
అభిమానులకు హీరో హితవు
కోలీవుడ్ అభిమానుల ప్రవర్తన చాలా సందర్భాల్లో తమ హీరోలకు ఇబ్బందికరంగా మారుతుంటుంది. ప్రస్తుతం ఇలయదళపతి విజయ్ అలాంటి పరిస్థితుల్లోనే ఉన్నాడు. మహిళా జర్నలిస్టు ధన్య రాజేంధ్రన్, విజయ్ సినిమాపై చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారాయి. షారూఖ్ ఖాన్ తాజా చిత్రం జబ్ హ్యరీ మెట్ సెజల్ బాగోలేదు అని చెప్పేందుకు విజయ్ సినిమాను సురను ఉదహరించిన ధన్యాపై విజయ్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్ట్ లు చేశారు.
దీంతో ధన్య రాజేంద్రన్ పోలీసులను ఆశ్రయించింది. ఈ విషయం పై స్పందించిన హీరో విజయ్, అభిమానుల చర్యలను తప్పు పట్టారు. తాను వ్యక్తిగతంగా మహిళలను గౌరవిస్తానన్న విజయ్, ప్రతీ ఒక్కరికీ ఎవరినైనా విమర్శించే హక్కు ఉంటుందన్నాడు. మహిళపై అసభ్యకర వ్యాఖ్యలు చేయటం కరెక్ట్ కాదని అభిమానులకు హితవు పలికారు. విజయ్ ప్రస్తుతం అట్లీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న మెర్సల్ షూటింగ్ లో బిజీగా ఉన్నాడు.