Dhanya Rajendran
-
కేరళ వర్షాలు : మోకాళ్లలోతు చేరిన వరద నీరు
-
విజయ్ అభిమానుల్లో ఎందుకావేశం?
సాక్షి, న్యూఢిల్లీ: సమాజంలో భిన్నాభిప్రాయాలుగల ప్రజలు ఉన్నట్లే సినిమా అభిమానుల్లో విభిన్నంగా స్పందించే వాళ్లు ఉంటారు. సహేతుకంగా స్పందిస్తే కొందరు అహేతుకంగా స్పందిస్తారు. ఎవరు, ఎలా స్పందించినా మర్యాద, మన్నలను దాట కూడదు, వారి మాటలు శ్రుతిమించిన రాగానా పడకూడదు. తమిళ నటుడు విజయ్ అభిమానులు స్పందన కూడా శ్రుతి మిచ్చిందని చెప్పవచ్చు. ‘ది న్యూస్ మినట్’ ఎడిటర్ ఇన్ చీఫ్ ధన్యా రాజేంద్రన్ పట్ల వారి స్పందన దారుణంగా ఉంది. ఇంతకు ఆమె పట్ల ఆ విజయ్ అభిమానులకు ఆ వీరావేశం ఎందుకొచ్చింది? షారూక్ ఖాన్ నటించిన తాజా చిత్రం ‘హారీ మెట్ సేజల్’ చిత్రాన్ని ధన్యా రాజేంద్రన్ సమీక్షిస్తూ 2010లో విడుదలైన విజయ్ నటించిన తమళ సినిమా ‘సురా’కన్నా ఆధ్వాన్నంగా ఉందని వ్యాఖ్యానించారు. ఆమె విమర్శనలో ఉన్న ఔచిత్యాన్ని ప్రశ్నించకుండా కొంత మంది విజయ్ అభిమానులు ట్విట్టర్లో దారుణంగా ధ్వజమెత్తారు. కొడతాం, చంపుతామని బెదిరించి వారు చివరకు ‘పబ్లిషిటీ బీమ్ధన్యా’ హ్యాష్ ట్యాగ్‌తో లైంగిక దాడులు కూడా జరుపుతామని బెదిరించారు. అప్పటి వరకు ఎంతో ఉపేక్షించిన మహిళా జర్నలిస్టు 65 వేల అర్థరహిత దూషణల తర్వాత స్పందించి బుధవారం నాడు పోలీసు స్టేషన్‌కు వెళ్లి కేసు పెట్టారు. ఆమె కేసు పెట్టకముందే స్పందించాల్సిన తమిళ హీరో ఆలస్యంగా బుధవారం అర్ధరాత్రి ముక్తిసరిగా ఓ ప్రకటన విడుదల చేశారు. మహిళలను కించపర్చరాదంటూ అతి పేలవంగా తన అభిమానులకు హితవు చెప్పారు. అన్ని పురుషాధిక్య పాత్రల్లోనే నటించే విజయ్ అభిమానుల్లో కూడా పురుషాధిక్యత భావం ఎక్కువగానే ఉండవచ్చు. కానీ తాను సినిమాల్లో ఏది చేసినా అది తన అభిమానులపై ప్రభావం చూపిస్తుందన్న అవగాహన కలిగిన ఏ నటులైన శ్రుతిమించిన అభిమానుల స్పందనపై ఘాటుగానే స్పందిస్తారు. తమ హీరోను ఆఫ్ట్రాల్ విజయ్‌తో పోలుస్తారా ? అంటూ షారూక్ ఖాన్ అభిమానులు కూడా దారుణ దూషణలకు దిగితే....ఆ హీరో ఎలా స్పందిస్తారో చూద్దాం! -
నేను మహిళలను కించపరచను: హీరో విజయ్
సాక్షి, చెన్నై: సామాజిక మీడియా, ఇతర ఆన్లైన్ వేదికలపై వారి అభిప్రాయాలను వ్యక్తం చేసే మహిళలను కించపరిచే సంస్కృతికి తాను వ్యతిరేకమని తమిళ సూపర్ స్టార్ విజయ్ చెప్పారు. తాను మహిళలను ఎంతో గౌరవిస్తానని తెలిపారు. ప్రతి ఒక్కరికీ ఎవరి సినిమానైనా విమర్శించే హక్కు ఉందన్నారు. సోషల్ మీడియాలో మహిళలు నొచ్చుకునే విధంగా ఎవరూ కామెంట్లు పెట్టవద్దని ఆయన అభిమానులను కోరారు. ధన్యా రాజేంద్రన్ అనే మహిళా జర్నలిస్టు, ఇటీవల విడుదలైన షారుక్ ఖాన్ చిత్రం జబ్ హ్యారీ మెట్ సెజల్, గతంలో విడుదలైన విజయ్ చిత్రం ‘సూర’ లాగా బాగా లేదని, ఆట మధ్యలోనే లేచి వచ్చేశా అంటూ పోస్టు పెట్టారు. అయితే ఈ పోస్టు విజయ్ అభిమానులకు కోపం తెప్పించింది. అంతేకాకుండా సోషల్ మీడియాలో అసభ్యకరంగా తిడుతూ పోస్టులు పెట్టారు. దీంతో ధన్యా రాజేంద్రన్ చెన్నైలోని సైబర్ క్రైం పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా విజయ్ మహిళను కించపరిచే విధంగా పోస్టులు పెట్టొందంటూ అభిమానులను కోరారు. -
అభిమానులకు హీరో హితవు
కోలీవుడ్ అభిమానుల ప్రవర్తన చాలా సందర్భాల్లో తమ హీరోలకు ఇబ్బందికరంగా మారుతుంటుంది. ప్రస్తుతం ఇలయదళపతి విజయ్ అలాంటి పరిస్థితుల్లోనే ఉన్నాడు. మహిళా జర్నలిస్టు ధన్య రాజేంధ్రన్, విజయ్ సినిమాపై చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారాయి. షారూఖ్ ఖాన్ తాజా చిత్రం జబ్ హ్యరీ మెట్ సెజల్ బాగోలేదు అని చెప్పేందుకు విజయ్ సినిమాను సురను ఉదహరించిన ధన్యాపై విజయ్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్ట్ లు చేశారు. దీంతో ధన్య రాజేంద్రన్ పోలీసులను ఆశ్రయించింది. ఈ విషయం పై స్పందించిన హీరో విజయ్, అభిమానుల చర్యలను తప్పు పట్టారు. తాను వ్యక్తిగతంగా మహిళలను గౌరవిస్తానన్న విజయ్, ప్రతీ ఒక్కరికీ ఎవరినైనా విమర్శించే హక్కు ఉంటుందన్నాడు. మహిళపై అసభ్యకర వ్యాఖ్యలు చేయటం కరెక్ట్ కాదని అభిమానులకు హితవు పలికారు. విజయ్ ప్రస్తుతం అట్లీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న మెర్సల్ షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. -
మహిళా జర్నలిస్టుకు హీరో ఫ్యాన్స్ అసభ్య మెసేజ్‌లు!
చెన్నై: తమిళ హీరో విజయ్ ఫ్యాన్స్ అభిమానం శ్రుతి మించారు. తన హీరో నటించిన సినిమా బాగోలేదని కామెంట్ పెట్టిన ఓ మహిళా జర్నలిస్టుపై అసభ్యకరమైన వ్యాఖ్యలు పోస్ట్ చేసిన ఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే....బెంగళూరుకు చెందిన జర్నలిస్టు ధన్య రాజేంద్రన్ బాలీవుడ్ హీరో షారుఖ్ ఖాన్ తాజా చిత్రం ‘జబ్ హ్యారీ మెట్ సీజల్’ కి వెళ్లింది. అయితే ఆ సినిమా ఆమెకు అంతగా నచ్చకపోవడంతో ఇంటర్వెల్ కాకుండానే థియేటర్ నుంచి వచ్చేసింది. అదే విషయాన్ని ధన్య రాజేంద్రన్ శుక్రవారం ట్వీట్ చేస్తూ కొన్నేళ్ల క్రితం హీరో విజయ్ నటించిన ‘సురా’ సినిమా చూసినప్పుడు కూడా ఇదే ఫీలింగ్ కలిగిందని, అయితే ఆ సినిమా కనీసం ఇంటర్వెల్ దాకా అయినా కూర్చోబెట్టిందని, షారుక్ సినిమా అంతకంటే దారుణంగా ఉందని పోస్ట్ చేసింది. దీంతో విజయ్ ఫాన్స్ ఆమెపై సోషల్‌మీడియాలో వల్గర్ కామెంట్లతో ప్రతిదాడికి దిగారు. అసభ్య పదజాలంతో రీ ట్వీట్ చేయటమే కాక బూతు మెసేజ్‌లు, ట్రోలింగ్ ఫోటోలు తయారు చేసి సోషల్ మీడియాలో పెట్టారు. అంతేకాకుండా మహిళా జర్నలిస్టుపై బెదిరిస్తూ పోస్టులు పెట్టారు. ఇందుకు సంబంధించి ట్విట్టర్లో గత మూడు రోజులుగా సుమారు 45వేలకు పైగా ట్విట్లు వచ్చాయి. దీంతో ధన్య రాజేంద్రన్ పోలీసుల్ని ఆశ్రయించారు. పక్కా ఫ్లాన్ ప్రకారం తనపై హీరో అభిమానులు ట్రాలింగ్ చేశారని ఆమె ఫిర్యాదు చేశారు. ధన్యా రాజేంద్రన్ ఫిర్యాదుపై విచారణ అధికారులు మాట్లాడుతూ... ఈ ఘటనకు సంబంధించి ఇప్పటివరకూ నలుగురిని గుర్తించినట్లు తెలిపారు. అయితే అసభ్యంగా కామెంట్లు చేసిన పలువురు తమ ట్విట్టర్ అకౌంట్లను డిలీట్ చేసినట్లు సీనియర్ అధికారి పేర్కొన్నారు. పోలీసులు ఐటీ యాక్ట్ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. (అసభ్యకర పదజాలం, చిహ్నాలు, ప్రతీకాత్మక చిత్రాలు, బొమ్మలు, దృశ్యాలు వంటివి పోస్ట్ చేసి సదరు వ్యక్తి పేరు, ప్రతిష్టలు, గౌరవానికి భంగం కలిగించేలా చేసినా శిక్షార్హులే. అంతేకాదు, మహిళ ఆత్మాభిమానాన్ని కించపరిచేలా పదాలు, చిహ్నాలు వంటివి పెట్టినా ఐపీసీ సెక్షన్ 509 కింద నేరం). కాగా ఈ వివాదంపై హీరో విజయ్ ఇంతవరకూ స్పందించలేదు.