి ప్రకటించారు. వస్తే అడ్డుకుంటామని జేసీ అనుచరులు హెచ్చరించడంతో తాడిపత్రిలో ఒక్కసారిగా హైటెన్షన్ వాతావరణం నెలకొంది. ఏఎస్పీ రోహిత్‌కుమార్ చౌదరి దాదాపు 150 మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. జేసీ, కేతిరెడ్డి ఇళ్ల మధ్య ఉన్న కళాశాల ఆట స్థలాన్ని ఆధీనంలోకి తీసుకున్నారు. డ్రోన్ కెమెరాలతో పట్టణమంతా నిఘా ఉంచారు. రెండు పార్టీల నాయకుల ఇళ్ల వద్ద ఉన్న దుకాణాలను మూసివేయించారు. జనం గుంపులుగా ఉండకుండా చెదరగొట్టారు. ఉదయం 11 గంటల వరకు ఉద్రిక్తత కొనసాగింది. చివరకు తిమ్మంపల్లిలో పెద్దారెడ్డిని హౌస్ అరెస్ట్ చేశారన్న సమాచారంతో పోలీస్ బలగాలు వెనుదిరిగాయి.నా ఇంటికి వెళ్లాలన్నా వీసా కావాలా? కేతిరెడ్డి‘నేను తాడిపత్రిలోని సొంతింటికి వెళ్లాలన్నా వీసా కావాలేమో చెప్పండి..అప్లై చేసుకుంటా’ అని తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి వ్యాఖ్యానించారు. సాధారణంగా వేరే దే«శానికి వెళ్లాలంటే వీసా కావాలని, కానీ ఇప్పుడు పోలీసుల తీరు చూస్తుంటే తాడిపత్రికి వెళ్లాలన్నా వీసా తీసుకోవాలేమోనన్న అనుమానం వస్తోందని ఎద్దేవా చేశారు. తాడిపత్రిలో జేసీ ప్రభాకర్‌రెడ్డి ఆగడాలు శ్రుతిమించాయన్నారు. తనను నమ్మి తాడిపత్రి నియోజకవర్గ ప్రజలు, వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలు 80 వేల మంది ఓట్లు వేశారని, వారి బాగోగులు చూసేందుకు తాడిపత్రికి వచ్చి తీరుతానని స్పష్టం చేశారు. -
YSRCP నేత కేతిరెడ్డి పెద్దారెడ్డిపై దాడికి టీడీపీ నేతల స్కెచ్
-
పవన్ పై ఒక రేంజ్ లో ఏకిపారేసిన కేతిరెడ్డి
-
చంద్రబాబుపై ఎమ్మెల్యే కేతిరెడ్డి సంచలన వ్యాఖ్యలు
-
లోకేష్ కు కేతిరెడ్డి సవాల్.. ఆరోపణలు నిరూపించగలరా?
ధర్మవరం: తప్పుడు ఆరోపణలతో వ్యక్తిత్వాన్ని దెబ్బతీసేవిధంగా ఆరోపణలు చేసి బురదజల్లాలని చూస్తే సహించేది లేదని ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి టీడీపీ నేతలు నారా లోకేష్, పరిటాల శ్రీరామ్‌లను హెచ్చరించారు. గురువారం పట్టణంలోని ఎమ్మెల్యే నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి మాట్లాడారు. ఇటీవల ధర్మవరం మండలంలో తాను కొనుగోలు చేసిన ఫాంహౌస్‌కు సంబంధించి చెరువు స్థలాన్ని కబ్జా చేశానని, పక్క వారి భూముని కూడా గూగుల్ మ్యాప్‌లో చిత్రీకరించి నారా లోకేష్ చేసిన ఆరోపణలు పూర్తిగా నిరాధారమని పేర్కొన్నారు. వాస్తవంగా ధర్మవరం పొలంలో సర్వే నంబర్ 904, 905, 908, 909లలో కేవలం 25.38 ఎకరాలను కొనుగోలు చేసి అందులో మాత్రమే ఫాంహౌస్ నిర్మించి వ్యవసాయం చేస్తున్నామన్నారు. ఈ పొలాన్ని రైతుల నుంచి కొనుగోలు చేసినట్లు తెలిపారు. అయితే నారా లోకేష్ మాత్రం తన ఫాంహౌస్‌కు ఆనుకుని సర్వే నంబర్ 43లో ఉన్న జే. సూర్యనారాయణ అనే రైతుకు చెందిన పొలాన్ని తనదిగా చూపుతూ గూగుల్ మ్యాప్‌లో చిత్రీకరించి 20 ఎకరాలు కబ్జా చేశానని చెప్పడం ఎంత వరకు సమంజసమన్నారు. నారా లోకేష్ ఎవరో రాసిచ్చిన స్క్రిప్ట్ చదవడం వల్ల మరింత విలువలు దిగజారి ప్రవర్తిస్తున్నారని మండిపడ్డారు. ఈ విషయంలో ఏ విచారణకై నా తాను సిద్ధమని, ఒకవేళ తాను చెప్పింది నిజమని తేలితే మీరు రాజకీయాల నుంచి తప్పుకుంటారా? అని ప్రశ్నించారు. ఒక వేల అబద్ధమని తేలితే తాను ఎమ్మెల్యే పదవికి తక్షణం రాజీనామా చేస్తానని, సవాల్‌ను స్వీకరించే దమ్ముందా? అని ప్రశ్నించారు. ఆధారాలతో సహా మీడియాకు... ధర్మవరం నియోజకవర్గంలోని ముదిగుబ్బ మండలంలో ఎమ్మెల్యే కేతిరెడ్డి అనుచరులు 20 ఎకరాల భూమిలో ప్లాట్లు వేసి రూ.60 కోట్లు కాజేశారని నారా లోకేష్ తాజాగా ఆరోపించారన్నారు. ఇది కూడా పూర్తిగా అవాస్తవమన్నారు. 2009లో తామే ఈ పొలంలో పేదలకు ఇళ్ల పట్టాలను మంజూరు చేశామని తెలిపారు. ఆ తర్వాత 2014లో టీడీపీ ప్రభుత్వ హయాంలో ఇష్టానుసారం టీడీపీ నాయకులు, కార్యకర్తలకు ఆ స్థలంలో పట్టాలను పంపిణీ చేసి ప్లాట్లను కాజేశారన్నారు. ఈ పొలం కూడా కోర్టు పరిధిలో ఉందన్నారు. అలానే దొరిగిల్లు రోడ్డులో సర్వే నంబర్ 1330–1లో గుట్టలు చదును చేసి 17 ఎకరాలను ఆక్రమించారని ఆరోపించారన్నారు. వాస్తవంగా అయితే తామే ఈ పొలం అన్యాక్రాంతం కాకుండా ప్రభుత్వ భూమి అని తెలియజేసే బోర్డును ఏర్పాటు చేయించినట్లు వివరించారు. ఇందుకు సంబంధించిన ఫొటోను మీడియాకు ఎమ్మెల్యే చూపించారు. అంతేకాక సదరు స్థలంలో కొంత భాగంలో సచివాలయం, రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. అలానే