ధనలక్ష్మిపై నాంపల్లి కోర్టులో రామ్గోపాల్ వర్మ పిటిషన్ | Ram Gopal Varma filed a petition in Nampally Court against censor officer | Sakshi
Sakshi News home page

ధనలక్ష్మిపై నాంపల్లి కోర్టులో రామ్గోపాల్ వర్మ పిటిషన్

Published Mon, Nov 11 2013 5:04 PM | Last Updated on Fri, Oct 19 2018 7:52 PM

ధనలక్ష్మిపై నాంపల్లి కోర్టులో రామ్గోపాల్ వర్మ పిటిషన్ - Sakshi

ధనలక్ష్మిపై నాంపల్లి కోర్టులో రామ్గోపాల్ వర్మ పిటిషన్

హైదరాబాద్: ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ సెన్సార్ బోర్డు ప్రాంతీయ  అధికారి ధనలక్ష్మిపై నాంపల్లి కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. సత్య-2 సినిమా విడుదల సందర్భంగా ధనలక్ష్మి తనను ఇబ్బంది పెట్టినట్లు వర్మ ఆ పిటిషన్లో పేర్కొన్నారు. ఆమెపై క్రిమినల్ కేసు నమోదు చేయవలసిందిగా పోలీసులను ఆదేశించాలని ఆయన కోర్టును కోరారు.

సెన్సార్ బోర్డు అధికారి ధనలక్ష్మిపై క్రిమినల్ కేసు పెడతానని వర్మ శనివారం ఇక్కడ విలేకరులకు చెప్పారు. సత్య-2 కొన్ని చోట్ల విడుదల కాకుండా ధనలక్ష్మి అడ్డుకుంటున్నట్లు ఆయన ఆరోపించారు. సత్య-2 శుక్రవారం విడుదలైన విషయం తెలిసిందే.  ఈ సినిమాకు హిందీ భాషలోకంటే  తెలుగులో చాలా ఎక్కువ కట్స్ పడినట్లు కూడా వర్మ వివరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement