నేను నిలబడితే జనం కొడతారు
నేను నిలబడితే జనం కొడతారు
Published Sat, Nov 9 2013 11:50 PM | Last Updated on Mon, Aug 20 2018 6:18 PM
రామ్‌గోపాల్‌వర్మ తనకు నచ్చినట్టు సినిమాలు తీస్తాడు. అప్పుడప్పుడు అవి ప్రపంచానికి కూడా నచ్చేస్తుంటాయ్ ‘26/11’లా. ఆయన దర్శకత్వం వహించిన ‘సత్య-2’ ఇటీవలే విడుదలైంది. ఈ సందర్భంగా విలేకరులు అడిగిన ప్రశ్నలకు వర్మ మార్క్ సమాధానాలు మీకోసం.
మాఫియా సినిమాలు తీస్తున్నారు... వాళ్ల నుంచి ప్రాబ్లమ్స్ వస్తే?
మాఫియా నుంచి థ్రెట్ ఉందని క్రైమ్ బ్రాంచ్ నుంచి ఫోన్ వచ్చింది. కానీ అలాంటిదేం జరగలేదు. ఎందుకంటే నాకు మాఫియా గురించి ఇంటిలిజెన్స్ బ్యూరో కంటే ఎక్కువ తెలుసు.
ఈ మధ్య ఓ మీడియా చానల్‌తో గొడవైందట?
నా సినిమాలో నాలుగు ఐడెంటిటీ ఉన్న పాత్రలు కావాలి. అందుకే ఆ పాత్రలకు నలుగురు తెలిసిన మనుషుల పేర్లు పెట్టా. అందులో ఒక పేరు ‘ప్రకాష్వ్రి టీవీ 8’. దాంతో ఆ చానల్ వారికి కోపం వచ్చింది. వాళ్లు మాత్రం నాపై ‘వర్మకు మతి పోయిందా’ అంటూ ప్రోగ్రామ్స్ చేసుకోవచ్చు. నేను మాత్రం వాళ్ల పేరును కేరక్టర్‌కి వాడకూడదు. ఇదేం న్యాయం.
అనసవరంగా అందరినీ ఎందుకు శత్రువుల్ని చేసుకుంటారు?
నాకు ఎవరు శత్రువులు ఉండరు. వాళ్లే నన్ను శత్రువుగా చూస్తుంటారు.
పవన్‌కల్యాణ్ రాజకీయాల్లోకి రావాలని ఎందుకు పదేపదే చెబుతున్నారు?
అతనిలో నిజాయితీ ఉంది. చూట్టానికి బాగుంటాడు. సినిమాల్లో అయితే... థియేటర్లోనే చూడాలి. రాజకీయాల్లోకొస్తే రోజూ న్యూస్ చానల్స్‌లో చూడొచ్చు కదా.
వాళ్లూ వీళ్లూ ఎందుకు.. మీరే నిల్చోవచ్చుగా?
నేను నిలబడితే జనం కొడతారు.
ఈ మధ్య స్టార్స్‌తో సినిమా తీయడంలేదే?
వాళ్ల ఇమేజ్‌ని, గ్రాఫ్‌ని దృష్టిలో పెట్టుకొని సినిమా తీయడం నాకు చేతకావడం లేదు.
మీ సినిమాల్లో హీరోలు డాన్సులు చేయరే?
అబ్బాయిలు డాన్సులు చేస్తే ఎవరు చూస్తారు? అమ్మాయిలు చేస్తే చూస్తారు.
మామగారు అయ్యారుగా ఎలా ఉంది ఫీలింగ్?
నా కూతురు కూడా నన్ను ‘రాము’ అనే పిలుస్తుంది. అందుకే ఆ లిస్ట్‌లో నన్ను చేర్చొద్దు.
పాట పాడారు. పాట రాశారు. సినిమా తీశారు. డెరైక్షన్ సరేసరి... మరి నటన ఎప్పుడు?
అలా మాత్రం నన్ను చూడలేరు. ఎందుకంటే మీరంటే నాకు సింపతి. ఇబ్బంది పెట్టలేను.
Advertisement