దొరిగిల్లు రోడ్డులో సర్వే నంబర్ 2060–4 మూడెకరాల స్థలాన్ని గత టీడీపీ ప్రభుత్వం ఖబరస్థాన్ను ఏర్పాటు చేస్తే దాని ఆక్రమించారని చెప్పారని ఇది పూర్తిగా అవాస్తవమన్నారు. వాస్తవంగా అయితే 2022లో 2–90 ఎకరాల స్థలాన్ని ఖబరస్తాన్కు స్థలాన్ని కేటాయించింది తామేనన్నారు. ఇందుకు సంబంధించి ఈ స్థలం పూర్తి రక్షణలో ఉందన్నారు. దీనికి సంబంధించి ఆర్డీఓ ఇచ్చిన ఆర్డర్ కాపీని ఎమ్మెల్యే మీడియాకు చూపించారు. పరువు నష్టం దావా వేస్తా ప్రతి ఒక్క ఆరోపణకు తాను ఆధారాలతో సహా వివరణ ఇస్తున్నానని, తాను ఒక్కటే చెబుతున్నానని తన అనుచరులు ఎవరైనా సరే చిన్నపాటి తప్పు చేసిన ఉపేక్షించేది లేదన్నారు. అయితే ఏ ఆధారం లేకుండా తప్పుడు ఆరోపణలు చేసే మీలాంటి వారిని ప్రజలు క్షమించరన్నారు. పాదయాత్రలో ప్రజలకు మీరు ఏం మంచి చేస్తారో చెప్పాల్సింది పోయి ఇలా బురదజల్లుడు రాజకీయాలు చేస్తూ పోతే మనుగడ ఉండదని హెచ్చరించారు. నిరాధార ఆరోపణలు చేసిన నారా లోకేష్, పరిటాల శ్రీరామ్‌లతో సహా యల్లో మీడియాపై పరువు నష్టం దావా వేస్తానని ఎమ్మెల్యే కేతిరెడ్డి స్పష్టం చేశారు. -
ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి తో " స్ట్రెయిట్ టాక్ "
-
ఆ ఇంట్లో ముగ్గురూ సర్పంచ్‌లే
ఒక ఇంట్లో ఒకరు సర్పంచ్ కావడం సాధారణంగా చూస్తుంటాం. అందుకు భిన్నంగా ఒక ఇంట్లో ముగ్గురు సర్పంచ్‌లుగా పనిచేయడం విశేషమే. తంబళ్లపల్లె మండలం మర్రిమాకులపల్లె పంచాయతీ ఇందుకు నిదర్శనంగా నిలుస్తోంది. సాక్షి, తంబళ్లపల్లె: మండలంలోని మర్రిమాకులపల్లె పంచాయతీలో నాటి నుంచి నేటి వరకూ కేతిరెడ్డి కుటుంబ హవా నడుస్తోంది. ఈ పంచాయతీ ఏర్పడినప్పుడు మొదటి సర్పంచ్‌గా కేతిరెడ్డి తిమ్మారెడ్డి ఎన్నికయ్యారు. అప్పటి నుంచి వరుసగా మూడుసార్లు పదవిలో కొనసాగారు. అనంతరం ఆయన కుమారుడు కె.వెంకటరమణారెడ్డి సర్పంచ్‌గా ఎన్నికై ఆయన మూడుసార్లు సర్పంచ్‌గా పని చేశారు. వెంకటరమణారెడ్డి కోడలు కె.జ్యోతి గతంలో సర్పంచ్‌గా పనిచేశారు. ప్రస్తుత ఎన్నికల్లో రెండోసారి గ్రామస్తుల ఆమోదంతో ఏకగ్రీవంగా ఎన్నిక కావడం విశేషం. ఈ పంచాయతీలో సుమారు 618 మంది ఓటర్లు ఉన్నారు. కేతిరెడ్డి కుటుంబ సభ్యులు ప్రజలకు అందుబాటులో ఉండడం, ప్రజా సమస్యలపై స్పందించడం, పంచాయతీ అభివృద్ధికి కృషి చేయడమే ఇందుకు కారణం. కులమతాలకు అతీతంగా ప్రభుత్వ సంక్షేమ పథకాలను అర్హులందరికీ అందజేయడంతో ఆ కుటుంబంపై ప్రజలు మొగ్గు చూపుతున్నారు. చదవండి: ఏమ్మా.. ఎలా చదువుతున్నారు! బర్త్‌డే: తప్పతాగి యువకుడి మృతి? -
నకిలీ ఓట్లపై అధారలతో పాటు ఫిర్యాదు చేశాం
-
సంక్షేమ పథకాల్లో కోతా?
