నేను ఏ క్రిమినల్‌తో ఒక్కరోజూ డిన్నర్ చేయలేదు - రామ్‌గోపాల్‌వర్మ
నేను ఏ క్రిమినల్‌తో ఒక్కరోజూ డిన్నర్ చేయలేదు - రామ్‌గోపాల్‌వర్మ
Published Tue, Sep 17 2013 1:07 AM | Last Updated on Tue, Aug 28 2018 4:30 PM
‘‘ఇందులో నేను ఓ ప్రేమ గీతం పాడాను. దానికి కారణం ఒక్కటే. నాకు ప్రేమగీతం పాడాలని ఓ చిన్న కోరిక ఉంది. అది తీర్చుకోవడానికి పాడాను’’ అని రామ్‌గోపాల్‌వర్మ అన్నారు. ఆయన దర్శకత్వంలో సుమంత్‌కుమార్‌రెడ్డి మెట్టు నిర్మించిన చిత్రం ‘సత్య-2’. శర్వానంద్ ఇందులో ప్రధాన పాత్రధారి. నితిన్ రైక్వార్, సంజయ్, దర్శన్, శ్రీ ఇషాక్ స్వరాలందించిన ఈ చిత్రం పాటలను హైదరాబాద్‌లో విడుదల చేశారు.
ఆడియోసీడీని బోయపాటి శ్రీను, రేవంత్‌రెడ్డి ఆవిష్కరించి తొలి ప్రతిని పూరి జగన్నాథ్‌కి అందించారు. రామ్‌గోపాల్‌వర్మ మరిన్ని విషయాలు చెబుతూ -‘‘‘సత్య’కి ‘సత్య-2’కి చాలా తేడా ఉంది. ప్రతి ఒక్కరూ జీవితంలో ఏదో సాధించాలి అనుకుంటారు. ఆ ఆలోచనకు సరైన రూపమే ‘సత్య-2’. శర్వానంద్ నేనేదో అవకాశమిచ్చినట్లు మాట్లాడాడు.
నేను అవకాశాలివ్వను... తీసుకుంటాను. క్రిమినల్స్‌తో పరిచయం ఉండటం వల్లే ఇలాంటి సినిమాలు ఇంత రియలిస్టిక్‌గా తీయగలుగున్నానని చాలా మంది అభిప్రాయం. నిజానికి నేను ఏ క్రిమినల్‌తో ఒక్క రోజు కూడా డిన్నర్ చేయలేదు. నిజజీవితంలో జరిగే అనుభవాలే నా సినిమాల్లో కనిపిస్తాయి’’అని చెప్పారు. ఇంకా పూరిజగన్నాథ్, మంచు విష్ణు, లక్ష్మీప్రసన్న, ఆర్పీ పట్నాయక్, కోన వెంకట్, సందీప్ కిషన్, ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి, ఐజీ సీతారామాంజనేయులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
Advertisement
Advertisement