బంజారాహిల్స్: తన కూతురిది ఆత్మహత్య కాదని అల్లుడే హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించాడంటూ తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు బంజారాహిల్స్ పోలీసులు కేసును పునర్విచారిస్తున్నారు. వివరాల్లోకి వెళ్తే గుంటూరు జిల్లాకు చెందిన వెంకటేశ్వరరావు,దనలక్ష్మి(26)దంపతులు బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రి క్వార్టర్స్‌లో నివాసం ఉంటున్నారు.
మంగళవారం ఉదయం భర్త వెంకటేశ్వరరావు తన భార్య ఆత్మహత్య చేసుకుందని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అయితే తన కూతురుది ఆత్మహత్య కాదని కట్నం కోసం, పిల్లలు పుట్టడం లేదనే సాకుతో రెండో పెళ్ళి చేసుకునేందుకు అల్లుడు వెంకటేశ్వరరావు ఆమెను హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించారని మృతురాలి తండ్రి ఏడుకొండలు ఫిర్యాదు చేయడంతో పుర్విచారణ చేపట్టారు. వెంకటేశ్వరరావును అదుపులోకి తీసుకున్నారు. బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.