= నిరుపేదలకు అన్యాయం జరిగితే సహించం = వైఎస్సార్సీపీ ధర్మవరం సమన్వయకర్త కేతిరెడ్డి ధర్మవరంటౌన్ : ప్రజా సాధికార సర్వేతో ప్రతి ఇంటికీ లబ్ధి చేకూరుస్తామని నమ్మబలికి, వివరాలు సేకరించిన తర్వాత సంక్షేమ పథకాల్లో కోత విధించేందుకు సిద్ధమవడం సిగ్గుచేటని ధర్మవరం మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్సీపీ సమన్వయకర్త కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి రాష్ట్ర ప్రభుత్వాన్ని అన్నారు. నిరుపేదలకు అన్యాయం జరిగితే సహించేది లేదని హెచ్చరించారు. శుక్రవారం పట్టణంలోని తన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇటీవల పౌరసరఫరాల శాఖ వారు ఒక సర్క్యులర్ జారీ చేశారని, అర్హులైన నిరుపేద రేషన్ లబ్ధిదారులకు రేషన్ పంపిణీ చేయకుండా అనవసర నిబంధనలు ఉంచి, రేషన్ కార్డులను రద్దు చేసేందుకు ప్రభుత్వం కుట్ర పన్నడం దారుణమన్నారు. సర్క్యులర్ ప్రకారం కుటుంబానికి ద్విచక్ర వాహనం ఉన్నా, నాలుగు చక్రాల వాహనం ఏదేని కలిగి ఉన్నా రేషన్ కార్డును రద్దు చేసేలా నిబంధనలు పెట్టారన్నారు. రేషన్ కార్డులను రద్దు చేసేందుకు నియోజకవర్గానికి ఫీల్డ్ లెవల్ ఆఫీసర్లను నియమించి మరీ జిల్లా వ్యాప్తంగా లక్షల సంఖ్యలో కార్డులను రద్దు చేసేందుకు ప్రభుత్వం సాధికార సర్వేలో అందించిన వివరాలనే ప్రామాణికంగా తీసుకుంటోందన్నారు. ఏదైన కుటుంబంలో నాలుగు చక్రాల వాహనం చిన్నపాటి సరుకు రవాణా చేసేందుకు, ట్రాక్టర్‌తో వ్యవసాయ పనులు చేసుకునేందుకు, మరికొంత మంది జీవనోపాధికోసం వాహనాలను నడుపుతుంటే అటువంటివారిపై ఇలా కక్షసాధించడంలో ఆంతర్యమేమిటని ప్రశ్నించారు. మరోవైపు ధర్మవరం నియోజకవర్గంలో రేషన్ షాపుల డీలర్లు అధికార పార్టీ అండతో రెచ్చిపోతున్నారన్నారు. నిరుపేదలకు రేషన్ కార్డు ద్వారా బియ్యం అందించాలంటే వారి వద్ద ప్రైవేట్ వస్తువులు కారంపొడి, ధనియాలపొడి, గోధుమపిండిలతో పాటు పలు రకాల వస్తువులను కొనుగోలు చేస్తేనే బియ్యం వేస్తున్నారని, లేని వారికి రేషన్ అందించడం లేదన్నారు. ఇలా వసూలు చేసిన మొత్తంలో ఎమ్మెల్యేకు, అధికారులకు రేషన్ డీలర్లు ఎంతమొత్తంలో ఇస్తున్నారో అర్థం అవుతోందన్నారు. వరుస కరువులతో రైతులు, చేనేత కార్మికులు అల్లాడిపోతుంటే కనీసం పంట నష్ట పరిహారం గానీ, చేనేతలకు రుణాలను గానీ అందించకుండా ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరి దారుణమన్నారు. జిల్లాలో ప్రజలకు తాగడానికి గంజి కూడా లేక అలమటిస్తుంటే ముఖ్యమత్రి చంద్రబాబు, ఆయన తనయుడు లోకేష్ మాత్రం అవినీతి సొమ్ముతో విలాసవంతమైన బంగ్లాలు నిర్మించి జల్సా చేస్తున్నారని ఆరోపించారు. సాధికార సర్వేను ప్రామాణికం చేసుకుని సంక్షేమ పథకాలను కోత విధించాలని చూస్తే సహించేది లేదన్నారు. పౌరసరఫరాల శాఖ విడుదల చేసిన సర్క్యులర్‌ను ఉపసంహరించుకొవాలని, లేని పక్షంలో వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని హెచ్చరించారు. -
ఏర్కాడులో కేతిరెడ్డి ప్రచారం
చెన్నై, సాక్షి ప్రతినిధి: సేలం జిల్లా ఏర్కాడు ఉప ఎన్నికల్లో అన్నాడీఎంకే అభ్యర్థి సరోజ గెలుపుకోసం తమిళనాడు తెలుగు యువశక్తి బుధవారం సుడిగాలి పర్యటన నిర్వహించింది. నియోజకవర్గ పరిధిలోని తెలుగు ప్రజల మద్దతును కూడగట్టే నిమిత్తం యువశక్తి అధ్యక్షులు కేతిరెడ్డి జగదీశ్వర్‌రెడ్డి అనేక ప్రాంతాల్లో పర్యటిం చారు. వలసూరు, అయోధ్యపట్నం, పెరుమాళుపాళం, కుప్పనూరు, పళ్లిపట్టు తదితర ప్రాంతాల్లో ఇంటింటికీ వెళ్లి తెలుగు వారిని, ఇతర ఓటర్లను కలిశారు. అనేక చోట్ల తెలుగు మహిళలు ఆయనకు మంగళ హారతులు పట్టి స్వాగతం పలికారు. అమ్మ పాలనలో చేపట్టిన పథకాల గురించి వివరిస్తూ ముద్రించిన కరపత్రాలను కేతిరెడ్డి పంచిపెట్టారు. అన్నాడీఎం అభ్యర్థి సరోజను గెలిపించడం ద్వారా అమ్మ పాలనకు మద్దతు పలకాలని ఓటర్లను కోరారు. కేతిరెడ్డి వెంట మంత్రి కామరాజ్, రాయపురం ఎమ్మెల్యే జయకుమార్, చెన్నై టీనగర్ ఎమ్మెల్యే కలైరాజన్, తెలుగు యువశక్తి రాము, సేలం కార్యదర్శి డి.శివశంకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. నగదు పంపిణీలో ఘర్షణ పెరియ గౌండపురం బస్టాండు సమీపంలో మంగళవారం రాత్రి అన్నాడీఎంకే నేతలు ఓటర్లకు పంచెలు, చీరలు, నగదు పంపిణీ చేస్తుండగా డీఎంకే నేతలు అడ్డు తగిలారు. దీంతో ఆగ్రహించిన అధికార పార్టీ వారు మారణాయుధాలతో దాడులకు దిగారు. ఇదిలా ఉండగా ఎన్నికల నిబంధనలను అతిక్రమించారంటూ మంత్రులు వలర్మతి, సెంథిల్‌బాలాజీ సహా 14 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. నేడు జయ పర్యటన అధికార పార్టీ అభ్యర్థి సరోజ గెలుపు కోసం సీఎం జయలలిత గురువారం ఏర్కాడులో పర్యటిస్తున్నారు. ఎన్నికల ప్రచారం నిమిత్త ఉదయం 11.30 గంటలకు ఆమె ఏర్కాడు చేరుకుంటారు. 9 చోట్ల ఏర్పాటు చేసిన ప్రచార సభల్లో ఆమె ప్రసంగిస్తారు. ఏర్కాడు ఎన్నికల నేపథ్యంలో ప్రచార కార్యక్రమాల బాధ్యతలను నిర్వరిస్తున్న మంతుల బృందం జయ పర్యటనకు అన్ని ఏర్పాట్లు చేసింది. -
ధర్మవరంలో రైల్ రోకో చేపట్టిన కేతిరెడ్డి
-
కాంగ్రెస్‌కు సమైక్య సెగ